
బ్యూనస్ ఎయిర్స్: నాలుగేళ్ల క్రితం కేవలం రెండు పతకాలతో సరిపెట్టుకున్న భారత బృందం ఈసారి యూత్ ఒలింపిక్స్‌లో అదరగొడుతోంది. ఫైవ్–ఎ–సైడ్ హాకీ పురుషుల విభాగంలో భారత జట్టు రజతం సొంతం చేసుకుంది. మలేసియాతో జరిగిన ఫైనల్లో భారత్ 2–4తో ఓడింది. స్వర్ణం–రజతం కోసం అర్జెంటీనాతో భారత మహిళల జట్టు కూడా తలపడనుంది. మహిళల రెజ్లింగ్ 43 కేజీల విభాగంలో భారత రెజ్లర్ సిమ్రన్ రజత పతకం సొంతం చేసుకుంది. ఫైనల్లో సిమ్రన్ 6–11తో ఎమిలీ (అమెరికా) చేతిలో ఓడింది.
నాలుగు రోజులు మిగిలి ఉన్న ఈ క్రీడల్లో ఇప్పటికే భారత్ 10 పతకాలతో తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. ఇప్పటివరకు మను భాకర్, సౌరభ్ (షూటింగ్), లాల్‌రినుంగా (వెయిట్‌లిఫ్టింగ్) స్వర్ణాలు సాధించగా... తబాబి దేవి (జూడో), తుషార్ (షూటింగ్), మెహులీ (షూటింగ్), లక్ష్య సేన్ (బ్యాడ్మింటన్), సిమ్రన్ (రెజ్లింగ్) రజతాలు గెలిచారు. 2010 యూత్ ఒలింపిక్స్‌లో భారత్ రెండు రజతాలు, ఆరు కాంస్యాలతో కలిపి మొత్తం ఎనిమిది పతకాలు సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment