సమంత
ఒక స్టూడెంట్ టీచర్‌గా మారాలంటే బోలెడంత టైమ్ పడుతుంది. కానీ సమంత మాత్రం తక్కువ టైమ్‌లోనే స్టూడెంట్ నుంచి టీచర్ స్థాయికి ఎదిగారు. కానీ ఆషామాషీ టీచర్‌గా కాదు. తేడా వస్తే తాట తీసే కర్రసాము టీచర్ అట. శివకార్తికేయన్, సమంత జంటగా పొన్‌రామ్ దర్శకత్వంలో రూపొందిన తమిళ సినిమా ‘సీమరాజా’. ఇందులో కర్రసాము నేర్పించే టీచర్ సుదందిరదేవి పాత్రలో సమంత నటించారు. ఈ పాత్ర కోసం సమంత కష్టపడి కర్రసాము నేర్చుకున్నారు. 15 సార్లు మార్షల్ ఆర్ట్స్ క్లాసులకు వెళ్లారట.
అంటే ముందు స్టూడెంట్‌గా కర్రసాము క్లాసులకు వెళ్లిన సమంత, వెండితెరపై టీచర్‌గా మారారు. ఇందులో నటి సిమ్రాన్ విలన్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఈ సినిమాకు డి. ఇమ్మాన్ సంగీతం అందించారు. ‘సీమరాజా’ చిత్రం సెప్టెంబర్ 13న విడుదల కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే... పవన్‌కుమార్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రధారిగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ‘యు టర్న్’ సినిమా కూడా సెప్టెంబర్ 13నే విడుదల కానుండటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment