సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న ఆకాళీదల్ నేతలు
సాక్షి, ముంబై: ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే మద్దతు ప్రకటించినట్లు ఆకాళీదల్ వెల్లడించింది. శిరోమణి ఆకాళీదల్ వర్కింగ్ కమిటీ బృందం ఆదివారం ఉద్దవ్ ఠాక్రేతో భేటీ అయింది. ఈ సందర్భంగా రైతుల ఆందోళనకు మద్దతు ఇస్తున్నట్టు ఆయన ప్రకటించినట్లు పేర్కొంది. గత కొన్ని రోజులుగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లులకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆకాళీదల్ నేతలు, ఎంపీ చందు మాజరా తదితరులు ఉద్దవ్ ఠాక్రేతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతు పలుకాలని ఉద్దవ్‌ను కోరారు. తొందర్లోనే ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌తో కూడా భేటీ కానున్నట్లు చందు మాజరా తెలిపారు. చదవండి: (హైదరాబాద్ ఫలితాలతో నూతనోత్తేజం!)
ఎన్సీపీ మద్దతు: జయంత్
రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ కార్యకర్తలు మంగళవారం భారత్ బంద్‌లో పాల్గొనాలని మహారాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షుడు జయంత్ పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ చట్టాలపై పార్లమెంటులో చర్చలు చేపట్టకపోవడాన్ని ఆయన ఖండించారు. రైతులు, కేంద్రం మధ్య జరుగుతున్న చర్చలు విఫలమవడంతో సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపు మేరకు ఎన్సీపీ మద్దతు తెలుపుతోందన్నారు. రైతుల నిరసనలపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ డిసెంబర్ 9 న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌తో భేటీ కానున్నారని తెలిపారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే మూడు వ్యవసాయ బిల్లులను ప్రవేశపెట్టినప్పుడు ఎన్సీపీ వాకౌట్ చేసిందని జయంత్ గుర్తుచేశారు. 26నుంచి రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతిస్తున్నామని అన్నారు. చదవండి: (రైతుల కోసం ఉరికి కూడా సిద్ధం: తేజస్వీ యాదవ్)
Comments
Please login to add a commentAdd a comment