‘‘అన్వేషి’ ట్రైలర్, విజువల్స్ చాలా బాగున్నాయి. సంగీతం, నేపథ్య సంగీతం కూడా చక్కగా ఉంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలి. చిత్ర యూనిట్‌కి అభినందనలు’’ అని నటి వరలక్ష్మీ శరత్ కుమార్ అన్నారు. విజయ్ ధరణ్ దాట్ల, సిమ్రాన్ గుప్తా, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా వీజే ఖన్నా దర్శకత్వం వహించిన చిత్రం ‘అన్వేషి’. టి.గణపతి రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని నవంబరు రెండో వారంలో విడుదలకి సన్నాహాలు చేస్తున్నారు.
గణపతి రెడ్డి పుట్టినరోజు(సోమవారం) సందర్భంగా ‘అన్వేషి’ మూవీ ట్రైలర్‌ను వరలక్ష్మి విడుదల చేశారు. టి.గణపతి రెడ్డి మాట్లాడుతూ– ‘‘నిర్మాతగా ‘అన్వేషి’ నా తొలి చిత్రం. సినిమా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు. ‘‘మంచి కథాంశంతో రూపొందిన మా సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు వీజే ఖన్నా, విజయ్ ధరణ్ దాట్ల, సిమ్రాన్ గుప్తా, అనన్య. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్, సహ నిర్మాతలు హరీష్ రాజు, శివన్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దుర్గేష్ మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment