అమెరికాలో భారత మాజీ రాయబారి 'తరంజిత్ సింగ్ సంధు' మంగళవారం న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీలో చేరారు. ప్రధాన కార్యదర్శులు వినోద్ తవడే, తరుణ్ చుగ్ సమక్షంలో సంధు పార్టీ చేరారు. అమృత్‌సర్ లోక్‌సభ స్థానం నుంచి ఆయన బరిలోకి దిగే అవకాశం ఉంది.
2020 ఫిబ్రవరి 3న హర్షవర్ధన్ ష్రింగ్లా స్థానంలో సంధు USలో రాయబారిగా బాధ్యతలు స్వీకరించారు. 1988 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి అయిన సంధు శ్రీలంకలో భారత హైకమిషనర్‌గా కూడా పనిచేశారు. ముప్పై సంవత్సరాలకు పైగా విశిష్టమైన కెరీర్‌లో, సంధు మాజీ సోవియట్ యూనియన్‌లో పనిచేశాడు.
బీజేపీ చేరిన తరువాత సంధు మాట్లాడుతూ.. గత 10 సంవత్సరాలలో నేను ప్రధాని మోదీ నాయకత్వంతో సన్నిహితంగా పనిచేశాను. ముఖ్యంగా భారత్ - అమెరికా మధ్య సంబంధాలను బలపడ్డాయని అన్నారు. దేశానికి సేవ చేసే ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించేందుకు తనను ప్రోత్సహించినందుకు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు కృతజ్ఞతలు తెలిపారు.
#WATCH | India's former Ambassador to the US, Taranjit Singh Sandhu joins the BJP, in Delhi. pic.twitter.com/krYAqi0FjX
— ANI (@ANI) March 19, 2024
Comments
Please login to add a commentAdd a comment