taranjith singh sandhu
-
బీజేపీ ఎంపీ అభ్యర్థికి రైతుల నిరసన సెగ.. ఆయన ఏమన్నారంటే?
ఛంఢీగడ్: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఎంపీ అభ్యర్థికి రైతుల నుంచి నిరసన సెగ తగిలింది. అమెరికాలో భారత మాజీ రాయబారి తరంజిత్ సింగ్ సంధు ఇటీవల బీజేపీలో చేరారు. ఆయనకు బీజేపీ పంజాబ్‌లోని అమృత్సర్ పార్లమెంట్ స్థానాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఆయన ఈ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా అమృత్సర్ జిల్లాలో చేపట్టిన రోడ్డు షోను రైతులు అడ్డుకున్నారు. గంగోమహాల్, కొల్లామహల్ గ్రామాల మధ్య చేపట్టిన రోడ్డు షోలో ఆయన రైతుల నుంచి నిరసన ఎదుర్కొన్నారు. దారికి ఇరువైపుల పెద్దసంఖ్యలో చేరి.. ఆయన కాన్వాయ్ అడ్డుకొని నల్లజెండాలు ప్రదర్శిస్తూ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతు సంఘం సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు పంజాబ్‌లోని పలు గ్రామాల రైతులు కేంద్ర తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ‘మళ్లీ అధికారంలో రావాలని బీజేపీ చేస్తోంది. అందుకే ప్రచారం మొదలుపెట్టింది. కానీ మేము ఎట్టిపరిస్థితుల్లో మా గ్రామాల్లో వారు (బీజేపీ నేతలు) ప్రచారం చేసకోవటానికి అనుమతించబోం. వారిని తీవ్రంగా వ్యతిరేకిస్తాం’ అని నిరసన తెలిపిన రైతులు తెలిపారు. తరంజిత్ సింగ్ మార్చి 20న బీజేపీలోచేరిన విషయం తెలిసిందే. ఆయన పార్టీలో చేరిన పదిరోజులకు బీజేపీ అమృత్సర్ టికెట్ కేటాయించింది. రైతులు చేసిన నిరసనపై బీజేపీ ఎంపీ అభ్యర్తి తరంజిత్ సింగ్ మీడియాతో మాట్లాడారు. ‘ప్రజాస్వామ్యం ప్రతిఒక్కరికీ భావ ప్రకటన స్వేచ్ఛ వ్యక్తపరచడాన్ని అనుమతిస్తుంది. అదేవిధంగా నిరసన వ్యక్తం చేయటాన్ని కూడా అనుతిస్తుంది. నన్ను ఎన్నికల కోసం ప్రచారం చేయటానికి కూడా అనుమతిస్తుంది. అయితే మేము రైతు ఆదాయం పెంచేలా ప్రణాళికలు రచిస్తాం’ అని తరంజిత్ అన్నారు. ఇటీవల నార్త్‌వెస్ట్ ఢిల్లీ పార్లమెంట్ స్థానం సిట్టింగ్ ఎంపీ, ప్రముఖ గాయకుడు హన్స్ రాజ్ హాన్స్ కూడా రైతుల నిరసనను ఎదుర్కొన్నారు. ఆయనకు మరోసారి బీజేపీ టికేట్ ఇచ్చింది. అయితే ఈసారి ఆయన్ను ఫరిద్కోట్ నుంచి బరిలోకి దించింది. -
11 మంది అభ్యర్థులతో బీజేపీ మరో జాబితా
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ శనివారం 11 మంది అభ్యర్థులతో మరో జాబితాను విడుదల చేసింది. ఇందులో ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన భర్తృహరి మహతాబ్, రవ్నీత్ సింగ్ బిట్టూ, సుశీల్ కుమార్ రింకూ, ప్రణీత్ కౌర్ తదితర సిట్టింగులున్నారు. వీరంతా అవే స్థానాల నుంచి మళ్లీ బరిలోకి దిగుతున్నారు. అమెరికాలో భారత మాజీ రాయబారి తరన్జీత్ సింగ్ సంధు అమృత్‌సర్‌లో పోటీ చేయనున్నారు. 2019లో బీజేపీ తరఫున నార్త్‌వెస్ట్ ఢిల్లీలో గెలుపొందిన హన్స్ రాజ్ హన్స్ ఈసారి ఫరీద్కోట్ బరిలో ఉంటారు. బీజేడీకి గుడ్ బై చెప్పిన భర్తృహరి కటక్ నుంచి పోటీ చేస్తున్నారు. -
బీజేపీలోకి తరంజిత్ సింగ్ సంధు - అమృత్సర్ నుంచి పోటీ?
అమెరికాలో భారత మాజీ రాయబారి 'తరంజిత్ సింగ్ సంధు' మంగళవారం న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీలో చేరారు. ప్రధాన కార్యదర్శులు వినోద్ తవడే, తరుణ్ చుగ్ సమక్షంలో సంధు పార్టీ చేరారు. అమృత్సర్ లోక్‌సభ స్థానం నుంచి ఆయన బరిలోకి దిగే అవకాశం ఉంది. 2020 ఫిబ్రవరి 3న హర్షవర్ధన్ ష్రింగ్లా స్థానంలో సంధు USలో రాయబారిగా బాధ్యతలు స్వీకరించారు. 1988 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి అయిన సంధు శ్రీలంకలో భారత హైకమిషనర్‌గా కూడా పనిచేశారు. ముప్పై సంవత్సరాలకు పైగా విశిష్టమైన కెరీర్లో, సంధు మాజీ సోవియట్ యూనియన్‌లో పనిచేశాడు. బీజేపీ చేరిన తరువాత సంధు మాట్లాడుతూ.. గత 10 సంవత్సరాలలో నేను ప్రధాని మోదీ నాయకత్వంతో సన్నిహితంగా పనిచేశాను. ముఖ్యంగా భారత్ - అమెరికా మధ్య సంబంధాలను బలపడ్డాయని అన్నారు. దేశానికి సేవ చేసే ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించేందుకు తనను ప్రోత్సహించినందుకు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు కృతజ్ఞతలు తెలిపారు. #WATCH | India's former Ambassador to the US, Taranjit Singh Sandhu joins the BJP, in Delhi. pic.twitter.com/krYAqi0FjX — ANI (@ANI) March 19, 2024 -
భారత రాయబారిపై ఖలిస్తానీ వాదుల దూషణలు
న్యూయార్క్: గురుపూరబ్ పర్వదినం సందర్భంగా ప్రార్థనల్లో పాల్గొనేందుకు అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న గురుద్వారాకు వెళ్లిన భారత రాయబారి తరన్జీత్ సింగ్ సంధుపై ఖలిస్తానీ వాదులు నోరుపారేసుకున్నారు. లాంగ్ ఐలాండ్‌లో హిక్స్‌విల్లే గురుద్వారాకు వెళ్లిన సంధుకు ఘన స్వాగతం లభించింది. ఇది జీర్ణించుకోలేని ఖలిస్తానీ వాదులు ఆయన్ను దూషించారు. కెనడాలో ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఘటనపై ఆయనపై పలు ప్రశ్నలు సంధిస్తూ పెద్దగా కేకలు వేశారు. స్థానిక సిక్కు సమాజ సభ్యులు సంధుకు రక్షణగా నిలిచి, ఖలిస్తానీ వాదులను బయటకు పంపించారు. -
అమెరికాలో భారత ఎంబసీపై దాడికి విఫలయత్నం
న్యూఢిల్లీ/వాషింగ్టన్: ఖలిస్తానీ మూకలు మళ్లీ పేట్రేగాయి. ఈసారి అమెరికాలో వాషింగ్టన్‌లోని భారత దౌత్య కార్యాలయాన్ని లక్ష్యం చేసుకున్నాయి. దానిపై దాడికి ఖలిస్తానీ మద్దతుదారులు చేసిన యత్నాన్ని సీక్రెట్ సర్వీస్ పోలీసులు విఫలం చేశారు. ఎంబసీ ఎదుట వారు హింసను ప్రేరేపించేలా ప్రసంగించారు. ఆ సమయంలో కార్యాలయంలో లేని దౌత్యాధికారి తరన్‌జిత్ సంధును బహిరంగంగానే బెదిరించారు! ఎంబసీ కిటికీలు, అద్దాలు పగులగొట్టేందుకు కర్రలను తెచ్చిపెట్టుకున్నారు. నిరసనలను కవర్ చేస్తున్న పీటీఐ ప్రతినిధినీ దూషించారు. ఆయన్ను నెట్టేస్తూ, ఖలిస్తానీ జెండా కర్రలతో కొట్టేందుకు ప్రయత్నించారు. దాంతో ఆయన పోలీసులకు ఫోన్ చేశారు. సీక్రెట్ సర్వీస్, స్థానిక పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. త్రివర్ణ పతాకమున్న పోల్‌ను విరగ్గొట్టేందుకు చేసిన ప్రయత్నాలను వమ్ము చేశారు. ఈ ఘటనను భారత దౌత్య కార్యాలయం తీవ్రంగా ఖండించింది. శాన్ఫ్రాన్సిస్కోలోని భారత్ కాన్సులేట్, లండన్‌లోని భారత హైకమిషన్ వద్ద కూడా ఖలిస్తానీ మూకలు గొడవలకు దిగడం తెలిసిందే. కెనడాలోని తమ దౌత్య కార్యాలయాలు, కాన్సులేట్లపై తీవ్రవాద, వేర్పాటువాద శక్తుల దాడులపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కెనడా హైకమిషనర్‌కు సమన్లు జారీ చేసింది. -
స్నాతకోత్సవం.. వర్చువల్‌గా
వాషింగ్టన్: ఈఏడాదికి అమెరికాలో తమ చదువులను పూర్తి చేసుకున్న విద్యార్థులకు వర్చువల్ స్నాతకోత్సవ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో వేలాది మంది భారత విద్యార్థులు, కుటుంబీకులు, మిత్రులు పాల్గొన్నారు. కరోనా కారణంగా ఈ ఏడాది జరిగే అన్ని స్నాతకోత్సవాలు రద్దవడం తెల్సిందే. దీంతో ఎంబసీ ఆఫ్ ఇండియా స్టూడెంట్ హబ్ ఈ కార్యక్రమాన్ని వర్చువల్ పద్ధతిలో నిర్వహించింది. అనుకోని ఘటనలే అంతులేని అవకాశాలను కల్పిస్తాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని అమెరికాలో భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ విద్యార్థుల్లోనే భవిష్యత్ ఆవిష్కరణ కర్తలు, ఎంటర్ ప్రెన్యూర్లు, డాక్టర్లు, సైంటిస్టులు ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సింగర్, ఎంటర్ప్రెన్యూర్ లాలిత్య మున్షా, నటి గౌతమి తడిమెల్ల, తబలా మాస్టర్ దివ్యాంగ్ వాకిల్, ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ వేణు గోపాల్, ఐపీఎస్ ఆఫీసర్ అపర్ణ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. -
2020నాటికి భారత్ కొత్త రికార్డు!
కొలంబో: భారత్ 2020నాటికి కొత్త రికార్డును సొంతం చేసుకోబోతోంది. ప్రపంచంలోనే మహా యువ భారత దేశంగా అవతరించనుంది. 2020నాటికి సగటున 29 ఏళ్ల వయసుగలవారే భారతదేశంలో ఎక్కువగా ఉంటారని భారత రాయబారి ఆదివారం శ్రీలంకలోని కాంబోడియాలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకటించారు. ఇదే సంవత్సరం నాటికి 64శాతం భారతీయ జనాభా పనిచేయగల గట్టి సామర్థ్యంతో ఉంటారని శ్రీలంకలోమ భారత హైకమిషనర్‌గా పనిచేస్తున్న తరంజిత్ సింగ్ సందు చెప్పారు. అభివృద్ధి భారతదేశ విదేశాంగ విధానం అని ఆయన అన్నారు. భారత దేశంలోని జనాభా ఆశయాలను, ఆశలను తీర్చే విధంగా ముందుకు వెల్లడమే ఇండియా ఫారిన్ పాలసీ అని అభివర్ణించారు. భారత నాయకత్వాన్ని మొత్తం ప్రపంచం మెచ్చుకుంటోందని, ప్రపంచంలోనే మిక్కిలి క్రియాశీలంగా ఒక్క భారత విదేశాంగ విధానమే ఉంటుందని అన్నారు. శ్రీలంక-ఇండియాల మధ్య సంబంధాలకు పెద్ద మొత్తంలో అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.