
హీరోయిన్ సిమ్రాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అప్పట్లో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా అగ్ర హీరోల సరసన నటించింది. తెలుగుతో పాటు తమిళంలోనూ సత్తాచాటింది. దక్షిణాది ఇండస్ట్రీలో సిమ్రాన్‌కు ఎంతో మంది అభిమానులున్నారు. అయితే సిమ్రాన్‌కు ఒక చెల్లెలు ఉండేది. ఆమె కూడా సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. కానీ ఊహించని పరిణామాలతో హీరోయిన్ చెల్లెలు ఆత్మహత్య చేసుకుంది. తాజాగా తన చెల్లిని తలుచుకుంటూ సిమ్రాన్ ఎమోషనల్ ట్వీట్ చేసింది.
సిమ్రాన్ ట్వీట్‌లో రాస్తూ.. 'నా అందమైన సోదరి మోనాల్‌కు జ్ఞాపకార్థం. నిన్ను ఎప్పటికీ మరచిపోలేను.' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన ఆమె అభిమానులు మిస్ యూ మోనాల్ సిస్టర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే గతంలో కోలీవుడ్‌కు చెందిన సుజిత్ అనే కొరియోగ్రాఫర్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగిన మోనాల్ ఆ తర్వాత అతడు మోసం చేయడంతో సూసైడ్ చేసుకుందని కథనాలు వెలువడ్డాయి. దీనిపై ఇప్పటికీ క్లారిటీ లేకపోవడంతో ఆమె ఆత్మహత్య మిస్టరీగానే మిగిలిపోయింది.
కాగా.. ఇంద్రధనుస్సు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది సిమ్రాన్ చెల్లెలు మోనాల్ నావెల్. తెలుగులో 'ఇష్టం' చిత్రంతో అరంగేట్రం చేసింది. స్టార్ హీరోయిన్ చెల్లెలిగా ఎంట్రీ ఇవ్వడంతో అతి తక్కువ సమయంలోనే క్రేజ్ అందుకుంది. అయితే ఆ తర్వాత ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. అయితే కొన్ని సినిమాల తర్వాత ఊహించని విధంగా ఆమె సూసైడ్ చేసుకోవడం అప్పట్లో ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. 2002, ఏప్రిల్ 14న తన ఫ్లాట్‌లోనే ఉరి వేసుకుని మోనాల్ నావెల్ చనిపోయింది. తాజాగా చెల్లిని గుర్తు చేసుకుంటూ సిమ్రాన్ తీవ్ర భావోద్వేగానికి గురైంది.
In loving memory of my beautiful sister Monal. You’ll be never forgotten 😘 pic.twitter.com/4E78Ol6PZz
— Simran (@SimranbaggaOffc) April 14, 2023
Comments
Please login to add a commentAdd a comment