jaliyanwala bagh
-
నాటి దుశ్చర్యలో వెలుగుచూడని నిజాలెన్నో..
జలియన్‌వాలా బాగ్ సభ మీద 1919 ఏప్రిల్ 13న జనరల్ డయ్యర్ పేల్చిన తూటాలు 1,650. అక్కడకి 31 మైళ్ల దూరంలో ఉన్న లాహోర్‌లో 1940 మార్చి 19న ఊరేగింపుగా వెళుతున్న ఒక సమూహం మీద డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్ పీసీడీ బీటీ ఆదేశాల మేరకు పోలీసులు కాల్చినవి 1,620. ముప్పయి మంది చనిపోయారని ప్రభుత్వం ప్రకటించింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం 200 మంది చనిపోయారు, ఛిద్రమైన శవాలను ట్రక్కుల్లోకి విసిరి తీసుకుపోయారు. నిర్బంధాలను ఎత్తివేయాలని కోరుతూ శాంతియుతంగా ప్రదర్శన జరుపుతున్న ఖక్సర్ తెహ్రీక్ కార్యకర్తలపై 1,620 తూటాలు కాల్చినట్టు అక్కడి పోలీస్ స్టేషన్ గుమాస్తా (మొహరీర్) నమోదు చేశాడు. కాల్పుల వార్తను ప్రపంచ పత్రికలు ప్రచురించాయి. సర్ డగ్లస్ యంగ్ అధ్యక్షునిగా హైకోర్టు న్యాయమూర్తులతో దర్యాప్తు సంఘం నియమించారు కూడా. కానీ నివేదిక వెలుగు చూడలేదు. ఇంతకీ ఏమిటీ ఖక్సర్ తెహ్రీక్? భారత స్వాతంత్య్ర సమరంలో జాతీయ కాంగ్రెస్, ముస్లింలీగ్, గదర్ పార్టీ, హిందూ మహాసభ, స్వరాజ్య పార్టీ హిందుస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ వంటివెన్నో కనిపిస్తాయి. అలాంటిదే ఖక్సర్ తెహ్రీక్. ఖక్సర్ అంటే అర్థం అణకువ కలిగినవాడు. నలభై లక్షల సభ్యత్వంతో (1942 నాటికి), దేశంలోను, విదేశాలలో కూడా శాఖలు నెలకొల్పింది. దీని మీద భయంకరమైన నిర్బంధం ఉండేది. బ్రిటిష్ ప్రభుత్వం అణచివేతే కాదు, మహమ్మద్ అలీ జిన్నా నాయకత్వంలోని అఖిల భారతీయ ముస్లిం లీగ్ కూడా ఖక్సర్‌ను పరమ శత్రువులాగే చూసింది. ఎంత శత్రుత్వం అంటే, 1943 జూలై 20న బొంబాయిలో జిన్నా మీద ఆయన ఇంట్లోనే హత్యాయత్నం జరిగింది. ఆ పని చేసిన రఫీక్ సాబిర్ ఖక్సర్ సభ్యుడని అనుమానించారు. పంజాబ్ ప్రీమియర్, ముస్లింలీగ్ ప్రముఖుడు సర్ సికిందర్ హయత్‌ఖాన్ కూడా ఖక్సర్ మీద కక్ష కట్టాడు. స్వరాజ్య ఉద్యమం దేనికి? బ్రిటిష్ పాలన అంతానికి! ఈ విషయం మీద ఉన్న స్పష్టత స్వతంత్ర భారత ప్రభుత్వం గురించి ఎక్కువమందికి లేదంటే అతిశయోక్తి కాదు. ఆ విషయం ఆలోచించిన సంస్థ ఖక్సర్. హిందూముస్లిం ప్రభుత్వమే స్వతంత్ర భారత్‌ను పాలించాలన్నది సంస్థ ఆశయాలలో ఒకటి. 1936 నవంబర్ 29న సియాల్కోట్లో నిర్వహించిన సమావేశంలో ఒక ప్రణాళికను రూపొందించుకుంది (మష్రికి మనుమడు నాసివ్ు యూసఫ్ సేకరించిన వివరాలు, ఇతర చరిత్రకారులు సేకరించిన విషయాలు ఎన్నో). దైవం ఆధిపత్యాన్ని అంగీకరించడం, జాతీయ సమైక్యత, మానవ సేవ వంటి సిద్ధాంతాలను ఖక్సర్ స్వీకరించింది. సమాజంలోని అంతరాలను సరిచేయడమనే సంస్థ సూత్రాన్ని గౌరవిస్తూ పారను చిహ్నంగా తీసుకుంది. ఎక్కువ ముస్లిం సిద్ధాంతాల ఛాయలు ఉన్నా, ఖక్సర్లో సభ్యుడు కావడానికి మతం, ప్రాంతం, కులం, వర్ణం అడ్డు కాలేదు. కానీ వేయేళ్లు ఈ దేశాన్ని పాలించిన ముస్లింల పూర్వ వైభవం ఖక్సర్ ఆశయాలలో ఒకటన్నది నిజం. ఖక్సర్ దేశ విభజనను వ్యతిరేకించింది. అందుకే అఖండ భారత్ కోసం, విభజనను నిరోధించడానికి చివరి యత్నంగా 1946లో ఒక రాజ్యాంగాన్ని కూడా తెచ్చింది. మొత్తం 17 ఏళ్ల పాటు స్వాతంత్య్ర సమరంలో ఈ సంస్థ పాల్గొన్నది. లాహోర్ కేంద్రంగా ఉద్యమించిన ఖక్సర్ తెహ్రీక్‌ను 1931లో అల్లామా ఇనాయతుల్లా అల్ మష్రికి (25 ఆగస్ట్ 1888– 27 ఆగస్ట్ 1963) స్థాపించాడు. సంస్థ నిబంధనలకు కచ్చితంగా లోబడి ఉండడమే కాదు, సభ్యులు ఉద్యమానికి సమయం ఇవ్వడంతో పాటు, దేశం కోసం ఎవరి వ్యయం వారే భరించాలి. అచ్చంగా బ్రిటిష్ పోలీసుల యూనిఫామ్‌ను పోలి ఉన్న దుస్తులు ధరించేవారు. దాని మీద సోదరత్వం అన్న నినాదం (ఉఖూవ్వాత్) ఉండేది. నాయకుడు సహా అంతా ఇదే ధరించేవారు. మష్రికి అనేకసార్లు కారాగారం అనుభవించాడు. 1942 జనవరి 19న వెల్లూరు జైలు నుంచి విడుదలచేసి... మద్రాస్ ప్రెసిడెన్సీ దాటకూడదని ఆంక్షలు పెట్టారు. సంస్కరణ, వ్యక్తి నిర్మాణం, దేశం కోసం త్యాగం ఖక్సర్ ఆశయాలు. ఇరుగు పొరుగులకు సేవ కార్యక్రమంలో అంతర్భాగం. ఇక్కడ ముస్లింలు, ముస్లిమేతరులు అన్న భేదం లేదు. పరిసరాలను శుభ్రం చేస్తూ, పేదలు, వృద్ధులు, రోగులకు సేవలు అందించాలి. మష్రికి ఇస్లామిక్ పండితుడు, మేధావిగా గుర్తింపు పొందాడు. అమృత్‌సర్‌కు చెందిన ముస్లిం రాజ్‌పుత్ కుటుంబంలో పుట్టిన మష్రికి కేంబ్రిడ్జ్ నుంచి గణితశాస్త్ర పోస్ట్ గ్రాడ్యుయేట్. 1912లో స్వదేశం వచ్చి 25 ఏళ్లకే కళాశాల ప్రిన్సిపాల్ అయ్యాడు. 29 ఏళ్లకి విద్యాశాఖ అండర్ సెక్రటరీ అయ్యాడు. మొగల్ దర్బార్‌లో కీలక పదవులు అనుభవించిన కుటుంబం వారిది. తండ్రి ఖాన్ అటా మహ్మద్ ఖాన్ న్యాయవాది. ‘వకీల్’ అనే పక్షపత్రిక నడిపేవారు. కాంగ్రెస్ స్థాపన సమయంలో దేశంలో ఎంతో ఖ్యాతి వహించిన సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ వంటివారికి అటా ఖాన్ సన్నిహితుడు. వీటన్నింటికీ మించి ఖురాన్‌కు మష్రికి రాసిన వ్యాఖ్యానం (తాజ్కిరా) నోబెల్ సాహిత్య బహుమానం పరిశీలనకు పంపారు. తత్త్వశాస్త్రం మీద కొన్ని రచనలు చేశాడు. మష్రికి 1939లో బ్రిటిష్ ప్రభుత్వానికి తుది హెచ్చరికలు చేయడం ఆరంభించాడు. సంవత్సరంలోనే ఖక్సర్ తన లక్ష్యాన్ని చేరుకుంటుందని ప్రకటించాడు. అలా జరగకపోతే సంస్థను రద్దు చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. మరొక రెండున్నర లక్షలమందిని సభ్యులుగా చేర్చాలని అనుచరులను ఆదేశించాడు. ఖక్సర్ ప్రమాదకరంగా తయారైందని 1939లోనే పంజాబ్ గవర్నర్ హెన్రీ డఫీల్డ్ వైస్రాయ్ లిన్లిత్గోకు ఇచ్చిన నివేదికలో వెల్లడించాడు. ఇలాంటి నివేదికే మధ్య పరగణాల నుంచి కూడా వెళ్లింది. ఒకసారి ఢిల్లీలో మాట్లాడిన తరువాత మష్రికి మీద జిన్నా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. మష్రికి ఒక ఉన్మాది అని వ్యాఖ్యానించాడు. ఇదే బ్రిటిష్ ప్రభుత్వానికి ఉపకరించింది. మరింత కర్కశంగా వ్యవహరించడం మొదలుపెట్టింది. నాటి పంజాబ్ ప్రీమియర్ హయత్‌ఖాన్, ‘రెండు రోజులలోనే ఖక్సర్ పనిపడతానని’ చెప్పాడని మష్రికి అనుచరుడు రజా షేర్ జమీన్ తన పుస్తకంలో నమోదు చేశాడు. రెండో ప్రపంచ యద్ధంలో పరిస్థితులను బట్టి భారత్‌లో తలనొప్పులు లేకుండా చేసుకోవడానికి హయత్ఖాన్కు ఖక్సర్ అణచివేతకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీనితోనే సంస్థ నిషేధానికి ఎత్తులు మొదలయినాయి. దుష్ప్రచారమూ మొదలయింది. జర్మనీ నాజీలతో ఖక్సర్కు సంబంధాలు ఉన్నాయని ‘ది ట్రిబ్యూన్’ పత్రికలో ఒక వ్యాసం వెలువడింది. పంజాబ్ అసెంబ్లీలో కూడా పథకం ప్రకారం సభ్యులు ప్రశ్నలు లేవనెత్తారు. ఖక్సర్ ఉద్యమంలో మతోన్మాదమే ఉందని హయత్‌ఖాన్ సమాధానం ఇచ్చాడు. నిజానికి అందులో ముస్లింలు, హిందువులు, సిక్కులు కూడా ఉన్నారు. అప్పుడే లాహోర్‌లో 1940 మార్చి 19న ఖక్సర్ ప్రదర్శన మీద కాల్పులు జరిగాయి. ఆ రోజే నిషేధించారు.లాహోర్ ప్రదర్శన మీద కాల్పులు, జిన్నా మీద హత్యాయత్నం రెండూ పథకం ప్రకారం జరిగినవేననీ, వాటి వెనుక, బ్రిటిష్ ప్రభుత్వం, జిన్నా ఉన్నారంటూ మష్రికి 1943లో పత్రికా ప్రకటన ఇచ్చాడు. ఒక దశలో జిన్నా రాజకీయంగా బలహీనపడినప్పుడు ఖక్సర్ సభ్యులు లీగ్ జెండా కిందకు రావాలని ఆశించాడని చెబుతారు. 1947 జూలై 4న సంస్థను మష్రికి రద్దు చేశాడు. అయినా అతడి మరణానంతరం పాకిస్తాన్లో దానిని పునరుద్ధరించారు. - డా. గోపరాజు నారాయణరావు చదవండి: 900 యేళ్లనాటి ఈ గ్రామానికి రెండే ద్వారాలు... కారణం అదేనట.. -
జలియన్‌వాలాబాగ్ దురంతం: ఒక జాతి ఆత్మను తాకిన తూటా..
1919 ఏప్రిల్ 13: ఆ రోజు జరిగిన నెత్తుటికాండను అంచనా వేయడంలో నాటి ప్రపంచం, విఖ్యాత మేధావులు అవమానకరంగా విఫలమయ్యారు. కాలమే చెప్పింది, మానవాళి చరిత్రలో అదెంత బీభత్సమో! అదే జలియన్‌వాలాబాగ్ దురంతం. అది భారతీయ ఆత్మ మీద దాడి. ఆ కాల్పులలో 379 మంది చనిపోయారని ప్రభుత్వం చెప్పింది. మృతుల సంఖ్య 1500 వరకు ఉంటుందని నాటి భారతీయుల వాదన. ఈ ఘటన మీద విచారణకు నియమించినదే విలియం హంటర్ కమిషన్. సాక్షులను ఢిల్లీ, అహ్మదాబాద్, బొంబాయి, లాహోర్లకు పిలిచారు. లాహోర్‌లోని అనార్కలీ బజార్లో ఉన్న టౌన్‌హాలు అందుకు వేదిక. 1919 నవంబర్ 19న అక్కడికే వచ్చి వాంగ్మూలం ఇచ్చాడు జనరల్ రెజినాల్డ్ ఎడ్వర్డ్ హ్యారీ డయ్యర్. నిరాయుధుల మీద 90 మంది సైనికుల చేత కాల్పులు జరిపించినవాడు ఇతడే. చాలా ఆలస్యంగా ఘటన వివరాలు బయటకు వచ్చాయి. జాతీయ కాంగ్రెస్ కూడా విచారించింది. తుపాకీ గుళ్లకు బలైన వాళ్లలో ఏడుమాసాల పసిగుడ్డు సహా 42 మంది చిన్నారులూ ఉన్నారని మదన్మోహన్ మాలవీయ చెప్పారు. ప్రభుత్వం లెక్క కూడా దీనికి దగ్గరగానే ఉంది. ఇక వెలుగు చూడని అంశాలూ ఎన్నో! 1919 ఆఖర్లో ఓ రోజు నెహ్రూ అమృత్సర్ నుంచి ఢిల్లీ వరకు ప్రయాణించారు. రాత్రి బండి. ఆయన ఎక్కిన బోగీ దాదాపు నిండిపోయి ఉంది. ఒక్క బెర్త్, అదీ అప్పర్ బెర్త్, ఖాళీగా ఉంది. ఎక్కి నిద్రపోయారు. తెల్లవారుతుంటే తెలిసింది, ఆ బోగీలో ఉన్నవారంతా సైనికాధికారులని. అప్పటికే వాళ్లంతా పెద్ద పెద్ద గొంతులతో మాట్లాడుకుంటున్నారు. ఒకడు మరీ పెద్ద గొంతుతో, కటువుగా మాట్లాడుతున్నాడు. అతడు అంత బిగ్గరగా చెబుతున్నవి, అప్పటికి దేశాన్ని కుదిపేస్తున్న అమృత్సర్, జలియన్‌వాలాబాగ్ అనుభవాలే. అసలు ఆ పట్టణమంతా తనకి ఎలా దాసోహమైందో చెబుతున్నాడు. తిరుగుబాట్లూ, ఉద్యమాలూ అంటూ అట్టుడికినట్టుండే పంజాబ్ తన ప్రతాపంతో ఎలా మోకరిల్లిందో వర్ణిస్తున్నాడు. ముదురు ఊదారంగు చారల దుస్తులలో ఉన్నాడతడు. మొదటి ప్రపంచ యుద్ధంలో పదిలక్షల మంది భారతీయులు పోరాడారు. 60వేల మంది చనిపోయారు. యుద్ధం తరువాతైనా ఏదో ఒరుగుతుందని ఎదురుచూశారు. ఏం లేకపోగా, అణచివేత ఎక్కువయింది. అందుకే ఒక తిరుగుబాటు మనస్తత్వం వచ్చింది. రాజ్యాంగ సంస్కరణలు జరుగుతాయన్న ఆశ మధ్య తరగతిలో ఉంది. అంటే స్వయంపాలనకు అవకాశం. దీని గురించి ప్రజలు మాట్లాడుకోవడం ఆరంభించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఇది బాగా ఉండేది. ఇక పంజాబ్‌లో అయితే మొదటి ప్రపంచ యుద్ధం కోసం రకరకాల పేర్లతో తమ యువకులను సైన్యంలో చేర్చుకున్న సంగతి గుర్తు చేసుకుంటున్నారు. అదే కాకుండా కామగాటమారు నౌక ఉదంతం, అనంతర పరిణామాలు వారిని బాధిస్తున్నాయి. ప్రపంచ యుద్ధం నుంచి తిరిగి వచ్చిన సైనికులు గతంలో మాదిరిగా లేరు. దేశదేశాల సైనికులతో కలసి పనిచేసి ప్రపంచ జ్ఞానంతో వచ్చారు. దశాబ్దాలుగా భారతీయ సైనికులకు జరుగుతున్న అన్యాయం పట్ల గుండె మండిపోతోంది. అలాంటి సందర్భంలో రౌలట్ చట్టం వచ్చింది. ఎలాంటి విచారణ, ఆరోపణ లేకుండానే ఎవరినైనా అరెస్టు చేసే అధికారం ఈ చట్టంతో అధికారులకు వచ్చింది. దేశమంతా ఆగ్రహోదగ్రమైంది. మితవాద కాంగ్రెస్ నాయకులకు కూడా ఆవేశం వచ్చింది. రౌలట్ చట్టాన్ని తీసుకురావద్దని గాంధీజీ కోరారు. ఆ చట్టానికి వ్యతిరేకత తెలియచేయడానికి సత్యాగ్రహ సభ పేరుతో ఉద్యమం ప్రారంభించారు. పంజాబ్ మరీ ఉద్రేకపడింది. ఫలితం జలియన్‌వాలాబాగ్. పంజాబ్‌కూ మిగిలిన దేశానికీ మధ్య బంధం తెగిపోయింది. సైనిక శాసనం నడుమ చిన్న వార్త కూడా రావడం లేదు. ఆ దురంతం జరిగిందని తెలుసు. అది ఎంత ఘోరంగా ఉందోనని దేశంలో గుబులు. సైనిక శాసనం ఎత్తేశారు. దీనితో కాంగ్రెస్ నాయకులు వెల్లువెత్తారు. పండిట్ మదన్మోహన్ మాలవీయ, స్వామి శ్రద్ధానంద నాయకత్వంలో పునరావాస కార్యక్రమం ప్రారంభించారు. వాస్తవాల సేకరణ పనిలో మోతీలాల్, చిత్తరంజన్‌దాస్ ఉన్నారు. దాస్‌కు సహాయకుడు నెహ్రూ (నెహ్రూ స్వీయచరిత్ర, 1936 నుంచి). పది నుంచి పదకొండు నిమిషాలు సాగిన కాల్పులే. కానీ ఆ తుపాకుల నెత్తుటి చరిత్ర అంతటా ప్రతిధ్వనిస్తూనే ఉంది. దీనితో పాటు ఆనాటి ఆర్తనాదాలు కూడా. కాల్పులు జరపకుండా జనం అక్కడ నుంచి వెళ్లిపోవడానికి అవకాశం ఉన్నా అలా చేయని సంగతిని హంటర్ కమిషన్ ముందు జనరల్ డయ్యర్ ఒప్పుకున్నాడు. ఎందుకు? అలా చేస్తే వాళ్లు తనను చూసి నవ్వుతారన్న అనుమానం. ఇంకా ఎక్కువ మందిని చంపాలంటే మిషన్ గన్లే ఉపయోగించేవాడినని అన్నాడు. గాయపడిన వాళ్ల సంగతి పట్టించుకోవడం తన పని కాదనీ అన్నాడు. ఆ ఘట్టం గురించి చెబుతున్నప్పుడు ‘బీభత్సమైనది’ అనేవాడు. ‘ది బుచర్ ఆఫ్ అమృత్సర్: జనరల్ రెజినాల్డ్ డయ్యర్’ పేరుతో నీజెల్ కోలెట్ రాసిన జీవితకథలో విస్తుపోయే విషయాలు ఉన్నాయి. తాను ఎంత చట్టవిరుద్ధంగా ప్రవర్తించాడో డయ్యర్కూ తెలుసు. అందుకే ఘటన జరిగిన రెండుమూడు రోజులు కథనాలు మార్చి వినిపించాడు. కానీ పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఓడ్వయ్యర్ నుంచి మద్దతు లభించింది. తరువాత చాలామంది బ్రిటిష్ ప్రముఖులు గొప్ప పని చేశాడని పొగడ్తలతో ముంచెత్తారు. స్వర్ణదేవాలయం పెద్దలు జనరల్ డయ్యర్‌ను ‘గౌరవ సిక్కు’ను చేశారు (రిచర్డ్ కావెండిష్, హిస్టరీ టుడే వాల్యూమ్ 59, ఇష్యూ 4, ఏప్రిల్ 2009). 1920 జూలై 8న బ్రిటిష్ పార్లమెంట్ ప్రభువుల సభలో చర్చ జరిగింది. ఎక్కువమంది డయ్యర్‌ను సమర్థించారు. యుద్ధ వ్యవహారాల కార్యదర్శి విన్స్టన్ చర్చిల్ మాత్రం అది బ్రిటిష్ విధానం కాదని అన్నాడు. హంటర్ కమిషన్ తీవ్ర విమర్శలతో డయ్యర్‌ని ఆ ఏడాదే ఉద్యోగం నుంచి తొలగించి ఇంగ్లండ్ పంపేశారు. అయినా ‘బాగ్ హీరో’గా ‘మార్నింగ్ పోస్ట్’ అనే బ్రిటిష్ పత్రిక తన నిధితో డయ్యర్‌ను సత్కరించదలిచింది. ఇంగ్లండ్ పత్రికలు సరే, బ్రిటిష్ ఇండియా నుంచి ‘కలకత్తా స్టేట్స్‌మన్’, ‘మద్రాస్ మెయిల్’ వంటి పత్రికలూ నిధి సేకరించాయి. మొత్తం 28,000 పౌండ్లు. కానీ అది తీసుకోవడానికి డయ్యర్ నిరాకరించాడు. అప్పటికే అతనిలో అభద్రతాభావం పేరుకుపోయింది. పైగా ఆర్టియోసెరిలోసిస్ వ్యాధి. చిన్నపాటి ఉద్వేగానికి గురైనా చావు తప్పదు. అంతేకాదు, బాగ్ ఘటన పేరుతో తాను మళ్లీ ప్రపంచానికి గుర్తుకు రావడం ఇష్టం లేదన్నాడు. బ్రిస్టల్ పట్టణం శివార్లలో ఎవరికీ పట్టనట్టు ఉండే సోమర్సెట్ కుగ్రామంలోని చిన్న కొండ మీద కట్టిన కాటేజ్‌లో భార్య అనీతో కలసి రహస్యంగా జీవించాడు. అక్కడే 1927 జూలై 23న చనిపోయాడు. మొదట గుండెపోటు వచ్చింది. అప్పుడు కూడా అతడు బాగ్ గురించే ప్రస్తావించాడంటారు జీవితకథ రాసిన కోలెట్. డయ్యర్‌కు రెండుసార్లు అంత్యక్రియలు జరిగాయట. మొదట అతని స్వగ్రామంలో, మళ్లీ సైనిక లాంఛనాలతో. అలా ముగిసింది అతని జీవితం. ఆరోజు రైలు ప్రయాణంలో నెహ్రూ చూసిన ఆ ఊదారంగు చారల దుస్తులలో ఉన్న వ్యక్తి ఢిల్లీలో దిగిపోయాడు. లాహోర్‌లో ఏర్పాటు చేసిన విచారణ సంఘం ముందు హాజరై వస్తున్నాడు. అతడే జనరల్ డయ్యర్. - డా. గోపరాజు నారాయణరావు -
దారుణ ఘటన.. ఒకే మర్రికి వెయ్యిమంది ఉరితీత...!
నిర్మల్: నిర్మల్ ప్రాంతం సాహసోపేతమైన వీరుల పోరాటానికి, వారి అసమాన త్యాగాలకు ఓ నిదర్శనం. జలియన్‌వాలాబాగ్ ఘటన కంటే ఏళ్ల ముందే.. అంతకంటే దారుణమైన ఘటన ఇక్కడ చోటు చేసుకుంది. ఒకే మర్రి చెట్టుకు వెయ్యి మందిని ఉరి తీశారు. అంతకు ముందు ఓ అడవిబిడ్డ అందరినీ కూడగట్టి చేసిన వీరోచిత పోరు గుర్తు చేసుకుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. 17న కేంద్ర హోం మంత్రి అమిత్‌షా నిర్మల్‌కు రానున్న నేపథ్యంలో మరో సారి వెలుగులోకి వస్తున్న ఇక్కడి చరిత్ర నిన్న మొన్నటిది కాదు.. ఎప్పుడో 1857 నాటిది. ఆంగ్లేయులకు చుక్కలు చూపించారు దేశంలో అప్పుడు జరిగిన ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో నిర్మల్ గడ్డ కూడా భాగమైంది. ఆ సంగ్రామాన్ని అణచి వేసేందుకు ఆంగ్లేయులు భారీగా దళాలను దించారు. దీంతో పేరున్న నాయకులంతా చెల్లాచెదు రయ్యారు. ఉత్తర భారతంలో పోరును నడిపిన తాంతియాతోపే అనుచరులైన రొహిల్లాలు (రొహిల్ ఖండ్‌కు చెందినవారు) అదే సమయంలో నిర్మల్ ప్రాంతం వైపు వచ్చారు. అప్పటికే జనగాం (ఆసిఫాబాద్) ప్రాంతంలో పోరు సాగిస్తున్న స్థానిక గోండు యోధుడు రాంజీ నిర్మల్ తాలూకా మీదుగా అడవుల్లోకి చొచ్చుకు వస్తున్న ఆంగ్లేయులు, నిజాంలను అడ్డుకునేందుకు నిర్మల్ ప్రాంతానికి చేరుకున్నాడు. ఆయన గోండు వీరులకు రొహిల్లాల దండు తోడైంది. కొంతమంది దక్కనీలు, మరాఠావాసులు వీరితో చేతులు కలిపారు. రొహిల్లాల సర్దార్ హజీతో కలిసి రాంజీ ఉమ్మడి శత్రువులను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాడు. ముప్పుతిప్పలు పెట్టి.. సరైన ఆయుధ సంపత్తి లేకున్నా నిర్మల్ ప్రాంత భౌగోళిక స్వరూపాన్ని రాంజీ గోండు తనకు అనుకూలంగా మలచుకున్నాడు. ఇక్కడి గుట్టలు, గొలుసుకట్టు చెరువులు, పచ్చని అడవులను ఆధారంగా చేసుకుని పోరు సాగించాడు. స్థానిక ఆంగ్లేయ కలెక్టర్ నేతృత్వంలోని సైనికులను మట్టి కరిపించాడు. రాంజీ, రొహిల్లాలు, మరికొందరు కలిసి పోరు ప్రారం భించారన్న సంగతి కలెక్టర్ ద్వారా హైదరాబాద్ రాజ్యంలో వారి రెసిడెంట్ అయిన డేవిడ్సన్కు, నాటి పాలకుడు ఆఫ్జల్ ఉద్దౌలాకు తెలుస్తుంది. అప్పటికే వీరిద్దరితోపాటు అప్పటి దివాన్ సాలర్జంగ్ దక్షిణ భారతదేశంలో ప్రథమ స్వాతంత్ర పోరును అణచివేసే పనిలో ఉన్నారు. ఇలాంటి సమయంలో నిర్మల్ కేంద్రంగా పోరు ప్రారంభం కావడాన్ని తీవ్రంగా పరిగణించిన వారు బళ్లారిలోని 47వ నేషనల్ ఇన్ఫాంట్రీని నిర్మల్‌కు పంపి స్తారు. కల్నల్ రాబర్ట్ నేతృత్వంలోని ఈ దళం నిర్మల్ చేరుకుంటుంది. ఇక్కడి ప్రాంతంపై అంతగా పట్టులేకపోవడంతో రాంజీ సేన సాగించిన గెరిల్లా పోరులో రాబర్ట్ సైన్యం రెండుసార్లు దెబ్బతిం టుంది. ఈ కసితో రాంజీని దొంగదెబ్బ తీసేందుకు ప్రయత్నించి సఫలమవుతారు. ఆయనతో పాటు వెయ్యిమందిని బందీలుగా పట్టుకుంటారు. చిత్రహింసలు పెట్టి.. బహిరంగంగా రాంజీ సహా వెయ్యిమందిని చిత్రహింసలు పెడతారు. అందరినీ నిర్మల్ శివారులోని ఎల్లపెల్లి దారిలో గల మర్రిచెట్టు వద్దకు ఈడ్చుకెళ్తారు. నేలలో ఊడలు దిగిన ఆ మహా మర్రిచెట్టుకు అందరూ చూస్తుండగా రాంజీ సహా వెయ్యిమందిని ఉరితీస్తారు. 1860 ఏప్రిల్ 9న ఈ దారుణం జరిగినట్లు చెబుతారు. ఆ వీరులంతా ఉరికొయ్యలకు వెరువకుండా చిరునవ్వులతోనే తమ ప్రాణాలను దేశం కోసం త్యాగం చేశారు. ఇంతటి పోరాటాన్ని సాగించిన రాంజీ గోండు, వెయ్యిమంది వీరుల చరిత్ర ఇప్పటికీ బయటకు రాకపోవడం శోచనీయం. వెలుగుచూడని పోరాటం జనరల్ డయ్యర్ సైన్యం వెయ్యిమందికి పైగా కాల్చి చంపిన జలియన్‌వాలా బాగ్ ఘటన కంటే యాభయ్యేళ్ల ముందే ఇది జరిగింది. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. వెయ్యిమంది.. ఒకేసారి తమ ప్రాణాలను త్రుణప్రాయంగా త్యాగం చేశారు. తమను కన్న భూతల్లి కోసం ఆ గిరిబిడ్డలు వీరోచితంగా పోరాడారు. ఇక చరిత్రకెక్కని ధీరుడు.. రాంజీ గోండు. సామాన్య సైన్యంతో నెలల తరబడి బలమైన శత్రువులపై పోరు సాగించాడు. తర్వాతి కాలంలో జల్, జంగల్, జమీన్ అంటూ పోరాడిన కుమ్రంభీమ్‌కు ఈయనే స్ఫూర్తిగా నిలిచాడు. ఇంతటి పోరాటాన్ని సాగించిన రాంజీ, మిగతా వీరుల చరిత్ర కనీసం బయటకు రాలేదు. పాఠ్యపుస్తకాలకూ ఎక్కలేదు. వీరుల బలిదానంతో వెయ్యి ఉరుల మర్రిగా మారిన ఆ చెట్టు 1995లో గాలివానకు నేలకొరిగింది. తెలంగాణ ఉద్యమ సమయంలో పలు సంఘాల ఆధ్వర్యంలో 2007 నవంబర్ 14న వెయ్యి ఉరుల మర్రి సమీపంలో ఓ స్థూపాన్ని, 2008 నవంబర్ 14న నిర్మల్‌లోని చైన్‌గేట్ వద్ద రాంజీ గోండు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఎవరూ పట్టించుకోలేదు. అమిత్ షా రానుండటంతో.. నాలుగేళ్ల క్రితం మోదీ ప్రభుత్వం రాష్ట్రంలో రాంజీ గోండు పేరిట గిరిజన మ్యూజియాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పింది. మొదట నిర్మల్‌లో అని, ఆ తర్వాత హైదరాబాద్‌లో చేస్తామని చెప్పినా.. చివరకు ఎక్కడా పెట్టలేదు. ఇక నిర్మల్ నడిబొడ్డున ఉన్న రాంజీ విగ్రహం గోస మాటల్లో చెప్పలేం. చుట్టూ చెత్త, మందుసీసాలతో ఆయన ప్రాణత్యాగానికి ఏమాత్రం విలువలేని పరిస్థితి ఆవేదనకు గురిచేస్తుంది. తెలంగాణ విమోచన దినానికి ఏ మాత్రం సంబంధం లేకున్నా.. తర్వాతి కాలం పోరుకు స్ఫూర్తిగా నిలిచిన ఘటనగా దీనిని గుర్తిస్తున్నామని, ఇప్పటికైనా ఈ చరిత్రను వెలుగులోకి తెస్తామని బీజేపీ చెబుతోంది. తాజాగా అమర వీరుల స్థూపం వద్ద నివాళులర్పించేందుకు అమిత్ షా నిర్మల్ రానుండటంతో దీనికి ప్రాధాన్యత చేకూరింది. -
ఇది ‘తెలంగాణ జలియన్‌వాలాబాగ్’
సాక్షి, హైదరాబాద్: మూడు కిలోమీటర్ల భారీ మానవహారం. సమీప ఊళ్ల నుంచి పోగైన నాలుగు వేలమంది ముందుకు కదులుతున్నారు. చేతుల్లో జాతీయ పతాకాలు రెపరెపలాడుతుండగా, వందేమాతరం, నిజాం వ్యతిరేక నినాదాలు మిన్నంటుతున్నాయి. వారు జాతీయ పతాకాన్ని ఎగరేయాల్సిన మైదానం సమీపంలోకి రాగానే నిజాం పోలీసులు, రజాకార్లు విరుచుకుపడ్డారు. ఓవైపు కాల్పులు, మరోవైపు పారిపోతున్నవారిపై కత్తులతో దాడి.. చూస్తుండగానే రణరంగమైందా ప్రాంతం. 15 మంది అక్కడికక్కడే చనిపోగా, పారిపోతూ ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మరో ఎనిమిది మంది అసువులుబాశారు. ఇది పాశవిక నిజాం సైన్యం సృష్టించిన నరమేధం. తెలంగాణ సాయుధపోరాట చరిత్రలో నిలిచిపోయిన రక్తపుమరక. బ్రిటిష్ సైన్యం దేశభక్తులపై విచక్షిణారహితంగా కాల్పులు జరిపి వందలమందిని పొట్టనపెట్టుకున్న జలియన్ వాలాబాగ్ నరమేధాన్ని పోలిన ‘తెలంగాణ జలియన్ వాలాబాగ్’ ఘటన. సొంత హవా కోసం తహతహలాడి బ్రిటిష్ పాలకులకు తొత్తుగా మారి జనానికి ప్రత్యక్ష నరకం చూపిన నిజాం పాలనకు ఇదో ఎర్రటి గుర్తు. అలనాటి భయంకరమైన రోజును ఇప్పటికీ మరిచిపోని ఆ ప్రాంతం పరకాల. ఘటన జరిగింది 1947 సెప్టెంబరు 2. సరిగ్గా నేటికి 74 ఏళ్లు పూర్తిచేసుకుని 75వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో కచ్చితంగా గుర్తుచేసుకోవాల్సిన ఘటన ఇది. స్మారకం ఏదీ? స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని పొందే ఈ పరకాల ఘటనకు సంబంధించి కొన్నేళ్ల క్రితం వరకు పరకాలలో కనీసం స్మారకం కూడా లేదు. అప్పట్లో చిన్నస్తూపం, చనిపోయినవారి పేర్లతో ఫలకం మాత్రం ఏర్పాటుచేశారు. కేంద్ర సహాయమంత్రిగా ఉన్న సమయంలో బీజేపీ నేత విద్యాసాగరరావు తన తల్లి పేరిట ఉన్న ట్రస్టు ఆధ్వర్యంలో ఇక్కడ ఓ స్మారకాన్ని నిర్మించారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడుతూ జాతీయ పతాకాన్ని ఎగురవేసేందుకు ఆరోజు చేయిచేయి పట్టుకుని మానవహారంగా వచ్చిన అమరవీరులకు గుర్తుగా అక్కడ ర్యాలీగా వెళ్తున్నట్లుగా మనుషుల బొమ్మలు ఏర్పాటు చేయించారు. జలియన్ వాలాబాగ్‌తో పోల్చదగింది పంజాబ్‌లోని జలియన్ వాలాబాగ్‌లో దేశభక్తులపై కాల్పులు జరిపించి వందలమంది మృతికి కారణమైన జనరల్ డయ్యర్ రాక్షసత్వానికి, పరకాలలో ‘జాయిన్ ఇండియా’ ఉద్యమంలో రాక్షసంగా వ్యవహరించి పదుల సంఖ్యలో పోరాట యోధుల మృతికి కారణమైన నిజాం పోలీసు సీఐ జియాఉల్లా ఉన్మాదానికి పోలిక ఉంది. చరిత్రలో పరకాల మరో జలియన్ వాలాబాగ్‌గా నిలిచిపోయింది. కానీ చాలామందికి నాటి గాథ తెలియకపోవటం విచారకరం. ఇక్కడి స్మారకాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంది. – రాచర్ల గణపతి, చరిత్ర విశ్లేషకుడు -
Jallianwala Bagh: విషాద స్మారకస్థలిని వినోదపర్యాటకంలా మారుస్తారా?
చారిత్రక స్ఫూర్తిని పదికాలాలు కాపాడే పరిరక్షణ, పునరుద్ధరణ వేరు. స్ఫూర్తిని మింగేసి, చరిత్రనే కనుమరుగు చేసేటంత సమూల మార్పుల సుందరీకరణ వేరు. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో బహుశా అతి ప్రాచీన స్మారకస్థలి జలియన్‌వాలా బాగ్‌లో చేయిపెట్టినప్పుడు ప్రభుత్వం ఈ చిన్న తర్కం మర్చిపోయినట్టుంది. కేంద్రం అక్కడ చేసిన తాజా మార్పులు, కొత్త నిర్మాణాల చేర్పులు ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. శతాబ్దానికి పైగా చరిత్ర ఉన్న ఓ విషాద స్మారకస్థలిని ఫక్తు వినోదపర్యాటకంలా మారుస్తున్నారని ప్రతిపక్షాలు, పౌరసమాజం అందరూ ధ్వజమెత్తుతున్నారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జలియన్‌వాలా బాగ్ స్మారకస్థలం ప్రపంచదేశాల స్వాతంత్య్ర చరిత్రలో ప్రత్యేకమైనది. తొలి ప్రపంచ యుద్ధకాలంలోని అణచివేత చర్యలను కొనసాగిస్తున్న రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా 10 – 12 వేలమంది భారత స్వాతంత్య్ర ప్రియులు 1919 ఏప్రిల్ 13న జలియన్‌వాలా బాగ్‌లో సమావేశమయ్యారు. నిరాయుధులైన ఆ శాంతియుత ఉద్యమకారులు బయటకు వెళ్ళడానికి ఉన్న దారిని మూసేసి మరీ, బ్రిగేడియర్ జనరల్ డయ్యర్ సారథ్యంలోని బ్రిటీష్ సైన్యం పది నిమిషాలు విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. కాల్పులను తప్పించుకొనే మార్గం లేక పక్కనే ఉన్న బావిలోకి జనం దూకిన విషాద సందర్భం అది. వైశాఖి పర్వదిన వేళ జరిగిన ఆ అమానుష కాల్పుల్లో అధికారిక లెక్కల ప్రకారమే 379 మంది చనిపోయారు. అంతకు మూడురెట్లు గాయపడ్డారు. అసలైతే అమరులు, క్షతగాత్రుల సంఖ్య వేలల్లోనే! అప్పట్లో గాంధీ తదితర జాతీయనేతలు జనం నుంచి విరాళాలు పోగుచేసి, దాన్ని స్మారకోద్యానంగా మార్చారు. ఆ ప్రాంగణం మధ్యలో ఇప్పుడున్న అతి పెద్ద స్తూపాన్ని 1961లో కట్టి, అధికారిక స్మారకస్థలి నిర్మించారు. ఆనాటి అమానుషానికి నేటి బ్రిటీషు వారసులు దాదాపు క్షమాపణ కోరినంత పని చేయడం మరో చరిత్ర. జాతి రక్తం ఉప్పొంగే ఆ చారిత్రక విషాదస్థలిని ఇప్పుడేమో వినోద పర్యాటక స్థలంలా మార్చేశారన్నది విమర్శ. ఏడాదిన్నరగా నవీకరించిన ఆ స్మారకాన్ని ఆగస్టు 28న ప్రధాని మోదీ జాతికి అంకితం జేశారు. ‘చరిత్రను కాపాడుకోవడం బాధ్యత’ అనీ ఆయన సెలవిచ్చారు. మరి చరిత్రను కాపాడాల్సిన సర్కారు తీరా చేసిందేమిటి? నాటి విషాదాన్ని కళ్ళకు కట్టే ఇరుకుదారిని మార్చేసి, అందమైన కుడ్యశిల్పాలు, త్రీడీ ప్రొజెక్షన్లు, లేజర్ అండ్ సౌండ్ షోలు పెట్టింది. 102 ఏళ్ళ క్రితం జలియన్‌వాలా బాగ్ దమనకాండలో అమరులైనవారికి ప్రధాని ఒక పక్కన శ్రద్ధాంజలి ఘటిస్తుండగానే, పొరుగున ఆయన పార్టీ ప్రభుత్వమే నడుస్తున్న హర్యానాలో పోలీసు లాఠీలు రైతు ఉద్యమకారులను రక్తమోడేలా బాదడం విరోధాభాస. ప్రశాంతంగా సమావేశమైన స్వాతంత్య్ర సమరవీరుల్ని ‘కాల్చిపారేయ’మన్న ఆనాటి జనరల్ డయ్యర్కూ, రైతుల ‘బుర్రలు బద్దలు కొట్టండి’ అన్న నేటి ప్రభుత్వ ప్రతినిధులకూ తేడా ఏముంది? ఏడాది క్రితం పంజాబ్‌లో మొదలైన రైతు ఆందోళనలు 9 నెలలుగా ఢిల్లీ శివార్లలో సాగుతున్నాయి. రౌలత్ చట్టాన్ని వ్యతిరేకించిన అప్పటి అమరులదీ, కొత్త సాగుచట్టాలను వ్యతిరేకిస్తున్న ఇప్పటి రైతులదీ – ఇరు వర్గాలదీ శాంతియుత ఉద్యమమే. కానీ, ప్రభువుల ప్రవర్తన మాత్రం నూరేళ్ళు దాటినా మారలేదన్న మాట. జలియన్‌వాలా బాగ్ స్మారకానికి కేంద్రం చేసిన మార్పులను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, సీపీఎం నేత సీతారామ్ ఏచూరి సహా పలువురు విమర్శించారు. ఈ మార్పులు ‘అమరవీరులను అవమానించడమే. బలిదానానికి అర్థం తెలియని వ్యక్తే ఇలా చేయగలర’ని రాహుల్ విరుచుకుపడ్డారు. జరిగిన కథకు ప్రతీక అయిన జలియన్‌వాలా బాగ్ ఇరుకైన దారిని సమూలంగా మార్చేయడం ‘చరిత్రను ధ్వంసం చేయడమే’ అని జనంలో చర్చ రేగింది. డిస్కో లైట్లు – బొమ్మలు పెట్టి, సందర్శకుల నుంచి రుసుము వసూళ్ళతో వినోదాత్మక పర్యాటక ప్రదేశంలా మార్చడం జలియన్‌వాలా బాగ్ విషాదబీభత్సానికి ఒక రకంగా అగౌరవమే. అయితే, అధిష్ఠానం ఆశీస్సులున్న సిద్ధూతో అస్తుబిస్తు అవుతున్న పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ మాత్రం తమ అధినేత రాహుల్ అభిప్రాయానికి విరుద్ధంగా వ్యాఖ్యానించడం గమనార్హం. ‘అక్కడేం తొలగించారో నాకు తెలీదు కానీ, ఆ స్మారకం నాకైతే బాగుంది’ అన్నారాయన. రాష్ట్రంలోని కీలక స్మారకాన్ని కేంద్రం మార్చేస్తుంటే, అమరిందర్ ఎందుకు అడ్డుకోలేదన్నది ఇప్పుడు మరో విమర్శ. కారణాలేమైనా, చారిత్రక ప్రదేశాల్ని పరిరక్షించే బదులు అందంగా చరిత్రని పునర్నిర్మించాలనుకుంటేనే సమస్య. అందంగా లేదని అమ్మనైనా, చరిత్రనైనా మార్చలేం. కానీ, పాలకులు మారినప్పుడల్లా చరిత్రను తమ కళ్ళతోనే అందరూ చూడాలనుకోవడం, ఎవరి రంగులు వాళ్ళు పులమాలనుకోవడం కొన్నేళ్ళుగా జరుగుతున్న తంతు. భారత స్వాతంత్య్ర అమృతోత్సవ వేళ ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రిసెర్చ్’ విడుదల చేసిన పోస్టర్లో నవభారత నిర్మాత నెహ్రూ లాంటి వాళ్ళ బొమ్మ లేదని ఇటీవలే వివాదం రేగింది. ఇప్పుడీ స్మారకస్థలి వ్యవహారం వచ్చింది. అన్నిటా పైపై పటాటోపానికి ప్రాధాన్యమిస్తే ఇలానే ఉంటుంది. భావితరాలకు అందించాల్సింది ఆలోచింపజేసే స్ఫూర్తినే తప్ప, అందమైన ఊహల అనుభూతిని కాదు. అలా ప్రతిదీ మార్కెట్ చేసుకొనే యావలో పడ్డ పాలకుల వల్ల చరిత్రకు ప్రమాదమే. చరిత్రకారుడు కిమ్వాగ్నర్ అన్నట్టు ‘జలియన్‌వాలాబాగ్ చరిత్ర ఇప్పుడు చరిత్రలో కలిసిపోయింది’. అవును... ఆత్మ పోయింది. ఆడంబరమే మిగిలింది. స్వాతంత్య్ర సమరంలో అసువులు బాసిన అమరవీరుల స్మారక సాక్షిగా ఇది మరో తీరని విషాదం. -
షాహీన్ బాగ్, జలియన్‌వాలా బాగ్గా మారుతుందా?
సాక్షి, న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) కు వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహీన్‌బాగ్ వద్ద సుదీర్ఘ ఆందోళన కొనసాగుతుండగా, ఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ ఉద్యమాన్ని ప్రభుత్వం పాశవికంగా అణిచివేయనుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఫిబ్రవరి 8 తరువాత (ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు), షాహీన్ బాగ్ ఉద్యమాన్ని ఎట్టి పరిస్థితుల్లో కొనసాగన్వివదనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జలియన్‌బాగ్ మారణకాండను గుర్తు చేసుకున్న ఒవైసీ, షాహీన్ బాగ్‌ను కూడా జలియలావాలా బాగ్గా మార్చేఅవకాశం లేకపోలేదన్నారు. ఆందోళనపై కాల్పులు జరపమన్న బీజేపీ మంత్రి సంకేతాల నేపథ్యంలో, అక్కడ ఆందోళన చేస్తున్న ఆందోళనకారులను కాల్చి చంపవచ్చు అనే సందేహాన్ని ఒవైసీ వెలిబుచ్చి వుందంటూ వివాదాన్నిమరింత రాజేశారు. అంతేకాదు ఉద్రిక్తత రేపుతున్న బీజేపీ మంత్రి వ్యాఖ్యలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్పీఆర్, ఎన్ఆర్సీపై స్పందిస్తూ 2024 వరకు ఎన్ఆర్సీ అమలు ఉండదనే విషయంపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలన్నారు. ఎన్పీఆర్ కోసం 3900 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు చేస్తున్నారు? తాను చరిత్ర విద్యార్థిని కాబట్టి ఈ విధంగా భావిస్తున్నానని ఒవైసీ తెలిపారు. జర్మనీ నియంత హిట్లర్ రెండుసార్లు జనాభా గణనను నిర్వహించిన అనంతరం లక్షలాదిమంది యూదులను గ్యాస్ చాంబర్లో వేసి హతమార్చాడు.. మనదేశంలో అలా జరగకూడదని తాను కోరుకుంటున్నానంటూ ఒవైసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 రోజులుగా సీఏఏకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతున్న ఢిల్లీలోని షాహీన్ బాగ్ వద్ద బుధవారం మరోసారి కలకలం రేగింది. తుపాకీతో అనుమానస్పద వ్యక్తులు హల్చల్ చేసిన ఘటనను మర్చిపోక ముందే తాజాగా బురఖా ధరించిన మహిళ అనుమానాస్పదంగా సంచరించడం ఆందోళన రేపింది. ఆమెను గమనించిన ఆందోళనకారులు, పోలీసులకు అప్పగించారు. పొలిటికల్ ఎనలిస్టు, యూట్యూబర్‌గా చెప్పుకున్న ఆమెను గుంజాకపూర్గా గుర్తించారు పోలీసులు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కాగా దేశీయంగా, ప్రపంచవ్యాప్తంగా నిరసనల మధ్య గత డిసెంబర్లో భారతదేశంలో కొత్త పౌరసత్వ చట్టం అమల్లోకి వచ్చింది. దీంతో సీఏఏ అమలును వ్యతిరేకిస్తూ తీవ్ర ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. చదవండి : ఆజాదీ కావాలా అంటూ తెగబడిన ఉన్మాది, సీఏఏ, ఎన్పీఆర్పై రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు @gunjakapoor naam hai hamara Naam to suna hoga🤦 Free ki biryani khane burka pahen k shaheen baugh me pakdi gayi🤦🤦🤦@arshaan_zaman @ihansraj @IndiasMuslims @iamseeratraza @NehasinghJnu @tamashbeen_ @IamOnir pic.twitter.com/IPfZ18Ro8u — silent_word_💯FB (@silenteyes601) February 5, 2020 -
‘మరి గాంధీ కుటుంబం క్షమాపణలు చెప్పదా’
చంఢీగడ్ : జలియన్ వాలాబాగ్ మారణహోమానికి నేటికి సరిగ్గా వందేళ్లు. బ్రిటీష్ - ఇండియా చరిత్రలో ఈ మారణహోమం ఓ మచ్చగా మిగిలిపోతుందని రెండు రోజుల క్రితం బ్రిటన్ ప్రధాన మంత్రి థెరిసా మే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. థెరిసా వ్యాఖ్యలు ప్రస్తుతం భారత రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ జలియన్ వాలాబాగ్ దురాగతానికి పాల్పడినందుకుగాను బ్రిటన్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పంబాజ్ సీఎం వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్.. ‘అమరీందర్ సింగ్ జలియన్ వాలాబాగ్ దురాగతానికి గాను బ్రిటన్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని కోరడం బాగానే ఉంది. మరి మీ పార్టీ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఆదేశాల మేరకు జరిగిన ఆపరేషన్ బ్లూస్టార్ సంగతేంటి. దానికి గాంధీ కుటుంబం క్షమాపణలు చెప్పాల్సిన పని లేదా’ అని ప్రశ్నించారు. అంతేకాక మీరు స్వయంగా దగ్గరుండి రాహుల్ గాంధీని సిక్కుల పవిత్రంగా భావించే శ్రీ అకాళి తక్త్ సాహిబ్‌లోకి తీసుకెళ్లారు.. మరి దీనికేం సమధానం చెప్తారంటూ హర్సిమ్రత్ కౌర్ వరుస ట్వీట్లు చేశారు. 1984లోఅమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో దాక్కున్న సిక్కు ఉగ్రవాదులను ఏరిపారేసేందుకు అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఆపరేషన్ బ్లూస్టార్ అమలు చేసిన సంగతి తెలిసిందే. దీన్ని ఉద్దేశిస్తూ.. హర్సిమ్రత్ కౌర్ ట్వీట్ చేశారు. అంతేకాక స్వర్ణ దేవాలయంలోకి ఆయుధాలను, ట్యాంక్‌లను తీసుకువచ్చిన గాంధీ కుటుంబాన్ని ప్రశ్నించే ధైర్యం అమరీందర్‌కు లేదని ఆమె ఎద్దేవా చేశారు. ఈ ట్వీట్‌పై స్పందించిన అమరేందర్.. ‘మీరు, మీ భర్త సుఖ్బీర్ సింగ్ బాదల్, ఆయన తండ్రి ప్రకాశ్ సింగ్ బాదల్ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. ఎందుకంటే మీ ముత్తాత సర్దార్ సుందర్ సింగ్ మజిథియి జలియాన్ వాలాబాగ్ మారణకాండ అనంతరం జనరల్ డయ్యర్‌కు బ్రహ్మాండమైన విందు ఇచ్చాడు. దాంతో ఆయన ప్రభు భక్తికి మెచ్చి బ్రిటన్ ప్రభుత్వం అతన్ని నైట్‌హుడ్ బిరుదతో సత్కరించడం గుర్తులేదా’ అని రీట్వీట్ చేశారు. ప్రస్తుతం వీరి ట్వీట్ల యుద్ధం ఇంటర్నెట్లో తెగ ట్రెండ్ అవుతోంది. -
మారణకాండకు వందేళ్లు : రూ.100 నాణెం విడుదల
అమృతసర్ : జలియన్ వాలాబాగ్ మారణహోమం జ్ఞాపకార్థం కేంద్ర ప్రభుత్వం 100 రూపాయల నాణేన్ని విడుదల చేసింది. వందలాదిమందిని పొట్టన పెట్టుకున్నబిట్రీష్ దుశ్చర్యకు వంద సంవత్సరాల పూర్తయిన సందర్భంగా ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఈ నాణేలను శనివారం విడుదల చేశారు. పంజాబ్‌లోని అమృతసర్‌లోని జలియాన్ వాలాబాగ్ స్మారకం వద్ద వెంకయ్యనాయుడు అమరవీరులకు ఘన నివాళులర్పించారు. అనంతరం స్మృతి చిహ్నంగా కొత్త వంద రూపాయల నాణేన్ని, స్టాంప్‌ను రిలీజ్ చేశారు. కాగా భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో అత్యంత దురదృష్టమైన, హేయమైన సంఘటనగా జలియన్ వాలాబాగ్ ఉదంతం నిలిచిపోయింది. పంజాబీలకు అత్యంత ముఖ్యమైన వైశాఖీ ఉత్సవం సందర్భంగా వేలాది మంది 1919 ఏప్రిల్ 13న జనలర్ డయ్యర్ ఆధ్వర్యంలో జరిగిన జలియన్ వాలాబాగ్ కాల్పుల్లో వందలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. కాగా వందేళ్ళ తరువాత జలియన్‌వాలాబాగ్ మారణకాండ బ్రిటిష్ ఇండియన్ చరిత్రలోనే సిగ్గుచేటుగా బ్రిటిష్ ప్రధాని థెరిసా మే వ్యాఖ్యానించడం తెలిసిందే. -
రక్త చరిత్రకు వందేళ్లు పూర్తి..
చంఢీగడ్: బ్రిటీష్ పాలిత భారతదేశంలో మాయనిమచ్చగా చరిత్రలో నిలిచిపోయిన ఘటన జలియన్ వాలాబాగ్ దురాగతం. ఆంగ్లేయుల సైన్యం ఊచకోత దాటికి వేలాదిమంది భారత పౌరులు ప్రాణాలు కోల్పోయారు. పచ్చని నేలవంటి అమృత్సర్పై రక్తపుటేరులు పారించారు. బ్రిటీష్ దురాగతానికి వందేళ్లు గడిచినా.. భారతీయుల గుండెల్లో దిగిన ఆ తుపాకీగుండ్ల శబ్ధం ఇంకా మారుమోగుతూనే ఉంది. 1919, ఏప్రిల్ 13న పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ సమీపంలో గల స్వర్ణ దేవాలయం పక్కనే ఉన్న జలియన్ వాలాబాగ్ లో దాదాపు 20 వేలమంది ప్రజలను బ్రిటీష్ సైన్యం ఊచకోత కోసిన విషయం తెలిసిందే. భారతీయుల హక్కులను కాలరాస్తూ.. బ్రిటీష్ ప్రభుత్వం తీసుకువచ్చిన రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా సమావేశమైన వేలమందిపై తూటల వర్షం కురించారు. ఈ ఘటనకు నేటితో వందేళ్లు పూర్తియిన సందర్భంగా అమృత్‌సర్‌లోని అమరుల స్మారక స్థూపం వద్ద రాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సహా పలువురు ప్రముఖులు నివాళి అర్పించారు. జనరల్ డయ్యర్ మారణహోమం వైశాఖ మాసం, సిక్కులకు ఆధ్యాత్మిక నూతన సంవత్సరం నాడు అందరూ గుమ్మికూడి రౌలత్‌చట్టంపై చర్చిస్తున్నారు. అలాగే ఈ చట్టం కింద ప్రముఖ్య స్వాతంత్య్ర సమరయోధులు.. సత్యపాల్, సైఫుద్ధీన్ కిచ్లూలను అక్రమంగా నిర్బంధించడాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా అక్కడి వచ్చే ప్రముఖ నేతలు ఆంగ్లేయ పాలనకు వ్యతిరేకిస్తూ చేస్తున్న ఉపన్యాసాలను వినడంకోసం వారంతా ఎదురు చూస్తున్నారు. అయితే తమ పాలననకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ సభ గురించి తెలుసుకున్న బ్రిటీష్ జనరల్ డయ్యర్ దారుణమైన మారణహోమానికి పాల్పడ్డాడు. మైదానానికున్న అన్ని దారుల్లో సాయుధులను మొహరించి ఎవ్వరూ బయటకు వెళ్లకుండా దిగ్బంధించి విచక్షణా రహితంగా వారిపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో దాదాపు 400 మంది మృత్యువాతపడ్డట్లు అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ అంతకంటే ఎక్కువమందే దాదాపు 1000 మందికి పైగా చనిపోయివుంటారని చరిత్ర చెబుతోంది. ఈ దాడిలో అధికంగా చిన్నారులు. మహిళలే ప్రాణాలు కోల్పోయారు. భారతీయు ఒత్తిడిమేరకు ఈ ఉదంతంపై విచారణ జరపడానికి బ్రిటీష్ ప్రభుత్వం 1919లో "హంటర్ కమిషన్" ఏర్పాటు చేశారు. అక్కడ సమావేశమైన గుంపుపై కాల్పులు జరపాలనే ఉద్దేశంతోనే తాను అక్కడికి వెళ్ళాననీ డయ్యర్ ఒప్పుకున్నాడు. దీంతో బ్రిటీష్ ప్రభుత్వం అతనిపై చర్యలు తీసుకుంది. కొద్దిమంది బ్రిటిష్ అధికారులు మాత్రం అతన్ని ప్రశంసించారు. పగతీర్చుకున్న ఉద్దమ్ సింగ్ పౌరులను చుట్టుముట్టి విచ్చలవిడిగా కాల్పులు జరిపి వేల మంది మరణానికి కారణమైన జనరల్ డైయర్ను విప్లవకారుడు ఉద్దమ్ సింగ్ హత్యచేశాడు. ఘటన జరిగిన 21 ఏళ్ల అనంతరం..1940 మార్చి 13న లండన్ కాక్స్ టన్ హాల్లో అతన్ని హతమార్చడం విశేషం. ఆ తరువాత బ్రిటీష్ ప్రభుత్వం ఉద్దమ్ సింగ్‌ని ఉరితీసింది. భారత దేశపు తొలి మార్స్కిస్ట్గా బ్రిటీష్ అధికారులు ఉద్దమ్‌ను వర్ణించడం విశేషం. భారతదేశంలో ఈ ఘటనపై ప్రతిగా తీవ్రమైన ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. పంజాబ్‌లో జరుగుతున్న స్వాతంత్ర్యోద్యమానికి మరింత ఆజ్యం పోసింది. 1920లో గాంధీజీ ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా సహాయ నిరాకరణోద్యమం ప్రారంభించడానికి జలయన్వాలాబాగ్ ఘటనే నాంది పలికింది. భగత్ సింగ్ విప్లవకారుడిగా మారడానికి కూడా ఈ సంఘటనే కారణం. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ బ్రిటీష్ ప్రభుత్వం తనకిచ్చిన సర్ బిరుదును ఇంగ్లండు ప్రభువుకు తిరిగి ఇచ్చేశాడు. మొత్తమ్మీద ఈ సంఘటన స్వాతంత్ర్యోద్యమానికి మరింత స్ఫూర్తినిచ్చి వేగవంతం చేసిందని చరిత్రకారులు చెప్తుంటారు. జలియన్ వాలాబాగ్ స్మారక స్తూపం 1920లో ఈ దుర్ఘటన జరిగిన స్థలంలో ఒక స్మారక స్తూపాన్ని నిర్మించడానికి భారత జాతీయ కాంగ్రెస్(ఐఎన్‌సీ) తీర్మానించింది. అమెరికాకు చెందిన బెంజమిన్ పోల్క్ అనే ఆర్కిటెక్టు స్మారక స్తూపానికి రూపకల్పన చేశాడు. 1961 ఏప్రిల్ 13న అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్, జవహర్ లాల్ నెహ్రూ వంటి నాయకుల సమక్షంలో ఈ స్తూపం ఆవిష్కరింపబడింది. నిరంతరాయంగా మండుతూ ఉండే అఖండ జ్వాలను తరువాత జోడించారు. ప్రక్కనున్న భవనాలపై బుల్లెట్ గుర్తులను ఇప్పటికీ చూడవచ్చును. బులెట్లల నుంచి తప్పించుకోవడానికి తొక్కిడిలో అనేకులు దూకి మరణించిన భావి కూడా ఇప్పుడు ఒక సంరక్షిత స్మారక చిహ్నం. -
ఏదీ క్షమాపణ!
తరాలు మారుతున్నా, ఏళ్లు గడుస్తున్నా కొన్ని దురంతాలకు సంబంధించిన జ్ఞాపకాలు చెదిరిపోవు. అవి పదే పదే స్ఫురణకొస్తూనే ఉంటాయి. ఆగ్రహాగ్నిని రగిలిస్తూనే ఉంటాయి. ప్రపంచ చరిత్రలోనే ఒక నెత్తుటి అధ్యాయంగా మిగిలిపోయిన జలివాలాబాగ్ దురంతం అటువంటిదే. వందేళ్లనాడు సరిగ్గా ఇదే రోజు జరిగిన ఆ దురంతంలో 379మంది మరణించారని ప్రభుత్వ రికార్డులు చెబుతున్నా ఆ సంఖ్య దాదాపు 1,000వరకూ ఉండొచ్చునని ప్రత్యక్షసాక్షుల కథనం. గాయపడినవారి సంఖ్య ఇంతకు మూడు రెట్లు ఉంటుంది. ఆ దుర్మార్గం ఆ ఒక్క రోజుతోనే ఆగిపోలేదు. మరో మూడు నాలుగు రోజులపాటు సాగింది. అమృత్సర్, ఆ చట్టుపట్ల ప్రాంతాల్లో మార్షల్ లా విధించి, పౌరులను అత్యంత అమానుషంగా హింసించారు. మండుటెండలో రోడ్లపై పౌరులను దొర్లిస్తూ వారిని కొరడాలతో కొట్టారు. జనం గుమిగూడి ఉన్నారని అనుమానించిన ప్రాంతాలపై విమానా లతో బాంబులు కురిపించారు. వేలాదిమందిని అరెస్టు చేశారు. సెన్సార్‌షిప్‌తో ఈ దుర్మార్గాలు బయటకు రాకుండా చూశారు. పంజాబీల ఉగాది పర్వదినమైన బైశాఖినాడు జరిగే వేడుకల కోసం అమృత్సర్ పరిసరప్రాంతాలనుంచి వేలాదిమంది తరలిరావడం రివాజు. రెండువందల ఏళ్లుగా సాగే ఈ సంప్రదాయానికి కొనసాగింపుగానే జలియన్‌వాలాబాగ్ పేరిట ఉన్న విశాల మైదానంలో కుటుంబాలతోసహా వేలాదిమంది చేరారు. అంతమంది గుమిగూడటమే బ్రిటిష్ సైనికుల దృష్టిలో నేరమైంది. చుట్టూ నిలువెత్తు గోడ, బయటకు పోవడానికి మూడు చిన్న చిన్న గేట్లు మాత్రమే ఉన్న ఆ ప్రాంగణంపై సైన్యం తుపాకి గుళ్లు కురిపించింది. దాదాపు 10 నిమిషాలపాటు 1,650 రౌండ్లు కాల్పులు జరిపింది. పంజాబ్‌లో అంతటి దౌష్ట్యాన్ని ప్రదర్శించడానికి నేపథ్యం ఉంది. అక్కడ వరస కరువులు, ఆహారం కొరత ఏర్పడటం, అధిక ధరలు తప్పలేదు. వీటివల్ల కలిగే ఆకలిమంటల్ని తట్టుకోవడానికి ఒకే ఒక మార్గం– సైన్యంలో చేరటం. బ్రిటిష్ సైన్యంలో 60 శాతంమంది పంజాబీలే ఉండేవారు. అలా వెళ్లలేనివారు, వెళ్లేందుకు ఇష్టపడనివారు ఉద్యమాల్లో సమీకృతులయ్యేవారు. కరువుతో అల్లాడే ప్రాంతాన్ని పీల్చి పిప్పి చేస్తున్న వలసపాలకులపై సహజంగానే ఆగ్రహం పెల్లుబికేది. అది ఉద్యమాల్లో వ్యక్తమయ్యేది. 1914–18 మధ్య సాగిన మొదటి ప్రపంచ యుద్ధంలో సహకారం అందిస్తే స్వయంపాలనకు వీలుకల్పించే అధినివేశ ప్రతిపత్తి ఇస్తామని చెప్పిన పాలకులు ఆ తర్వాత మాట తప్పారు. ఆ యుద్ధంలో మరణించిన, తీవ్రంగా గాయపడినవారిలో చాలామంది పంజా బీలు కావడం, యుద్ధానంతరం ఏర్పడిన ద్రవ్యోల్బణం, భారీ పన్నులు కరువుతో అల్లాడే ఆ ప్రాంతాన్ని మరింత కుంగదీయడంతో జనంలో తీవ్ర అసంతృప్తి ఉండేది. దీన్ని చల్లార్చడానికి, ఉద్యమాలను అణచడానికి పాలకులు రౌలట్ చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టంకింద పౌరులను ఏ చిన్న అనుమానం కలిగినా విచక్షణారహితంగా అరెస్టు చేసేవారు. విచారణ లేకుండా సుదీర్ఘకాలం జైళ్లలో బంధించేవారు. ఎక్కడైనా జనం గుమిగూడితే ప్రభుత్వం ఉలిక్కిపడేది. జలియన్వాలాబా గ్లో జరిగింది అదే. పండగపూటా స్వర్ణాలయాన్ని సందర్శించుకుని, వేడుకలు చేసుకుందామని పల్లెటూళ్లనుంచి రెండెడ్లబళ్లపై కుటుంబసమేతంగా వచ్చినవారిపై అకారణంగా గుళ్లవర్షం కురిపిం చారు. ఈ అమానుష హత్యాకాండే అనంతరకాలంలో మహాత్మాగాంధీ ఆధ్వర్యంలో అహింసా యుత సహాయ నిరాకరణ ఉద్యమానికి దారితీసింది. విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ అంతకు నాలు గేళ్లముందు బ్రిటిష్ ప్రభుత్వం తనకిచ్చిన నైట్‌హుడ్‌ను వదులుకోవడానికి కారణమైంది. దీనికి సారథ్యంవహించిన డయ్యర్‌కు అన్నివిధాలా అండగా నిలిచిన అప్పటి పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ మైకేల్ ఓడ్వయర్‌ను 1940లో విప్లవవీరుడు ఉధమ్‌సింగ్ లండన్ వెళ్లి మరీ హతమార్చాడు. ఇంత చరిత్ర ఉన్న ఈ అమానుషత్వంపై క్షమాపణ చెప్పడానికి బ్రిటన్ ప్రభుత్వానికి నోరు పెగలడం లేదు. అది సిగ్గుమాలిన చర్య, ఒక విషాదకరమైన ఘటన అని మాత్రం బ్రిటన్ ప్రధాని థెరిస్సా మే అంటున్నారు. జలియన్‌వాలాబాగ్ దురంతానికి కేవలం డయ్యర్ అనే సైనికాధికారి తప్పిదం మాత్రమే కారణం కాదు. ప్రపంచంలోని అనేక దేశాల్లో తెల్లజాతి కొనసాగించిన రాక్షస పాలనలో భాగం. దశాబ్దాలు గడిచిపోయినప్పుడూ, తరాలు మారిపోయినప్పుడూ ఇలా క్షమా పణలు చెప్పమని అడగటం ఏమంత న్యాయమని ఎవరికైనా అనిపించవచ్చు. దానివల్ల చరిత్రలో భాగమైపోయిన తప్పును ఎలా సరిదిద్దగలమన్న సందేహం కలగొచ్చు. నిజానికి క్షమాపణ అనేది అడిగితే చెప్పేది కాదు. అది లోలోపలి నుంచి పెల్లుబికి రావాలి. అందులో పశ్చాత్తాపం ఉండాలి. వ్యక్తులకైనా, దేశాలకైనా ఇది నాగరిక లక్షణం. బాధితులకు, వారి వారసులకు అలాంటి క్షమాపణ ఓదార్పునిస్తుంది. సాంత్వన కలిగిస్తుంది. డయ్యర్‌ను బాధ్యుణ్ణి చేసి, అతడిపై చర్య తీసుకున్న ప్పుడు ఆనాటి బ్రిటిష్ సమాజంలో అనేకులు అతనికి అండగా నిలబడ్డారని గుర్తుంచుకోవాలి. సాహితీప్రపంచానికి చెందిన రుయార్డ్ కిప్లింగ్ అందులో ఒకడు. డయ్యర్ చేసిన పని భారత్‌లో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని సుస్థిరపరిచిందని వాదించి, అతగాడికి 26,000 పౌండ్లు పోగేసి ఇచ్చిన ఘనులున్నారు. ఒక్క డయ్యర్‌ను మాత్రమే కాదు... అలాంటివారినెందరినో నెత్తినపెట్టుకుని ఊరే గిన బ్రిటిష్ సమాజం ఇన్నేళ్ల తర్వాత తాను మారానని చాటడానికి ఈ వందేళ్ల సందర్భం ఒక అవకాశం అయి ఉంటే దాని ఘనత పెరిగేది. కానీ ఏవేవో పదాలు, పదబంధాలు వాడి, తన భాషా పాండిత్యాన్ని చాటుకుని చరిత్రలో జరిగిన అమానుషత్వాన్ని చిన్నదిగా, ఒక యాదృచ్ఛిక ఉదం తంగా చాటడానికి బ్రిటన్ ప్రభుత్వం ఇంకా ప్రయత్నిస్తోంది. ఇది సహించరానిది. ఆనాటి తరం వలసదేశాలను దోపిడీ చేసి సాధించిపెట్టిన సంపదనూ, అభివృద్ధినీ అనుభవిస్తూ, వారి అమాను షత్వానికి తాము బాధ్యులం కాదని చెప్పడం మర్యాద కాదు. నాగరిక లక్షణం అంతకన్నా కాదు. థెరిస్సా మే దీన్ని గుర్తించలేకపోవడం విచారించదగ్గ విషయం. -
రెండు సైన్యాల మధ్య ఓ అర్ధరాత్రి గోడ..!
అవలోకనం మనం మరొక స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా, భారత జాతీయవాదపు మూడు అంశాలకేసి దృష్టి సారించాలని అనుకుంటు న్నాను. మొదటిది ఏమిటంటే మనకు ఇన్నాళ్లూ బోధిస్తూ వచ్చిన భారత మ్యాప్‌కి సంబంధించిన సగుణవాది స్వభావం (మానవ లక్షణాలను కలిగి ఉం డటం అని అర్థం) మదరిండియా లేక భారతమాత చిత్రం దేశ భౌగోళిక చిత్రపటంకి సంబం ధించిన భౌతిక రేఖలను పోలి ఉంటుంది. మన దేశాన్ని చీరకట్టులోని మహిళగా కూడా చూపిస్తుంటారు. జమ్మూ కశ్మీర్ రాష్ట్రం ఈ చిత్రం తలను పోలి ఉంటుంది. దక్షిణాదిన ఉన్న ఓ చిన్న ద్వీపకల్పం అతి ఇరుకైన భాగం ఆమె కాలి అందియలు, పాదాలను పోలి ఉంటుంది. కెరటంలా లేచే ఆమె చీర కొంగు ఈశాన్య రాష్ట్రాల రూపం దాల్చి ఉంటుంది. 40 సంవత్సరాల క్రితం నాటి మ్యాప్‌లను కూడా నేను స్పష్టంగా గుర్తించుకోగలిగేవాడిని. ఎందుకంటే ప్రజల హృదయాల్లో అవి ప్రతి ధ్వనిస్తుండేవి. కాబట్టే అవి చాలా కాలం అందరి జ్ఞాపకాల్లో ఉండేవి. దీని విశిష్ట గుణం ఏమిటంటే, ఇండియా మ్యాప్‌లో ఏమాత్రం మార్పు చేసినా సరే దేశంలోని ఏ వ్యక్తికీ అది ఆమోదనీయం కాదు. ఎందుకంటే దీర్ఘ కాలంగా వారు భారత మ్యాప్‌ని మానవరూపంలో, సజీవమైన అర్థంలో చూస్తూ వస్తున్నారు. భారత మ్యాప్ ఏవో కొన్ని రేఖలు, స్థల వర్ణనతో కూడిన అంశాల కలయిక కాదు. అందుకే, ఆ మ్యాప్‌లో ఎలాంటి మార్పులనైనా తీసుకురావటం ప్రభుత్వానికి కష్టమయ్యేది. చైనాతో సరిహద్దు సమస్య కానీ, కశ్మీర్లో చాలా భాగం పాకిస్తాన్ ఆక్రమ ణలో ఉందన్న వాస్తవం కానీ మన అధికారిక మ్యాప్‌ల నుంచి కనుమరుగు కావ డం కష్టం. మనకు వెలుపలి ప్రపంచం ప్రచురించే ఇండియన్ మ్యాప్‌ల భౌతిక రూపాన్ని సవరిస్తూ, వాటిపై అధికారిక స్టాంపులను ముద్రిస్తూ ఉండటంలో మన ప్రభుత్వం ఎల్లప్పుడూ తలమునకలవుతూ ఉంటుంది. వాటిలోని తప్పులు ఎంతో అభ్యంతరకరమైనవని చూపడమే ప్రభుత్వ ఉద్దేశం. కాని అలాంటి మ్యాప్‌లు చాలా తరచుగా కనబడుతుంటాయి. వాటిని ఎవరైనా తెలిసో తెలి యకో ఉపయోగిస్తున్నట్లయితే మన మీడియా అలాంటి ఘటనలపై ఆగ్రహం ప్రదర్శిస్తుంటుంది. భారతమాత చిత్రపటంలో ఏ కొంచెం మార్పులు చేసినా సరే చాలామంది భారతీయులకు అది తీవ్రమైన నేరంగా కనిపిస్తుంటుంది. ఆమె రూపం విషయంలో ఎలాంటి ఉల్లంఘనలూ జరగకూడదు మరి. మనం అర్థం చేసుకోవలసిన రెండో అంశం ఏమిటంటే ఆ మ్యాప్ చరిత్రే. 1947లో భారత్‌కు వారసత్వంగా వచ్చినది వలస రాజ్యమే. దీనికి అత్యంత దూకుడుతో కూడిన విస్తరణ స్వభావం ఉండేది. మొఘలులు సైతం ఎన్నడూ స్వాధీనపర్చుకోనంత పెద్ద భూభాగాన్ని, ప్రత్యేకించి ఈశాన్య ప్రాంతం మొత్తాన్ని ఇది కైవసం చేసుకుంది. మొఘలులు లేదా వారి వారసులు ఈశాన్య ప్రాంతాన్ని స్వాధీనపర్చుకోలేకపోయారు అంటే అర్థం ఈ ప్రాంతాలు ఒక కొత్తవైన, అసలు ఒప్పందాల మాటున భద్రంగా ఉండేవి. శాశ్వతమైన, పొందికైన దేశంలో భాగం గా మనం భావిస్తున్న పలు భూభాగాలను బ్రిటిష్ భారతీయ సైన్యం పోరాడి గెలుచుకుంది. ఈ వాస్తవాంశాన్ని భారతీయులకు ఎవరూ బోధపర్చలేదు. వలస సైన్యం ఆక్రమణకు లోబడినవి కాబట్టే ఆ ప్రాంతాల్లో భారత్‌పట్ల అంతటి శత్రుభావం, తిరుగుబాట్లు చోటు చేసుకుంటూ వచ్చాయి. కానీ నాగాల సమస్యపట్ల మహాత్మా గాంధీకి కాస్త సానుభూతి ఉండేదని తెలుసుకుంటే కొంతమందికి ఆశ్చర్యం కలుగవచ్చు. ఏదేమైనప్పటికీ, వలసపాలనా కాలంలో వలే, కఠిన చట్టాలకింద మగ్గిపోతున్న భారత్‌లోని ఒక భాగం పట్ల సగటు భార తీయుడికి ఏమంత సానుభూతి ఉండేది కాదు. ఈ చట్టాలవల్లే భారతీయ సైన్యం ఆ ప్రాంతంలో తాను చేసే తప్పులకు శిక్షలన్నవే లేకుండా, పూర్తి రక్షణతో కార్య కలాపాలు కొనసాగిస్తోంది. మన జాతీయ వాదానికి అది సంరక్షకురాలు అనే భావనతో మెజారిటీ భారతీయులు భారత సైన్యం చర్యల పట్ల పెద్ద పట్టింపు లేకుండా గడిపేస్తుంటారు. ఇక మూడో అంశం ఏమిటంటే భారత సైన్యపు జాతీయవాద స్వభావం ఒక భ్రమ అన్నదే. వలసపాలనలో భారత్‌లో ఉన్నది ఒక కిరాయి సైన్యం. 1947 ఆగ స్టు నెలలో ఓ అర్ధరాత్రి అది ఉన్నట్లుండి జాతీయ సైన్యంగా మారిపోయిందన్నది వాస్తవం. పాకిస్తాన్ కూడా ఇదే ప్రక్రియలోకి వెళ్లింది. ఆగస్టు 14కి ముందు నాటి బ్రిటిష్ సైన్యానికి (బలూచ్ రెజిమెంట్‌కు చెందిన పంజాబీలు, గూర్ఖా రెజిమెం టుకు చెందిన నేపాలీలే అమృత్‌సర్‌లోని జలియన్ వాలాబాగ్‌లో నిరాయుధులైన సిక్కులు, హిందువులు, ముస్లింలను వందలాదిగా కాల్చిచంపారు), ఆగస్టు 15 నాటి భారతీయ స్వేచ్ఛా సైన్యానికి ఏమాత్రం వ్యత్యాసం ఉండేది కాదు. భారతీయ సైన్యం దీర్ఘకాలంగా గర్వించదగిన సమరోచిత సైనిక వార సత్వాన్ని కలిగి ఉండేదని నా భావన. అదే సమయంలో పుట్టుకతోనే పూర్తిగా కిరాయి స్వభావంతో కూడిన చరిత్ర దానికుండేది. క్రీస్తుకు ముందు నాలుగో శతా బ్దంలో గ్రీకు చరిత్రకారుడు అరియన్, అలెగ్జాండర్ ది గ్రేట్ సైనిక దండయాత్రల గురించి రాశాడు. దీనికోసం ఇతడు జనరల్ టాలమీ (ఇతడు క్లియోపాత్రతో ముగిసిన గ్రీక్-ఈజిప్షియన్ ఫారోల వంశక్రమాన్ని కనుగొన్నాడు) రాసిన చరి త్రను ప్రధానంగా ఉపయోగించుకున్నాడు. పంజాబ్‌లో మాసిడోనియన్ సైన్యం సాగించిన అతి కష్టమైన దండయాత్ర గ్రామీణులు కిరాయికి కుదుర్చుకున్న కిరాయి సైనికులకు వ్యతిరేకంగా నడిచింది. అంతకు వందేళ్లకు క్రితం గ్రీకు చరిత్ర కారుడు హెరోడోటస్ కూడా ఇదే విషయాన్ని నివేదిస్తూ.. ప్లేషియా యుద్ధ రంగంలో పర్షియన్ సేనలో భారతీయ కిరాయిసేనల రెజిమెంట్ ఉండేదని రాశాడు. ఈ విభాగం ధరించిన దుస్తులు, ఆయుధాల గురించి హెరోడోటస్ వర్ణిం చాడు. ఇక మొఘల్ కాలంలో అయితే, జాట్ల నుంచి మరాఠాలు, సిక్కుల దాకా ఎవరు ఎక్కువ కిరాయి చెల్లిస్తే వారి తరపున పోరాడేందుకు భారతీయులు అందుబాటులో ఉండేవారన్నది అందరికీ తెలిసిన విషయమే. భారత్‌పై విదేశీ దురాక్రమణతో సంబంధమున్న ప్రతి సమరంలోనూ అంటే ప్లాసీ లేదా హల్దీఘాటీ వంటి యుద్ధాలన్నింటిలోనూ విజయం సాధించిన పక్షంలో మెజారిటీ పోరాటయోధులుగా భారతీయులే ఉండేవారు. భారతీయ సైన్యం జాతీయవాద స్వభావంతో కూడి నదనే మన సంప్రదాయిక విశ్వాసానికి ఈ ఉదాహరణలు ఏమంత అనుగుణంగా ఉండటం లేదు కదా. కానీ మనం బాల్యం నుంచి పాఠశాలల్లో నేర్చుకుంటూ వచ్చిన పాఠాల్లో ఈ చరిత్ర లేదు. మన వాస్తవ చరిత్ర తెలిసిన వారు మాత్రం తాము తప్పక సమా ధానపడవలసిన రెండు విభిన్న వర్ణనలతో నిత్యం ఘర్షిస్తుంటారు. మన సంస్కృతి స్వభావం, దాని సున్నితత్వాల సుతిమెత్తనితనం నేప థ్యంలో పైన పేర్కొన్న మూడు అంశాలూ సమీప భవిష్యత్తులో మార్పు చెందు తాయని నేను భావించడం లేదు. కాని ఒక చిన్నదైన, తెలివైన శ్రోతల బృందానికి ఒక కాలమిస్టు రాసి పంచుకోగలిగిన విషయంగా ఈ మూడు అంశాలు ఉనికిలో ఉండవచ్చు మరి. - ఆకార్ పటేల్ (వ్యాసకర్త కాలమిస్టు, రచయిత) aakar.patel@icloud.com