పొత్తులకు దూరంగా ఉండాలని బీజేపీ నిర్ణయించుకున్న సంకేతాలే కనిపిస్తున్నాయి. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల సమయంలో శివసేనతో
పొత్తులకు దూరంగా ఉండాలని బీజేపీ నిర్ణయించుకున్న సంకేతాలే కనిపిస్తున్నాయి. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల సమయంలో శివసేనతో తెగతెంపులు చేసుకున్న బీజేపీ... ఢిల్లీలోనూ అదే బాటలో పయనించే అవకాశం అధికంగా ఉంది. గత విధానసభ ఎన్నికలలో అకాలీదళ్‌కు నాలుగు సీట్లు కేటాయించిన బీజేపీ ఈసారి అన్ని స్థానాల నుంచి పోటీ చేయొచ్చని అంటున్నారు.
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో బీజేపీ, అకాలీదళ్ మధ్య దూరం నానాటికీ పెరుగుతోంది. మహారాష్ట్రలో బీజేపీ, శివసేనల మధ్య సంబంధాలు బెడిసిన సంగతి విదితమే. నరేంద్రమోదీ ప్రభజనం ఊపు మీదున్న కమలదళం ఢిల్లీలో శిరోమణి అకాలీదళ్‌తో ఎన్నికల పొత్తు పెట్టుకోకపోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత విధానసభ ఎన్నికలలో అకాలీదళ్‌కు నాలుగు సీట్లు కేటాయించిన బీజేపీ ఈసారి అన్ని స్థానాల నుంచి తన అభ్యర్థులను నిలబెట్టవచ్చని అంటున్నారు. సీనియర్ సిక్కు నేత, మాజీ మంత్రి హరిశరణ్‌సింగ్ బల్లీ కాంగ్రెస్ గూటిని వీడి మళ్లీ బిజెపిలో చేరడం, ఆమ్ ఆద్మీ పార్టీ తరపున గత ఎన్నికలలో గెలిచి విధానసభ స్పీకరైన ఎం.ఎస్. ధీర్‌ను పార్టీలో చేర్చుకోవడం... బీజేపీ సిక్కు ఓటర్లను ఆక ట్టుకునే ప్రయత్నం చేస్తోందన్న విషయం స్పష్టమవుతోంది.
బల్లీ...బీజేపీపీలో చేరడంతో బీజేపీ, అకాలీదళ్‌ల మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. బల్లీ... హరిగనర్ నియోజకవర్గానికి నాలుగుసారు ప్రాతినిధ్యం వహించారు.1993 నుంచి 2013 వరకు హరినగర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే గత విధానసభ ఎన్నికల్లో బీజేపీ హరినగర్ సీటును అకాలీదళ్‌కు కేటాయించడంతో ఆగ్రహించిన బల్లీ కాంగ్రెస్‌లో చేరిపోయారు. హరినగర్ నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసిన ఆయన ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన జగ్‌దీప్ సింగ్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఇప్పుడు మళ్లీ ఆయన బీజేపీలోకి తిరిగి రావడంతో ఈసారి హరినగర్ సీటును అకాలీదళ్‌కు కేటాయించకపోవచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి.
బల్లీ తన కుమారుడి కోసం హరినగనర్‌టికెట్ ఆశిసున్నారని అంటున్నారు. అయితే అకాలీదళ్ ఈ సీటును వదులుకోవడానికి సుమఖంగా లేదు. గత విధానసభ ఎన్నికల సమయంలో తనకు కేటాయించిన నాలుగు సీట్లను తనకు ఇవ్వాలని ఆకాలీదళల్ అశిస్తోంది, ధీర్, బల్లీల చేరికతో సిక్కు ఓటర్లను ఆకట్టుకోగలదని బీజేపీ వర్గాలు అంటన్నాయి. బీజేపీ నేతగా బల్లీకి హరినగర్‌తో పాటు తిలక్‌నగర్, రాజోరీగార్డెన్, వాటి పరిసరప్రాంతాలలో బల్లీ ప్రభావం సిక్కు, పంజాబీ ఓటర్లపై ఉంటుందని అకాలీదళ్ వర్గాలు అంటున్నాయి.