లక్నో: అకాలీదళ్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి బల్వంత్ సింగ్ రామ్వాలియా పార్టీకి గుడ్ బై చెప్పి.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కేబినెట్లో మంత్రిగా చేరారు. అఖిలేష్ యాదవ్ శనివారం తన మంత్రి వర్గాన్ని విస్తరించి కొత్తగా 12 మందిని మంత్రులుగా తీసుకున్నారు.
కొత్త మంత్రులు, కేబినెట్ ర్యాంక్ పొందిన వారితో సహా మొత్తం 21 మంది ప్రమాణం చేశారు. 2017లో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అఖిలేష్ కేబినెట్లో భారీ మార్పులు చేశారు. ఇందులో భాగంగా బల్వంత్ను కేబినెట్లోకి తీసుకున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్కు సుదీర్ఘకాలం బల్వంత్ సింగ్ అనుచరుడిగా కొనసాగారు.
పార్టీకి గుడ్ బై.. మంత్రిగా ప్రమాణం
Published Sat, Oct 31 2015 1:11 PM | Last Updated on Sun, Sep 3 2017 11:47 AM
Advertisement