2020నాటికి భారత్ కొత్త రికార్డు!
కొలంబో: భారత్ 2020నాటికి కొత్త రికార్డును సొంతం చేసుకోబోతోంది. ప్రపంచంలోనే మహా యువ భారత దేశంగా అవతరించనుంది. 2020నాటికి సగటున 29 ఏళ్ల వయసుగలవారే భారతదేశంలో ఎక్కువగా ఉంటారని భారత రాయబారి ఆదివారం శ్రీలంకలోని కాంబోడియాలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకటించారు. ఇదే సంవత్సరం నాటికి 64శాతం భారతీయ జనాభా పనిచేయగల గట్టి సామర్థ్యంతో ఉంటారని శ్రీలంకలోమ భారత హైకమిషనర్‌గా పనిచేస్తున్న తరంజిత్ సింగ్ సందు చెప్పారు.
అభివృద్ధి భారతదేశ విదేశాంగ విధానం అని ఆయన అన్నారు. భారత దేశంలోని జనాభా ఆశయాలను, ఆశలను తీర్చే విధంగా ముందుకు వెల్లడమే ఇండియా ఫారిన్ పాలసీ అని అభివర్ణించారు. భారత నాయకత్వాన్ని మొత్తం ప్రపంచం మెచ్చుకుంటోందని, ప్రపంచంలోనే మిక్కిలి క్రియాశీలంగా ఒక్క భారత విదేశాంగ విధానమే ఉంటుందని అన్నారు. శ్రీలంక-ఇండియాల మధ్య సంబంధాలకు పెద్ద మొత్తంలో అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.