ఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) కు వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహీన్‌బాగ్ వద్ద సుదీర్ఘ ఆందోళన కొనసాగుతుండగా, ఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ ఉద్యమాన్ని ప్రభుత్వం పాశవికంగా అణిచివేయనుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఫిబ్రవరి 8 తరువాత (ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు), షాహీన్ బాగ్ ఉద్యమాన్ని ఎట్టి పరిస్థితుల్లో కొనసాగన్వివదనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జలియన్‌బాగ్ మారణకాండను గుర్తు చేసుకున్న ఒవైసీ, షాహీన్ బాగ్‌ను కూడా జలియలావాలా బాగ్‌గా మార్చేఅవకాశం లేకపోలేదన్నారు. ఆందోళనపై కాల్పులు జరపమన్న బీజేపీ మంత్రి సంకేతాల నేపథ్యంలో, అక్కడ ఆందోళన చేస్తున్న ఆందోళనకారులను కాల్చి చంపవచ్చు అనే సందేహాన్ని ఒవైసీ వెలిబుచ్చి వుందంటూ వివాదాన్నిమరింత రాజేశారు. అంతేకాదు ఉద్రిక్తత రేపుతున్న బీజేపీ మంత్రి వ్యాఖ్యలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీపై స్పందిస్తూ 2024 వరకు ఎన్‌ఆర్‌సీ అమలు ఉండదనే విషయంపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలన్నారు. ఎన్‌పీఆర్ కోసం 3900 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు చేస్తున్నారు? తాను చరిత్ర విద్యార్థిని కాబట్టి ఈ విధంగా భావిస్తున్నానని ఒవైసీ తెలిపారు. జర్మనీ నియంత హిట్లర్ రెండుసార్లు జనాభా గణనను నిర్వహించిన అనంతరం లక్షలాదిమంది యూదులను గ్యాస్ చాంబర్‌లో వేసి హతమార్చాడు.. మనదేశంలో అలా జరగకూడదని తాను కోరుకుంటున్నానంటూ ఒవైసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
50 రోజులుగా సీఏఏకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతున్న ఢిల్లీలోని షాహీన్ బాగ్ వద్ద బుధవారం మరోసారి కలకలం రేగింది. తుపాకీతో అనుమానస్పద వ్యక్తులు హల్‌చల్ చేసిన ఘటనను మర్చిపోక ముందే తాజాగా బురఖా ధరించిన మహిళ అనుమానాస్పదంగా సంచరించడం ఆందోళన రేపింది. ఆమెను గమనించిన ఆందోళనకారులు, పోలీసులకు అప్పగించారు. పొలిటికల్ ఎనలిస్టు, యూట్యూబర్‌గా చెప్పుకున్న ఆమెను గుంజాకపూర్‌గా గుర్తించారు పోలీసులు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కాగా దేశీయంగా, ప్రపంచవ్యాప్తంగా నిరసనల మధ్య గత డిసెంబర్‌లో భారతదేశంలో కొత్త పౌరసత్వ చట్టం అమల్లోకి వచ్చింది. దీంతో సీఏఏ అమలును వ్యతిరేకిస్తూ తీవ‍్ర ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.
చదవండి : ఆజాదీ కావాలా అంటూ తెగబడిన ఉన్మాది, సీఏఏ, ఎన్‌పీఆర్‌పై రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు
@gunjakapoor naam hai hamara
— silent_word_💯FB (@silenteyes601) February 5, 2020
Naam to suna hoga🤦
Free ki biryani khane burka pahen k shaheen baugh me pakdi gayi🤦🤦🤦@arshaan_zaman @ihansraj @IndiasMuslims @iamseeratraza @NehasinghJnu @tamashbeen_ @IamOnir pic.twitter.com/IPfZ18Ro8u
Comments
Please login to add a commentAdd a comment