అమృత్‌సర్ జిల్లా రాజస్సని ప్రాంతంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 10మందికి పైగా గాయపడ్డారు. ఆధ్యాత్మిక మందిరమైన నీరంకరి భవన్ వద్ద ఈ పేలుడు చోటు చేసుకుంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో పేలుడు సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రార్థనా మందిరం వద్దకు ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనం మీద వచ్చి పేలుడు పదార్థాలు విసిరినట్లు తెలుస్తోందని స్థానిక పోలీస్ అధికారి సురీందర్ సింగ్ తెలిపారు.