సోషల్ మీడియాలో తాజాగా ఒక వీడియో వైరల్‌గా మారింది. ఒక కుక్క తల కారు బంపర్‌లో ఇరుక్కుపోవడాన్ని ఆ వీడియోలో చూడవచ్చు. దానిని రెస్క్యూ చేసేందుకు అమృత్‌సర్ పోలీసు విభాగానికి చెందిన ఒక అధికారు ఎంతో చాకచక్యంగా వ్యవహరించారు. అతను ఆ కుక్క తలను కారు బంపర్ నుంచి బయటకు తీశారు. ఈ వీడియోను ఇప్పటివరకూ 8 వేలకుపైగా నెటిజన్లు చూశారు. చాలామంది ఈ వీడియోను రీట్వీట్ చేస్తూ, పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
ఈ వీడియోను అమృత్‌సర్ పోలీస్ కమిషనర్ తన అధికారిక అకౌంట్‌లో పోస్ట్ చేశారు. దీనికి క్యాప్షన్‌గా ‘ఇది హదయానికి హత్తుకునే పని. ఒక కుక్క తల.. కారు బంపర్‌లో ఇరుక్కుపోయింది. అమృత్‌సర్ పోలీసు అధికారి ఒకరు దానిని కాపాడేందుకు ముందుకు వచ్చారు. అతను ఎంతో నేర్పుగా, సురక్షితంగా దాని తలను బంపర్ నుంచి బయటకు తీశారు. ఈ నేపధ్యంలో ఆ కుక్కకు ఎటువంటి గాయం కాలేదని’ రాశారు.
A heartwarming act of compassion! 🙌🚓
— Commissioner of Police Amritsar (@cpamritsar) June 28, 2023
In a touching incident, a dog got trapped in a car bumper, Amritsar police official came to the rescue. With great care and skill, safely freed the dog, ensuring its well-being.🐾#LetsBringTheChange #LoveForAnimals pic.twitter.com/HylTFNHu8e
పోలీసు అధికారి మెచ్చుకుంటున్న జనం..
ఈ వీడియోను చూసి కామెంట్ చేస్తున్న నెటిజన్లు కుక్కను కాపాడేందుకు ఆ అధికారి వ్యవహరించిన తీరును మెచ్చుకుంటున్నారు. ఒక యూజర్ ‘ఈ పని వారి యూనిఫారంనకు మరింత గౌరవాన్నిస్తుంది. భగవంతుడు ఆ అధికారిని.. ఇటువంటి గొప్ప పనిచేసినందుకు ఆశీర్వదిస్తాడు’ అని రాశారు. కొందరు యూజర్స్ జంతుప్రేమ గురించి ప్రస్తావించారు. మరో యూజర్ ‘అన్ని ప్రాణుల విషయంలోనూ సానుభూతితో మెలగాలని అన్ని ధర్మాలు చెబుతున్నాయి. అదే మానవత్వమని పేర్కొంటున్నాయి’ అని రాశారు.
ఇది కూడా చూడండి: పర్ఫెక్ట్ టైమింగ్:కెమెరాకు చిక్కిన మూడు తలల చీతా!
Comments
Please login to add a commentAdd a comment