Ravana burning
-
Devi Navaratrulu 2024: అయ్యవారికి చాలు ఐదు వరహాలు
(ఈ ఫొటోలో ఉన్నది రావణుడు. దసరాకి రావణ దహనం చేస్తారు. అందుకు తయారవుతున్న బొమ్మ ఇది. ఢిల్లీలోనిది ఈ ఫొటో) పిల్లలూ... దేవీ నవరాత్రులను దసరా పండగగా పిలుస్తారు. పూర్వపు రోజుల్లో దసరా సెలవలప్పుడు ఉపాధ్యాయులు తమ తమ పాఠశాలలో చదువుకునే బాల బాలికలను వెంటబెట్టుకుని గ్రామం లోని ఇంటింటికీ వెళ్ళే వారు, గహస్తులను ఆశీర్వదంచేవాళ్ళు. పిల్లలు కొత్త బట్టలు వేసుకుని చేతుల్లో విల్లంబులు పట్టుకుని అయ్యవారి వెంట వెళ్ళే వారు. ఈ అంబులను గిలకలు అంటారు. వీటిని సంధించి వదిలితే, ఎదుటి వారి మీద పూలూ ఆకులు పడేవి. బడి పిల్లలు అలా ఊరంతా తిరుగుతూ పాటలు, పద్యాలు పాడేవారు. వీటినే దసరా పద్యాలు అంటారు. దసరా పద్యాలు చాలా సులభంగా, వీనులకు విందుగా ఉంటాయి. ఈ పద్యం చూడండి.ఏ దయా మీ దయా మా మీద లేదు,ఇంత నిర్లక్ష్యమా ఇది మీకు తగదు,దసరాకు వస్తిమనీ విసవిసలు పడకచేతిలో లేదనక అప్పివ్వరనకపావలా.. .అర్ధయితే ...పట్టేది లేదు,ముప్పావలా అయితే ముట్టేది లేదు,హెచ్చు రూపాయయితే పుచ్చుకుంటాము,అయ్య వారికి చాలు ఐదు వరహాలుపిల్ల వారికి చాలు పప్పు బెల్లాలుజయీభవా...దిగ్విజయీభవా -
ఢిల్లీ : రామ్ లీలా మైదానంలో రావణ దహనం
-
అమృత్సర్ ప్రమాదం : పాపం దల్బీర్ సింగ్
అమృత్సర్ : పంజాబ్లోదసరా వేడుకల సందర్భంగా ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అమృత్‌సర్‌లోని జోడా పాఠక్ ప్రాంతంలో రైల్వే క్రాసింగ్‌ను ఆనుకొని ఉన్న స్థలంలో దసరా సందర్భంగా శుక్రవారం రావణ దహన కార్యక్రమం నిర్వహించారు. రైల్వే ట్రాక్ పక్కన రావణ దహనం నిర్వహిస్తుండగా పట్టాలపై నుంచుని వీక్షిస్తున్న వారిపై నుంచి రైలు దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలిసింది.ఈ దుర్ఘటనలో కనీసం 61 మంది చనిపోగా.. మరో 80 మందికి పైగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలోనే రావణాసురిడి వేషం కట్టిన దల్బీర్ సింగ్ప్రాణాలు కోల్పోయాడు. దసరా సమయంలో ఉత్తర భారతంలోని అన్ని గ్రామాల్లోనూ రామ్‌లీలా నాటకం వేస్తారు. ఈ క్రమంలో అమృత్‌సర్‌కు చెందిన దల్బీర్ సింగ్ కూడా కొన్నేళ్లుగా రామ్‌లీలా నాటకంలో రావణుడి వేషం వేస్తూ వస్తున్నాడు. ఈ ఏడాది కూడా అతను అమృత్‌సర్‌లో జరిగిన రామ్‌లీలా నాటకంలో రావణుడి వేషం వేశాడు. అయితే జోడా పాటక్ వద్ద జరుగుతున్న రావణ దహన వేడుకను వీక్షిస్తున్న సమయంలో దల్బీర్ సింగ్ కూడా అక్కడే ఉన్నాడు. రైల్వే ట్రాక్‌పై నిలబడి.. దల్బీర్ ఆ వేడుకను వీక్షించాడు. బాణాసంచ పేల్చుతున్న సమయంలోనే లోకల్ రైలు దూసుకురావడంతో.. ట్రాక్‌పై ఉన్న దల్బీర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన పట్ల దల్బీర్ ఫ్యామిలీ తీవ్ర దిగ్భ్రాంతికి గురైన ఆ ఫ్యామిలీ తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంది. దల్బీర్‌కు 8 నెలల చిన్న బాబు ఉన్నాడు. కుటుంబానికి ఆధారం అయిన కుమారుడు మరణించడంతో.. తన కోడలికి ఉద్యోగం ఇప్పించాలని దల్బీర్ తల్లి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. దూసుకొచ్చిన మృత్యువు -
రామ్‌లీలా మిఠాయి
దేశ రాజధాని ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో రావణ దహనం తర్వాత చేసుకునే మిఠాయిల సంబరం ఇదిగో...! మోతీచూర్ లడ్డు కావలసినవి: సెనగపిండి – రెండున్నర కప్పులు; పంచదార – ఒకటిన్నర కప్పులు; పాలు – పావు కప్పు; మిఠాయి రంగు – చిటికెడు; నెయ్యి – డీప్ ఫ్రైకి తగినంత; ఏలకుల పొడి – టీ స్పూను; బాదం తరుగు – టేబుల్ స్పూను; పిస్తా తరుగు – టేబుల్ స్పూను తయారి: ∙పంచదారకు మూడు కప్పుల నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచి, తీగ పాకం వచ్చే వరకు ఉడికించి, పక్కన ఉంచాలి పాలు జత చేసి పొంగే వరకు ఉంచి, దించేయాలి ∙మిఠాయి రంగు జత చేసి, బాగా కలిపి పక్కన ఉంచాలి ∙ఒక పాత్రలో సెనగ పిండి, మూడు కప్పుల నీళ్లు పోసి ఉండలు లేకుండా బాగా కలపాలి. (ఇష్టపడేవారు మిఠాయి రంగు కలుపుకోవచ్చు) ∙స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి వేడి చేయాలి ∙సన్న రంధ్రాలున్న చట్రంలో సెనగ పిండి పోస్తూ సన్న బూందీ నేతిలో పడేలా కదుపుతుండాలి ∙వేయించిన బూందీని బయటకు తీయాలి ∙ఈ విధంగా మొత్తం చేసుకున్నాక, పంచదార పాకంలో వేసి కలపాలి ఏలకుల పొడి వేసి బాగా కలిపి చేతితో లడ్డు తయారుచేయాలి ∙(ముత్యం పరిమాణంలో బూందీ తయారుచేసి, లడ్డూ చేస్తాం కనుక, ఈ లడ్డూను మోతీచూర్ లడ్డూ అంటారు). షీరా కావలసినవి: పాలు – రెండున్నర కప్పులు; పంచదార – ఒకటిన్నర కప్పులు; రవ్వ – కప్పు; బాదం తరుగు – టేబుల్ స్పూను; ఎండు ద్రాక్ష – టేబుల్ స్పూను; నెయ్యి – అర కప్పు; కుంకుమ పువ్వు – చిటికెడు తయారి: ముందుగా పాలు మరిగించి, పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలి వే డయ్యాక రెండు టీ స్పూన్ల నెయ్యి వేసి కరిగాక, బొంబాయి రవ్వ వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి ∙వే పాలు పోసి బాగా కలిపి రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచాలి ∙పంచదార వేసి మరోమారు ఉyì కించాలి ∙చివరగా బాదం తరుగు, నెయ్యి వేసి మరోమారు కలిపి దించేయాలి. కాజూ కత్లీ కావలసినవి: జీడిపప్పు – 3 కప్పులు; పంచదార పొడి – 10 టేబుల్ స్పూన్లు; పాల పొడి – టీ స్పూను; రోజ్ ఎసెన్స్ – పావు టీ స్పూను; సిల్వర్ ఫాయిల్ – చిన్న షీటు తయారి: ∙జీడిపప్పులను తగినన్ని నీళ్లలో సుమారు గంట సేపు నానబెట్టాలి ∙నీళ్లు ఒంపేసి, పంచదార పొడి, పాల పొడి జత చేసి, మిక్సీలో వేసి ముద్దగా చేసి తీసేయాలి ∙స్టౌ మీద బాణలి వేడయ్యాక, ఈ మిశ్రమం వేసి ఆపకుండా కలుపుతూ ఉడికించి, దింపేయాలి ∙తరవాత కొద్దిసేపు చేతితో మర్దించాలి ∙రోజ్ ఎసెన్స్ జత చేయాలి. ∙ఒక పెద్ద ప్లేట్‌కి నెయ్యి పూసి, ఉడికిన జీడిపప్పు మిశ్రమాన్ని పళ్లెంలో పోసి, సమానంగా పరిచి, పైన సిల్వర్ ఫాయిల్ అతికించాలి. ∙కొద్దిగా గట్టిపడగానే డైమండ్ ఆకారంలో కట్ చేసుకోవాలి. ఘేవార్ కావలసినవి: మైదా పిండి – 4 కప్పులు; నెయ్యి – 2 కప్పులు; పాలు – కప్పు; నీళ్లు – 4 కప్పులు; బాదం తరుగు – టేబుల్ స్పూను; పిస్తా తరుగు – టేబుల్ స్పూను; ఏలకుల పొడి – టీ స్పూను; కుంకుమ పువ్వు – కొద్దిగా; పంచదార – 2 కప్పులు; మిఠాయి రంగు – చిటికెడు తయారి: ∙మిక్సింగ్ బౌల్లో మైదా, నెయ్యి, పాలు, మూడు కప్పుల నీళ్లు పోసి పిండిని కలుపుకోవాలి ∙మిగిలిన ఒక కప్పు నీళ్లలో మిఠాయి రంగు వేసి బాగా కలిపి, ఈ రంగు నీళ్లను పిండిలో పోసి మృదువుగా కలుపుకోవాలి ∙స్టీలు లేదా అల్యూమినియం గిన్నెలో సగ భాగానికి నెయ్యి పోసి స్టౌ మీద ఉంచి వేడి చేయాలి ∙నెయ్యి వేడి కాగానే, కలిపి ఉంచుకున్న మైదా మిశ్రమాన్ని గ్లాసుతో పోయాలి. మధ్యలో పిండి అలాగే నిలిచి ఉండేట్లు సన్నని మంట మీద వేడి చేయాలి ∙మరో గ్లాసు పిండి తీసుకుని దాని మీదే మళ్లీ పోసి, ఈ సారి కూడా పిండి మ«ధ్యలో నిలిచి ఉండే వరకు తక్కువ మంట మీద వేడి చేయాలి ∙ఘేవర్ రెడీ అయినట్లే ∙మరొక గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసి పంచదార వేసి తీగపాకం వచ్చవరకు కలపాలి ∙తయారుచేసి ఉంచుకున్న ఘేవర్‌ను పంచదార పాకంలో ముంచి తీసి పక్కన పెట్టుకోవాలి చల్లారాక కుంకుమ పువ్వు నీళ్లు చిలకరించాలి ∙బాదం, పిస్తా, ఏలకుల పొడి చల్లి సర్వ్ చేయాలి. -
‘రావణ దహనం’ సృష్టికర్త లింగం
ఆర్మూర్ టౌన్ : దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించే రావణ సంహారం(దహనం) దృశ్య రూపకం పట్టణంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. 19 ఏళ్లుగా ఈ ఘట్టాన్ని చూసేందుకు పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తారు. ఈ దృశ్యరూపకాన్ని సృష్టించి దసరా ఉత్సవాలకు శోభను తీసుకువచ్చి ప్రజలకు కనువిందు చేస్తున్నది పట్టణానికి చెందిన ఎలక్ట్రిక్ బ్రహ్మ బిరుదాంకితుడు చౌకె లింగం. స్థానిక జిరాయత్ నగర్లో నివాసముంటున్న చౌకె లింగం దసరా ఉత్సవాల్లో రావణ దహనానికి ఆద్యుడు. జంబి హనుమాన్ ఆలయంలో దసరా ఉత్సవాలు సాంప్రదాయబద్ధంగా అంగరంగవైభవంగా జరిగినప్పటికీ లింగం రాకతో ఉత్సవాలకు మరింత శోభ సంతరించుకుంది. వీధి నాటకాలు, యక్షగానం, బుర్రకథలతో చౌకె లింగం ఈ ప్రాంత ప్రజలకు సుపరిచితుడు. జిల్లా వ్యాప్తంగా తొమ్మిది చోట్ల ప్రదర్శన.. ఈ ఏడాది పట్టణంతో పాటు మండలంలోని అంకాపూర్, మిర్ధాపల్లి, నందిపేట్ మండలం వన్నెల్(కె), బాల్కొండ మండలం బోదెపల్లి, వేల్పూర్ మండలం పడిగెల్, ఇందల్వాయి మండల కేంద్రం, మోర్తాడ్ మండల కేంద్రాలతో పాటు జిల్లా కేంద్రంలో రావణ దహనం ఘట్టాన్ని చౌకె లింగం సౌజన్యంతో నిర్వహించనున్నారు. ఇందుకు ఏర్పాట్లలో చౌకె లింగం బృందం నిమగ్నమయ్యింది. ఈ యేడు దుర్గామాత చేతిలో మహిషాసుర వధను వరుసగా రెండవ సంవత్సరం ప్రదర్శించేందుకు లింగం సన్నద్ధమవుతున్నారు. నా అదృష్టంగా భావిస్తున్నా పట్టణంలో దసరా ఉత్సవాల నిర్వహణలో ప్రతి యేట నాకు అవకాశం కల్పించడం అదృష్టంగా భావిస్తున్నా ను. గతేడాది నుంచి రావణ సంహారంతో పాటు మహిషాసుర వధను ప్రదర్శిస్తున్నాం. కళాకారులకు, ప్రతిభావంతులకు ఆశించిన మేర గుర్తింపు లభించడం లేదు. - చౌకె లింగం, రావణ దహనం సృష్టికర్త, ఆర్మూర్