సూపర్‌ స్టార్‌ సినిమాలో... | Simran and Nawazuddin Siddiqui join Rajinikanth's upcoming film | Sakshi
Sakshi News home page

సూపర్‌ స్టార్‌ సినిమాలో...

Published Fri, Jul 20 2018 2:21 AM | Last Updated on Thu, Sep 12 2019 10:40 AM

Simran and Nawazuddin Siddiqui join Rajinikanth's upcoming film - Sakshi

సిమ్రాన్, నవాజుద్దీన్‌ సిద్దిఖీ

రజనీకాంత్‌ హీరోగా ‘పిజ్జా’ ఫేమ్‌ కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాకు అనిరు«ద్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తారని, నటుడు విజయ్‌ సేతుపతి ఓ కీలక పాత్ర చేయనున్నారని ఇటీవల చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఇప్పుడు నటి సిమ్రాన్, బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్దిఖీలు ఈ సినిమా యూనిట్‌లోకి జాయిన్‌ అయ్యారు.

ఈ విషయాన్ని సన్‌ పిక్చర్స్‌ సంస్థ అధికారికంగా ప్రకటించింది. సిమ్రాన్‌ని ఏ పాత్రకు తీసుకున్నారనేది బయటపెట్టలేదు. అయితే కోలీవుడ్‌ ఊహల ప్రకారం ఆమెకు రజనీ సరసన నటించే గోల్డెన్‌ చాన్స్‌ దక్కిందట. ఈ సినిమాలో బాబీ సింహా, సానత్‌ రెడ్డి, మేఘా ఆకాశ్‌ కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement