మాజీ డిప్యూటీ సీఎం సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై దాడి నేపధ్యంలో మరోమారు తెరపైకి అమృత్‌సర్
గోల్డెన్ టెంపుల్ భద్రతపై తలెత్తుతున్న పలు అనుమానాలు
పాకిస్తాన్ సరిహద్దుకు ఆనుకునివున్న నగరం అమృత్‌సర్
తాజ్‌మహల్ తర్వాత పర్యాటకులు అమితంగా ఇష్టపడే నగరం
ఒకప్పుడు శ్రీరాముని కుమారులు లువుడు, కుశుడు ఇక్కడే బస
అమృత్‌సర్‌కు సుమారు 500 ఏళ్ల చరిత్ర
సిక్కుల నాల్గవ గురువు గురు రాందాస్ 1564ఏడీలో ఈ నగరానికి పునాది
జలియన్‌వాలాబాగ్ మారణకాండకు సాక్ష్యం అమృత్‌సర్
న్యూఢిల్లీ: పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయం వెలుపల జరిగిన దాడిలో రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం సుఖ్‌బీర్ సింగ్ బాదల్ తృటిలో తప్పించుకున్నారు. ఈ దాడి తర్వాత గోల్డెన్ టెంపుల్ భద్రతపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అలాగే పలువురు స్వర్ణదేవాలయ ఘన చరిత్ర గురించి కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు.
తాజ్‌మహల్ తరువాత..
భారతదేశంలోని పంజాబ్‌లో పాకిస్తాన్ సరిహద్దుకు ఆనుకునివున్న నగరం అమృత్‌సర్. దీనిని సిక్కులు అత్యంత పవిత్రమైన నగరంగా భావిస్తారు. టూరిజం డిపార్ట్‌మెంట్ గణాంకాల ప్రకారం.. యూపీలోని తాజ్‌మహల్ తర్వాత పర్యాటకులు అమితంగా ఇష్టపడే నగరం అమృత్‌సర్. ఇక్కడి గోల్డెన్ టెంపుల్ కారణంగా అమృత్‌సర్ పేరు అగ్రస్థానంలో నిలిచింది. గోల్డెన్ టెంపుల్‌ను స్వర్ణదేవాలయం అని కూడా అంటారు.
రామాయణ కాలంలో..
ఇప్పడు అమృతసర్ ఉంటున్న ప్రాంతంలో ఒకప్పుడు దట్టమైన అడవి ఉండేదట. శ్రీరాముని కుమారులు లువుడు, కుశుడు ఇక్కడే బస చేశారట. వాల్మీకి ఆశ్రమం కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఈ ప్రదేశాన్ని రామతీర్థంగా కూడా పిలుస్తారు.
గురు నానక్ దేవ్ ముచ్చటపడి..
సిక్కుల గురువు గురు నానక్ దేవ్ ఈ ప్రదేశంలోని అందానికి ముచ్చటపడి, ఇక్కడి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నారట. దీని ఆనవాలు ఇప్పుటికీ కనిపిస్తుంది. అమృత్‌సర్‌కు సుమారు 500 ఏళ్ల చరిత్ర ఉంది. సిక్కుల నాల్గవ గురువు గురు రాందాస్ 1564ఏడీలో ఈ నగరానికి పునాది వేశారని చెబుతారు. నాడు అతని పేరు మీదుగా ఈ ప్రాంతాన్ని రాందాస్‌పూర్ అని పిలిచేవారట. ఆ తర్వాత క్రీ.శ.1577లో ఇక్కడ గురుద్వారా నిర్మాణానికి హరిమందర్ సాహిబ్‌కు పునాది వేశారు. ఈ గురుద్వారాలో ఒక సరస్సు కూడా నిర్మితమయ్యింది. ఈ గురుద్వారా నిర్మాణంతో అమృత్‌సర్ నగరం సిక్కు మతస్తులకు కేంద్రంగా మారింది.
బ్రిటిష్ పాలకుల అరాచకం
1849లో అమృత్‌సర్‌ను బ్రిటిష్ పాలకులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అమృత్‌సర్ చరిత్రలో జలియన్‌వాలాబాగ్ మారణకాండను అత్యంత బాధాకరమైన సంఘటనగా చెబుతారు. 1919, ఏప్రిల్ 13న ఈ ప్రాంతంలో సమావేశమైన వందలాది మంది నిరాయుధులపై బ్రిటిష్ ప్రభుత్వం కాల్పులు జరిపింది. ఈ ఘటనలో వెయ్యమంది మృతి చెందారు. ఇక్కడి పార్కు గోడలపై నేటికీ అప్పటి ఆనవాళ్లు కనిపిస్తాయి. అమృత్‌సర్ నగరంలో జరిగిన ఈ ఘటన చరిత్రలోనే అత్యంత బాధాకరమైన ఉదంతంగా చెబుతారు. ఇదిలావుండగా అమృత్‌సర్‌లో హోలా మొహల్లా, లోహ్రీ పండుగలను ఘనంగా జరుపుకుంటారు. అమృత్‌సర్‌లో ని గోల్డెన్ టెంపుల్, దుర్గా టెంపుల్, వాఘా సరిహద్దు, జలియన్‌వాలా బాగ్, గోవింద్‌ఘర్ కోట, విభజన మ్యూజియంలను చూసేందుకు పర్యాటకులు తరలివస్తుంటారు.
ఇది కూడా చదవండి: చైనా చేతికి ‘పవర్‌ఫుల్ బీమ్’.. గురి తప్పేదే లే..
Comments
Please login to add a commentAdd a comment