పసివాడిని బావిలో తోసేసిన బాలిక.. తరువాత? | Little Girl Throws 4 year Old Boy into a Well | Sakshi
Sakshi News home page

China: పసివాడిని బావిలో తోసేసిన బాలిక.. తరువాత?

Published Sat, Dec 2 2023 11:32 AM | Last Updated on Sat, Dec 2 2023 12:02 PM

Little Girl Throws 4 year Old Boy into a Well - Sakshi

పిల్లలు తమ ఆటల్లో వినోదం కోసం చేయకూడని పనులు కూడా చేస్తుంటారు. ఒక్కోసారి వీటి పర్యవసానాలు ఊహకందని విధంగా ఉంటాయి. తాజాగా పిల్లల ఆటలకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసినవారంతా షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూశాక పిల్లలను ఎప్పుడూ ఒంటరిగా వదలకూడదని, వారిని కనిపెట్టుకుని ఉండాలని ఎవరికైనా అనిపిస్తుంది. 

ఈ షాకింగ్ వీడియోలో ఒక బాలిక తన కంటే చిన్నవాడైన ఒక బాలుడిని ఎత్తుకుని బావిలోకి తోసేయడం కనిపిస్తుంది. ఈ వీడియో చైనాకు చెందినదని తెలుస్తోంది. ఈ వీడియో మొదట్లో ఇద్దరు పిల్లలు బావి దగ్గర  ఆడుకోవడం కనిపిస్తుంది. ఆటల్లో భాగంగా ఆ బాలిక ఆ పిల్లాడిని ఎత్తుకుని బావి దగ్గరకు తీసుకువస్తుంది. తరువాత ఆ పిల్లాడిని బావిలో పడేస్తుంది. అయితే ఆ పిల్లాడు ఆ బావి గోడను పట్టుకుంటారు. దీనిని గమనించిన ఆ బాలిక.. బాలుని చేతులను గోడ నుంచి జరిపి బావిలోకి తోసేసింది. బావిలో పడిపోయిన బాలుడు ఏడుస్తున్నప్పటికీ అతడికి సాయం చేసేందుకు ఎవరూ రాకపోవడం వీడియోలో కనిపిస్తోంది. అయితే కొద్దిసేపటి తరువాత స్థానికులు ఆ బాలుని ఆర్తనాదాలు విని అతనిని కాపాడుతారు. 

ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారిన ఈ వీడియో యూజర్లను కలిచివేసింది. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో @cctvidiots అనే ఖాతాతో షేర్‌ చేశారు. ఈ వీడియో చూసిన యూజర్లు రకరకాలుగా కామెంట్‌ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: తుపానులకు పేర్లు ఎందుకు? ఎవరు పెడతారు?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement