
జెనీవా: రష్యా ఆక్రమణతో ఉక్రెయిన్ నుంచి ప్రజలు భారీగా వలస బాట పట్టారు. దేశం వీడి వెళ్లే వారితో సరిహద్దు పాయింట్లు రద్దీగా మారాయి. కిలోమీటర్ల కొద్దీ క్యూలైన్లు కనిపిస్తున్నాయి. యుద్ధం మొదలయ్యాక ఉక్రెయిన్ నుంచి 5లక్షల మందికి పైగా ప్రజలు వలస వెళ్లినట్లు ఐక్యరాజ్యసమితి వలసల విభాగం(యూఎన్‌హెచ్‌సీఆర్) హై కమిషనర్ ఫిలిపో గ్రాండి చెప్పారు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతూ పోతోందని ఆయన సోమవారం ట్విట్టర్‌లో తెలిపారు.