బాహుబలిలో త్రిష ఇల్లన్న నయనతార ట్రైలర్ | Bahubali in the trailer sick Trisha illanna | Sakshi
Sakshi News home page

బాహుబలిలో త్రిష ఇల్లన్న నయనతార ట్రైలర్

Published Sat, Jul 11 2015 2:27 AM | Last Updated on Sun, Sep 3 2017 5:15 AM

Bahubali in the trailer sick Trisha illanna

బాహుబలిలో త్రిష ఇల్లన్న నయనతార ట్రైలర్
 

బాహుబలి శుక్రవారం ప్రపంచ వ్వాప్తం గా విడదలై విశేష ప్రజాదరణతో ప్రదర్శింపబడుతోంది. తమిళనాడులో అత్యధిక థియేటర్లలో వి డుదలైంది. ఈ చిత్రం ప్రదర్శింపబడుతున్న థి యేటర్లలో త్రిష ఇల్లన్న నయనతార చిత్ర ట్రైలర్ హల్‌చల్ చేయడం విశేషం. యువ సంగీత దర్శకుడు, నటుడు జీవీ.ప్రకాష్‌కుమార్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం త్రిష ఇల్లన్న నయనతార. కయల్ చిత్రం ఫేమ్ ఆనంది, మనీషామదవ్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని క్యామి యో ఫిలింస్ పతాకంపై నిర్మాత జయకుమార్ నిర్మిస్తున్నారు.

సీనియర్ నటి సిమ్రాన్ కీలక పా త్ర పోషిస్తున్నారు. నవ దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ పరిచయం అవుతున్న ఈ చిత్రం ఆడియో ఇటీవలే విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. చిత్ర ట్రైలర్ సోషల్ నెట్ వర్క్‌లో హల్‌చల్ చేస్తోంది. తాజాగా బాహుబలి చిత్రంతో పాటు థియేటర్లలో సంద డి చేస్తోంది. బాహుబలితో పాటు తమ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసే అవకాశం కల్పించినందుకు నిర్మాత కేఈ.జ్ఞానవేల్ రాజాకు త్రిష ఇల్లన్న నయనతార చిత్ర నిర్మాత కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్లు ఒక ప్రకటనలో పేర్కోన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement