నా చిన్ననాటి కోరిక: హీరోయిన్ | shruti hassan visit to golden temple | Sakshi
Sakshi News home page

నా చిన్ననాటి కోరిక: హీరోయిన్

Jul 22 2017 8:32 PM | Updated on Sep 5 2017 4:38 PM

నా చిన్ననాటి కోరిక: హీరోయిన్

నా చిన్ననాటి కోరిక: హీరోయిన్

సంచలన హీరోయిన్ శ్రుతిహాసన్ అనూహ్యంగా అమృతసర్‌లోని గోల్డెన్‌టెంపుల్‌లో ప్రత్యక్షమయ్యారు.

చెన్నై: సంచలన హీరోయిన్ శ్రుతిహాసన్ అనూహ్యంగా అమృతసర్‌లోని గోల్డెన్‌టెంపుల్‌లో ప్రత్యక్షమయ్యారు. శ్రుతి సంఘమిత్ర చిత్రాన్ని అనవసరంగా వదులుకుంది. ఆమె తండ్రి కమలహాసన్‌తో  కలిసి నటిస్తున్న శభాష్‌నాయుడు చిత్ర నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. ప్రస్తుతం చేతిలో సినిమాలే లేవు అనే ప్రచారాలను ఏ మాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతోంది. నిజానికి శ్రుతి ఖాళీగా కూర్చోలేదు. చేతిలో టిగ్మంషూదులియాస్ యాత్ర అనే చిత్రంతో పాటు ఇతర వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ బిజీగానే ఉంది.

తను నటిస్తున్న హిందీ చిత్రం అక్టోబరు నెలలో తెరపైకి రానుంది. ఒక బ్రాండ్ ప్రచారంలో భాగంగా ఇటీవల చంఢీగఢ్ వెళ్లిన భామ ఆ పని పూర్తి చేసుకుని సమీపంలోని  అమృతసర్‌కు వెళ్లి అక్కడి గోల్డెన్‌ టెంపుల్‌ను దర్శించుకున్నారు. గోల్డెన్ టెంపుల్ లో రాత్రి హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రుతి ప్రచారంలో తన అనుభవాలను పంచుకుంటూ.. గోట్డెన్‌టెంపుల్‌ను దర్శంచుకోవాలన్నది తన చిన్న నాటి నుంచి ఉన్న కోరిక అంది.

ఆ మధ్య ఒక చిత్ర ప్రచారం కోసం అమృతసర్‌ వచ్చినప్పుడు ఆలయాన్ని దర్శించుకోవాలని అనుకున్న, అయితే చివరి క్షణంలో ప్రణాళిక మారిపోవడంతో అది నెరవేర లేదని ఈ భామ తెలిపింది. అయితే ఈ సారి మాత్రం అలాంటి అవకాశాన్ని వదులు కోదలచుకోలేదని పేర్కొంది. స్వర్ణదేవాలయాన్ని సందర్శించడం చాలా గొప్ప అనుభూతి అని తెలిపింది. అక్కడి వాతావరణం, ఎంతో ఎనర్జీని, ప్రశాంతతను అందించిందని శ్రుతిహాసన్ పేర్కొన్నట్లు ఆమె ప్రతినిధి ఒకరు తెలిపారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement