
రజనీకాంత్
రజనీకాంత్ స్టూడెంట్స్‌కు పాఠాలు చెబితే ఎలా ఉంటుంది? రౌడీలను కంట్రోల్‌లో పెట్టాల్సిన మాస్ హీర్ క్లాస్‌గా స్టూడెంట్స్‌కు క్లాస్ తీసుకుంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందో తెలియాలంటే వచ్చే ఏడాది వరకూ ఆగాల్సిందే. రజనీకాంత్ హీరోగా ‘పిజ్జా’ ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఫస్ట్ టైమ్ రజనీకాంత్ çసరసన సిమ్రాన్ హీరోయిన్‌గా కనిపించనున్న చిత్రం ఇది. ఇందులో రజనీకాంత్ కాలేజ్ ప్రొఫెసర్‌గా కనిపిస్తారని చెన్నై టాక్.
ఇటీవల విడుదలైన రజనీ ‘కాలా’లో క్యారే సెట్టింగా? డైలాగ్ గుర్తు చేసుకుంటే, క్యా తలైవా.. క్లాసా? అని రజనీ మాస్ అభిమానులు ఆందోళన పడే అవకాశం ఉంది. బాధపడక్కర్లేదు. ‘రజనీకాంత్ సినిమాలో ఉండాల్సిన మాస్ అంశాలు మిస్ కాకుండా జాగ్రతపడుతున్నాం’ అని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ అంటున్నారు. ఫ్లాష్‌బ్యాక్ సీన్స్‌లో డాన్‌లా అలరిస్తారట. ఇందులో మూడు మేజర్ యాక్షన్ సీన్స్ ఉంటాయట. ఈ సినిమా డెహ్రాడూన్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం చెన్నైలో కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయింది. విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్ధిఖీ, సనత్ రెడ్డి, మేఘా ఆకాశ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment