కమల్‌తో నటించడం లేదు
కమల్‌హాసన్, సిమ్రాన్‌లది సక్సెస్‌ఫుల్ జంట. వీరిద్దరూ ఇంతకు ముందు పంపల్‌కే సంబంధం (తెలుగులో బ్రహ్మచారి) పంచతంత్రం తదితర చిత్రాల్లో నటించారు. ఆ సమయంలో కమల్ హాసన్, సిమ్రాన్‌లు సహజీవనం చేసినట్లు ప్రచారం జరిగింది. ఆ తరువాత సిమ్రాన్ తన చిన్ననాటి స్నేహితుడిని పెళ్లిచేసుకుని నటనకు దూరం అయ్యారు. మళ్లీ ఇప్పుడు నటనకు దగ్గరయిన సిమ్రాన్ ఇటీవల ఆహా కల్యాణం చిత్రంలో అతిథి పాత్రలో మెరిశారు. అసలు విషయం ఏమిటంటే ఒకప్పటి సూపర్ జోడీ అయిన కమల్, సిమ్రాన్‌లు కలిసి మళ్లీ నటించడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మలయాళంలో మంచి విజయాన్ని సాధించిన దృశ్యం చిత్రం తమిళ రీమేక్‌లో కమల్ హాసన్ నటించనున్నారు.
మలయాళంలో నటించిన నటి మీనానే తమిళంలోను కమల్ సరసన నటించనున్నట్లు మొదట ప్రచారం జరిగింది. దీన్ని మానా ఖండించారు. ఆమె దృశ్యం తెలుగు రీమేక్‌లో వెంకటేశ్ సరసన నటిస్తున్నారు. తమిళంలో నటి నదియా నటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఆ తరువాత నటి సిమ్రాన్ కమల్‌తో మరోసారి నటించడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని సిమ్రాన్ ఖండించారు. ఈ సందర్భంగా ఆమె గురువారం ఒక ప్రకటన విడుదల చేస్తూ దృశ్యం తమిళ రీమేక్‌లోనే కాదు ఏ భాషలోనూ తాను నటించడం లేదని స్పష్టం చేశారు. తన సినీ ప్రణాళికను త్వరలోనే వెల్లడించనున్నట్లు సిమ్రాన్ తెలిపారు.