న్యూఢిల్లీ : బిజెపి ఎంపీ, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధు తన సిన్సియారిటీ చాటుకున్నారు. ఏడాది కాలంగా తాను ముంబై వెళ్ళింది డబ్బు సంపాదనకేనని ఆయన చెప్పారు. టివి వ్యాఖ్యాతగా తాను సంపాదించుకున్న డబ్బు తన ఇల్లు గడవడానికేనని సిద్ధూ తెలిపారు. అరుణ్ జైట్లీ న్యాయవాదని, పంజాబ్ డిప్యూటీ సిఎం వ్యాపారవేత్త అని అలాంటప్పుడు తాను టివి వ్యాఖ్యాతగా ఉంటే తప్పేంటని సిద్ధు ప్రశ్నించారు. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి గురువారం అమృతసర్ వచ్చారు. సిద్దూకు అబిమానులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక నుంచి తన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు.
అమృత్‌సర్ ఎంపీ అయిన సిద్ధూ ముక్కుసూటితనం, వ్యవహారశైలిపై ఎన్‌డిఏ భాగస్వామ్య పక్షం శిరోమణి అకాళీదళ్ గుర్రుగా ఉంది. అందుకే సిద్ధూను సైలంట్ అయిపోవాలని చెప్పడమేకాక ముంబై వెళ్ళేందుకు బిజెపి అనుమతినిచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు పది నెలలుగా సిద్ధూ ముంబైకే పరిమితం కావడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. సిద్ధూ ఆచూకి తెలిపిన వారికి రెండు లక్షల రూపాయల రివార్డ్ ఇస్తామంటూ పోస్టర్లు ప్రచురించాయి.
ముంబై వెళ్లింది డబ్బు సంపాదనకే: సిద్ధూ
Published Thu, Sep 5 2013 12:24 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement