ఏడాదికి రెండు సినిమాలు: సిమ్రాన్ | Simran announces launch of her production company | Sakshi
Sakshi News home page

ఏడాదికి రెండు సినిమాలు: సిమ్రాన్

Published Sat, Apr 4 2015 7:17 PM | Last Updated on Sat, Sep 2 2017 11:51 PM

సిమ్రాన్

సిమ్రాన్

చెన్నై:  దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు అగ్ర కథానాయకిగా వెలుగొందిన  సిమ్రాన్ సినిమా ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. సిమ్రాన్ తెలుగు, తమిళ భాషలలో అగ్రహీరోలు అందరి సరసన నటించారు. ఉత్తరాదికి చెందిన ఈ భామ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్,  కమల్హాసన్, అజిత్, విజయ్ వంటి హీరోల సరసన హిట్ చిత్రాలలో నటించారు.  నటిగా మంచి దశలో ఉండగానే ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు.  

సినిమా పట్ల తనకు ఉన్న ఆసక్తితో ప్రొడక్షన్ రంగంలో అడుగిడనున్నారు. ప్రొడక్షన్ కంపెనీ పేరుని 'సిమ్రాన్ అండ్ సన్స్'గా ప్రకటించారు. ఈ బ్యానర్పై ఏడాదికి రెండు చిత్రాలు నిర్మించనున్నట్లు తెలిపారు. తనకు సినిమా అంటే ఎంతో ఇష్టమని తెలిపారు. అందువల్లనే నిర్మాతగా దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement