మద్యం మత్తులో యువతి.. వీడియో షేర్‌ చేసిన బీజేపీ నేత | Video of a woman struggling due to drug abuse in Punjab goes viral, shared by BJP leader Manjinder Singh Sirsa. |Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో యువతి.. వీడియో షేర్‌ చేసిన బీజేపీ నేత

Published Tue, Jun 25 2024 9:59 AM | Last Updated on Tue, Jun 25 2024 11:27 AM

Amritsar Drug Addict Girl Video Viral

దేశంలోని కొందరు యువతీయువకులు మత్తుకు బానిసలుగా మారి తమ కెరియర్‌ను నాశనం చేసుకోవడమే కాకుండా, తల్లిదండ్రులను కష్టాలపాలు చేస్తున్నారు. మత్తుపదార్థాల తీసుకోవడం వలన జరిగే హాని గురించి అటు ప్రభుత్వం, ఇటు స్వచ్ఛంద సంస్థలు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా ఆశించినంత ఫలితం కనిపించడంలేదు.  

తాజాగా పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో మద్యం మత్తులో రాత్రివేళ రోడ్డుపై జోగుతున్న ఓ యువతికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో అమృత్‌సర్‌లోని మోహక్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని జీటీ రోడ్డులో చిత్రీకరించారు. ఈ వీడియో వైరల్ అయిన నేపధ్యంలో మత్తుమందులను అరికట్టడంలో విఫలమైన ప్రభుత్వంపై విమర్శలు చెలరేగుతున్నాయి.

ఈ వీడియోను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంజీందర్ సింగ్ సిర్సా తన ‘ఎక్స్‌’ హ్యాండిల్‌లో  షేర్‌ చేశారు. పంజాబ్‌లో డ్రగ్స్ సమస్యను నివారించడంలో ఆప్‌ ప్రభుత్వం విఫలమయ్యిందని ఆరోపించారు. మంజీందర్ సింగ్ షేర్ చేసిన వీడియోలో రాత్రివేళ రోడ్డుపై ఒక యువతి  మద్యం మత్తులో ఊగిపోతూ కనిపిస్తుంది. ఆమె సరిగా నిలబడలేక పోవడాన్ని కూడా  వీడియోలో చూడవచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన  మూడు నెలల్లో రాష్ట్రాన్ని మత్తుమందుల నుంచి విముక్తి చేస్తామని ప్రకటించిందని, ఇప్పుడు ఆ మాటనే విస్మరించిందని సుజీందర్‌ సింగ్‌ ఆరోపించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement