
అమృత్‌సర్: అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని అపవిత్రం చేసేందుకు యత్నించిన ఓ వ్యక్తిని కొందరు కొట్టిచంపారు. శనివారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సుమారు 30 ఏళ్లున్న ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆలయంలోపలున్న బంగారు గ్రిల్స్‌పై నుంచి దూకి నిషిద్ధ పూజా మందిరంలోకి ప్రవేశించాడు.
అక్కడున్న కత్తిని పట్టుకుని, గురుగ్రంథ్ సాహిబ్‌ను పఠిస్తున్న పూజారి వైపుగా వెళ్లాడు. ప్రమాదాన్ని పసిగట్టిన శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ(ఎస్‌జీపీసీ) టాస్క్‌ఫోర్స్ సభ్యులు అతడిని పట్టుకుని ఎస్‌జీపీసీ కార్యాలయానికి తీసుకెళ్లారు. విషయం తెలిసి ఆగ్రహంతో అక్కడికి చేరుకున్న కొందరు ఆ అగంతకుడిని పట్టుకుని తీవ్రంగా కొట్టడంతో మరణించాడు. మృతుని వివరాలు, ఇంకెవరైనా అతడితోపాటు ఉన్నారా? తదితర విషయాలపై సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్లు డిప్యూటీ పోలీస్ కమిషనర్ భందాల్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment