భారత్ వృద్ధి రేటు 2013లో 4.8 శాతమని ఐక్యరాజ్యసమితి పేర్కొంది.
న్యూఢిల్లీ: భారత్ వృద్ధి రేటు 2013లో 4.8 శాతమని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఇంతక్రితం ఈ అంచనాలను సమితి 6.1 శాతంగా పేర్కొంది. 2014 వృద్ధి రేటును కూడా 1.2 శాతం తగ్గించి 5.3 శాతానికి కుదించింది. 2015లో వృద్ధి రేటును 5.7 శాతంగా అంచనావేసింది. అమెరికా సహాయక ప్యాకేజీల ఉపసంహరణల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అభివృద్ధి చెందుతున్న దేశాలు సిద్ధం కావాలని కూడా ఐక్యరాజ్యసమితి ఆర్థిక విశ్లేషణా నివేదిక సూచించింది. 2014లో ప్రపంచ వృద్ధి రేటు 3 శాతం ఉంటుందన్నది సమితి అంచనా.
రూపాయిపై ‘ఫెడ్’ ప్రభావం: బీఆఫ్‌ఏ: కాగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రకటించిన సహాయ ప్యాకేజీల కోత(ట్యాపరింగ్) నిర్ణయం స్వల్పకాలంలో భారత రూపాయి మారకపు విలువపై ప్రభావం చూపే అవకాశం ఉందని బ్యాంక్ ఆఫ్ అమెరికా (బీఆఫ్‌ఏ మిరిల్ లించ్) పేర్కొంది.