నిర్భయ కేసు దోషి ముకేష్ సింగ్ వ్యాఖ్యలను యునైటెడ్ నేషన్స్ ఖండించింది. బాధితురాలిని బాధ్యురాల్ని చేస్తూ ముకేష్ అన్న మాటలు ఉచ్చరించరానంత నీచంగా ఉన్నాయని పేర్కొంది. మహిళలపై జరుగుతున్న హింసను అడ్డుకోవాల్సిన సమయం ఆసన్నమైందని యూఎన్ సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్, ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ ఒక ప్రకటనలో వెల్లడించారు. స్త్రీలపై దాడి జరిగిన ప్రతీసారి గట్టిగా నినదించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలపై హింసను అడ్డుకోవడానికి పురుషులు సంసిధ్దులు కావాల్సిన అవసరం ఉందన్నారు. అయితే 'ఇండియన్ డాటర్' డాక్యుమెంటరీ ప్రసారం నిషేధంపై స్పందించడానికి ఆయన నిరాకరించారు.
ఇది ఇలా ఉంటే... ఇండియన్ డాటర్ పేరుతో బ్రిటీష్ ఫిలిం మేకర్ లెస్లీ ఉడ్విన్ తీసిన డాక్యుమెంటరీని అనుకున్నదాని కంటే ముందుగానే బీబీసీ, అంటే బుధవారం రాత్రి 10 గంటలకే ప్రసారం చేసింది తాము చాలా బాధ్యతాయుతంగా ఈ సమస్యను చిత్రీకరించామంటూ బీబీసీతన వైఖరిని సమర్థించుకుంది. నిర్భయ గ్యాంగ్ రేప్ ఉదంతంపై బీబీసీ చానెల్కు చెందిన బ్రిటిష్ ఫిల్మ్ మేకర్ లెస్లీ ఉడ్విన్ ఇండియాస్ డాటర్ పేరుతో రూపొందించిన డాక్యుమెంటరీ దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. నిజానికి... ఈ డాక్యుమెంటరీ మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినం సందర్భంగా ప్రసారం చేయడానికి ఉద్దేశించింది.
'ఆ వ్యాఖ్యలు ఉచ్చరించడానికే నీచం'
Published Thu, Mar 5 2015 12:10 PM | Last Updated on Sat, Sep 2 2017 10:21 PM
Advertisement