రైలు ప్రమాదంలో మరణించిన రావణ పాత్రధారి దల్బీర్ సింగ్
అమృత్‌సర్ : పంజాబ్‌లోదసరా వేడుకల సందర్భంగా ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అమృత్‌సర్‌లోని జోడా పాఠక్ ప్రాంతంలో రైల్వే క్రాసింగ్‌ను ఆనుకొని ఉన్న స్థలంలో దసరా సందర్భంగా శుక్రవారం రావణ దహన కార్యక్రమం నిర్వహించారు. రైల్వే ట్రాక్ పక్కన రావణ దహనం నిర్వహిస్తుండగా పట్టాలపై నుంచుని వీక్షిస్తున్న వారిపై నుంచి రైలు దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలిసింది.ఈ దుర్ఘటనలో కనీసం 61 మంది చనిపోగా.. మరో 80 మందికి పైగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలోనే రావణాసురిడి వేషం కట్టిన దల్బీర్ సింగ్‌ప్రాణాలు కోల్పోయాడు.
దసరా సమయంలో ఉత్తర భారతంలోని అన్ని గ్రామాల్లోనూ రామ్‌లీలా నాటకం వేస్తారు. ఈ క్రమంలో అమృత్‌సర్‌కు చెందిన దల్బీర్ సింగ్ కూడా కొన్నేళ్లుగా రామ్‌లీలా నాటకంలో రావణుడి వేషం వేస్తూ వస్తున్నాడు. ఈ ఏడాది కూడా అతను అమృత్‌సర్‌లో జరిగిన రామ్‌లీలా నాటకంలో రావణుడి వేషం వేశాడు. అయితే జోడా పాటక్ వద్ద జరుగుతున్న రావణ దహన వేడుకను వీక్షిస్తున్న సమయంలో దల్బీర్ సింగ్ కూడా అక్కడే ఉన్నాడు. రైల్వే ట్రాక్‌పై నిలబడి.. దల్బీర్ ఆ వేడుకను వీక్షించాడు.
బాణాసంచ పేల్చుతున్న సమయంలోనే లోకల్ రైలు దూసుకురావడంతో.. ట్రాక్‌పై ఉన్న దల్బీర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన పట్ల దల్బీర్ ఫ్యామిలీ తీవ్ర దిగ్భ్రాంతికి గురైన ఆ ఫ్యామిలీ తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంది. దల్బీర్‌కు 8 నెలల చిన్న బాబు ఉన్నాడు. కుటుంబానికి ఆధారం అయిన కుమారుడు మరణించడంతో.. తన కోడలికి ఉద్యోగం ఇప్పించాలని దల్బీర్ తల్లి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment