న్యూఢిల్లీ : ఐక్యరాజ్యసమితి మానవాభివృద్ధి సూచికలో ఈ ఏడాది భారత్ ర్యాంక్ స్వల్పంగా మెరుగుపడింది. గత ఏడాది మానవాభివృద్ధి సూచికలో 189 దేశాలకు గాను 130వ స్ధానంలో నిలిచిన భారత్ ఈ ఏడాది ఒక స్ధానం మెరుగపడి 129వ స్ధానానికి చేరింది. 2005-06 నుంచి 2015-16 మధ్యలో భారత్‌లో 27 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని యూఎన్‌డీపీ ఇండియా స్ధానిక ప్రతినిధి శోకో నోడా చెప్పారు. మూడు దశాబ్ధాలుగా భారత్‌లో చోటుచేసుకుంటున్న వేగవంతమైన అభివృద్ధితో భారత్‌లో పేదరికం గణనీయంగా తగ్గిందని, జీవనకాలం పెరగడంతో పాటు మెరుగైన విద్య, వైద్యం అందుబాటులోకి వచ్చాయని ఆమె పేర్కొన్నారు. 1990 నుంచి 2018 మధ్యలో దక్షిణాసియా ప్రాంతం 46 శాతం మేర సత్వర వృద్ధి సాధించిందని ఆ తర్వాత తూర్పు ఆసియా, ఫసిఫిక్ ప్రాంతాలు 43 శాతం వృద్ధిని సాధించాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment