ఇకనైనా ఆపండి.. వెంటనే నాకు సారీ చెప్పండి: నటి సిమ్రాన్ | Simran Slams Rumours On Movie With Thalapathy Vijay | Sakshi
Sakshi News home page

Simran: ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్నా.. కానీ ఇప్పుడు చెబుతున్నా

Published Sun, Sep 22 2024 12:37 PM | Last Updated on Sun, Sep 22 2024 12:47 PM

Simran Slams Rumours On Movie With Thalapathy Vijay

తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఇలా అందరూ హీరోల సరసన నటించిన హీరోయిన్ సిమ్రాన్.. ప్రస్తుతం తమిళ సినిమాలకే మాత్రమే పరిమితమైపోయింది. కీలక పాత్రల్లో అడపాదడపా నటిస్తోంది. ఉన్నట్టుండి సోషల్ మీడియాలో ఈమె షాకింగ్ పోస్ట్ పెట్టింది. తనపై రూమర్స్ పుట్టిస్తున్న వాళ్లపై మండిపడింది. వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేసింది.

సిమ్రాన్ ఏమంది?
'వేరే వాళ్లు చెప్పిన విషయాలు నా ఫ్రెండ్స్ నమ్మడం చూస్తుంటే చాలా బాధగా ఉంటుంది. ఇప్పటివరకు నేను సైలెంట్‌గా ఉన్నాను. కానీ ఇప్పుడు చెబుతున్నా. ఏ పెద్ద హీరోతోనూ పనిచేయాలనే కోరిక నాకు లేదు. ఇప్పటికే వారితో చాలా సినిమాల్లో చేశా. ఇప్పుడు నా లక్ష‍్యాలు వేరు. నా పరిమితులు నాకు తెలుసు. ఒకరు లేదా మరొకరితో ముడిపెడుతూ ఇన్నేళ్లుగా సోషల్ మీడియాలో ఏదో ఒకటి రాస్తూనే ఉన్నారు. నేను చాలా నిశ్శబ్దంగా ఉన్నాను'

(ఇదీ చదవండి: పిల్ల దెయ్యం సినిమా.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులో స్ట్రీమింగ్)

'నాకంటూ ఆత్మగౌరవం ఉంది. దానికే నా మొదటి ప్రాధాన్యత. కాబట్టి ఇకపైనా ఆపండి అని చెబుతున్నాను. ఈ ప్రచారాలని ఆపేందుకు ఎవరూ ప్రయత్నించలేదు. అలానే క్లారిటీ తీసుకునే విషయమై నన్ను సంప్రదించలేదు. సరిగ్గా చెప్పాలంటే నన్ను అసలు పట్టించుకోలేదు. నా పేరు ఎప్పుడు పోగొట్టుకోలేదు. సరైన విషయం కోసమే నిలబడ్డాను. ఇండస్ట్రీ నుంచి అదే కోరుకుంటున్నా. నాపై తప్పుడు వార్తలు రాస్తున్న వాళ్లు వెంటనే క్షమాపణలు చెప్పాలి' అని నటి సిమ్రాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

విజయ్ మూవీ రూమర్స్
సిమ్రాన్ ఇలా కోప్పడటానికి విజయ్‌తో సినిమా చేయనుందనే రూమర్సే కారణం. విజయ్‌ని హీరోగా పెట్టి ఈమె నిర్మాత కొత్త సినిమా తీయాలనుకుంటోందని, కానీ ఇతడు మాత్రం నిర్మాణం వద్దని ఈమెకు చెప్పాడని పుకార్లు వచ్చాయి. ఇప్పుడు వీటిపై స్పందిస్తూనే పరోక్షంగా ఈ పోస్ట్ పెట్టింది.

(ఇదీ చదవండి: అమెరికాలో పెళ్లి.. సమంతనే స్పెషల్ ఎట్రాక్షన్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement