భయపెట్టే సినిమాలకు ఉండే డిమాండ్ వేరు. మరీ ముఖ్యంగా దెయ్యం కథలతో మూవీ తీయాలే గానీ ఏ మాత్రం బాగున్నా సరే హిట్ చేసేస్తారు. అలా రీసెంట్ టైంలో అద్భుతమైన సక్సెస్ అందుకున్న హిందీ సినిమా 'ముంజ్య'. పెద్దగా పేరున్న యాక్టర్స్ లేనప్పటికీ విజయం సాధించింది. రూ.25 కోట్లు పెడితే రూ.140 కోట్ల వసూళ్లు సొంతం చేసుకుంది.
(ఇదీ చదవండి: 'ముంజ్య' సినిమా రివ్యూ తెలుగులో)
ఈ సినిమా ఆగస్టు 25న ఎలాంటి ప్రకటన లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. నిన్నటి వరకు కేవలం హిందీలో మాత్రమే అందుబాటులో ఉండేది. తాజాగా తెలుగు, తమిళ వెర్షన్స్ కూడా స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. హాట్‌స్టార్‌లో ఇది అందుబాటులో ఉంది.
'ముంజ్య' విషయానికొస్తే.. 1952లో గోట్యా పిల్లాడు అనుకోకుండా చనిపోతాడు. ముంజ్య అనే పిల్ల దెయ్యంగా మారిపోతాడు. కట్ చేస్తే ప్రస్తుతం పుణెలో బిట్టు అనే కుర్రాడు తల్లి, నానమ్మతో కలిసి జీవిస్తుంటాడు. కుక్కకి కూడా భయపడే ఇతడు.. ముంజ్య ఉండే చోటుకు వెళ్తాడు. అనుకోకుండా ఈ దెయ్యం బయటకొచ్చేలా చేస్తాడు. అప్పటినుంచి బిట్టు జీవితంలో పిల్ల దెయ్యం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ దెయ్యం బిట్టు వెనక పడటానికి కారణమేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ.
(ఇదీ చదవండి: తమిళ హీరోయిన్‌పై పోలీస్ కేసు.. అప్పటి గొడవ మళ్లీ)
Comments
Please login to add a commentAdd a comment