ఛంఢీగడ్: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఎంపీ అభ్యర్థికి రైతుల నుంచి నిరసన సెగ తగిలింది. అమెరికాలో భారత మాజీ రాయబారి తరంజిత్ సింగ్ సంధు ఇటీవల బీజేపీలో చేరారు. ఆయనకు బీజేపీ పంజాబ్‌లోని అమృత్‌సర్ పార్లమెంట్ స్థానాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఆయన ఈ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా అమృత్‌సర్ జిల్లాలో చేపట్టిన రోడ్డు షోను రైతులు అడ్డుకున్నారు. గంగోమహాల్, కొల్లామహల్ గ్రామాల మధ్య చేపట్టిన రోడ్డు షోలో ఆయన రైతుల నుంచి నిరసన ఎదుర్కొన్నారు. దారికి ఇరువైపుల పెద్దసంఖ్యలో చేరి.. ఆయన కాన్వాయ్ అడ్డుకొని నల్లజెండాలు ప్రదర్శిస్తూ వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
రైతు సంఘం సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు పంజాబ్‌లోని పలు గ్రామాల రైతులు కేంద్ర తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
‘మళ్లీ అధికారంలో రావాలని బీజేపీ చేస్తోంది. అందుకే ప్రచారం మొదలుపెట్టింది. కానీ మేము ఎట్టిపరిస్థితుల్లో మా గ్రామాల్లో వారు (బీజేపీ నేతలు) ప్రచారం చేసకోవటానికి అనుమతించబోం. వారిని తీవ్రంగా వ్యతిరేకిస్తాం’ అని నిరసన తెలిపిన రైతులు తెలిపారు. తరంజిత్ సింగ్ మార్చి 20న బీజేపీలోచేరిన విషయం తెలిసిందే. ఆయన పార్టీలో చేరిన పదిరోజులకు బీజేపీ అమృత్‌సర్ టికెట్ కేటాయించింది.
రైతులు చేసిన నిరసనపై బీజేపీ ఎంపీ అభ్యర్తి తరంజిత్ సింగ్ మీడియాతో మాట్లాడారు. ‘ప్రజాస్వామ్యం ప్రతిఒక్కరికీ భావ ప్రకటన స్వేచ్ఛ వ్యక్తపరచడాన్ని అనుమతిస్తుంది. అదేవిధంగా నిరసన వ్యక్తం చేయటాన్ని కూడా అనుతిస్తుంది. నన్ను ఎన్నికల కోసం ప్రచారం చేయటానికి కూడా అనుమతిస్తుంది. అయితే మేము రైతు ఆదాయం పెంచేలా ప్రణాళికలు రచిస్తాం’ అని తరంజిత్ అన్నారు.
ఇటీవల నార్త్‌వెస్ట్ ఢిల్లీ పార్లమెంట్ స్థానం సిట్టింగ్ ఎంపీ, ప్రముఖ గాయకుడు హన్స్ రాజ్ హాన్స్ కూడా రైతుల నిరసనను ఎదుర్కొన్నారు. ఆయనకు మరోసారి బీజేపీ టికేట్ ఇచ్చింది. అయితే ఈసారి ఆయన్ను ఫరిద్‌కోట్ నుంచి బరిలోకి దించింది.
Comments
Please login to add a commentAdd a comment