united nations organisation
-
నటుడు నరేశ్‌కు దక్కిన అరుదైన గౌరవం.. లెఫ్టినెంట్ కల్నల్‌గా గుర్తింపు
సీనియర్ నటుడు నరేశ్‌కు అరుదైన గౌరవం దక్కింది. సుమారు 300 చిత్రాలలో నటించిన నరేశ్ కేవలం సినిమాలకే పరిమితం కాలేదు. ఆయనలో మంచి వక్త కూడా ఉన్నారు. ప్రపంచ సమస్యలపై ఆయనకు లోతైన అవగాహన ఉంది. ఉగ్రవాదం, సామాజిక సమస్యలు, తదితర అంశాలపై అనేక అంతర్జాతీయ వేదికలపై ఆయన ఇప్పటికే ప్రసంగించారు. అందుకు గుర్తింపుగా 'సార్' అనే బిరుదుతోపాటు 'డాక్టరేట్'ని అందుకున్నారు. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ నుంచి ఆయనకు ఈ గుర్తింపు దక్కింది. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో తాజాగా జరిగిన 5వ ప్రపంచ కాంగ్రెస్ సమావేశాల్లో నటుడు నరేశ్‌కు ఈ అరుదైన గౌరవం దక్కింది. ఈ సమావేశాలను నేషనల్ అకాడమీ ఆఫ్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ సంస్థతోపాటు ఇంటర్నేషనల్ స్పెషల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అండ్ హ్యూమన్ రైట్స్ (ఐఎస్ సీఏహెచ్ఆర్) కలిసి ఈ సమావేశాన్ని నిర్వహించాయి. ఐఎస్ సీఏహెచ్ఆర్ సంస్థ ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ. ఇది నాటో, యూరోపియన్ యూనియన్, అమెరికా, తదితర దేశాల గుర్తింపు ఉన్న సంస్థ కూడా.. అక్కడ నరేశ్‌కు మరో గౌరవం దక్కింది. మిలటరీ ఆర్ట్స్ గుడ్‌విల్ అంబాసిడర్‌తో పాటు లెఫ్టినెంట్ కల్నల్‌గా నరేశ్‌ను నియమించినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. దీంతో ఇక నుంచి నరేశ్ పేరు ముందు లెఫ్టినెంట్ కల్నల్, సార్... అనే హోదా చేరుతుంది. అంతర్జాతీయ ఉగ్రవాదం అంశంపై ఆయన ప్రసంగాలకు తగిన గుర్తింపు లభించింది. నేషనల్ అకాడమీ ఆఫ్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ ప్లానింగ్ (ఎన్ఏఎస్డీపీ), ఇంటర్నేషనల్ స్పెషల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అండ్ హ్యూమన్ రైట్స్ (ఐఎస్ సీఏహెచ్ఆర్) ఓ కార్యక్రమంలో నరేశ్‌కు 'సర్' బిరుదును ప్రదానం చేశాయి. ఫిలిప్పీన్స్ లోని మనీలా నగరంలో జరిగిన 5వ వరల్డ్ కాంగ్రెస్ సమావేశంలో ఈ బిరుదును అందించారు. ఐఎస్ సీఏహెచ్ఆర్ సంస్థ ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ. ఇది నాటో, యూరోపియన్ యూనియన్, అమెరికా, తదితర దేశాల గుర్తింపు ఉన్న సంస్థ కూడా. ఇక నుంచి నరేశ్ పేరు ముందు లెఫ్టినెంట్ కల్నల్, సార్... అనే హోదా చేరుతుంది. దేశంలో ఇలాంటి గౌరవాలు అందుకున్న తొలి నటుడిగా నరేశ్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఉగ్రవాదంపై ఆయన చేసిన ప్రసంగాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయని ఈ కార్యక్రమంలో ప్రముఖులు తెలిపారు. ఉగ్రవాదాన్ని అరికట్టడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ సమావేశాల ఉద్దేశాన్ని ఓ దౌత్యవేత్తగా, కళాకారుడిగా ప్రజల్లోకి తీసుకెళతానని నరేశ్ ఈ సందర్భంగా తెలిపారు. తన ఉపన్యాసాలకు గుర్తింపుగా 'సర్' బిరుదును ఇవ్వడం పట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు ఆయన పేర్కొన్నారు. -
ఇండియా పేరు మార్పుపై ఐరాస స్పందన
న్యూయార్క్: కేంద్ర ప్రభుత్వం.. ఇండియా అనే పేరును భారత్‌గా మారబోతోందన్న ఊహాగానాలపై విస్త్రృత స్థాయిలో చర్చ నడుస్తున్న వేళ ఐక్యరాజ్య సమితి స్పందించింది. అలాంటి విజ్ఞప్తి ఏదైనా తమ దాకా వస్తే.. తప్పకుండా పరిశీలిస్తామని తెలిపింది. దేశాలు తమ తమ పేర్లను మార్చుకునే క్రమంలో.. ప్రపంచ దేశాల సమాఖ్య ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తులు పంపుతుంటాయి కూడా. ఐరాస గనుక ఆ విజ్ఞప్తిని అధికారికంగా అంగీకరిస్తే.. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఆ దేశాన్ని కొత్త పేరుతోనే పిలుస్తుంటారు. ఇదే విషయాన్ని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ ఉపప్రతినిధి ఫర్హాన్ హక్ ప్రస్తావించారు. ‘‘ చివరిసారిగా.. టర్కీ దేశం కూడా తుర్కీయేగా తమ పేరును మార్చాలని ఐరాసకు విజ్ఞప్తి పెట్టుకుంది. అలా ఇండియా కూడా అలాంటి విజ్ఞప్తి ఏదైనా చేస్తే.. తప్పక పరిశీలిస్తాం. ఇండియా మాత్రమే కాదు ఏ దేశం అలా రిక్వెస్ట్ పంపినా పరిశీలిస్తాం’’ అని తెలిపారు. కిందటి ఏడాది టర్కీ తుర్కీయేగా తమ దేశం పేరును మార్చుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు దేశంలో పేరు మార్పు అంశం రాజకీయదుమారానికి తెర తీసింది. ఈనెల 9-10 తేదీల్లో ఢిల్లీలో జరగబోయే జీ20 సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన విందు ఆహ్వాన పత్రికల్లో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కు బదులుగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ President of Bharat అని ఉండటంతో ఈ అంశం కాస్తా తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో కేంద్రంపై విరుచుకుపడుతోంది. బీజేపీ ఆ విమర్శలకు కౌంటర్ ఇస్తోంది. అయితే.. విపక్ష ఇండియా కూటమిలోని కొన్ని పార్టీల నేతలు భారత్ అనే పేరు మార్పుపై సానుకూల వ్యాఖ్యలు చేస్తుండడం గమనార్హం. మరోవైపు ప్రధాని మోదీ ఈ విషయంలో కేంద్ర మంత్రులకు దిశానిర్దేశం చేశారు. పేరు మార్పు విషయంలో వివాదాలకు దూరంగా ఉండాలని మంత్రులను కోరారాయన. -
ఐక్యరాజ్యసమితి ప్రశంసలు అందుకున్న 'తెలుగు మహిళ'
ఆమె చదువుకోలేదు. కానీ నేల గొప్పతనం తెలుసు. విత్తనం విలువ తెలుసు. ప్రకృతిని కాపాడాలంటే ఏ పద్ధతిలో సాగు చెయ్యాలో తెలుసు. ఆమె మారుమూల పల్లెకు చెందిన సామాన్యురాలు. కానీ వ్యవసాయ శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోయేలా.... 30 రకాల చిరుధాన్యాల పంటలు పండించి 'విత్తన సంరక్షణ' నిధిని ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం సందర్భంగా ఐక్యరాజ్యసమితి ప్రశంసలు పొందిన ఆమె మన తెలుగు మహిళ....నడిమిదొడ్డి అంజమ్మ. జీవ వైవిధ్య పరిరక్షణలో భాగంగా విత్తనాల విప్లవంలో ఆమె చేసిన కృషిపై సాక్షి ప్రత్యేక కథనం. అంజమ్మ సొంత ఊరు సంగారెడ్డి జిల్లా గంగ్వార్, అది తెలంగాణ , కర్ణాటకలోని ఒక సరిహద్దు ప్రాంతం. నిరుపేద దళిత కుటుంబంలో పుట్టిన ఆమె బడి ముఖమైనా చూడలేదు. పదేళ్ళ వయసులోనే.. సమీపంలోని గంగ్వార్ కు చెందిన సంగప్పతో వివాహం జరిగింది. ''అప్పట్లో మాకు రెండు పూటలా భోజనం చేసే పరిస్థితి కూడా లేదు. వ్యవసాయ కూలీగా. జీవితాన్ని మొదలుపెట్టాను" అంటూ నాటి రోజులను గుర్తు చేసుకుంటు, క్రమ క్రమంగా ఒక అర ఎకరం భూమిని ఆ దంపతులు సమకూర్చుకున్నారు. సేంద్రియ పద్ధతులతో వ్యవసాయం ప్రారంభించారు. అదే సమయంలో... ఆ ప్రాంతంలో సేంద్రియ విధానంలో చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడానికి జహీరాబాద్ ప్రాంతంలో దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్) కార్యక్రమాలు చేపట్టింది. అ సొసైటీలో అంజమ్మ సభ్యురాలుగా చేరింది. డీడీఎస్ సహకారంతో తన పొలంలో చిరుదాన్యాలు సాగు చేసింది. అర ఎకరం నుంచి పది ఎకరాల భూమికి.. కొత్త మెళకువలను తెలుసుకుంటూ, వివిధ రకాల పంటలు వేసింది. ఆమె శ్రమ మంచి ఫలితాలను ఇచ్చింది. ముప్పై ఏళ్ళ కాలంలో అర ఎకరం నుంచి పది ఎకరాల భూమికి యజమానురాలుగా చేరుకున్నారు. వాయిస్ ఓవర్ : నూనె గింజలు, పప్పు దినుసులు, రాగులు, సజ్జలు, సామలు, కొర్రలు. తదితర చిరుధాన్యాలు పండించారు. ఇప్పటి వరకూ 80 రకాల చిరుధాన్యాలతో విత్తన సంపదను సృష్టించారు. ఈ విత్తన సంరక్షణ నిధిలోని విత్తనాలను ఆమె ఎవరికి విక్రయించరు. అవసరమయ్యే రైతులకు ఉచితంగా ఇస్తారు, వారికి దిగుబడి వచ్చాక రెట్టింపు విత్తనాలు తీసుకొని మళ్ళీ భద్రపరుస్తారు. స్థానిక వాతావరణానికి అనుగుణంగా వివిధ రకాలను పండిస్తున్న అంజమ్మను మొక్కల జీవ వైవిధ్యం. పరిరక్షకురాలుగా 2019లో కేంద్ర ప్రభుత్వం అవార్డు తో సత్కరించింది. ఆమెకు అంతర్జాతీయంగా గుర్తింపు దక్కింది. విత్తన సంరక్షకురాలుగా ఖ్యాతి పొందిన అంజమ్మ నాగాలాండ్, బీహార్, మేఘాలయ, ఒడిశా, అసోంతో సహా 22 రాష్ట్రాల్లో పర్యటిం చారు. విత్తన సంరక్షణ, సేంద్రియ ఎరువులు తయారీ, మహిళా సంఘాల నిర్వహణ తదితర అంశాల్లో తన అనుభవాలను అక్కడివారితో పంచుకున్నారు. అంజమ్మ విత్తన సంరక్షకురాలు. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం సందర్భంగా ఈ ఏడాది ఐక్యరాజ్యసమితి (ఐరాస) ఆహార, వ్యవసాయ విభాగం ప్రపంచస్థాయిలో చిరుధాన్యాల రైతులపై అధ్యయనం చేపట్టింది. చిరుధాన్యాలు పండించడం, విత్తనాలను అందజేయడం ద్వారా వాటి సాగును ప్రోత్సహించడంలో అంజమ్మ కృషిని ఆ విభాగం గుర్తించి, ప్రశంసలు అందించింది. ఒక సాధారణ మహిళ అంతర్జాతీయ స్థాయిలో పొందిన ఈ గుర్తింపు జాయిరాబాద్ ప్రాంతానికి గర్వకారణమని పలువురు ప్రముఖులు ఆమెను అభినందిస్తున్నారు. డీడీఎస్ డైరెక్టర్‌గా ఈ మధ్య వరకూ పనిచేసిన.. దివంగతులైన సతీష్ గారి సలహాలు, సూచనలు నన్ను ముందుకు నడిపించాయి. చిరుదాన్యాలను పండిస్తే మనకు ఆరోగ్యకరమైన ఆహారం లభిస్తుంది. పశువులకు, పక్షులకూ కూడా ఇవి మేలు చేస్తాయి అని చెబుతోంది 63 ఏళ్ళ అంజమ్మ . ఇక అంజమ్మ అటు విత్తన సంరక్షణ చేస్తూనే .. రాజకీయాల్లో కూడా రాణిస్తోంది . స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీగా గెలుపొంది, ప్రస్తుతం న్యాలకల్ మండల పరిషత్ అధ్యక్షురాలుగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. (చదవండి: సంక్షోభం నేర్పిన పాఠం! నగరాల్లోకి 'పెరటి తోటలొచ్చాయ్'!) -
World Music Day: సంగీతానికి ప్రత్యేకంగా ఓ రోజు ఎందుకు కేటాయించారంటే!
సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, ఇలా లలిత కళలు ఐదు. కానీ మిగతా వాటికి భిన్నమైన దారి సంగీతానిది. సంగీతానిది ఎలాంటి ఎల్లలూ, హద్దులూ లేని విశ్వభాష. సంగీతం మనసుకు హాయిని కలిగిస్తుంది. కొన్ని రకాల అనారోగ్యాలను తొలగిస్తుంది. ముఖ్యంగా మానసిక ఆరోగ్యానికి సంగీతంతో చికిత్స చేయవచ్చు. జూన్ 21న ప్రపంచ సంగీతం దినోత్సవం. ఈ సందర్భంగా సంగీతం మనిషి జీవితంతో ఎంతగా పెనవేసుకుని పోయిందో, అన్ని రోజులూ మన వీనులకు విందు గావించే సంగీతానికి ప్రత్యేకంగా ఓ రోజంటూ ఎందుకు కేటాయించారో తెలుసుకుందాం... మనకు నచ్చిన పాట లేదా మనసుకు హత్తుకునే సంగీతం విన్నపుడు విన్నపుడు మనకు తెలీకుండానే ఒక రకమైన తన్మయత్వం కలుగుతుంది. ఎప్పుడైనా కాస్త డీలా పడినట్లు, ఒత్తిడికి లోనైనట్లు అనిపించినప్పుడు ఒక మంచిపాట, వీనులవిందైన సంగీతం వింటే ఆ ఒత్తిడి మొత్తం ఎగిరిపోతుంది. ఎంతో సాంత్వన లభిస్తుంది. నూతనోత్తేజం కలుగుతుంది. ఇక సంతోష సమయాలలో ఐతే చెప్పనక్కర్లేదు. పెళ్లి వేడుకలు, ఇతర కార్యక్రమాల్లో ఉరకలెత్తించే, హుషారు కలిగించే సంగీతం, పాటలు వాతావరణాన్ని మరింత సందడిగా ఆహ్లాదంగా మారుస్తాయి. మొత్తంగా సంగీతాన్ని ఇష్టపడని సంగీతానికి పరవశించని వారంటూ ఉండరంటే అతిశయోక్తి కాదేమో! సంగీతం... సార్వజనీనం పొత్తిళ్లలోని పాపాయి ఉంగా ఉంగా అని చేసే శబ్దంలో ఉంది సంగీతం, తల్లి తన బిడ్డను ఊయలలూపుతూ పాడే లాలిపాటల్లో ఉంది సంగీతం, ఏడుస్తున్న పసిబిడ్డ ఆ ఏడుపు ఆపి హాయిగా కేరింతలు కొట్టేటట్లు చేయగల అమ్మమ్మలు, బామ్మల జోలపాటల్లో ఉంది సంగీతం, శ్రమైక జీవులు తమకు అలుపు తెలీకుండా పాడుకునే పాటల్లో ఉంది సంగీతం. ఇవన్నీ కూడా ఎలాంటి శాస్త్రీయ పద్ధతిని పాటించకపోయినప్పటికీ ఒక సొగసైన తాళం, రమ్యమైన లయతో సాగుతుంటాయి. మనుషులే కాదు ఇతర ప్రాణులకూ ఉంది సంగీత జ్ఞానం. నాగస్వరం విన్న సర్పాలు సొగసుగా నాట్యమాడటం, చైత్రమాసాన లేత మామిడి చివుళ్లు తిన్న కోయిలమ్మ కుహుకుహు రాగమాలపించటం, సంగీతం వింటూ ఆవులు పాలు సమృద్ధిగా ఇవ్వడం మనకు తెలిసిందే. అందుగలడిందులేడని...అన్న చందాన ప్రపంచమంతటా నిండి ఉంది సంగీతం. అందుకే అన్నారు శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసం ఫణిః అని. వాగ్గేయకారులైన అన్నమయ్య, త్యాగయ్య, క్షేత్రయ్య వంటివారు తమ ఆరాధ్యదైవాలపైన సంకీర్తనలు రచించారు. పాటలు పాడుకున్నారు. తమ జీవితంలోని విషాదాలను, విరహాలను తొలగించుకున్నారు. నైరాశ్యాన్ని సంగీతంతోనే జయించారు. అంతకంటే ముందు అశోకవనంలో సీతాదేవి ఒకానొక దశలో తీవ్ర నైరాశ్యానికి లోనై, పొడవైన తన కేశాలతో గొంతుకు ఉరి బిగించుకుని ఆత్మహత్యకు పాల్పడబోతుండగా.. చెట్టు మీదున్న ఓ పక్షి ఏదో వింత వింత శబ్దాలతో వీనులవిందైన రాగాన్ని ఆలపించింది. అప్రయత్నంగా ఆ రాగాలను ఆలకించిన సీతమ్మలోని నైరాశ్యం, కుంగుబాటు తొలగిపోయాయి. జీవితంపై తిరిగి ఆశలు చిగురించాయి. ఆత్మహత్యా ప్రయత్నాన్ని విరమించుకుని రాముడి కోసం ఓపిగ్గా నిరీక్షించింది. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. మెదడుకు, హృదయానికి సంబంధించిన కొన్ని వ్యాధులకు చేసే చికిత్సలో రోగికి ఇష్టమైన సంగీతాన్ని వినిపించడం ద్వారా వైద్యులు సత్ఫలితాలను సాధించిన దాఖలాలెన్నో మనకు తెలుసు. బీపీ, తలనొప్పి వంటి వాటిని సంగీత చికిత్సతో నయం చేయవచ్చని వైద్యులు నిరూపించారు కూడా. బాత్రూమ్లో కూనిరాగాలు తీసే వారు, బరువు పనులు చేసేవారు, రేవుల్లో బట్టలు ఉతికే రజకులు.. ఒకరేమిటి... శ్రమ తెలియకుండా తమకు తోచిన పాటలు పాడుకోవడం అందరికీ తెలిసిందే. ఐక్యరాజ్యసమితి ప్రకటన ప్రజల మనస్సుల్లో, ఆలోచనల్లో సంగీతాన్ని నిత్యనూతనంగా ఉంచాలన్న ఉద్దేశ్యంతో ఐక్యరాజ్యసమితి జూన్ 21ని ప్రపంచ సంగీత దినోత్సవంగా నిర్వహించాలని ప్రతిపాదించింది. దీని ప్రకారం ప్రతి ఏడాది ప్రపంచమంతటా జూన్ 21ని వరల్డ్ మ్యూజిక్ డేగా పాటించాలని ప్రకటించింది. ఇది క్రమంగా అన్ని దేశాలకు, నగరాలకు వ్యాపించి వరల్డ్మ్యూజిక్ డేకు ప్రాచుర్యం లభించింది. ప్రపంచ సంగీత దినోత్సవాన్ని ‘ఫెటె డె లా మ్యూసిక్’ అని ‘మేక్ మ్యూజిక్ డే’ అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో, 1000 నగరాల్లో వరల్డ్ మ్యూజిక్ డే సంబరాలను జరుపుకుంటున్నారు. ఈ వేడుకల్లో సంగీతం పట్ల అభిమానం, ఆసక్తి ఉన్నవారెవరైనా పాల్గొనవచ్చు. ఎవరైనా, ఎక్కడైనా సంగీత ప్రదర్శనలు ఇవ్వవచ్చు. పార్కులు, వీధులు, గార్డెన్లు, ఇతర పబ్లిక్ ప్లేసులలో గానంతో లేదా వాద్యపరికరాలతో తమ సంగీత నైపుణాన్ని ప్రదర్శించవచ్చు. ఈరోజు జరిగే ప్రదర్శనలన్నీ అందరికీ పూర్తిగా ఉచితమే. నిబంధనలేమీ లేని రోజే సంగీత దినోత్సవం ప్రపంచంలో ఎక్కడైనా ఏదైనా కార్యక్రమంలో పాల్గొనాలంటే, ఏదైనా పని చేయాలంటే వాటికి సంబంధించి కొన్ని పరిమితులు ఉంటాయి. ఇలాగే పాల్గొనాలి, ఇంత వయసు వారే పాల్గొనాలి, ఇంత అనుభవం కావాలి....ఇలాంటివి. కానీ వరల్డ్ మ్యూజిక్ డే విషయంలో అలాంటి నిబంధనలేమీ లేవు. సంగీతం పట్ల అనురక్తి, ఆసక్తి ఉన్నవారైవరైనా ఇందులో భాగస్వాములు కావచ్చు. ఉద్దండులు, సాధారణమైన వారు అన్న తారతమ్యాలేవీ ఉండవు. సంగీత రంగంలో గొప్పవారనదగ్గ వారి నుంచి ఇప్పుడే ఓనమాలు నేర్చుకుంటున్న వారి దాకా, పిల్లల నుంచి వృద్ధుల దాకా ఎవరైనా నిరభ్యంతరంగా పాల్గొన వచ్చు. మీ మీ ఆసక్తులను బట్టి ఒక సమూహంగా ఏర్పడవచ్చు. అంతా కలిసి ఒక సంగీత కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చు. ప్రదర్శనలు ఇవ్వవచ్చు లేదా మీరే ఆ ప్రదర్శనలో పొల్గొని సంగీత ప్రపంచంలో కాసేపు ఆనందంగా, హాయిగా విహరించవచ్చు. కాబట్టి మీకు మీరే మీకు నచ్చిన అంశం మీద సరదాగా ఓ ప్యారడీ పాట రాయండి. దానిని మీరే పాడండి. పదిమందితోనూ పంచుకోండి. సంగీత సముద్రంలో ఓలలాడండి. జీవితంలో ఆనందాన్ని నింపుకోండి. (జూన్ 21న ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా) చదవండి: అంతర్జాతీయ యోగా దినోత్సవం: యోగా ఒక విస్మయ శక్తి -
Turkey To Turkiye: టర్కీ పేరు మార్చుకోవడానికి కారణం ఇదే!
అంకారా: మిడిల్ ఈస్ట్ కంట్రీ టర్కీ.. అధికారికంగా తన పేరు మార్చుకుంది. టర్కీ కాస్త ఇక నుంచి ‘తుర్కియె’గా మారనుంది. ఇక నుంచి కొత్త పేరుతో తమను గుర్తించాలని ఐక్యరాజ్య సమితికి టర్కీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతిపాదన పంపారు. ఆ వెంటనే ఐరాస అంగీకారం చెబుతూ.. ఈ విషయాన్ని ప్రకటించింది. దేశం గుర్తింపులో మార్పులుచేసే ‘‘రీబ్రాండింగ్’’ను.. కిందటి ఏడాది అధ్యక్షుడు రెచప్ టయ్యప్ ఎర్దోవాన్ మొదలుపెట్టారు. ఇందులో భాగంగా దేశం పేరును మార్చాలంటూ ప్రముఖ అంతర్జాతీయ సంస్థలను అక్కడి ప్రభుత్వ అధికారులు ఆశ్రయిస్తున్నారు. ఎర్దోగాన్ సైతం తమ దేశం పేరును తుర్కియె (Türkiye)గా ఉచ్చరించాలని ప్రపంచ దేశాలను కోరుతున్నారు. తుర్కుల సంస్కృతి, సంప్రదాయాలు, నాగరికత, విలువలకు తుర్కియా అనే పదం చక్కగా నప్పుతుందని ఎర్దోవాన్ చెబుతూ వస్తున్నారు. గత ఏడాది పేరును మారుస్తున్నట్లు టర్కీ ప్రకటించిన వెంటనే ప్రభుత్వ మీడియా సంస్థ టీఆర్టీలో వెంటనే మార్పులు చేశారు. టర్కీ (turkey)గా ఉన్న దేశం పేరును తుర్కియె(Türkiye)గా మార్చుకున్నట్లు.. ఐక్యరాజ్య సమితికి పంపిన లేఖలో పేర్కొన్నారు. కొత్త పేరును అధికారికంగా గుర్తించాలని ఐక్యరాజ్య సమితిని కోరారు టర్కీ విదేశాంగ మంత్రి. తమ దేశం పేరును మార్చాలని టర్కీ పెట్టుకున్న అభ్యర్థనకు ఐరాస అంగీకారం తెలిపింది. దీంతో టర్కీ అనే పేరు ఇక చరిత్ర కానుంది. కారణం ఇదే.. టర్కీ అనేది ఒక పక్షి పేరు. అంతేకాదు.. ఫెయిల్యూర్, మూర్ఖుడు, సిల్లీ ఫెలో అనే ఇంగ్లిష్ అర్థాలు కూడా ఉన్నాయి. అందుకే ఈ పేరు మార్చాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుందని టీఆర్టీ చెబుతోంది. గత జనవరిలో ‘హలో తుర్కియా’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. రీబ్రాండింగ్ ప్రక్రియలో భాగంగా.. ఇక నుంచి ఆ దేశం నుంచి ఎగుమతి అయ్యే ప్రాడక్టులపై ‘మేడ్ ఇన్ తుర్కియె’ మారుస్తారు. దేశం కొత్త పేరును విస్తృతంగా ప్రాచుర్యంలోకి తీసుకురావాలని అక్కడి ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. మిశ్రమ స్పందన దేశం పేరును మార్చడంపై అక్కడి ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతుండటంతో ఆర్థిక సంక్షోభం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఎర్దోవాన్ ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. జనాలు కూడా తమ పరిస్థితి పట్టించుకోకుండా.. ఇలా పేర్లు మారుస్తున్న ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే.. దేశాలు ఇలా పేర్లు మార్చుకోవడం కొత్తేమీ కాదు. 2020లో డచ్ ప్రభుత్వం హోలాండ్ అనే పేరును ఇకపై వాడబోమని నెదర్లాండ్స్, ఐరాసకు తెలిపింది. అంతకుముందు మాసిడోనియా కూడా గ్రీస్‌తో ఉన్న గొడవల నేపథ్యంలో.. నార్త్ మాసిడోనియాగా పేరు మార్చుకుంది. గతంలో పర్షియా ఇరాన్ అయ్యింది. అలాగే.. సియామ్ కాస్త థాయ్‌లాండ్ అయ్యింది. ఇలా ఎన్నో దేశాలు పేర్లు మార్చుకున్నాయి. -
మహాత్ముడి స్ఫూర్తితో కరోనాపై పోరు
ఐక్యరాజ్యసమితి: గాంధీజీ ఇచ్చిన శాంతి సందేశాన్ని ప్రపంచ సమాజం అందిపుచ్చుకోవాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ పిలుపునిచ్చారు. ఒకరిపై ఒకరు యుద్ధం చేసుకోవడం కాదు, మనందరి ఉమ్మడి శత్రువైన కరోనా మహమ్మారిపై మహాత్ముడి స్ఫూర్తితో కలిసికట్టుగా యుద్ధం సాగిద్దామని సూచించారు. కరోనాను ఓడించడమే మన లక్ష్యం కావాలని చెప్పారు. గాంధీజీ జయంతి రోజే అంతర్జాతీయ అహింసా దినం కావడం యాదృచ్ఛికం కాదని అన్నారు. ఆయన పాటించిన అహింసా, శాంతియుత నిరసనలు, గౌరవం, సమానత్వం అనేవి మాటలకు అతీతమైనవని తెలిపారు. మానవాళి భవిష్యత్తుకు అవి చోదక శక్తులని ఉద్ఘాటించారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్షోభ పరిస్థితులకు ఇవి చక్కటి పరిష్కార మార్గాలని వివరించారు. ఈ మేరకు అంతర్జాతీయ అహింసా దినం సందర్భంగా గుటెరస్ శనివారం ఒక సందేశం విడుదల చేశారు. ఘర్షణలు, వాతావరణ మార్పులు, పేదరికం, అసమానతలు, అపనమ్మకం, ప్రజల మధ్య విభజనలు ప్రపంచానికి పెద్ద సమస్యగా మారాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. -
నిరాశ్రయులైన వేలాది మంది ప్రజలు
కిన్షాసా: కాంగో దేశంలో అగ్నిపర్వతం పేలిన ఘటనలో ఇరవైవేల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఆ దేశంలోని గోమాలో అగ్నిపర్వతం పేలడంతో లావా ప్రవహించింది. దీంతో డజన్లకొద్దీ ప్రజలు మరణించినట్లు, 40 మంది వరకు తప్పిపోయినట్లు బుధవారం ఐక్యరాజ్యసమితి తెలిపింది. అంతేకాకుండా అగ్నిపర్వత విస్ఫోటనాకి వందలాది గృహాలు ధ్వంసమయ్యాయి. వేలాది మంది అక్కడి నుంచి దూరంగా పారిపోయారని తెలిపారు. కాగా నైరాగోంగో నుంచి 15 కి.మీ (9 మైళ్ళు) దూరంలో 200 సార్లు భూమి కంపించింది. అయితే ఇప్పటివరకు భూకంపానికి ఎటువంటి మరణాలు సంభవించలేదని అధికారులు తెలిపారు. కానీ భూమి కంపించడంతో పగుళ్లు ఏర్పడ్డాయని, ఈ పగుళ్లు అక్కడి నివాసితులను భయాందోళనలకు గురిచేస్తున్నాయని తెలిపారు. కాంగో దేశ అధికారులు పునరావాస సహాయక పనులు చేపట్టారు. అయితే దశాబ్దాలుగా రగులుతున్న ఇరగోంగో అగ్నిపర్వతం బద్దలయ్యే సమయాన్ని అక్కడి యంత్రాంగం అంచానా వేయలేకపోయింది. దీంతో ప్రాణ, ఆస్తి నష్టం భారీగా సంభవించింది. (చదవండి: ఆకుపచ్చగా మారుతున్న గంగానది.. కారణం ఏంటి?) -
20 ఏళ్ల తర్వాత అగ్నిపర్వతం బద్ధలు..భయం గుప్పిట్లో ప్రజలు
కిన్షాసా: కాంగోలోని ఇరగోంగో అగ్నిపర్వం దాదాపు రెండు దశాబ్దాల తర్వాత బద్దలైంది. అగ్ని పర్వతం విస్ఫోటనంతో లావా పైకి ఉప్పొంగుతోంది. దీంతో ఆకాశమంతా ఎరుపురంగులోకి మారింది. లావా ధారలుగా ప్రవహిస్తూ గోమా నగరంలోని ప్రధాన రహదారులపైకి చేరడంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దాదాపు రెండు మిలియన్ల మంది గోమా నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. అయితే, ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని అధికార వర్గాలు తెలిపాయి.1977 లో నైరాగోంగో పర్వతం విస్ఫోటనం వల్ల సుమారు 2 వేల మంది మరణించారు. అలాగే 2002లో విస్పోటనం చెందగా.. తప్పించుకునే దారిలేక వందలాది మంది మృతి చెందారు. లక్ష మందికిపైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. శనివారం రాత్రి మరోసారి అగ్నిపర్వతం బద్దలవడంతో ప్రజలంతా ఆందోళనకు గురవుతున్నారు. అయితే అగ్నిపర్వతం పేలుడుతో వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం సహాయక చర్యలు ప్రారంభించింది. కాగా యూరప్ పర్యటనలో ఉన్న కాంగో అధ్యక్షుడు ఫెలిక్స్ టిసెకెడి ఆదివారం స్వదేశానికి రానున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు సుమారు మూడువేల మంది ప్రజలు కాంగోను విడిచి వెళ్లినట్లు రువాండా ఇమ్మిగ్రేషన్ అధికారులు పేర్కొన్నారు. కొందరు కివు సరస్సు పడవల్లో ఆశ్రయం పొందగా.. మరికొందరు మెట్రోపాలిటన్ ప్రాంతంలోని ఎత్తయిన పర్వత ప్రాంతానికి చేరుకున్నారు. ఇక ఈ ఘటనపై ఐక్యరాజ్య సమితి శాంతి భద్రత బృందం స్పందించింది. లావా గోమా నగరం వైపు వెళ్లడం లేదని, ప్రస్తుతం తాము అప్రమత్తంగానే ఉన్నట్లు పేర్కొంది. కాగా అగ్నిపర్వత విస్ఫోటనం గురించి సకాలంలో తెలియజేయకపోవడంతో ప్రజల్లో అయోమయం నెలకొంది. అధికారులు సకాలంలో స్పందిచకపోవడం, సోషల్ మీడియాలో రకరకాల వార్తలు ప్రచారం కావడంతో ప్రజల్లో గందరగోళం పెంచింది. 🚨🚨Activité volcanique aux alentours de Goma: la MONUSCO fait des vols de reconnaissance. La lave ne semble pas se diriger vers la ville de Goma. Nous restons en alerte. pic.twitter.com/JQmz7v16Ne — MONUSCO (@MONUSCO) May 22, 2021 (చదవండి: హఠాత్తుగా మారిన వాతావరణం: చైనాలో పెనువిషాదం) -
పురుషుల కంటే స్త్రీలే అధికంగా..
ఐక్యరాజ్యసమితి: మహమ్మారి కోవిడ్ కారణంగా, 2021లో దక్షిణాసియాలో మహిళల పేదరికం మరింత పెరగనున్నట్టు ఐక్యరాజ్యసమితి తాజాగా విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రానున్న దశాబ్దంలో 25 –34 ఏళ్ల వయస్సుల వారిలో పురుషుల కంటే అధికంగా స్త్రీలే పేదరికం బారిన పడతారని ఆ సంస్థ వెల్లడించింది. గత దశాబ్దాలలో మహిళలను పేదరికం నుంచి బయటకు తీసుకురావడానికి చేసిన కృషి, ఇప్పటి వరకు జరిగిన మహిళల అభివృద్ధి కోవిడ్ మహమ్మారి కారణంగా, తిరోగమనంవైపు మళ్లుతోందని తెలిపింది. ఫలితంగా 2021 నాటికి 4 కోట్ల 70 లక్షల మంది అదనంగా పేదరికం బారిన పడనున్నారని యుఎన్ వుమెన్, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం సంస్థలు వెల్లడించాయి. (చదవండి: కరోనా వల్ల మహిళలకే ఎక్కువ రిస్క్: యూఎన్) కోవిడ్ కారణంగా దక్షిణాసియాలో స్త్రీ-పురుష అంతరాలు తీవ్రంగా పెరిగిపోయి, మహిళలు మరింత పేదరికంలోకి కూరుకుపోనున్నారని ‘‘ఫ్రం ఇన్సైట్స్ టు యాక్షన్.. జెండర్ ఈక్వాలిటీ ఇన్ ది వేక్ ఆఫ్ కోవిడ్–19’’ పేరుతో విడుదల చేసిన రిపోర్టులో పేర్కొన్నాయి. కోవిడ్‌కి ముందు దక్షిణాసియాలో మహిళల పేదరికం రేటు 2021లో 10 శాతంగా అంచనావేయగా, ప్రస్తుతం అది 13 శాతంగా మారనుంది. 2021లో యావత్ ప్రపంచంలో, ప్రతి వంద మంది పేద పురుషులకు 118 మంది స్త్రీలు దారిద్య్రంలో ఉంటారని రిపోర్టు తెలిపింది. (చదవండి: ఆ ప్రభావాన్ని ఇప్పుడే అంచనా వేయలేం) ఈ అంతరం 2030 నాటికి ప్రతి వంద మంది పురుషులకు 121 మంది స్త్రీల నిష్పత్తికి చేరనున్నట్టు ఈ నివేదిక తెలిపింది. ఈ మహమ్మారి 2021 నాటికి 9.6 కోట్ల మందిని దుర్బర దారిద్య్రంలోకి నెడుతుండగా, అందులో 4.7 కోట్ల మంది స్త్రీలు, బాలికలే ఉంటారని ఈ రిపోర్టులో స్పష్టం అయ్యింది. మన సమాజం, ఆర్థిక వ్యవస్థల నిర్మాణంలో ఉన్న తప్పుడు విధానాల వల్ల ఈ అంతరాలు పెరుగుతున్నట్టు యుఎన్ వుమెన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫుంజిలే లాంబో నెకూకా తెలిపారు. మధ్య, దక్షిణ ఆసియా, సహారా ఆఫ్రికా ప్రాంతాల్లో ప్రపంచంలోనే అత్యధికంగా 87 శాతం పేదరికం ఉండగా, ఇప్పుడు అదనంగా మధ్య ఆసియాలో 5.4 కోట్లు, దక్షిణాసియాలో 2.4 కోట్ల మంది ప్రజలు అంతర్జాతీయ దారిద్య్ర రేఖ దిగువకు పడిపోనున్నట్లు ఆ రిపోర్టు వెల్లడించింది. -
భారత్-చైనా వివాదం: యూఎన్ఓ జోక్యం
న్యూయార్క్ : భారత్-చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి (యూఎన్ఓ) స్పందించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో వివాదాన్ని సద్దుమణిగించేలా ఇరు దేశాలు వ్యవహరించాలని, సరిహద్దుల వెంట ఉద్రిక్తతలు తలెత్తకుండా చూడాలని యూఎన్ఓ సూచించింది. ఒకవేళ దౌత్య మార్గాల ద్వారా ఇరు దేశాలు సమస్యను పరిష్కరించుకోని పక్షంలో మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను సరిచేసుకోవాలని వ్యాఖ్యానించింది. అలాగే భారత్-చైనా మధ్య తాను మధ్యవర్తిత్వం వహిస్తా అంటూ ముందుకొచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదనను కూడా ఇరు దేశాలు పరిశీలించాలని కోరింది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఓ ప్రకటన చేశారు. (మధ్యవర్తిత్వం చేస్తా) కాగా లదాఖ్, సిక్కిం ప్రాంతాల్లో భారత్– చైనా సరిహద్దు వెంట ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో.. మధ్యవర్తిత్వానికి సిద్ధమంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూఎన్ఓ తాజా వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు చైనా కవ్వింపు చర్యలతో తూర్పు లదాఖ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు అంతకంతకు తీవ్రతరమవుతున్నాయి. రెండు వారాల క్రితం ఈ ప్రాంతంలో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ దిగడంతో వివాదం మరింత పెద్దదయ్యింది. ఈ క్రమంలోనే భారత్‌కు కేవలం 3 కి.మీ. దూరంలో పాంగాంగ్ సరస్సు సమీపంలో 5 వేలకుపైగా సైనికుల్ని మోహరించినట్లు తెలుస్తోంది. (ఎవరెస్ట్ ఎత్తుపై చైనా అభ్యంతరం) చైనా చర్యలతో భారత్ కూడా అప్రమత్తమైంది. వాస్తవాధీన రేఖ మీదుగా బలగాలను మరింత పటిష్టం చేసింది. భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే తూర్పు లదాఖ్ ప్రాంతంలో ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని సమీక్షిస్తున్నారు. పరిస్థితుల్ని మరింత విశ్లేషించడానికి భారత ఆర్మీ టాప్ కమాండర్లు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ఆర్మీ ఛీప్‌తో పలుమార్లు చర్చలు జరిపారు. -
భారత్ సేవలకు సెల్యూట్: యూఎన్ చీఫ్
న్యూయార్క్: మహమ్మారి కోవిడ్-19పై పోరులో ఇతర దేశాలకు అండగా నిలుస్తున్న దేశాలకు సెల్యూట్ చేస్తున్నామని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అన్నారు. ప్రాణాంతక వైరస్ వ్యాప్తి కట్టడికై భారత్ వంటి దేశాలు చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. కరోనా వైరస్ ప్రభావాన్ని తగ్గించడంలో సత్పలితాలు ఇస్తున్నట్లుగా భావిస్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను దాదాపు 55 దేశాలకు భారత్ ఎగుమతి చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా విజృంభిస్తున్న దేశీయ అవసరాల కోసం తొలుత ఈ మందుల సరఫరాపై నిషేధం విధించిన భారత్ మానవతా దృక్పథంతో ఆంక్షలను ఎత్తివేసింది. ఈ క్రమంలో అమెరికా, మాల్దీవులు, ఇజ్రాయెల్, మారిషస్, సేచెల్లీస్ తదితర దేశాలు ఇప్పటికే హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను దిగుమతి చేసుకున్నాయి.(భారత్ అంగీకరించింది: మలేషియా) ఇక పొరుగు దేశాలైన అఫ్గనిస్తాన్, భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్, మలేషియా, శ్రీలంక, మయన్మార్‌కు మందులు ఎగుమతి చేసేందుకు భారత్ అంగీకరించింది. అదే విధంగా జాంబియా, డొమినికన్ రిపబ్లిక్, మడగాస్కర్, ఉగాండా, బర్కినా ఫాసో, నైగెర్, మాలి, కాంగో, ఈజిప్టు, అర్మేనియా, కజక్షాన్, ఈక్వెడార్, జామాపియా, సిరియా, ఉక్రెయిన్, చాద్, జింబాబ్వే, ఫ్రాన్స్, కెన్యా, జోర్డాన్, నెదర్లాండ్స్, నైజీరయా, ఒమన్, పెరు మొదలగు దేశాలకు కూడా విపత్కర పరిస్థితుల్లో భారత్ సాయం అందించనుంది. కాగా కరోనాపై పోరులో ప్రపంచదేశాలు పరస్పరం సహకరించుకోవాలని ఐరాస పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. (యూకే నిపుణుల కమిటీ చైర్మన్‌గా వెంకీ రామకృష్ణన్) ఈ నేపథ్యంలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆంటోనియో గుటెరస్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ‘‘వైరస్‌ను అంతం చేసేందుకు చేస్తున్న పోరాటంలో సంఘీభావంతో మెలగాలని ప్రధాన కార్యదర్శి పిలుపునిచ్చారు. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉన్న దేశాలు సాయం అర్థించే దేశాలకు తప్పక సహాయం చేయాలని ఆయన ఉద్దేశం. ఇందుకు స్పందించి ఇతరులకు అండగా నిలుస్తున్న దేశాలకు మేము సెల్యూట్ చేస్తున్నాం’’అని పేర్కొన్నారు. భారత్ చేస్తున్న సాయంపై స్పందించాల్సిగా విలేకరులు కోరిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా బదులిచ్చారు. (కరోనా: సంక్షోభంలో వారి భవిష్యత్తు) -
2020 చివరి నాటికి వ్యాక్సిన్ కనుగొంటేనే..
న్యూయార్క్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్(కోవిడ్-19)నివారణకు వ్యాక్సిన్ కనుగొన్నప్పుడే పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది చివరి నాటికి కరోనాను అంతం చేసే వ్యాక్సిన్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితిలో సభ్య దేశాలైన పలు ఆఫ్రికా దేశాల ప్రతినిధులతో బుధవారం ఆయన వీడియో కాన్షరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా గుటెరస్ మాట్లాడుతూ.. అంతర్జాతీయంగా అందరినీ సంఘటితం చేస్తూ.. వ్యాక్సిన్ కనుగొనే పరిశోధనలను వేగవంతం చేసేలా ప్రోత్సహించినపుడే మహమ్మారిని నియంత్రించగలిగే అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. అందుకోసం 2020 ఏడాది ముగిసే నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావాల్సిన అవశ్యకత ఉందన్నారు. (అమెరికా నిర్ణయం ఆందోళనకరం: చైనా) అదే విధంగా... ‘‘సురక్షితమైన, ప్రభావంతమైన వ్యాక్సిన్ మాత్రమే ప్రస్తుత పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకురాగలిగే ఏకైక సాధనం. అదే లక్షలాది మంది ప్రాణాలను కాపాడుతుంది. ట్రిలియన్ డాలర్ల ఖర్చును కట్టడి చేస్తుంది’’అని ఆంటోనియో పేర్కొన్నారు. కరోనా సంక్షోభ సమయంలో టాక్స్ రిటన్స్ దాఖలు చేసేందుకు గడువు పొడిగించిన ఉగాండా.... ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయిన వారిని ఆర్థికంగా ఆదుకుంటున్న నమీబియా.... ప్రజలకు ఆహార ధాన్యాలు అందిస్తున్న కేప్ వెర్డే.... పరిశ్రమలకు పన్ను భారం తగ్గించిన ఈజిప్టు ప్రభుత్వాలను ఆయన ఈ సందర్బంగా ప్రశంసించారు. కాగా ఐరాస అనుబంధమైన ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిధులు నిలిపివేయడంపై ఆంటోనియో గుటెరస్ విచారం వ్యక్తం చేసిన విషయం విదితమే. ట్రంప్ ఇటువంటి నిర్ణయం తీసుకోవడానికి ఇది సరైన సమయం కాదన్న ఆయన.. విపత్కర పరిస్థితుల్లో అంతర్జాతీయ సమాజం పరస్పర సహకారంతో ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశారు.(ఉగ్ర ప్రమాదం పొంచి ఉంది: యూఎన్ చీఫ్ హెచ్చరికలు) -
ఉగ్ర ప్రమాదం పొంచి ఉంది: యూఎన్ చీఫ్ హెచ్చరికలు
న్యూయార్క్: మహమ్మారి కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాప్తి బయో ఉగ్రవాదానికి తెరలేపే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ హెచ్చరించారు. ప్రాణాంతక వైరస్‌ను ఉగ్రమూకలు ఉన్మాద చర్యలకు వినియోగించుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రపంచ దేశాలకు, అంతర్జాతీయ సమాజానికి ప్రమాదం పొంచి ఉందని హెచ్చరికలు జారీ చేశారు. కరోనా వైరస్ సంక్షోభంపై గురువారం ఐరాసలో తొలిసారిగా డొమీనికన్ రిపబ్లిక్(కరేబియా దేశం) అధ్యక్షతన నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐరాస భద్రతా మండలి నుంచి ఆంటోనియో ప్రసంగించారు. కోవిడ్-19పై పోరును.. ‘‘ఈ తరం యుద్ధం- యునైటెడ్ నేషన్స్ అస్తిత్వానికై పోరాటం’’గా ఆయన అభివర్ణించారు. ‘‘మహమ్మారి కోవిడ్-19 తొలుత ఆరోగ్య సంక్షోభంగా పరిణమించింది. అయితే రాను రాను దీని కారణంగా ఇబ్బందులు పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ఇది ముప్పుగా పరిణమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సామాజిక అశాంతి, హింస చెలరేగే పరిస్థితులకు దారితీసేలా ఉంది. మహమ్మారిపై పోరుకు పూర్తిస్థాయిలో సిద్ధంగా లేనట్లయితే అది బయో ఉగ్రదాడులకు దారితీయవచ్చు. అలా అయితే రిస్కు మరింత ఎక్కువవుతుంది. ప్రపంచాన్ని నాశనం చేసేందుకు ఉగ్ర సంస్థలు దీనిని ఉపయోగించుకునే అవకాశం ఉంది’’అని ఆంటోనియో కీలక వ్యాఖ్యలు చేశారు. మహమ్మారిపై పోరులో ప్రభుత్వాలు తలమునకలైన వేళ ఉగ్రవాదులు రెచ్చిపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. అదే జరిగితే అంటువ్యాధిపై పోరులో విజయావకాశాలు సన్నగిల్లే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. (గృహహింసకు ముగింపు పలకండి:యూఎన్ చీఫ్) వారి పరిస్థితి ఏమిటి? కరోనా విజృంభిస్తున్న తరుణంలో మానవ హక్కుల ఉల్లంఘన మరో ఆందోళనకరంగా అంశంగా పరిణమించిందని ఆంటోనియో పేర్కొన్నారు. బలహీనవర్గాలు, శరణార్థుల పరిస్థితి ఎలా ఉందోనంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. విద్వేష ప్రసంగాలు వింటూనే ఉన్నాం. చికిత్స అందించే విషయంలో వివక్షను చూస్తున్నాం. భావ ప్రకటనా స్వేచ్ఛ, మీడియాపై ఆంక్షలు పెరిగిపోతున్నాయి’’అని ఆంటోనియో వ్యాఖ్యానించారు. కాగా కరోనాతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 95 వేల మంది మరణించగా.. దాదాపు పదహారున్నర లక్షల మంది దీని బారిన పడ్డారు. -
కరోనాపై పోరుతో పాటు అదీ ముఖ్యమే: యూఎన్ చీఫ్
న్యూయార్క్: మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికై ప్రపంచ దేశాలు పోరాటం ఉధృతం చేసిన వేళ గృహహింస కేసుల సంఖ్యలో పెరుగుదల ఆందోళనకరంగా పరిణమించిందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అన్నారు. అత్యంత సురక్షితంగా భావించే సొంత ఇంటిలోనే మహిళలు హింసకు గురవడం.. బాధాకర విషయం అని విచారం వ్యక్తం చేశారు. కరోనా ధాటికి ప్రపంచమంతా అల్లాడుతున్న వేళ ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం గర్హనీయమన్నారు. గత కొన్నివారాలుగా గృహ హింస కేసుల్లో భయంకరమైన పెరుగుదల నమోదైందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సంక్షోభంలో హెల్్పలైన్ నంబర్లను ఆశ్రయిస్తున్న మహిళల సంఖ్య రెట్టింపు అయిందన్నారు. హింసను అంతం చేసి ప్రతీ ఒక్కరు తమ ఇంటిలో శాంతి స్థాపన చేయాలని విజ్ఞప్తి చేశారు.(లాక్డౌన్: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కేసులు!) అదే విధంగా కొన్ని దేశాల్లో కరోనాపై పోరుకు తగినంతగా వైద్య సిబ్బంది అందుబాటులో లేరని.. ఈ విషయంపై ప్రభుత్వాలు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని గుటెరస్ సూచించారు. అంతేగాకుండా కోవిడ్-19పై పోరాడటంతో పాటుగా మహిళలపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టడం కూడా ముఖ్యమైన బాధ్యతగా గుర్తించాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. కరోనాపై యుద్ధంతో పాటుగా.. గృహ హింసకు వ్యతిరేకంగా ప్రతీ ఒక్కరూ కలిసికట్టుగా పోరాటం చేయాలన్నారు. కాగా మానవాళికి ముప్పుగా పరిణమించిన కోవిడ్-19ను అంతం చేసే చర్యల్లో భాగంగా వివిధ దేశాల్లో లాక్డౌన్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికా సహా భారత్, చైనా, యూరప్ దేశాలు ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్‌లలో గృహ హింస కేసుల సంఖ్య రెట్టింపు అయిందని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. (గృహ హింసకు ఎర్ర చుక్క పరిష్కారం) -
ఆ సూచీలో భారత్‌కు మెరుగైన ర్యాంక్
న్యూఢిల్లీ : ఐక్యరాజ్యసమితి మానవాభివృద్ధి సూచికలో ఈ ఏడాది భారత్ ర్యాంక్ స్వల్పంగా మెరుగుపడింది. గత ఏడాది మానవాభివృద్ధి సూచికలో 189 దేశాలకు గాను 130వ స్ధానంలో నిలిచిన భారత్ ఈ ఏడాది ఒక స్ధానం మెరుగపడి 129వ స్ధానానికి చేరింది. 2005-06 నుంచి 2015-16 మధ్యలో భారత్‌లో 27 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని యూఎన్డీపీ ఇండియా స్ధానిక ప్రతినిధి శోకో నోడా చెప్పారు. మూడు దశాబ్ధాలుగా భారత్‌లో చోటుచేసుకుంటున్న వేగవంతమైన అభివృద్ధితో భారత్‌లో పేదరికం గణనీయంగా తగ్గిందని, జీవనకాలం పెరగడంతో పాటు మెరుగైన విద్య, వైద్యం అందుబాటులోకి వచ్చాయని ఆమె పేర్కొన్నారు. 1990 నుంచి 2018 మధ్యలో దక్షిణాసియా ప్రాంతం 46 శాతం మేర సత్వర వృద్ధి సాధించిందని ఆ తర్వాత తూర్పు ఆసియా, ఫసిఫిక్ ప్రాంతాలు 43 శాతం వృద్ధిని సాధించాయని తెలిపారు. -
భారత ‘తాత్కాలిక’ అభ్యర్థిత్వానికి మద్దతు
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి (ఐరాస) భద్రతామండలిలో తాత్కాలిక సభ్యదేశాలను ఎంపిక చేసేందుకు నిర్వహించే ఎన్నికల్లో ఇండియా అభ్యర్థిత్వానికి 55 దేశాలతో కూడిన ఆసియా–పసిఫిక్ బృందం ఏకగ్రీవంగా మద్దతు తెలిపింది. చైనా, పాకిస్తాన్‌లు కూడా ఈ ఆసియా–పసిఫిక్ దేశాల బృందంలో ఉండటం గమనార్హం. భద్రతామండలిలో ఐదు దేశాలకు శాశ్వత సభ్యత్వం ఉండగా, మరో పది దేశాలకు తాత్కాలిక సభ్యత్వం కల్పిస్తారు. ఎన్నికలను నిర్వహించడం ద్వారా ఆ పది తాత్కాలిక సభ్య దేశాలను ఎన్నుకుంటారు. ప్రతి ఏడాదీ ఎన్నిక నిర్వహించి ఐదు దేశాలను ఎంపిక చేస్తారు. ఒకసారి ఎన్నికైతే ఆ దేశాలకు రెండేళ్లపాటు భద్రతామండలిలో తాత్కాలిక సభ్యత్వం లభిస్తుంది. 2021– 22 సంవత్సరాలకుగాను తాత్కాలిక సభ్యత్వం పొందే దేశాలను ఎంపిక చేసేందుకు వచ్చే ఏడాది జూన్‌లో ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లోనే ఇండియా పోటీ చేయనుండగా, భారత అభ్యర్థిత్వాన్ని ఆసియా–పసిఫిక్ బృందంలోని మొత్తం దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఈ విషయాన్ని ఐరాసలో భారత శాశ్వత రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్ మంగళవారం ట్విట్టర్ ద్వారా తెలిపారు. భారత అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన దేశాల్లో చైనా, పాకిస్తాన్, నేపాల్, జపాన్, ఇరాన్, టర్కీ, మలేసియా, ఇండోనేసియా, శ్రీలంక, సిరియా, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, యూఏఈ, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, వియత్నాం, మాల్దీవులు, మయన్మార్, కిర్గిజ్స్తాన్ తదితర దేశాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఇక ఇప్పటికే భారత్ ఏడుసార్లు ఐరాస భద్రతామండలిలో తాత్కాలిక సభ్యదేశంగా ఉంది. చివరిసారిగా 2011–12 సంవత్సరాల్లో భద్రతామండలిలో ఇండియా తాత్కాలిక సభ్యదేశ హోదాను పొందింది. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో విజయం సాధిస్తే పదేళ్ల తర్వాత మళ్లీ ఆ హోదా దక్కనుంది. భద్రతామండలిలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, రష్యాలకు శాశ్వత సభ్యత్వం ఉండటం తెలిసిందే. 21వ శతాబ్దపు రాజకీయ, భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ఇండియాకు కూడా శాశ్వత సభ్యత్వం కల్పించాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. -
దక్షిణాసియాలో విస్తరిస్తున్న ఉగ్రవాదం
అంతర్జాతీయ న్యాయశాస్త్రం పరిధి చాలా విస్తృతమైనది. ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రస్తుతం సంభవిస్తున్న మార్పులను క్రమబద్ధీకరిస్తూ దేశాలమధ్య నెలకొన్న సామాజిక, ఆర్థిక, భద్రతాపరమైన సమస్యలకు అంతర్జాతీయ న్యాయశాస్త్రం పరిష్కార మార్గాలను సూచిస్తుంది. ముఖ్యంగా యుద్ధ సమయంలో పాటించాల్సిన నియమాలను, యుద్ధ పరిస్థితులలో శాంతిని నెలకొల్పే సూచనలను, దౌత్యపరమైన సంప్రదింపులను, దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య లావాదేవీల సంబంధిత అంశాల గురించి, అంతరిక్ష న్యాయ విషయాలపై, మానవ హక్కులు. అంతర్జాతీయ సంస్థల విధులు, బాధ్యతలపై ఇది విస్తృతంగా చర్చిస్తుంది. దేశసరిహద్దుల భద్రతా విషయాలపై, ఉగ్రవాద నిర్మూలనపై, దేశసార్వభౌమత్వ అధికారాలు, ప్రకృతి పర్యావరణ సమతుల్యత, పైరసీ, గగన అంతరిక్ష సంబంధిత విషయాలు, సముద్ర న్యాయాలు, విమాన హైజాకింగ్, అంతర్జాతీయ వ్యాపార, వాణిజ్య పరిష్కార మార్గాలు, మానవహక్కులు వంటివన్నీ కూడా అంతర్జాతీయ న్యాయశాస్త్ర పరిధిలోవే. దక్షిణాసియా 48 ఏళ్లుగా టెర్రరిస్టు హబ్‌గా మారుతోంది. శ్రీలంకలో తాజా ఉగ్రవాద దాడి సౌత్ ఆసియాలో టెర్రరిజం పెరుగుదలకు సూచిక. 2017లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఉగ్రవాద దాడుల్లో 31 శాతం దక్షిణాసియాలో నమోదైనవే. వీటిల్లో మరణించిన వారిలో 29 శాతం మంది ఇక్కడివారే. శ్రీలంకలో జరిగిన దాడి గత 15 ఏళ్లలో అతిపెద్దది. 290 మంది చనిపోగా.. 500 మందికిపైగా గాయపడ్డారు. 2008లో ముంబై దాడుల్లో 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 2014లో పాకిస్తాన్‌లోని పెషావర్‌లో ఆర్మీస్కూల్పై జరిగిన దాడిలో 150 మందికి పైగా స్కూలు పిల్లలు బలైపోయారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14లో జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రదాడిలో 40 మంది భారత సైనికులు చనిపోయారు. ఇవేకాదు దక్షిణా సియాలో తరచుగా జరుగుతున్న దాడుల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. గ్లోబల్ టెర్రర్ డేటాబేస్(జీటీడీ) గణాంకాల ప్రకారం.. 1970 నుంచి 2017 వరకూ ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద దాడులను పరిశీలించినట్లయితే ఎక్కువ దాడులు జరిగిన ప్రాంతాల్లో దక్షిణాసియా రెండో స్థానంలో ఉంది. 1970లో 651 ఉగ్రవాద దాడులు జరిగితే.. 2014లో 17 వేల ఉగ్ర దాడులు నమోదయ్యాయి. 2002 నుంచి 2017 మధ్యకాలంలో దక్షిణాసియాలో 31,959 దాడులు జరిగితే 59,229 మంది చనిపోయారు. ఎంఈఎన్ ఈ విషయంలో ముందుంది. ఆ ప్రాంతంలో 33,126 దాడుల్లో 91,311 మంది మృతి చెందారు. ఐక్యరాజ్యసమితితో ఫలించిన భారత్ దౌత్యం: జైషే మహమ్మద్ సంస్థ అధినేత, పుల్వామా దాడి సూత్రధారి సయ్యద్ మసూద్ అజార్‌ను ఐక్యరాజ్యసమితి 1–5–2019 నాడు అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం శుభపరిణామం. సుదీర్ఘకాలంగా భారత్, తదితర దేశాలు ప్రతిపాదించిన తీర్మానాన్ని తాత్సారం చేస్తూ వచ్చిన చైనా తుదకు అంతర్జాతీయ ఒత్తిడిలకు తలొగ్గి తన అభ్యంతరాలను ఉపసంహరించుకుంది. ఐక్యరాజ్య సమితి తీసుకున్న ఈ కీలక నిర్ణయం వలన ఉగ్రవాదుల ఆర్థిక వనరులపై, ఆయుధాల కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం కలగనుంది. తీవ్రవాదం ముఖ్యంగా ఈ కింద పేర్కొన్న విషయాల చుట్టూ తిరుగుతున్నది. 1. జాతీయవాద ఉగ్రవాదం 2. మతపరమైన ఉగ్రవాదం 3. దేశాలు ప్రోత్సహిస్తున్న కుడి, ఎడమ విభాగాలకు సంబంధించిన తీవ్రవాదం. ఐక్యరాజ్యసమితి, ఇంటర్ పోల్, సీఐఏ, ఎఫ్‌బీఐ, రా లాంటి వ్యవస్థలు ఉన్నప్పటికీ తీవ్రవాద మూలాలు ఇప్పటికీ ఎందుకు నిర్వీర్యం కావడం లేదో సమగ్ర విశ్లేషణ చేసుకోవాల్సిన తరుణమిది. మూడు దశాబ్దాల కిందట బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఏర్పాటైన 8 సభ్య దేశాలతో కూడిన దక్షిణ ఆసియా ప్రాంతీయ సహకార సంఘం సార్క్ తీవ్రవాద దురాగతాలపై ఎన్నోసార్లు చర్చించినప్పటికీ ఇంకా ఇలాంటి ఉగ్రవాద కార్యకలాపాలు దక్షిణాసియాలో జరగటం దిగ్భ్రాంతికరం. తీవ్రవాదం కట్టడికి భద్రతాపరమైన చర్యలు: దక్షిణాసియా దేశాలు పరస్పర సహాయ సహకారంతో, సమన్వయంతో ప్రాంతీయ భద్రత పేరిట రూపొందించుకున్న చట్టాలను, నియమాలను ఉల్లంఘించకుండా పాటిస్తూ ప్రపంచ దేశాలకు ఆదర్శం కావాలి. విమానాశ్రయాలలో భద్రతాపరమైన పరిశీలనలను పటిష్ట పరచాలి. నైతిక విద్యను ప్రాథమిక స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయిదాకా అన్ని కోర్సులలో ఒక సబ్జెక్టుగా ప్రవేశపెట్టి, పర్యవేక్షించే బాధ్యత ఉపాధ్యాయులు, అధ్యాపకులపై ఎంతగానో ఉంది. వ్యాసకర్త: కె. శివచరణ్, న్యాయశాస్త్ర పరిశోధకులు, నల్సార్ విశ్వవిద్యాలయం మొబైల్ : 95158 90088 -
జిన్‌పింగ్ అంటే మోదీకి జంకు
న్యూఢిల్లీ/త్రిసూర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బలహీనమైన వ్యక్తి అని, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు భయపడుతున్నారని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్‌పై అంతర్జాతీయ ఉగ్రవాది ముద్ర పడకుండా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ)లో చైనా వరుసగా నాలుగోసారి అడ్డుతగిలిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన రాహుల్‌గాంధీ ప్రధాని మోదీపై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ‘బలహీనమైన మోదీ షీ జిన్‌పింగ్‌కు భయపడుతున్నారు. భారత ప్రయత్నాన్ని చైనా అడ్డుకుంటే.. మోదీ ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. చైనాతో నమో దౌత్య సంబంధం ఎలా ఉంటుందంటే.. 1.మోదీ జిన్‌పింగ్‌తో కలసి గుజరాత్లో పర్యటిస్తారు. 2.ఢిల్లీలో జీని కౌగిలించుకుంటారు. 3. చైనాలో జీ ముందు తలవంచుతారు’ అని రాహుల్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్లో స్పందిస్తూ.. ‘మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించేందుకు చేస్తున్న మన ప్రయత్నాలకు చైనా అడ్డుపడుతోంది. ఇక ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కలిసి తిరగడం వల్ల ఒరిగింది ఏంటన్న ప్రశ్న ప్రతి భారతీయుడిలోనూ మెదులుతోంది’’ అని పోస్ట్ చేసింది. మరోవైపు లోక్‌సభ ఎన్నికల ముందు దేశంలో తీవ్రమైన జాతీయవాద వాతావరణాన్ని సృష్టించి మోదీ ప్రభుత్వ అతిపెద్ద వైఫల్యాల నుంచి దేశ ప్రజల దృష్టి మరల్చేందుకే బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడింది. వారికి హింసే ఆయుధం.. బీజేపీ, సీపీఎంలు హింసను ఆయుధంగా వాడుకుంటున్నాయని రాహుల్ ఆరోపించారు. దేశంలో ప్రస్తుతం సైద్ధాంతిక యుద్ధం జరుగుతోందని అన్నారు. కేరళలోని కోజికోడ్‌లో గురువారం నిర్వహించిన ప్రచార ర్యాలీలో రాహుల్ ప్రసంగించారు. అన్ని మతాల ప్రజలు కలసిమెలసి జీవిస్తున్న రాష్ట్రానికి వచ్చినందుకు సంతోషంగా ఉందని అన్నారు. ప్రధాని మోదీపై విమర్శలు ఎక్కుపెడుతూ..ప్రధాని విధి తన మనసులో ఉన్నది చెప్పడం కాదని, ఇతరుల మనసుల్లో ఏముందో వినడమని హితవు పలికారు. కాంగ్రెస్ ఏదో ఒక వ్యక్తి, సంస్థ తరుఫున గళమెత్తదని, దేశమంతటికీ గొంతుక అని అన్నారు. దేనినీ కాంగ్రెస్ బలవంతంగా దేశంపై రుద్దదని, ప్రజల అభిప్రాయాలు గౌరవించి దానికి అనుగుణంగా నడుచుకుంటుందని తెలిపారు. -
సయీద్‌కు ఐరాస షాక్
న్యూఢిల్లీ: ముంబై మారణహోమం సూత్రధారి, జమాత్ ఉద్ దవా(జేయూడీ) అధినేత హఫీజ్ సయీద్‌కు ఐక్యరాజ్యసమితి(ఐరాస) షాక్ ఇచ్చింది. నిషేధిత ఉగ్రవాదుల జాబితా నుంచి సయీద్ పేరును తొలగించేందుకు ఐరాస నిరాకరించింది. ఈ సందర్భంగా సయీద్‌పై నిషేధం ఎత్తివేతను భారత్, అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ వ్యతిరేకించగా, పాక్ మౌనంగా ఉండిపోయింది. కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘సయీద్‌కు వ్యతిరేకంగా భారత్ బలమైన సాక్ష్యాలను సమర్పించింది. అతని ఉగ్రవాద కార్యకలాపాలపై పూర్తిస్థాయి ఆధారాలను ఐరాసకు అందజేసింది. దీంతో సయీద్‌పై నిషేధాన్ని కొనసాగిస్తామని ఐక్యరాజ్యసమితి ఆయన న్యాయవాది హైదర్ రసూల్ మిర్జాకు తెలియజేసింది’ అని వెల్లడించారు. లష్కరే తోయిబా సహ–వ్యవస్థాపకుడైన సయీద్ ప్రస్తుతం పాకిస్తాన్లో గృహనిర్బంధంలో కొనసాగుతున్నాడని పేర్కొన్నారు. జేయూడీపై ఐరాస 2008లో నిషేధం విధించిందన్నారు. ఈ కేసులో స్వతంత్ర అంబుడ్స్‌మెన్‌గా వ్యవహరిస్తున్న డానియెల్ కిఫ్సెర్ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడం ఆలస్యమయిందని తెలిపారు. సయీద్‌పై నిషేధానికి ఐరాస 1267 ఆంక్షల కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. ఐరాస ఆంక్షల కమిటీ ప్రధానంగా ఆస్తుల జప్తు, ప్రయాణ నిషేధం, ఆయుధాల అమ్మకం నిలిపివేత అనే మూడు అంశాలను పర్యవేక్షిస్తుంది. ఆంక్షల కమిటీ నిబంధనల మేరకు నిషేధిత జాబితాలోని సంస్థలు లేదా వ్యక్తుల ఆస్తులను సభ్యదేశాలు తక్షణం జప్తుచేయాలి. వీరికి ప్రభుత్వాలు ఎలాంటి సహాయసహకారాలు అందించరాదు. -
భూగోళంపై ఆకలి కేకలు
వాతావరణంలో ఏర్పడిన తీవ్రమైన మార్పులతో ప్రపంచ ప్రజల ఆకలి అనూహ్యంగా పెరిగిపోతోంది. ఆహార కొరత కొద్దిగా తగ్గుముఖం పడుతుందనుకుంటున్న తరుణంలో ప్రస్తుతం జనాభాలో ప్రతి ఎనిమిదిమందిలో ఒకరు ఆకలితో అలమటిస్తున్నట్టు ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. తీవ్రమైన వాతావరణ మార్పులే ఇందుకు ప్రధాన కారణమని కూడా స్పష్టం చేసింది. ఐక్యరాజ్యసమితి తాజాగా విడుదల చేసిన 2018 పౌష్టికాహారం, ఆహారభద్రతా రిపోర్టు ప్రస్తుత వాతావరణ పరిస్థితులపై హెచ్చరికలు జారీచేసింది. 2015 నుంచి గత మూడేళ్ళుగా వరసగా ప్రపంచ ప్రజలు ఆకలితీవ్రత ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తోందని అధ్యయనం తేల్చిచెప్పింది. గత ఒక్క యేడాదిలోనే ప్రపంచవ్యాప్తంగా 8.21 కోట్ల మంది ప్రజలు తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొన్నారు. ప్రధానంగా ఆఫ్రికా, దక్షిణ అమెరికాలు తీవ్రమైన ఆహార కొరతతోనూ, పౌష్టికాహారలోపాన్నీ ఎదుర్కొంటున్నాయి. ఆసియాలో 50 కోట్ల మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఓ వైపు కరువు కాటకాలు తాండవిస్తోంటే, మరోవైపు నదులు, సముద్రాలు పొంగిపొర్లి వరదలు ముంచెత్తుతున్నట్టు ఐక్యరాజ్యసమితి గుర్తించింది. ఈ రెండు భిన్నమైన పరిస్థితులే 2017లో ఆర్థిక కుంగుబాటుకీ, ఆకలికీ కారణమౌతున్నాయని గుర్తించింది. దీంతో దాదాపు కోటి మంది ప్రజలు ఆకలి నుంచి విముక్తికోసం అర్థిస్తున్నట్టు వెల్లడయ్యింది. ప్రపంచవ్యాప్తంగా నమోదౌతోన్న అధిక ఉష్టోగ్రతలు చివరకు ఆకలి ప్రపంచాన్ని సృష్టించాయని ఆక్స్‌ఫామ్ జిబిలో ఆహారమూ, వాతావరణ విధానాల శాఖాధిపతి రాబిన్ వ్యాఖ్యానించారు. గతంలో ఎప్పుడూ లేనట్టుగా 2018లో సైతం తీవ్రమైన వాతావరణ సంక్షోభాన్ని చూసామన్నారు. గత కొద్ది నెలలుగా పరిస్థితి మరింత భయానకంగా తయారైందన్నారు. ఐక్యరాజ్య సమితి రిపోర్టు ప్రకారం ప్రపంచంలో తీవ్రమైన వాతావరణ సంక్షోభం ఉన్నప్రాంతాల్లోనే ఎక్కువ మంది ప్రజలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. వర్షపాతంలో మార్పుల వల్ల గత ఐదేళ్ళలో తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయనీ, దీనివల్ల గోధుమ, వరి లాంటి కీలక పంటలు దెబ్బతింటున్నాయనీ రిపోర్టు వెల్లడించింది. కరువు కాటకాలను తట్టుకునేందుకు తక్కువ నీళ్ళు అవసరమైన పంటలను వేయడం వర్షపాతానికి అనుగుణంగా పంటమార్పిడీ పద్ధతులను అవలంభించక తప్పని పరిస్థితి రైతులకు ఎదురయ్యింది. యూనిసెఫ్, వ్యవసాయాభివృద్ధి సహాయక సంస్థ, ప్రపంచ ఆహార కార్యక్రమం, ప్రపంచ ఆరోగ్యసంస్థ సంయుక్తంగా నిర్వహించిన ప్రపంచ వ్యాప్తంగా ఆహార భద్రత, పౌష్టికాహారం 2018 నివేదికని ఐక్యరాజ్యసమితి తాజాగా విడుదల చేసింది. ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా 2030 నాటికి ఆకలినీ, పౌష్టికాహారలోపాన్నీ జయించాలన్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే తక్షణమే తీవ్ర వాతావరణ మార్పులపై స్పందించాలని ఈ రిపోర్టు ముందు మాటలో పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 6.72 కోట్ల మంది ప్రజలు అధిక బరువుతో బాధపడుతున్నారు. ప్రతి ఎనిమిది మందిలో ఒకరు స్తూలకాయంతో అవస్త పడుతున్నవారే. పౌష్టికాహారలోపమే దీనికి కారణం. ప్రపంచవ్యాప్తంగా 1.51 కోట్ల మంది ఐదేళ్ళలోపు పిల్లలు ఎదుగుదల లోపంతో బాధపడుతున్నారు. ఐదేళ్ళలోపు పిల్లలు ఉండాల్సిన ఎత్తుకంటే చాలా పొట్టిగా ఉండడానికి సైతం పౌష్టికాహారలోపమే కారణం. అయితే 2012లో ప్రపంచవ్యాప్తంగా 1.65 కోట్ల మంది చిన్నారులు ఎదుగుదలా లోపంతో ఉన్నారు. 2012 కంటే ఇప్పుడు కొంత మెరుగైనా మొత్తం ఆసియాలోనే 55 శాతం మంది ఐదేళ్లలోపు చిన్నారులను ఎదుగుదల లోపం బాధపెడుతోంది. ప్రతి ముగ్గురు గర్భిణీల్లో ఒకరు రక్తహీనతతో అనారోగ్యంపాలవుతున్నారు. ఇది వారి పిల్లల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 40 శాతం పిల్లలకే ఆరునెలల పాటు తప్పనిసరిగా యివ్వాల్సిన తల్లిపాలు లభ్యం అవుతున్నట్టు ఈ నివేదిక తేల్చింది. -
మరో నౌకను అదుపులోకి తీసుకున్న ద.కొరియా!
సియోల్: ఐక్యరాజ్యసమితి(ఐరాస) ఆంక్షలను ఉల్లంఘించి ఉత్తర కొరియాకు ముడిచమురును సరఫరా చేస్తున్న మరో నౌకను దక్షిణ కొరియా అదుపులోకి తీసుకుంది. ద.కొరియాలోని ప్యాంగ్‌టెక్–డాంగ్జిన్ పోర్టులోపనామాకు చెందిన 5,100 టన్నులున్న ‘కొటి’నౌకను డిసెంబర్ 21న స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. ఈ నౌక ఉ.కొరియాకు చెందిన నౌకకు చమురును బదిలీ చేసిందని పేర్కొన్నారు. ఈ నౌకా సిబ్బందిని పోలీసులు, నిఘా సిబ్బంది ప్రశ్నిస్తున్నారన్నారు. -
ఐక్యరాజ్యసమితి ఎందుకు ఏర్పడింది?
ఐక్యరాజ్యసమితి (ఐరాస) 70వ వార్షికోత్సవ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. ఐరాసా గుర్తింపు కలిగిన 193 దేశాల ప్రతినిధులు కూడా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఐరాస విశేషాలు కొన్ని.. మొదటి ప్రపంచ యుద్దానంతరం ఏర్పడిన నానాజాతి సంస్థ (లీగ్ ఆఫ్ నేషన్స్) రెండో ప్రపంచ యుద్దాన్ని ఆపలేకపోయింది. ఫలితంగా ప్రపంచ శాంతి, దేశాల మధ్య సహకారం పెంపొందించేందుకు 1945, అక్టోబరు 24న ఐక్యరాజ్య సమితి (యునెటైడ్ నేషన్స్ ఆర్గనైజేషన్) ఏర్పడింది. ఈ రోజును ప్రతి ఏటా ఐరాస దినంగా నిర్వహిస్తారు. ఐరాస ప్రధాన కార్యాలయం అమెరికాలోని న్యూయార్క్‌లో ఉంది. అప్పటి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ ‘యునెటైడ్ నేషన్స్’ అనే పదాన్ని తొలిసారి ప్రవేశపెట్టాడు. ఐరాస పతాకాన్ని 1947 అక్టోబరు 20న ఆమోదించారు. ఈ పతాకం లేత నీలం, తెలుపు రంగుల్లో ఉంటుంది. పతాకం మధ్యలో ఐరాస చిహ్నమైన ప్రపంచ పటం రెండు ఆలివ్ కొమ్మల మధ్య ఉంటుంది. ఆలివ్ కొమ్మలు శాంతికి చిహ్నం. ఐరాసాకి ఆరు అధికారిక భాషలున్నాయి అవి...చైనీస్, ఇంగ్లిష్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్, అరబిక్. 1973లో అరబిక్‌ను ఆరో అధికార భాషగా చేర్చారు. 1945, జూన్ 26న శానిఫ్రాన్సిస్కో నగరంలో జరిగిన సమావేశంలో యూఎన్ చార్టర్ పై 50 దేశాలు సంతకాలు చేశాయి. ఈ సమావేశానంతరం పోలండ్ 51వ దేశంగా చార్టర్‌పై సంతకం చేసింది. ప్రస్తుతం ఐరాసాలో 193 సభ్యదేశాలున్నాయి. 2011లో దక్షిణ సూడాన్ 193వ సభ్యదేశంగా చేరింది. వాటికన్, తైవాన్లు ఐరాసాలో సభ్యదేశాలు కావు. ఐరాసాలో చివరిగా చేరిన దేశాలు: 189 - తువాలు (సెప్టంబరు ,2000) 190 - సిట్జర్లాండ్ (సెప్టెంబరు, 2002) 191 - తూర్పు తిమోర్ (2006) 192 - మాంటెనెగో (2006) 193 - దక్షిణ సూడాన్ (జూలై, 2011) ఆరు ప్రధాన విభాగాలు 1.సాధారణ సభ: ఐక్యరాజ్య సమితిలోని సభ్యదేశాలన్నీ సాధారణ సభలో సభ్యులుగా ఉంటాయి. ప్రతి దేశం సభకు ఐదుగురు ప్రతినిధులను పంపవచ్చు. కాని ఒక దేశానికి ఒక ఓటు హక్కు మాత్రమే ఉంటుంది. సాధారణ సభను ప్రపంచ పార్లమెంటుగా పరిగణిస్తారు. ఈ సభ ఏడాదికి ఒకసారి సమావేశం అవుతుంది. భద్రతామండలికి పది అశాశ్వత సభ్యదేశాలను ఎన్నుకోవడం, ఐరాస బడ్జెట్‌ను ఆమోదించటం, భద్రతా మండలి సిఫార్సు మేరకు ఐరాస సెక్రటరీ జనరల్‌ను ఎన్నుకోవటం వంటివి సాధారణ సభ ముఖ్య విధులు. సాధారణ సభ అధ్యక్ష, ఉపాధ్యక్షులకు ఏడాది పదవీ కాలం ఉంటుంది. ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లో ఉంది. 2.భద్రతా మండలి: భద్రతా మండలిలో సభ్యులుగా ఐదు శాశ్వత సభ్యదేశాలు, పది అశాశ్వత సభ్యదేశాలు ఉంటాయి. దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లో ఉంది. శాశ్వత సభ్యదేశాలైన అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనాలకు వీటో హక్కు ఉంటుంది. తాత్కాలిక సభ్యదేశాలను రెండేళ్ల కాలపరిమితితో సాధారణ సభ ఎన్నుకుంటుంది. శాంతి పరిరక్షణ చర్యలు చేపట్టడం, సభ్యదేశాల మధ్య వివరాలను పరిష్కరించడం వంటి విధులను భద్రతా మండలి నిర్వర్తిస్తుంది. 3.ఆర్థిక, సామాజిక మండలి ఆర్థిక, సామాజిక మండలి ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లో ఉంది. ఈ మండలిలో మొత్తం 54 సభ్యదేశాలున్నాయి. కాలపరిమితి మూడేళ్లు. సాధారణ సభ ఏటా 18 దేశాలను మండలికి ఎన్నుకుంటుంది. ఐరాస, దాని సంస్థల మధ్య ఆర్థిక, సామాజిక రంగాల్లో సమన్వయం కోసం ఇది కృషి చేస్తుంది. 4.ధర్మ కర్తృత్వ మండలి వలస పాలనలో ఉన్న దేశాలు స్వాతంత్య్రం పొందేందుకు ఈ సంస్థ తోడ్పాటు అందిస్తుంది. దీని ప్రధాన కార్యాలయం న్యూయర్క్‌లో ఉంది. ఇప్పటికే చాలా దేశాలకు స్వాతంత్య్రంపొందాయి కాబట్టి ఈ మధ్య కాలంలో ఈ సంస్థ ప్రాధాన్యం తగ్గింది. 5.అంతర్జాతీయ న్యాయస్థానం అంతర్జాతీయ న్యాయస్థానం ప్రధాన కార్యాలయం నెదర్లాండ్స్‌లోని ది హేగ్‌లో ఉంది. ఈ న్యాయస్థానంలో మొత్తం15 మంది న్యాయమూర్తులు ఉంటారు. వీరి పదవీ కాలం తొమ్మిదేళ్లు. ఐరాస సభ్యదేశాల మధ్య వివాదాలను అంతర్జాతీయ న్యాయస్థానం పరిష్కరిస్తుంది. 6.సచివాలయం ఐరాస రోజువారీ కార్యకలాపాలను సచివాలయం నిర్వహిస్తుంది. ఇది సెక్రటరీ జనరల్ పర్యవేక్షణలో పని చేస్తుంది. ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లో ఉంది. సెక్రటరీ జనరల్ పదవీ కాలం ఐదేళ్లు. ఐరాస ప్రధాన కార్యదర్శులు పేరు దేశం పదవీ కాలం ట్రిగ్వే లై నార్వే 1946-53 దాగ్ హామ్మర్స్జోల్డ్ స్వీడన్ 1953-61 యూ థాంట్ మయన్మార్ 1961-71 కుర్ట్ వాల్దీమ్ ఆస్ట్రియా 1972-81 జేవియర్ పెరేజ్ డికుల్లర్ పెరూ 1982-91 బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ ఈజిప్ట్ 1992-96 కోఫీ అన్నన్ ఘనా 1997-2006 బాన్ కీ మూన్ దక్షిణ కొరియా 2007-ప్రస్తుతం -
సమానత్వమా నీవెక్కడ?
మీ ఇంట్లో ఓ చిట్టితల్లి కళ్లు తెరిచింది! పురుషుడితో సమానంగా ఆమె ఓ కంపెనీకి సీఈవో కావాలంటే..? ఇంకా ఎన్నేళ్లు వేచి చూడాలో తెలుసా..? 81 సంవత్సరాలు!! మహిళ, పురుషుడు అని తేడా లేని సమసమాజాన్ని చూడాలంటే ఆ చిన్నారి ఇంకా ఎన్నేళ్లు నిరీక్షించాలో తెలుసా..? మరో 50 ఏళ్లు!!! న్యూయార్క్: అవును.. ఆకాశంలో సగమని, అన్నింటా 'ఆమే'నని ఎంత ఊదరగొడుతున్నా మగువకు నేటికీ సమానావకాశాలు దక్కడం లేదు. ఇది వాళ్లోవీళ్లో చెప్పిన పోచికోలు కబురు కాదు. సాక్షాత్తూ ఐక్యరాజ్యసమితే ఈ విషయాన్ని స్పష్టంచేస్తోంది. స్త్రీ, పురుష వివక్ష రూపుమాసిపోవడానికి మరో 8 దశాబ్దాలు గడిచిపోవాల్సిందేనని చెబుతోంది. స్త్రీ సమానత్వం కోసం 20 ఏళ్ల కిందట కార్యాచరణ ప్రారంభించిన దాదాపు 189 దేశాలు ఇప్పటికీ తమ లక్ష్యానికి ఆమడ దూరంలో నిలిచాయని, ఒక్క దేశం కూడా సమానత్వాన్ని అందుకోలేదని పేర్కొంటోంది. స్త్రీ వివక్ష నిర్మూలన కోసం ప్రపంచవ్యాప్తంగా కృషి చేస్తున్న ఐరాస మహిళా విభాగం ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఫుమ్జిలె లాంబో-చుకా ఈ వివరాలు వెల్లడించారు. ఆదివారం ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె తాజాగా ఓ వార్తాసంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. 1995లో బీజింగ్‌లో ఐరాస మహిళా సదస్సు సందర్భంగా మహిళా సమానత్వం కోసం 150 పేజీలతో కార్యాచరణ(బ్లూప్రింట్) తయారు చేశారు. ఆ సదస్సులో నాటి అమెరికా మొదటి పౌరురాలు హిల్లరీ క్లింటన్ ప్రపంచదేశాల ప్రతినిధులను ఉద్దేశించి ఉత్తేజభరిత ప్రసంగం చేశారు. "మానవ హక్కులే.. మహిళా హక్కులు. మహిళా హక్కులే.. మానవ హక్కులు" అంటూ నినదించారు. బ్లూప్రింట్ అమలు కోసం 189 దేశాలు ప్రతినబూనాయి. ఆరోగ్యం, విద్య, ఉపాధి, రాజకీయ ప్రాతి నిధ్యం తదితర 12 అంశాల్లో మిహ ళకు పెద్దపీట వేయాలని నాడు తీర్మానించాయి. అప్పటితో పోల్చుకుంటే మహిళ పరిస్థితి కాస్త మెరుగుపడ్డా.. అది ఆశించినంత మేర లేదని ఫుమ్జిలె చెప్పారు. దేశాలకు, ప్రభుత్వాలకు నేతృత్వం వహించే విషయంలో మహిళకు సమాన అవకాశాలు లేవన్నారు. ప్రస్తుతం దాదాపు 20 మందికిపైగా మహిళలు మాత్రమే దేశాలు, ప్రభుత్వాలకు అధినేతలుగా ఉన్నారన్నారు. 20 ఏళ్లలో చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం 11 నుంచి 22 శాతానికి చేరిందన్నారు. "విధాన నిర్ణయాల్లో మహిళలకు చోటు దక్కడం లేదు. వారిపై హింస కూడా పెరిగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది." అని ఆమె పేర్కొన్నారు. నైజీరియా లో బొకో హరమ్ ఉగ్రవాదులు స్కూల్లోని బాలికలను కిడ్నాప్ చేసి 'సెక్స్' బానిసలుగా అమ్మేస్తున్నారని ఫుమ్జిలె ఆవేదన వ్యక్తంచేశారు. పిల్లల్ని ఎప్పుడు కనాలనే స్వేచ్ఛ బీజింగ్ మహిళలకు ఉండడం లేదని పేర్కొన్నారు. ఆరోగ్యమూ అంతంతే! పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా ఎన్నో పనులు.. మరెన్నో బాధ్యతలు! క్షణం తీరిక లేని ఈ నిత్యసమరం ముందు ''ఆమె' తన ఆరోగ్యాన్ని పణంగా పెడుతోందని సర్వేలు చెబుతున్నాయి. 'ఆ ఏమౌతుందిలే..' అని సర్దిచెప్పుకుంటూ మహిళలు పనుల్లో పడిపోతున్నారని, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని తేలింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్‌లో ఓ ప్రైవేటు ఇన్సూరెన్స్ సంస్థ ఆన్లైన్లో నిర్వహించిన సర్వేలో దాదాపు వెయ్యి మంది మహిళలు పాల్గొన్నారు. వారిలో తాము అనారోగ్యానికి గురైనప్పుడు మాత్రమే 'హెల్త్ చెకప్' చేయించుకుంటామని 63 శాతం మహిళలు చెప్పారు. 16 శాతం మంది మాత్రమే రెగ్యులర్‌గా చెకప్‌లకు వెళ్తున్నట్టు తెలిపారు. ఏడాదిలో ఒకట్రెండు సార్లు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నట్టు ఏకంగా 71 శాతం స్త్రీలు వెల్లడించారు. ఇన్ని సమస్యలు చుట్టుముడుతున్నా కేవలం 39 శాతం మంది మహిళలు మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ కలిగి ఉన్నారని తేలింది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడంతో మగవారితో పోల్చుకుంటే కీళ్ల నొప్పులు, రక్తహీనత, హార్మోన్ల అసమతుల్యత, కేన్సర్ల బారిన పడే అవకాశం మహిళల్లో ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు.