Anand Mahindra Latest Tweet: Small Restaurant Which is run By Teenagers Turned Viral - Sakshi
Sakshi News home page

Anand Mahindra Tweet: తండ్రిని కోల్పోయిన టీనేజర్లు.. ఆనంద్‌ మహీం‍ద్రా ట్వీట్‌తో మారనున్న సీన్‌

Published Sat, Feb 5 2022 3:31 PM | Last Updated on Sat, Feb 5 2022 4:16 PM

Anand Mahindra Latest Tweet About Small Restaurant Which is run By Teenagers  Turned Viral On Social Media - Sakshi

హృదయాన్ని స్పృశించే కథనాలు, గుర్తింపు కోసం ఎదురు చూస్తున్న ప్రతిభ ఎక్కడున్న స్పందించే అలవాటు ఆనంద్‌ మహీంద్రా సొంతం. సోషల్‌ మీడియా వేదికగా ఇప్పటికే అనేక సార్లు ఈ విషయం రుజువైంది. ఆయన చేసే ఒక్క ట్వీట్‌ ఎంతో మంది జీవితాల్లో వెలుగునింపింది. తాజాగా కుటుంబ పోషణ కోసం ఆ ఇద్దరు టీనేజర్లు చేస్తున్న ప్రయత్నాలకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చాడు ఆనంద్‌ మహీంద్రా. 

అమృత్‌సర్‌లో సుల్తాన్‌గేట్‌ ఎదురుగా ఓ చిన్న రెస్టారెంట్‌ ఉంది. కానీ ఈ రెస్టారెంట్‌ వెనుక ఓ పెద్ద కథ ఉంది. అదిప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ మారింది. మూడు నెలల క్రితం అప్పు చేసి ఈ రెస్టారెంట్‌ని ప్రారంభించారు. 2021 డిసెంబరు 21న రెస్టారెంట్‌ యజమాని హఠాత్తుగా చనిపోయాడు. దీంతో అతని కుటుంబం అండను కోల్పోగా.. రెస్టారెంట్‌ మూతపడే స్థితికి చేరుకుంది. దీంతో ఆ రెస్టారెంట్‌ యజమాని ఇద్దరు కొడుకులు హర్‌దీప్‌ సింగ్‌ (17), హంజ్‌దీప్‌ సింగ్‌ (11)లు రెస్టారెంట్‌తో పాటు తమ కుటుంబ బాధ్యతలను తీసుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఆ రెస్టారెంట్‌ను నడిపిస్తున్నారు. అనుభవం లేకపోయినా వయసు చాలకపోయినా గుండె ధైర్యంతో సమస్యలకు ఎదురీతున్నారు. అమృత్‌సర్‌కి చెందిన ఓ యువకుడు ఈ రెస్టారెంట్‌కి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు.

టీనేజర్ల నడిపిస్తున్న రెస్టారెంట్‌ వీడియోను ఆనంద్‌ మహీంద్రా ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. అమృతసర్‌ జిలేబీలకు ఫేమస్‌. కానీ ఈసారి అమృత్‌సర్‌ వెళితే జిలేబీల బదులు ఈ రెస్టారెంట్‌కి వెళ్తాను. త్వరలోనే ఈ రెస్టారెంట్‌ రద్దీగా మారుతుందంటూ ఆశాభావం వ్యక్తం చేశారాయన. ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌తో ఒక్కసారిగా ఈ రెస్టారెంట్‌ సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. లైకులు, రీట్వీట్లతో హెరెత్తించింది. చాలా మంది నెటిజన్లు ఈ పిల్లలు నడిపిస్తున్న రెస్టారెంట్‌కి వెళ్తామంటూ బదులిచ్చారు. మరికొందరు సాయం చేయడంతో పాటు చిన్న పిల్లలకు గైడ్‌ చేయాలంటూ సూచించారు. ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌తో ఈ చిన్న రెస్టారెంట్‌ మరో బాబా కా ధాబా తరహాలో ఈ రెస్టారెంట్‌ బిజీ అవుతుందని నెటిజన్లు అంటున్నారు.

చదవండి:  థ్యాంక్యూ ఆనంద్‌ మహీంద్రా సార్‌.. మాట నిలబెట్టుకున్న బిజినెస్‌మ్యాన్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement