Human Development Index
-
రేషన్ షాపుల్లో కాదు.. గుండెల్లో పెట్టుకుంటాం!
‘న్యాయమైన, సురక్షితమైన, ఆరోగ్యకరమైన ప్రపంచం అన్నది ప్రతి ఒక్కరి హక్కు.. నిజం చెప్పాలంటే ప్రపంచం ఏమంత బాగాలేదు’.. – ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సమావేశంలో వారం క్రితం నటి ప్రియాంక చోప్రా మాట ఇది.. .... బ్రిటన్ ను దాటి ఐదో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఇండియా.. కాలరెత్తుకున్న ఇండియన్ – ఓ మెట్టు ఎక్కిన ఆర్థిక భారతం. మానవాభివృద్థి సూచీలో 132వ స్థానంలో మనం.. – విద్య, ఆరోగ్యం, జీవన ప్రమాణాల్లో మరో మెట్టుజారిన పేద భారతం.. .... ఈ రెండూ దాదాపు వారం తేడాతో వచ్చిన వార్తలే. కానీ పరస్పర విరుద్ధం. ఇది చూస్తే పాత జోక్ ఒకటి జ్ఞాపకం వస్తుంది. ఓ రిచ్ స్టూడెంట్ పేదవాడిపై రాసిన వ్యాసం.. ‘వాళ్లింట్లో తల్లి, తండ్రి, పిల్లలు అంతా పేదవాళ్లే. వారి ఇంట్లో పనిమనిషి పేదవాడే, తోటమాలీ పేదవాడే.. చివరికి కారు డ్రైవరూ బాగా పేదవాడే..’ అని.. .... ఎకానమీ గణాంకాలు ఎప్పుడూ ‘ద్రవ్యోల్బణం’లా ఉంటాయి.. అర్థమైనట్టే ఉన్నా అయోమయంగా తోస్తాయి. పెరిగాయో, తగ్గాయో తెలియదు.. ఎక్కడ, ఎందుకు పెరుగుతాయో, తగ్గుతాయో సామాన్యులెవరికీ అర్థంకాదు. ... ‘ఏమంత బాగాలేదు’.. అన్న విషయం మాత్రం అనుభవంలోకి వస్తుంది.. ఏదీ సెక్యూరిటీ? విద్య, వైద్యంతో కూడిన మానవాభివృద్థి సూచీకి ప్రాధాన్యం ఎంత ఉంటుందో ఓ నెటిజెన్ షేర్ చేసిన ఈ మెసేజ్ చూస్తే తెలుస్తుంది. ‘‘.. నేను పెద్దవాళ్లు చెప్పినట్టుగా డిగ్రీ చేశా.. మంచి ఉద్యోగం సంపాదించా.. సమాజ నియమాలకు అనుగుణంగా పెళ్లి చేసుకున్నా.. ఆర్థిక నిపుణుల సూచన మేరకు నడుచుకుని పొదుపు చేసుకున్నా. రిటైర్మెంట్ ప్లాన్ చేసుకున్నా.. క్రెడిట్ కార్డుల జోలికి వెళ్లనే లేదు. సర్కార్ చెప్పినట్టుగా ట్యాక్స్‌లు కట్టా.. లైఫ్ అంతా మంచి సిటిజెన్‌గా ఉన్నా.. నా భార్యకు కేన్సర్ వచ్చింది. ఇన్సూరెన్స్ పోను 20 లక్షలు ఖర్చయింది. పొదుపు చేసిందంతా పోయింది. పాతికేళ్ల కష్టం రోగం పాలైంది. ఇంటి ఈఎంఐలు ఆగిపోయాయి. పిల్లల చదువులు గందరగోళంలో పడ్డాయి. ... ఇప్పుడు చెప్పండి మీరు చెప్పే నీతులపై, ఈ ప్రభుత్వాలపై నాకు ఎందుకు గౌరవం ఉండాలి? నాకు ఏం రక్షణ ఉందని నమ్మాలి. నా పిల్లల భవిష్యత్తుకు సొసైటీ, గవర్నమెంట్ ఉపయోగపడుతుందని విశ్వసించాలా? పిల్లల్ని నాలా ఒబీడియెంట్ సిటిజెన్లా పెంచమంటారా?’’ – జీవితంపైనా.. ప్రభుత్వంపైనా సంపూర్ణంగా ఆశలు పోయిన సందర్భం ఇది ఇదీ ప్రయారిటీ.. 132వ స్థానంలో ఉన్న మనం ఇలా ఉంటే.. కొద్ది సంవత్సరాలుగా ‘మానవాభివృద్థి సూచీ’లో అందరి కన్నా ముందు ఉంటున్న నార్వే ఎలా ఉందో చూద్దాం.. చమురు, సహజ వాయువు నిక్షేపాలు నార్వేకు ప్రధాన ఆదాయ వనరు. అయితే ఇలా వచ్చిన డబ్బును ఆ దేశం ప్రజాపనులు, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలపై ఖర్చు చేస్తుంటుంది. నార్వే అద్భుతమైన ఆరోగ్య రంగాన్ని రూపొందించుకుంది. ఎంతలా అంటే.. ఆ దేశంలో ప్రతి ఒక్కరికీ ప్రభుత్వమే ఆరోగ్య బీమా కల్పిస్తుంది. అన్నిరకాల వైద్యం ఉచితంగా అందిస్తుంది. ప్రపంచంలో అత్యంత పరిశుభ్రమైన గాలి, నీరు లభించే ప్రాంతాల్లో ఒకటిగా నార్వే పేరు పొందింది. ప్రపంచంలో అతి ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడుపోయేది ఆ దేశంలోనే.. కాలుష్య రహిత వాతావరణం, మంచి వైద్య సదుపాయాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, మంచి ఆదాయం అన్నీ ఉన్న నార్వే ప్రజల ఆయుష్షు కూడా ఎక్కువే. అక్కడివారి సగటు జీవితకాలం 82.3 ఏళ్లు. అక్కడి ప్రభుత్వ యూనివర్సిటీల్లో చదువు పూర్తిగా ఉచితం. విదేశీ విద్యార్థులకు కూడా ఫీజులు తీసుకోరు. నార్వే ప్రభుత్వం ఆ దేశ జీడీపీలో 6.6శాతం విద్యా రంగంపైనే ఖర్చుపెడుతుంది . విద్య, వైద్యం కోసం తమ సంపాదన అంతా ఖర్చుపెట్టాల్సిన పరిస్థితి లేకపోవడంతో ఆ దేశంలో ధనిక, పేద అంతరం మరీ ఎక్కువగా ఉండదు. ప్రతి కుటుంబం మెల్లగా ధనిక స్థాయికి ఎదిగే వాతావరణం ఉంటుంది. ఖర్చు విషయంలో వెసులుబాటు కారణంగా.. ఇప్పటితరం తమ తాతలు, తండ్రుల కంటే ఎక్కువగా విహార యాత్రలు చేయడం, ఎంజాయ్ చేయడం పెరిగింది. నార్వేలో ఉద్యోగిత రేటు 74.4 శాతం. మిగతావారు స్వయం ఉపాధి రంగాల్లో ఉంటారు. అంటే నిరుద్యోగం అతి తక్కువ. అక్కడ టెలి కమ్యూనికేషన్స్, టెక్నాలజీ రంగాల్లో చాలా ఉద్యోగాలు ఖాళీగా ఉంటుంటాయి. డెన్మార్క్, ఫిన్లాండ్, స్విట్జర్లాండ్ వంటి దేశాలు కూడా నార్వే తరహాలో ఉద్యోగ, ఉపాధి కల్పనలో మెరుగ్గా ఉన్నాయి. శాంతి భద్రతల విషయంలో నార్వే ప్రజలు ఎంతో సంతృప్తితో ఉన్నామని చెప్తుంటారు. రాత్రిపూట ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లడానికి ఏమాత్రం భయం అనిపించదని 88 శాతం మంది చెప్పడం గమనార్హం. ఆ దేశంలో సంభవించే మొత్తం మరణాల్లో హత్యలు అరశాతం (0.5%) లోపే కావడం గమనార్హం. ఆ దేశంలోని జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు సుమారు నాలుగు వేల మంది మాత్రమే. అక్కడి మహిళా ఉద్యోగులు గర్భం దాల్చితే.. పూర్తి జీతంతో కూడిన 8 నెలల (35 వారాలు) సెలవు (మెటర్నిటీ లీవ్) ఇస్తారు. లేదా 80 శాతం జీతంతో పది నెలలు (45 వారాలు) సెలవు తీసుకోవచ్చు. అవసరమైతే తండ్రులు కూడా పెటర్నిటీ లీవ్ తీసుకునే అవకాశం ఉంటుంది. పిల్లలు పుట్టిన మూడేళ్లలోపు 12 వారాల పాటు వేతనంతో కూడిన సెలవు ఇస్తారు. ఇదేం చారిటీ ..! ఈ మధ్య ఓ రేషన్ షాప్ ముందు స్టాండప్ కామెడీ సీన్ ఒకటి జరిగింది. సాక్షాత్తూ దేశ ఆర్థిక మంత్రి పేదవారికి ఇచ్చే కిలో బియ్యంలో కేంద్రం, రాష్ట్రవాటాల లెక్కలేశారు. పేదవారికి పెడుతున్న తిండిలో తమ వాటా 28 రూపాయలనీ, రాష్ట్రం వాటా 4 రూపాయలనీ, ప్రజల వాటా ఒక్క రూపాయనీ తేల్చారు. తమ వాటా ఇంత ఉండగా ప్రధాని మోదీ ఫొటో ఏదని నిలదీశారు... (క్లిక్ చేయండి: సదా.. మీ ‘చెప్పు’ చేతుల్లోనే..) ‘‘.. ఓ దేశం పేదరికాన్ని దాటడమనేది ‘చారిటీ’ కాదు. సహజ న్యాయంగా జరగాలి’’ అన్న నెల్సన్ మండేలా మాట ఆ సమయంలో గుర్తుకొచ్చి ఉంటే బాగుండేది. సహజన్యాయం జరిగితే... నేతలు తమ ఫొటోలను రేషన్ షాపుల్లో వెతుక్కోనక్కర్లేదు. అందరి ఇళ్లలో, గుండెల్లో అవి కనిపిస్తాయి. మానవాభివృద్థి సూచీ దానికదే పరుగులు పెడుతుంది. (క్లిక్ చేయండి: 75 ఏళ్లుగా ఉరుకుతున్నా... ఉన్నకాడే!) -
ర్యాంకులు పోనాయండీ!
ప్రపంచవ్యాప్తంగా ఇది ఆందోళనకర అంశం, తక్షణ దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన విషయం. ఐరాస లెక్క ప్రకారం వరుసగా రెండో ఏడాదీ పలు దేశాల ‘మానవాభివృద్ధి సూచిక’ (హెచ్‌డీఐ) స్కోరు కిందకు పడింది. మన దేశపు ర్యాంకు మునుపటితో పోలిస్తే రెండు స్థానాలు కిందకు పడింది. ఐరాస అభివృద్ధి సంస్థ (యూఎన్డీపీ) 2021–22 మానవాభివృద్ధి నివేదిక (హెచ్డీఆర్) ‘అనిశ్చిత పరిస్థితులు, అస్థిర జీవితాలు – మారుతున్న ప్రపంచంలో భవిష్యత్ రూప కల్పన’ ఈ చేదునిజాన్ని బయటపెట్టింది. తొంభై శాతానికి పైగా దేశాలు 2020లో కానీ, 2021లో కానీ హెచ్‌డీఐ స్కోరులో వెనకబడ్డాయి. నలభై శాతానికి పైగా దేశాలైతే ఆ రెండేళ్ళూ ర్యాంకుల్లో కిందికి వచ్చేశాయి. గత వారం విడుదలైన ఈ నివేదిక ప్రకారం మానవాభివృద్ధిలో మొత్తం 191 దేశాల్లో మన దేశం రెండు స్థానాలు కిందకొచ్చి, 132వ ర్యాంకుకు చేరింది. గడచిన 32 ఏళ్ళలో ఇలా వరుసగా రెండేళ్ళు సూచికలో దిగజారడం ఇదే తొలిసారి. మానవాభివృద్ధి పరామితుల ప్రకారం బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంకల కన్నా మనం వెనకబడే ఉన్నాం. దేశం సుభిక్షంగా ఉంది, స్థూల జాతీయోత్పత్తిలో బ్రిటన్ను దాటేశాం లాంటి కబుర్లతో కాలక్షేపం చేస్తున్న వారికి ఇది కనువిప్పు. హెచ్డీఐలో వివిధ దేశాల ర్యాంకులు పడిపోవడానికి కనివిని ఎరుగని సంక్షోభాలు కారణం. గత పదేళ్ళలో ఆర్థికపతనాలు, వాతావరణ సంక్షోభాలు, కరోనా, యుద్ధం లాంటి గడ్డు సమస్యల్ని ప్రపంచం ఎదుర్కొంది. ప్రతి సంక్షోభం ప్రపంచాభివృద్ధిపై ప్రభావం చూపింది. అయితే, అందులో కరోనాది అతి పెద్ద పాత్ర అని ఐరాస నివేదిక సారాంశం. ప్రపంచాన్ని వణికించిన ఈ మహమ్మారితో మానవ పురోగతి కనీసం అయిదేళ్ళు వెనక్కి వెళ్ళింది. అంతటా అనిశ్చితి ప్రబలింది. హెచ్‌డీఐకి లెక్కలోకి తీసుకుంటున్న అంశాల్లో లోపాలున్నాయని కొన్ని విమర్శలు లేకపోలేదు. అయితే, మరే సూచికా లేని వేళ ప్రతి దేశపు సగటు విజయాన్నీ లెక్కించడానికి ఉన్నంతలో ఇదే మెరుగైనదని ఒప్పుకోక తప్పదు. ఆర్థిక అసమానత్వం, లైంగిక అసమానత్వం, బహుముఖ దారిద్య్రం లాంటి ఆరు వేర్వేరు మానవాభివృద్ధి సూచీల ద్వారా ఈ ర్యాంకులు లెక్కకట్టారు. స్విట్జర్లాండ్ 0.962 స్కోరుతో ప్రథమ ర్యాంకు దక్కించుకుంది. భారత్ కేవలం 0.633 స్కోరుతో అగ్రశ్రేణికి సుదూరంగా నిలిచిపోయింది. విషాదమేమిటంటే, మానవాభివృద్ధిలో మన స్కోరు ప్రపంచ సగటు 0.732 కన్నా తక్కువ. పొరుగున ఉన్న చైనా హెచ్‌డీఐ స్కోర్ 1990 నుంచి ఏటా పెరుగుతుంటే, మన పరిస్థితి తద్భిన్నంగా ఉంది. మన దేశంలో ఆర్థిక అసమానతలూ ఎక్కువే. జనాభాలో అతి సంపన్నులైన 1 శాతం మంది ఆదాయ వాటా, నిరుపేదలైన 40 శాతం మంది వాటా కన్నా ఎక్కువని తాజా లెక్క. ఇంతటి అసమానత చైనా, స్విట్జర్లాండ్లలో లేదు. లింగపరంగా చూస్తే, మన దేశ తలసరి ఆదాయంలో పురుషుల కన్నా స్త్రీలు చాలా వెనుకబడి ఉన్నారు. విద్య, వైద్యం, జీవన ప్రమాణాల ప్రాతిపదికన లెక్కకట్టే బహుముఖ దారిద్య్రం లోనూ భారత్ పరిస్థితి గొప్పగా ఏమీ లేదు. 2019 నాటి యూఎన్డీపీ అంచనాల ప్రకారం... ప్రపంచంలో అత్యధిక జనాభా గల చైనాలో 5.4 కోట్ల మంది బహుముఖ దారిద్య్రంలో ఉంటే, రెండో అత్యధిక జనాభా ఉన్న భారత్‌లో ఆ సంఖ్య 38.1 కోట్ల పైచిలుకే. అయితే, 2019 – 2020 మధ్య మన దేశంలో లింగ అసమానత దారుణంగా పెరగగా, తాజా నివేదికలో ఆ కోణంలో కొద్దిగా మెరుగుదల సాధించడం ఉపశమనం. మొత్తానికి, అన్నీ కలిపి చూస్తే మానవాభివృద్ధిలో మన స్కోరునూ, దరిమిలా ఇతర దేశాల మధ్య మన ర్యాంకునూ కిందకు గుంజాయి. అయితే, సంతోషించదగ్గ అంశం ఏమంటే – కరోనాలో ఏడాది లోపలే భారత్ టీకాను అభివృద్ధి చేయడం, ధనిక దేశాలకు సైతం కరోనా నిరోధానికి సహకరించడం! ఇది మన మానవ సామర్థ్యమే! అదే సమయంలో కనీస ఆదాయ హామీకై దేశంలో జరుగుతున్న ప్రయత్నాలూ యూఎన్డీపీ ప్రశంసలు అందుకున్నాయి. అలాగే కరోనా అనంతరం ఆర్థికంగా మన దేశపు పనితీరు పొరుగు దేశాల కన్నా మెరుగ్గా ఉండడం ఆశాకిరణం. అభివృద్ధి అజెండా అమలుకు నిధులు వెచ్చించే వీలుంటుంది. అయినా, ఇప్పటికీ అనేక అంశాల్లో ఇతర దేశాలు మెరుగ్గా ఉన్నాయనేది నిష్ఠురసత్యం. పౌష్టికలోప జనాభా, బాలల మరణాల రేటు తదితర అంశాలతో లెక్కించే ‘ప్రపంచ ఆకలి సూచి’ (2020) ప్రకారం కూడా 107 దేశాల్లో మనది 94వ స్థానం. వీటికి తోడు ఇప్పుడు ఉక్రెయిన్‌లో యుద్ధం, ప్రపంచాన్ని పూర్తిగా వదిలిపోని కరోనా, భూతాపోన్నతి ముప్పేటదాడి చేస్తున్నాయి. అన్నీ కలసి ప్రపంచ ఆహార సంక్షోభానికి దారి తీయవచ్చని ఐరాస హెచ్చరిస్తోంది. నిలకడైన అభివృద్ధి, సామాజిక భద్రత, సత్వర సాంకేతిక ఆవిష్కరణలపై దృష్టి పెడితేనే అనిశ్చితి నుంచి బయటపడగలమంటోంది. ఐరాస మాట చద్దిమూట. పాలకులు దీన్ని పరిగణనలోకి తీసుకొని, పకడ్బందీగా మానవాభివృద్ధి ప్రణాళికలు రచించాలి. పర్యావరణ సంక్షోభ నివారణ లక్ష్యాలను చేరుకొనేందుకూ కృషి చేయాలి. ద్రవ్యోల్బణం, ధరలు పెరుగుతూ, ఉపాధి హామీ తగ్గుతున్న సమయంలో ఎన్నికల వ్యూహాలు కాస్త ఆపి, నిలకడగా చేతల్లోకి దిగాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంతరాలు తగ్గించుకొని, సమన్వయంతో సాగాలి. కానీ, పైచేయి కోసం ప్రయత్నాలతో ఢిల్లీ నుంచి గల్లీ దాకా సహకార స్ఫూర్తి కొరవడుతున్న వేళ ప్రగతి బాటలో కలసి సాగడానికి మన పాలకులు సిద్ధమేనా? -
మానవాభివృద్ధిలో నేలచూపు
మానవాభివృద్ధి సూచీలో ఎప్పటిలా మనం వెనకబడే వున్నాం. విద్య, వైద్యం, ఆయుర్దాయం వంటి చాలా అంశాల్లో నాసిరకం ప్రమాణాలతోనే నెట్టుకొస్తున్నాం. ప్రతి ఏటా ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం(యూఎన్డీపీ) విడుదల చేసే మానవాభివృద్ధి సూచీ నివేదిక ఏ దేశం సాధించినదెంతో చెబుతుంది. నిరుడు విడుదల చేసిన నివేదికలో అంతక్రితంకన్నా మెరుగై 129వ స్థానంలోకొచ్చిన మన దేశం ఈసారి మాత్రం రెండు మెట్లు కిందకు దిగి 131 స్థానానికి పోయింది. లోగడ 134వ స్థానంలో వున్న భూటాన్ వివిధ అంశాల్లోనూ తనను తాను మెరుగుపర్చుకుని ఇప్పుడు 129వ స్థానానికొచ్చింది. వాస్తవానికి ఈ నివేదిక 2019 సంవత్సరానికి సంబంధించి వివిధ దేశాల ప్రగతిని పరిగణనలోకి తీసుకుంది. అది ముగిసి 2020లోకి అడుగుపెట్టాక కరోనా మహమ్మారి కాటేసింది గనుక మనతోపాటు దాదాపు అన్ని దేశాలూ ఇందులో పొందిన ర్యాంకులకన్నా ప్రస్తుతం ఇంకా కిందకు దిగజారివుంటాయి. అయితే మన దేశం అన్ని ప్రమాణాల్లోనూ ఒకే రకంగా అట్టడుగు స్థాయిలో లేదు. కొన్నింటిలో మెరుగ్గా వుండగా, మరికొన్ని అంశాల్లో చాలా వెనకబడి వుంది. తాజా నివేదిక ప్రకారం మన దేశంలో సగటు ఆయుర్దాయం 69.7 సంవత్సరాలుంది. ఈ విషయంలో మనకన్నా బంగ్లాదేశ్(72.6), నేపాల్(70.8), భూటాన్(71.8) ఎంతో మెరుగ్గా వున్నాయి. అలాగే స్థూల జాతీయ తలసరి ఆదాయంలోనూ 2018తో పోలిస్తే నిరుడు తగ్గింది. మూడు దశాబ్దాలుగా ఐక్యరాజ్యసమితి ఈ మానవాభివృద్ధి సూచీ నివేదికలను ఏటా విడుదల చేస్తోంది. ప్రతి దేశమూ తమ పనితీరు సమీక్షించుకుని సవరించుకుంటాయని దాని ఆశ. ప్రగతికి కొలమానంగా స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)ని చెప్పడం కొన్ని దశాబ్దాలుగా ప్రపంచ దేశాలన్నిటా అలవాటుగా మారింది. జీడీపీ శాతాన్ని చూపుతూ అంతా సవ్యంగా వుందని మన పాలకులు కూడా నమ్మిస్తూనే వున్నారు. కానీ సాధారణ ప్రజలకు విద్య, వైద్యం, ఇతర మౌలిక వసతుల కల్పన ఎలావుందో, దేనికెంత వ్యయం చేస్తున్నారో లెక్కలు తీస్తే ఎప్పుడూ మనం దిగ దుడుపే. వాస్తవంగా సాధారణ ప్రజల తలసరి ఆదాయం ఎలావుంది... ఆ ఆదాయంలో వారు విద్య, వైద్యం, చదువు వగైరా అంశాల్లో ఎలా ఖర్చు చేస్తున్నారన్నదే కీలకమైన విషయం. అలాగే సామాజికంగా మహిళలు ఏ స్థానంలో వున్నారో, వారి అధీనంలో వున్న ఆస్తుల సగటువిలువెంతో, పాలనా వ్యవస్థలో వారికిస్తున్న స్థానం ఏపాటిదో పరిగణనలోకి తీసుకుంటేనే వాస్తవ అభివృద్ధి ఎలావుందో తెలుస్తుంది. దేశాన్నేలే పాలకులు వేటిని ప్రాధాన్యతా అంశాలుగా చూస్తున్నారో, వారి విధానాలు పౌరుల్ని ఎటువైపు నడిపిస్తున్నాయో, భిన్న రంగాల్లో ఒక దేశం సాధిస్తున్న అభివృద్ధేమిటో చూడటమే మానవాభివృద్ధి సూచీ లక్ష్యం. ఆరోగ్య సదుపాయాల సంగతే చూస్తే కొన్ని వెనకబడిన దేశాలకన్నా మనం నాసిరకంగా వున్నాం. పదివేల జనాభాకు సగటున మయన్మార్‌లో పది బెడ్లు వుంటే, మన దగ్గర అయిదు మాత్రమే వున్నాయి. బంగ్లాదేశ్‌లో అవి 8 అయితే, పాకిస్తాన్లో 6. ఇక వైద్యుల లభ్యత చూసినా అంతే. పదివేల జనాభాకు మన దేశంలో సగటున 8.6 వైద్యులుంటే పాకిస్తాన్లో ఆ సంఖ్య 9.8. చిత్రమేమంటే వైద్యుల లభ్యతలో మనకన్నా స్వల్పంగా వెనకబడి 8.3 దగ్గరే ఆగిన చిన్న దేశం వియత్నాంలో బెడ్ల సంఖ్యమాత్రం ఎక్కువ. అక్కడ పదివేల జనాభాకు సగటున 32 వున్నాయి. మౌలిక వైద్య సదుపాయాల కల్పనలో మనం చాలా వెనకబడివున్నామని కరోనా వైరస్ మహమ్మారి విరుచుకుపడినప్పుడు తేటతెల్లమయింది. వైద్య విద్యకు అగ్ర ప్రాధాన్య మిచ్చి కళాశాలల సంఖ్యను గణనీయంగా పెంచాలని ప్రభుత్వాలు భావించకపోవడమే ఇందుకు కారణం. ఉన్న కళాశాలల్లో అవకాశాలు రాక మన విద్యార్థులు చైనా, రష్యా, ఫిలిప్పీన్స్ వగైరా దేశాలకు వలసపోవలసి వస్తోంది. పీజీ, సూపర్ స్పెషాలిటీ స్థాయిల్లో సీట్ల సంఖ్య మరీ తక్కువ. పైగా వైద్య విద్య ఖర్చు తడిసి మోపెడవుతోంది. ప్రైవేటు రంగంలోని కళాశాలలు, డీమ్డ్ యూని వర్సిటీల్లో 50 శాతం సీట్లకు ఇష్టానుసారం ఫీజుల్ని వసూలు చేసుకునే అవకాశం ఇవ్వడంతో వైద్య విద్య ఖరీదైన వ్యవహారంగా మారింది. పరిస్థితి ఇలా వున్నప్పుడు వైద్యుల సంఖ్య, ఆసుపత్రి సదుపాయాలు ఎలా పెరుగుతాయి? ఆయుర్దాయం, ఆరోగ్యం, విద్య, మెరుగైన జీవన ప్రమాణం వగైరా అంశాలకు విడివిడిగా సూచీలు రూపొందించి మొత్తం మానవాభివృద్ధి సూచీలో ఏ దేశం ఎలావున్నదో చెప్పడం నివేదిక ఉద్దేశం. సున్నా నుంచి ఒకటి వరకూ మొత్తంగా ఏ దేశం ఏ స్థానంలో వుందో అది వెల్లడిస్తుంది. అలా చూసుకుంటే తొలి స్థానంలో వున్న నార్వే కూడా పూర్తిగా ఒకటికి చేరలేకపోయింది. అది 0.957 దగ్గర వుంది. రెండో స్థానంలో వున్న ఐర్లాండ్, స్విట్జర్లాండ్‌లు 0.955 దగ్గర వున్నాయి. మనం 0.645 దగ్గర, శ్రీలంక 0.782 దగ్గర వున్నాయి. మానవాభివృద్ధి సూచీ అద్దంలాంటిది. అది మనం ఎలావున్నామో చెబుతుంది. దాన్ని చూసి సరిచేసుకోవడం మన బాధ్యత. జీడీపీ ఘనంగా కనబడినా, తలసరి ఆదాయం గణనీయంగా పెరిగిందని చెప్పుకున్నా సాధారణ పౌరులకు ఒరిగేదేమీ వుండదు. వ్యవ సాయం, పరిశ్రమలు, సేవారంగం తదితరాల్లో మొత్తం ఉత్పత్తుల విలువ(జీఎన్డీపీ)ని లెక్కగట్టి, జనాభా సంఖ్యతో భాగించి తలసరి ఆదాయాన్ని లెక్కేస్తారు. ఇందులో ప్రభుత్వోద్యోగులకు లభించే జీతాలు కూడా వచ్చి చేరతాయి. ఇలావచ్చే జీడీపీని చూసి దారిద్య్రం తగ్గిందని, దేశం ప్రగతిపథంలో పయనిస్తోందని భావించడం పనికిమాలిన వ్యవహారమని నిపుణులు ఎప్పటినుంచో చెబుతున్నారు. అందుకు బదులు విద్యను, వైద్యాన్ని, ఇతర మౌలిక సదుపాయాలను ఏమేరకు కల్పించామో ప్రభు త్వాలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. సాధారణ ప్రజానీకం ఆదాయాన్ని పెంచడానికి, వారు తమ కాళ్లపై తాము నిలబడటానికి ఏం చేస్తున్నామో గమనించుకోవాలి. అప్పుడు మాత్రమే మానవాభివృద్ధి సూచీలో గర్వపడదగిన స్థాయికి చేరుకోగలుగుతాం. -
ఆ సూచీలో భారత్‌కు మెరుగైన ర్యాంక్
న్యూఢిల్లీ : ఐక్యరాజ్యసమితి మానవాభివృద్ధి సూచికలో ఈ ఏడాది భారత్ ర్యాంక్ స్వల్పంగా మెరుగుపడింది. గత ఏడాది మానవాభివృద్ధి సూచికలో 189 దేశాలకు గాను 130వ స్ధానంలో నిలిచిన భారత్ ఈ ఏడాది ఒక స్ధానం మెరుగపడి 129వ స్ధానానికి చేరింది. 2005-06 నుంచి 2015-16 మధ్యలో భారత్‌లో 27 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని యూఎన్డీపీ ఇండియా స్ధానిక ప్రతినిధి శోకో నోడా చెప్పారు. మూడు దశాబ్ధాలుగా భారత్‌లో చోటుచేసుకుంటున్న వేగవంతమైన అభివృద్ధితో భారత్‌లో పేదరికం గణనీయంగా తగ్గిందని, జీవనకాలం పెరగడంతో పాటు మెరుగైన విద్య, వైద్యం అందుబాటులోకి వచ్చాయని ఆమె పేర్కొన్నారు. 1990 నుంచి 2018 మధ్యలో దక్షిణాసియా ప్రాంతం 46 శాతం మేర సత్వర వృద్ధి సాధించిందని ఆ తర్వాత తూర్పు ఆసియా, ఫసిఫిక్ ప్రాంతాలు 43 శాతం వృద్ధిని సాధించాయని తెలిపారు. -
మానవాభివృద్ధిలో భారత్ ర్యాంకు 130
న్యూఢిల్లీ: మానవాభివృద్ధి సూచీలో భారత్ ఒక స్థానం మెరుగుపరచుకుని 130వ ర్యాంకు సాధించింది. ఐరాస అభివృద్ధి కార్యక్రమం(యూఎన్డీపీ) శుక్రవారం విడుదల చేసిన జాబితాలో 189 దేశాలకు ర్యాంకులు ప్రకటించింది. తాజా ర్యాంకింగ్‌లో పొరుగు దేశాలు బంగ్లాదేశ్, పాకిస్తాన్ వరసగా 136, 150వ స్థానాల్లో నిలిచాయి. నార్వే, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, ఐర్లాడ్, జర్మనీ వరసగా తొలి ఐదు స్థానాలు దక్కించుకున్నాయి. 189 దేశాల్లో 59 దేశాలు అధిక మానవాభివృద్ధి గ్రూప్‌లో, 38 దేశాలు అల్ప మానవాభివృద్ధి గ్రూప్‌లో ఉన్నాయి. 0.640 హెచ్‌డీఐ స్కోర్‌తో భారత్ మాధ్యమిక మానవాభివృద్ధి కేటగిరీలో చోటు దక్కించుకుంది. -
ఇంకా అసమానతలే!
- జిల్లా, కుల, లింగ, వృత్తి వర్గాల మధ్య కొనసాగుతున్న అసమానతలు - మానవాభివృద్ధి సూచీలో పదో స్థానంలో రాష్ట్రం - 2004–05తో పోల్చితే 2011–12లో మూడు స్థానాలు మెరుగు సాక్షి, హైదరాబాద్: సాంకేతికపరంగా ప్రపంచం ముందుకు దూసుకుపోతున్నా.. సమాజంలో అసమానతలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కూడా పరిస్థితులు ఇందు కు భిన్నంగా ఏమీ లేవు. ఇదే విషయాన్ని తెలంగాణ మానవాభివృద్ధి నివేదిక–2017 వెల్లడించింది. రాష్ట్రంలోని జిల్లాల మధ్య, గ్రామీణ–పట్టణ ప్రాంతాల మధ్య, కులాల మధ్య, స్త్రీ, పురుషుల మధ్య, వృత్తి వర్గాల మధ్య ఇంకా అసమానతలు కొనసాగుతు న్నాయని వివరించింది. ‘మానవాభివృద్ధి సూచీ(హెచ్‌డీఐ) ర్యాంకింగ్స్‌లో 2004–05లో తెలంగాణ 13వ స్థానంలో ఉండగా, 2011–12 నాటికి మూడు స్థానాలు మెరుగుపర్చుకుని పదో స్థానంలో నిలిచింది. జాతీయ సగటు కన్నా రాష్ట్ర మానవాభివృద్ధి సూచీ మెరుగ్గా ఉంది. 2004–05లో భారతదేశ మానవాభివృద్ధి సూచీ 0.361 కాగా, రాష్ట్రం విలువ 0.343గా నమోదైంది. అయితే, 2011–12లో దేశ సూచీ విలువ 0.48కు పెరగగా, రాష్ట్రం విలువ అంతకు మించి 0.513గా నమోదైంది. ఇదే సమయంలో తక్కువ హెచ్‌డీఐ ఉన్న జిల్లాలు కూడా మెరుగుపడ్డాయి. జీవన ప్రమాణాలు, ఆరోగ్యం, విద్యలో అసమానతలు సైతం తగ్గుముఖం పట్టాయి. అయితే అసమానతలు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి’అని మానవాభివృద్ధి నివేదిక వెల్లడించింది. సెంటర్ ఫర్ ఎకనమిక్, సోషల్ స్టడీస్ (సెస్) రూపొందించిన ఈ నివేదికను శుక్రవారం గుజరాత్ సెంట్రల్ వర్సిటీ చాన్స్‌లర్, మాజీ కేంద్ర మంత్రి ప్రొఫెసర్ వైకే అలగ్ ఆవిష్కరించారు. ఈ నివేదికపై ‘సెస్’ ప్రొఫెసర్ ఎస్.గలాబ్ పరిచయ వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమంలో సెస్ చైర్మన్ ఆర్.రాధాకృష్ణ, ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ డెవలప్మెంట్ చైర్మన్ ఎస్ఆర్ హషీం, మద్రాస్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ గౌరవాధ్యక్షుడు ఆర్ మారియా సాలెత్ పాల్గొన్నారు. హైదరాబాద్ టాప్.. మెదక్ లాస్ట్ రాష్ట్ర స్థాయిలో హెచ్‌డీఐ ర్యాంకింగ్స్‌లో హైద రాబాద్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా మెదక్ జిల్లా మరో స్థానం పతనమై అట్టడుగున నిలిచింది. హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలు తమ స్థానాలు నిలబెట్టుకోగా, మిగిలిన 5 జిల్లాల ర్యాంకుల్లో స్పల్ప మార్పులొచ్చాయి. మాతా, శిశు మరణాలు.. వైద్య సదుపాయాల లేమితో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఆరోగ్య స్థితిగతుల్లో మార్పు రాలేదు. జాతీయ కుటుంబ సర్వే 2015–16 ప్రకారం రాష్ట్రంలో శిశు మరణాల రేటు 28. తల్లుల మరణాల రేటు విషయంలో జిల్లాల మధ్య తీవ్ర వ్యత్యాసాలున్నాయి. హైదరాబాద్‌లో తల్లుల మరణాల రేటు 71 ఉండగా, ఆదిలాబాద్‌లో 152 ఉంది. ఆర్థికాభివృద్ధి–మానవాభివృద్ధి మధ్య పెరిగిన దూరం రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధి, మానవాభివృద్ధి మధ్య సంబంధం బలహీనపడింది. 2004–05తో పోల్చితే సమాన మానవాభివృద్ధి సాధించేందుకు 2011–12లో మూడు రెట్ల ఆర్థికాభివృద్ధి సాధించాల్సి ఉంది. మానవాభివృద్ధికి సమ్మిళిత అభివృద్ధి లేని అధిక ఆర్థికాభివృద్ధి కన్నా సమ్మిళిత అభివృద్ధి సహకరించింది. తక్కువ ఆర్థికాభివృద్ధి ఉన్నా సమ్మిళిత అభివృద్ధి గల జిల్లాలు అధిక ఆర్థికాభివృద్ధి గల జిల్లాలతో మెరుగైన మానవాభివృద్ధిని సాధించాయి. అంటే ఆర్థికాభివృద్ధికి మానవాభివృద్ధితో సంబంధం లేదని తెలుస్తోంది. సామాజికంగా.. ఎస్టీల హెచ్డీఐతో పోల్చితే ఓసీల హెచ్‌డీఐ 2002–04లో 2.20 రెట్లు అధికంగా ఉండగా, 2007–08లో 1.73 రెట్లకు తగ్గింది. కాలంతో పాటు సామాజిక తరగతుల మధ్య హెచ్‌డీఐ వ్యత్యాసాలు తగ్గుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణ ప్రాంతాల్లో అన్ని సామాజిక వర్గాల హెచ్‌డీఐ అధికంగా ఉంది. గ్రామీణ–పట్టణ ప్రాంతాల మధ్య అసమానతలు తగ్గాయి. స్త్రీ, పురుషుల మధ్య.. రాష్ట్రంతో పాటు జిల్లాలో కూడా 2004–05తో పోల్చితే 2011–12లో స్త్రీ, పురుషుల హెచ్‌డీఐ పెరిగింది. ఆదిలాబాద్ జిల్లా మినహా రాష్ట్రమంతటా స్త్రీ, పురుష హెచ్‌డీఐ విలువలో వ్యత్యాసాలు తగ్గాయి. ఆదాయం, విద్య, ఆరోగ్య అంశాల్లో సాధించిన వృద్ధి వల్లే హెచ్డీఐలో లింగ వ్యత్యాసాలు తగ్గాయి. అయితే, స్త్రీ, పురుషుల మధ్య విద్యాభివృద్ధిలో వ్యత్యాసాలు అధికంగా ఉన్నాయి. ప్రైవేటు విద్యకు.. ప్రైవేటు పాఠశాలలతో పోల్చితే ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల విద్యా ఫలితాలు తక్కువగా ఉన్నాయి. పిల్లల విద్య పట్ల తల్లిదండ్రుల ఆకాంక్షాలు పెరిగాయి. నిరక్షరాస్య తల్లులు కూడా తమ పిల్లలను ప్రైవేటు బడులకు పంపిస్తున్నారు. అయితే, ప్రైవేటు స్కూళ్లలో ఎస్సీ, ఎస్టీలు, ఇతర పేద వర్గాల విద్యార్థులు, అమ్మాయిల సంఖ్య చాలా తక్కువ. పాఠశాల విద్య విషయంలో లింగ, కుల, తరగతుల మధ్య అగాధాన్ని ఆదాయ వ్యత్యాసాలు తీవ్రంగా పెంచేశాయి. -
మానవాభివృద్ధి సూచీ పరుగులు
రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పెరిగిన మానవాభివృద్ధి రేటు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మొదటిసారిగా మానవాభివృద్ధి నివేదికను ప్రణాళిక విభాగం విడుదల చేసింది. జిల్లాల వారీగా మానవాభివృద్ధి ర్యాంకులు, అభివృద్ధి సూచికలను ఇం దులో పొందుపరిచింది. రాష్ట్ర ప్రణాళిక విభాగం, సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్(సెస్) సంయుక్తంగా ‘హ్యూమన్ డెవెలప్మెంట్ ఇన్ తెలంగాణ స్టేట్: డిస్ట్రిక్ ప్రొఫైల్స్’ పేరుతో ఈ నివేదికను ప్రచురించింది. రాష్ట్రంలోని పది జిల్లాల్లో 2004-05, 2011-12 సంవత్సరాలకు సంబంధించి మానవాభివృద్ధి సూచీ(హెచ్‌డీఐ)లు, జిల్లాల వారీగా ర్యాంకులు, హెచ్‌డీఐ వృద్ధిరేటును ఇందులో వివరించారు. 2015- 16 హెచ్‌డీఐ అంచనాలను లెక్కగట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో అందుబాటులో ఉన్న గణాంకాల ఆధారంగా ప్రణాళిక విభాగం రాష్ట్రానికి ప్రత్యేకంగా ఈ నివేదికను తయారు చేసింది. దశాబ్దం కిందటి గణాంకాలతో పోలిస్తే రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ మానవాభివృద్ధి సూచీ విలువలు పెరిగాయి. హెచ్‌డీఐ ర్యాంకుల్లో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉండగా సీఎం సొంత జిల్లా మెదక్ రాష్ట్రంలోనే చివరి స్థానంలో ఉంది. ‘‘గతంలో తయారు చేసిన మానవాభివృద్ధి సూచీలకు భిన్నంగా ఈసారి జిల్లాల వారీగా హెచ్‌డీఐ వివరాలు అందుబాటులోకి వచ్చాయి. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో జీవన ప్రమాణాలు పెంపొందించటం, అక్షరాస్యత, అసమానతలు తొల గించటం, ఆయుర్దాయం పెంపునకు ఈ నమూనా దోహదపడుతుంది. ఈ ఏడాది హెచ్‌డీఐ నివేదికలను మండలాలవారీగా, వీలైతే గ్రామ స్థాయిలో తయారీ చేసేందుకు కసరత్తు చేస్తున్నాం’’ అని ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి బీపీ ఆచార్య వెల్లడించారు. తలసరి ఆదా యం, ఆయుర్దాయం, అక్షరాస్యత, సామాజిక భద్రత, పేదరికం, అసమానతలను ప్రధాన ప్రామాణికాలుగా తీసుకొని మానవ అభివృద్ధి సూచీని లెక్కిస్తారు. యూఎన్డీపీ (యునెటైడ్ నేషన్స్ డవలప్మెంట్ ప్రాజెక్టు) అనుసరించిన పద్ధతిలోనే ఈ నివేదికను రూపొందించారు. అక్షరాస్యత, శిశు మరణాల అంశంలో హెచ్‌డీఐ విలువ పురోగతిని సూచిస్తున్నప్పటికీ ఆశించినంత వేగంగా మార్పు రావడం లేదని నివేదిక స్పష్టంచేసింది. అందుకే విద్య, వైద్యంపై ప్రభుత్వం చేసే ఖర్చును సైతం ఈ నివేదికలో ప్రస్తావించింది. 2004-2011 మధ్య కాలంలో తెలంగాణలో వైద్యం కంటే విద్యపై ఖర్చు చేసిన మొత్తం ఎక్కువని నిర్ధారించింది. ఈ మధ్య కాలంలో మొత్తం బడ్జెట్లో కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో 60-64 శాతం విద్య, వైద్యానికి ఖర్చు చేసినట్లు పేర్కొంది. కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో ఈ ఖర్చు 60% లోపే ఉంది. కరీంనగర్, మెదక్, మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాల్లో విద్యకు ఎక్కువ ఖర్చు చేయగా రంగారెడ్డి జిల్లాలో అతి తక్కువగా 32 శాతం నిధులే ఖర్చు చేశారు. వైద్యానికి ప్రభుత్వం చేసే ఖర్చు ఆదిలాబాద్ మినహా అన్ని జిల్లాల్లో 2004 నుంచి 2013 వరకు క్రమంగా తగ్గిపోయింది. 2010-2013 మధ్య కాలంలో ఆదిలాబాద్, వరంగల్, మెదక్ మినహా అన్ని జిల్లాల్లో సామాజిక రంగానికి చేసిన ఖర్చుల్లో వైద్యానికి అయిదు శాతం లోపునే వెచ్చించడం గమనార్హం. కొత్త రాష్ట్రంలో మారిన ర్యాంకులు గతంతో పోలిస్తే 2015-16 హెచ్‌డీఐ అంచనాల్లో జిల్లాల వారీ ర్యాంకులు స్వల్పంగా మారిపోయాయి. 2011లో ర్యాంకుల వరుసలో వెనుకబడ్డ ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్ ఇప్పుడు ముందుకు వచ్చాయి. అప్పుడు ముందున్న కరీంనగర్, వరంగల్, నల్లగొండ జిల్లాలు కొత్త రాష్ట్రం వచ్చాక కాస్త వెనుకబడ్డాయి. హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలు మొదటి అయిదు స్థానాల్లో నిలిచాయి. ఈ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 2004 నుంచి 2011 వరకు హెచ్‌డీఐ విలువ సగటున 8.3 శాతం పెరిగింది. 2015-16లో మరో 0.663 శాతం పెరుగుతుందని అంచనా వేశారు. -
20 ఏళ్లలో భారత్ ఆర్థిక వ్యవస్థ...10 ట్రిలియన్ డాలర్లకు!
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థకు వచ్చే 20 ఏళ్లలో అద్వితీయమైన ప్రగతిని సాధించే సత్తా ఉందని ప్రైస్‌వాటర్ హౌస్ కూపర్స్(పీడబ్ల్యూసీ) పేర్కొంది. సోమవారమిక్కడ ఈ సంస్థ విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం.. 2034 నాటికి దేశీ ఆర్థిక వ్యవస్థ 10 ట్రిలియన్ డాలర్లకు(దాదాపు రూ.620 లక్షల కోట్లు) ఎగబాకనుంది. అంతేకాదు మళ్లీ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు కూడా వార్షికంగా 9 శాతాన్ని అందుకోనుందని నివేదిక వెల్లడించింది. పారిశ్రామిక రంగం కృషి, ప్రభుత్వం పోషించబోయే నిర్మాణాత్మక పాత్ర ఈ ప్రగతికి కీలకంగా నిలవనున్నాయని పేర్కొంది. ‘భవిష్యత్తు భారత్-విజయ ప్రస్థానం’ పేరుతో విడుదల చేసిన ఈ నివేదికలో పీడబ్ల్యూసీ ఇంకా పలు అంశాలను ప్రస్తావించింది. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం 2 ట్రిలియన్ డాలర్లకు(దాదాపు రూ.124 లక్షల కోట్లు) చేరువలో ఉంది. ‘భారత్ ఇప్పుడు అత్యంత ప్రధానమైన మార్పు అంచున నిలబడింది. మళ్లీ 9 శాతం వృద్ధి, 10 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా అవతరించాలంటే... కార్పొరేట్ ఇండియా మద్దతు, కృషి చాలా అవసరం. అదేవిధంగా ప్రభుత్వంతో నిర్మాణాత్మక భాగస్వామ్యం కూడా కీలకమే’ అని పీడబ్ల్యూసీ పేర్కొంది. కాగా, ఈ 10 ట్రిలియన్ డాలర్లలో 40 శాతం వాటా కొత్త సొల్యూషన్ల(వ్యాపారాలు, ఆలోచనలు) నుంచే సాకారం కానుందని కూడా నివేదిక తెలిపింది. ‘వచ్చే 12-18 నెలల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన సవాళ్లను ఎదుర్కోనుంది. అయితే, భారత్‌లో మాత్రం మంచి వృద్ధి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రభుత్వం, ప్రైవేటు రంగం మధ్య సరైన భాగస్వామ్యం, సమన్వయంతో ఆర్థిక వృద్ధి రేటు ప్రస్తుతం అంచనా వేస్తున్న 5 శాతం కంటే చాలా అధిక స్థాయిలోనే సాధించే సత్తా భారత్‌కు ఉంది’ అని నివేదిక విడుదల సందర్భంగా పీడబ్ల్యూసీ ఇంటర్నేషనల్ చైర్మన్ డెన్నిస్ నాలీ వ్యాఖ్యానించారు. ఆర్థిక అభివృద్ధి ఫలాలను 125 కోట్లకుపైగా ఉన్న జనాభా అంతటికీ పంచడం ద్వారానే సరైన ప్రగతికి ఆస్కారం ఉంటుందని నాలీ అభిప్రాయపడ్డారు. స్వల్పకాలానికి చూస్తే జీడీపీ వృద్ధి రేటు 5.5-6 శాతం మేర ఉండొచ్చని అంచనా వేశారు. అయితే, తమ పీడబ్ల్యూసీ నివేదికలో పేర్కొన్న విధంగా కార్యచరణ ఉంటే కచ్చితంగా 9 శాతం వృద్ధి రేటు సాకారమవుతుందన్నారు. నివేదికలో ఇతర ముఖ్యాంశాలివీ... కీలకమైన విద్య, హెల్త్‌కేర్, వ్యవసాయం, రిటైల్, విద్యుత్, తయారీ, ఆర్థిక సేవలు, పట్టణీకరణ వంటి రంగాలతోపాటు డిజిటల్, ఫిజికల్ అనుసంధానానికి సంబంధించి ప్రాజెక్టుల సాకారానికి అనేక సవాళ్లు పొంచిఉన్నాయి. భారీ స్థాయిలో మానవ వనరులను(ఉద్యోగాలు) కల్పించడంతో పాటు వచ్చే రెండు దశాబ్దాల్లో మానవ వనరుల అభివృద్ధి సూచీ(హెచ్‌డీఐ)లో విప్లవాత్మక పురోగతి అవసరం. సగానికిపైగా యువ జనాభా, డిజిటల్ పరిజ్ఞానాలను వినియోగిస్తున్న మధ్యతరగతి ప్రజల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం... భారత్ ఆర్థికంగా, సామాజికంగా ప్రగతి సాధించేందుకు జీవితకాలంలో ఒక్కసారి వచ్చే అద్భుత అవకాశం. రానున్న దశాబ్దాల్లో పెరగనున్న జనాభా, మెరుగైన జీవన ప్రమాణాల కోసం ప్రతి ఏటా 1-1.2 కోట్ల ఉద్యోగాలను కల్పించాల్సి ఉంటుంది. తాజాగా సార్వత్రిక ఎన్నికల్లో వెల్లడైన ఫలితాలు(సుస్థిర ప్రభుత్వానికి మద్దతు) ఆర్థికాభివృద్ధిపై ప్రజలకున్న ఆకాంక్ష, సమాజంలో అందరికీ వృద్ధి ఫలాలు దక్కాలన్న దృఢమైన కోరికకు సంకేతం. 9 శాతం జీడీపీ వృద్ధి రేటు ద్వారా తలసరి ఆదాయం ఇప్పుడున్న దాదాపు 1,500 డాలర్ల(సుమారు రూ.93 వేలు) నుంచి 7,000 డాలర్ల(సుమారు రూ.4.3 లక్షలు) స్థాయికి ఎగబాకవచ్చు. కేవలం సంస్థలు, కంపెనీల కృషితోనే భారత వృద్ధి పుంజుకోవడం సాధ్యం కాదని.. ఇందుకు నవకల్పనలు(ఇన్నోవేషన్) చాలా కీలకమని పీడబ్ల్యూసీ ఇండియా చైర్మన్ దీపక్ కపూర్ పేర్కొన్నారు. కార్పొరేట్లు ప్రధాన పాత్ర పోషించాలన్నారు. -
India's rank in the 2014 Human Development Index?
1. Who won the first gold medal for India at the 20th Commonwealth Games in Glasgow, Scotland on July 24, 2014? 1) Sanjita Khumukcham Chanu 2) Mirabai Saikhom Chanu 3) Shushila Devi Likmabam 4) Abhinav Bindra 5) Malaika Goel 2. Arseniy Yatsenyuk announced his resignation as Prime Minister of which of the following countries on July 24, 2014? 1) Russia 2) Ukraine 3) Georgia 4) Bulgaria 5) Slovakia 3. Former Uttar Pradesh Speaker and five-time MLA Keshari Nath Tripathi was sworn-in as the 20th Governor of which of the following States on July 24, 2014? 1) Punjab 2) Haryana 3) West Bengal 4) Himachal Pradesh 5) Odisha 4. The 2014 Human Development Report was released on July 24, 2014. What is India's rank in the 2014 Human Development Index (HDI)? 1) 146 2) 145 3) 73 4) 135 5) 139 5. The 15th anniversary of Kargil Vijay Diwas was celebrated in India on which of the following dates in 2014? 1) July 12 2) July 18 3) July 11 4) July 22 5) July 26 6. The first Commonwealth Games were held in 1930 in which of the following cities? 1) London, England 2) Sydney, Australia 3) Auckland, New Zealand 4) Hamilton, Canada 5) Cardiff, Wales 7. Identify the mismatched pair with regard to the 2014 FIFA World Cup Awards? 1) Golden Boot-James Rodriguez 2) Golden Ball - Lionel Messi 3) Golden Glove - Manuel Neuer 4) Best Young Player-Paul Pogba 5) Fair Play - Brazil 8. Which country was ranked number one in the 2014 Human Development Index? 1) Norway 2) Australia 3) Switzerland 4) Netherlands 5) USA 9. The National Thermal Power Corporation (NTPC) would dev- elop a 1,320 MW Kajra thermal project in Lakhisarai district of? 1) Himachal Pradesh 2) Jharkhand 3) Bihar 4) Haryana 5) Jammu& Kashmir 10. Which of the following teams won the Hockey India League in February 2014? 1) Delhi Waveriders 2) Punjab Warriors 3) Ranchi Rhinos 4) Uttar Pradesh Wizards 5) None of these 11. Who won the National Billiards Championship in Lucknow on February 26, 2014? 1) Sourav Kothari 2) Alok Kumar 3) B. Bhaskar 4) Dhruv Sitwala 5) None of these 12. DeepMind Technologies is a British artificial intelligence company. Which of the following companies acquired it in January 2014? 1) Facebook 2) Google 3) Oracle 4) Microsoft 5) IBM 13. Which of the following State governments recently launched "Samajwadi Pension Scheme"? 1) Bihar 2) Uttarakhand 3) Jharkhand 4) Madhya Pradesh 5) Uttar Pradesh 14. Chilika lagoon has been named 'destination flyways' by the United Nations World Tourism Organization (UNWTO). It is in? 1) Kerala 2) Gujarat 3) Odisha 4) Andhra Pradesh 5) Assam 15. Sakhee, Nirbhaya and Parivar Suraksha are the three health insurance policies for women account holders of? 1) State Bank of India 2) State Bank of Hyderabad 3) ICICI Bank 4) Bhartiya Mahila Bank 5) Axis Bank 16. India has signed a $300 million loan agreement with Asian Development Bank to help improve road connectivity in which of the following States? 1) Sikkim 2) Himachal Pradesh 3) Chhattisgarh 4) Arunachal Pradesh 5) Rajasthan 17. Air Costa is an Indian regional airline based in? 1) Madurai 2) Chennai 3) Bangalore 4) Vijayawada 5) Mangalore 18. Air Costa signed an agreement with Embraer, the world's largest maker of regional aircraft, to buy 50 jets valued at $2.94 billion. Embraer is based in? 1) Spain 2) Portugal 3) Brazil 4) Russia 5) Japan 19. Which of the following private banks has launched its toll-free banking service which will help customers in carrying out six basic banking transactions just by dialing the numbers on February 17, 2014? 1) ICICI Bank 2) HDFC Bank 3) Axis Bank 4) Yes Bank 5) None of these 20. Amul has recently launched India's first milk ATM, Any Time Milk vending machine in? 1) Rajasthan 2) Tamil Nadu 3) Gujarat 4) Kerala 5) Maharashtra 21. Which of the following States became India's first State with 100 per cent sanitation coverage, in February 2014? 1) Sikkim 2) Goa 3) Kerala 4) Punjab 5) Assam 22. Which of the following railway zones launched HYLITES, a live train enquiry system in February 2014? 1) Western Railway 2) South Central Railway 3) Northern Railway 4) North Eastern Railway 5) Central Railway 23. A constitutional referendum was held in which of the following countries in January 2014 in which the new constitution was approved by 98.1% of voters? 1) Iraq 2) Syria 3) Egypt 4) Belgium 5) Canada 24. Which of the following countries have conducted their first naval war games in the Mediterranean Sea in January 2014? 1) Russia and UK 2) Russia and China 3) China and Pakistan 4) China and Italy 5) Russia and Turkey 25. BiblioTech is the first bookless, all-digital public library in the? 1) UK 2) Canada 3) Denmark 4) Finland 5) USA 26. Which world leader set a new Guinness World Record by delivering the largest online Civics class in the world in February 2014? 1) Viktor Yanukovych 2) Shimon Peres 3) Barack Obama 4) David Cameron 5) Stephen Harper 27. Yulia Lipnitskaya is the youngest figure skater to win gold at the Winter Olympics in Sochi in February 2014. She belongs to? 1) Ukraine 2) South Korea 3) Russia 4) Latvia 5) Lithuania 28. In which of the following fund transfer is settled instantly without being bunched with any other transaction? 1) NEFT 2) EFT 3) TT 4) RTGS 5) None of these 29. Which of the following was replaced by the Base Rate system with effect from July 1, 2010? 1) Bank Rate 2) BPLR 3) MSF 4) LAF 5) Repo Rate 30. Joachim Gauck visited India recently. He is the? 1) President of France 2) Prime Minister of France 3) President of Germany 4) Prime Minister of Italy 5) Prime Minister of Portugal 31. The Reserve Bank of India will introduce about one billion plastic notes of which of the following denominations? 1) Rs 20 2) Rs 50 3) Rs 100 4) Rs 10 5) Rs 500 32. Which of the following trophies/cups is given to the winner of the Cricket match between the Ranji Trophy champion and Rest of India? 1) Vijay Hazare Trophy 2) Vizzy Trophy 3) Irani Cup 4) NKP Salve Trophy 5) None of these 33. 10,000 MW nuclear power project will be built at Kovvada of which of the following districts in Andhra Pradesh? 1) Prakasham 2) Krishna 3) Srikakulam 4) Anantapur 5) Kurnool 34. Which of the following companies has announced that it had agreed to acquire Mumbai based Loop Mobile for Rs 700 crore? 1) Vodafone 2) Bharti Airtel 3) Idea 4) Reliance 5) None of these 35. Which country will host the Women's Junior World Cup Hockey in 2016? 1) India 2) Chile 3) France 4) South Korea 5) China 36. Who is the United Nations' Special Envoy for Refugees? 1) Angelina Jolie 2) Julia Roberts 3) Britney Spears 4) Katherine Zeta Jones 5)Emma Watson 37. Kanyashree Prakalpa, a scheme that provides scholarship to girls from economically backward backgrounds, has been given international recognition by DFID and UNICEF. This scheme was launched by? 1) Odisha 2) West Bengal 3) Tripura 4) Madhya Pradesh 5) Uttar Pradesh 38. What is India's rank in terms of foreign money lying with Swiss banks? 1) 69 2) 74 3) 58 4) 70 5) 63 39. Which country has retained its top position with highest share of close to 20 percent of global wealth in Swiss banking system? 1) UK 2) USA 3) Germany 4) Pakistan 5) China 40. Shaida Abdali is which country's Ambassador to India? 1) Pakistan 2) Afghanistan 3) Iran 4) Syria 5) Iraq 41. Which of the following countries does not have a woman Prime Minister at present? 1) Latvia 2) Bangladesh 3) Trinidad and Tobago 4) Denmark 5) Thailand 42. Om Prakash Singh Karhana of India won a gold medal in the 6th Asian indoor athletics championships held in Hangzhou, China in February 2014 in? 1) Javelin throw 2) Shot put 3) Pole vault 4) Discus throw 5) None of these 43. Who won the Zurich Chess challenge tournament on February 5, 2014? 1) Fabiano Caruana 2) Viswanathan Anand 3) Magnus Carlsen 4) Levon Aronian 5) Boris Gelfand 44. Who won the winter club open squash tournament in Winnipeg, Canada on February 3, 2014? 1) Dipika Pallikal 2) Heba El Torky 3) SiyoliWaters 4) Joshna Chinappa 5) None of thes 45. Which of the following teams won the Irani Cup Cricket in Bangalore on February 12, 2014? 1) Karnataka 2) Rest of India 3) Mumbai 4) Delhi 5) Baroda 46. Which of the following Indian Premier League (IPL) Cricket teams bought Yuvraj Singh for a record Rs 14 crore on February 12, 2014? 1) Delhi Daredevils 2) Kolkata Knight Riders 3) Kings XI Punjab 4) Mumbai Indians 5) Royal Challengers Bangalore 47. Who became the first New Zeal- and batsman to score triple century in Tests in February 2014? 1) B.J. Watling 2) James Neesham 3) RossTaylor 4) Brendon McCullum 5) Corey Anderson 48. Who is the Chairman of the Seventh Pay Commission? 1) Justice A.K. Patnaik 2) Justice P.C. Ghose 3) Justice Dipak Mishra 4) Justice A.M. Khanwilkar 5) Justice Ashok Kumar Mathur KEY 1) 1; 2) 2; 3) 3; 4) 4; 5) 5; 6) 4; 7) 5; 8) 1; 9) 3; 10) 1; 11) 1; 12) 2; 13) 5; 14) 3; 15) 4; 16) 3; 17) 4; 18) 3; 19) 2; 20) 3; 21) 1; 22) 2; 23) 3; 24) 2; 25) 5; 26) 2; 27) 3; 28) 4; 29) 2; 30) 3; 31) 4; 32) 3; 33) 3; 34) 2; 35) 2; 36) 1; 37) 2; 38) 3; 39) 1; 40) 2; 41) 5; 42) 2; 43) 3; 44) 4; 45) 1; 46) 5; 47) 4; 48) 5.