Varalakshmi Sharath Kumar
-
ఓటీటీలో 'వరలక్ష్మి శరత్ కుమార్' పాన్ ఇండియా సినిమా
సౌత్ ఇండియాలో విలక్షణ నటిగా వరలక్ష్మీ శరత్ కుమార్‌కు గుర్తింపు ఉంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా సినిమా 'శబరి'. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మే 3న ఈ సినిమా విడుదల అయింది. సుమారు ఐదు నెలల తర్వాత ఓటీటీలో విడుదల కానుంది. దసర సందర్భంగా ఈమేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల ఈ మూవీని నిర్మించారు. అనిల్ కాట్జ్ దర్శకుడు.శబరి చిత్రంలో కూతురుని కాపాడుకునే తల్లి పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ పోషించారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోయింది. అయితే, ఇప్పుడు ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు సన్‌నెక్ట్స్ అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 11 నుంచి తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందని ఒక పోస్టర్ విడుదలైంది. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్‌తో పాటు బేబి కృతిక, గణేశ్ వెంకటరామన్, మైమ్ గోపి కీలకపాత్రలు పోషించారు.కథేంటంటే...సంజన(వరలక్ష్మి శరత్ కుమార్), అరవింద్(గణేష్ వెంకట్ రామన్) ప్రేమించి పెళ్లి చేసుకొని ముంబై వెళ్తారు. కొన్నాళ్ల తర్వాత ఓ కారణంతో అరవింద్‌ని వదిలేసి కూతురు రియా(బేబీ నివేక్ష)తో కలిసి విశాఖపట్నం వచ్చేస్తుంది. ఉద్యోగం కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంది. చివరకు తన కాలేజ్ ఫ్రెండ్, లాయర్ రాహుల్(శశాంక్) సహాయంతో ఓ కార్పొరేట్ కంపెనీలో జుంబా డ్యాన్స్ ట్రైనర్‌గా ఉద్యోగం సంపాదిస్తుంది. సిటీకి దూరంగా ఓ ఫారెస్ట్‌లో సింగిల్‌గా ఉన్న ఇంట్లోకి షిఫ్ట్ అవుతుంది. కూతురిని మంచి స్కూల్లో జాయిన్ చేస్తుంది. ఓ సారి తన బంధువుల ఇంటికి వెళ్లగా.. తన కోసం సూర్య (మైమ్ గోపి) అనే ఓ క్రిమినల్ వచ్చాడని, అడ్రస్ చెప్పమని బెదిరించారనే విషయం తెలుస్తుంది.అదే భయంతో ఇంటికి వెళ్లగా.. నిజంగానే సూర్య తనను వెంబడిస్తాడు. అతని నుంచి తప్పించుకునే క్రమంలో గాయాలపాలవుతుంది. మరోసారి రాహుల్ ఇంటికి వెళ్లి వస్తుండగా.. సూర్య కనిపిస్తాడు. భయంతో సంజన పరుగులు తీస్తుంది. చివరకు స్పృహతప్పి పోగా.. పోలీసులు కాపాడతారు. సూర్య గురించి పోలిసులు ఇన్వెస్టిగేట్ చేయగా.. అతను చనిపోయినట్లు తెలుస్తుంది. మరి సంజనను వెంబడిస్తున్న సూర్య ఎవరు? ఎందుకు వెంబడిస్తున్నాడు? ప్రేమించి పెళ్లి చేసుకున్న అరవింద్‌ని సంజన ఎందుకు వదిలేసి వచ్చింది? అరవింద్ చేసిన తప్పేంటి? కిడ్నాప్‌కి గురైన కూతురు రియాని కాపాడుకోవడం సంజన ఎం చేసింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
దర్శకుడిగా మారిన ప్రముఖ ఫోటోగ్రాఫర్
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ భరణి కే ధరన్ దర్శకుడిగా మారాడు. 40పైగా సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పని చేసిన ఆయన ‘సివంగి’కోసం మెగా ఫోన్ పట్టాడు. ఈ చిత్రంలో ఆనంది, వరలక్ష్మి శరత్ కుమార్, జాన్ విజయ్ కీలక పాత్రలు పోషించారు. ఫిమేల్ సెంట్రిక్ కథతో రూపొందుతున్న ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ హంగులతో పాటు కుటుంబం విలువలకు ప్రాధాన్యతనిచ్చే అంశాలు ఉంటాయని మేకర్స్ తెలిపారు. ఓ మహిళా తన జీవితం లో ఎదురైన అనూహ్యమైన పరిస్థితులకు ఎలా ఎదురు నిలిచింది అన్నది కథాంశం. డొమెస్టిక్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని దర్శకుడు భరణి తెలియజేశారు. -
‘శబరి’ మూవీ రివ్యూ
టైటిల్: శబరినటీనటులు: వరలక్ష్మీ శరత్ కుమార్, గణేష్ వెంకట్రామన్, శశాంక్, మైమ్ గోపి, సునయన, రాజశ్రీ నాయర్, మధునందన్, బేబీ నివేక్ష తదితరులునిర్మాత: మహేంద్ర నాథ్రచన-దర్శకత్వం: అనిల్ కాట్జ్సంగీతం: గోపి సుందర్సినిమాటోగ్రఫీ: రాహుల్ శ్రీవాత్సవ, నాని చమిడిశెట్టిఎడిటర్: ధర్మేంద్ర కాకరాల కథేంటంటే...సంజన(వరలక్ష్మి శరత్ కుమార్), అరవింద్(గణేష్ వెంకట్ రామన్) ప్రేమించి పెళ్లి చేసుకొని ముంబై వెళ్తారు. కొన్నాళ్ల తర్వాత ఓ కారణంతో అరవింద్‌ని వదిలేసి కూతురు రియా(బేబీ నివేక్ష)తో కలిసి విశాఖపట్నం వచ్చేస్తుంది. ఉద్యోగం కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంది. చివరకు తన కాలేజ్ ఫ్రెండ్, లాయర్ రాహుల్(శశాంక్) సహాయంతో ఓ కార్పొరేట్ కంపెనీలో జుంబా డ్యాన్స్ ట్రైనర్‌గా ఉద్యోగం సంపాదిస్తుంది. సిటీకి దూరంగా ఓ ఫారెస్ట్‌లో సింగిల్‌గా ఉన్న ఇంట్లోకి షిఫ్ట్ అవుతుంది. కూతురిని మంచి స్కూల్లో జాయిన్ చేస్తుంది. ఓ సారి తన బంధువుల ఇంటికి వెళ్లగా.. తన కోసం సూర్య (మైమ్ గోపి) అనే ఓ క్రిమినల్ వచ్చాడని, అడ్రస్ చెప్పమని బెదిరించారనే విషయం తెలుస్తుంది. అదే భయంతో ఇంటికి వెళ్లగా.. నిజంగానే సూర్య తనను వెంబడిస్తాడు. అతని నుంచి తప్పించుకునే క్రమంలో గాయాలపాలవుతుంది. మరోసారి రాహుల్ ఇంటికి వెళ్లి వస్తుండగా.. సూర్య కనిపిస్తాడు. భయంతో సంజన పరుగులు తీస్తుంది. చివరకు స్పృహతప్పి పోగా.. పోలీసులు కాపాడతారు. సూర్య గురించి పోలిసులు ఇన్వెస్టిగేట్ చేయగా.. అతను చనిపోయినట్లు తెలుస్తుంది. మరి సంజనను వెంబడిస్తున్న సూర్య ఎవరు? ఎందుకు వెంబడిస్తున్నాడు? ప్రేమించి పెళ్లి చేసుకున్న అరవింద్‌ని సంజన ఎందుకు వదిలేసి వచ్చింది? అరవింద్ చేసిన తప్పేంటి? కిడ్నాప్‌కి గురైన కూతురు రియాని కాపాడుకోవడం సంజన ఎం చేసింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే?ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. ఇలాంటి సినిమాల్లో థ్రిల్ ఎలిమెంట్స్‌తో పాటు ట్విస్టులు కూడా ఊహించని విధంగా ఉండాలి. అప్పుడే సినిమా రక్తి కట్టిస్తుంది. శబరిలోనూ ఆ రెండు ఉన్నాయి. కానీ డైరెక్టర్ కథను డీల్ చేయడంలో కాస్త తడబడ్డాడు. ఎంచుకున్న పాయింట్ బాగుంది కానీ దాని చుట్టు అల్లుకున్న కథ.. రాసుకున్న స్క్రీన్‌ప్లే అంతగా అకట్టుకోలేకపోయింది. చాలా సన్నివేశాలు గత సినిమాలను గుర్తు చేసేలా ఉన్నాయి. లాజిక్స్ విషయంలో సినిమాటిక్ లిబర్టీ ఎక్కువగా తీసుకున్నాడు. కథంతా ఒక్క పాయింట్ చుట్టే తిరగడంతో సాగదీతగా అనిపిస్తుంది. అయితే మదర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. బిడ్డను కాపాడుకోవడం కోసం తల్లి చేసే పొరాటం ఆకట్టుకుంటుంది.సిటీలో ఓ మెంటల్ ఆస్పత్రి నుంచి ఓ వ్యక్తి తప్పించుకొని వచ్చి ఇద్దరిని చంపి, సంజన కోసం వెతికె సీన్‌తో కథను ఆసక్తికరంగా ప్రారంభించాడు. ఆ తర్వాత కథను రెండేళ్ల ముందుకు తీసుకెళ్లాడు. సంజన ఉద్యోగం కోసం వెతకడం.. ఈ క్రమంలో ఆమె బాల్యం.. అరవింద్‌తో పెళ్లి.. విడిపోవడానికి గల కారణాలను చూపిస్తూ ఎమోషనల్‌గా కథనాన్ని నడిపించాడు. అయితే ప్రతీది డీటెల్డ్‌గా చూపించడంతో కథనం సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ఫస్టాఫ్ అంతా సింపుల్‌గా, నిదానంగా సాగినట్లు అనిపిస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. ఇక సెకండాఫ్‌లో ఒక్కో ట్విస్ట్ రివీల్ అవ్వడంతో కథపై ఆసక్తి పెరుగుతుంది. కానీ సూర్య గురించి ట్విస్ట్ తెలిసిన తర్వాత కథనం మళ్లీ రొటీన్‌గానే సాగుతుంది. క్లైమాక్స్ ముందు వచ్చే ట్విస్ట్ కాస్త థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. లాజిక్స్‌పై దృష్టిపెట్టి స్క్రీన్‌ప్లేని మరింత బలంగా రాసుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే..సంజనా పాత్రకు వరలక్ష్మి శరత్ కుమార్ పూర్తి న్యాయం చేసింది. ఇనాళ్లు విలనిజం ఉన్న పాత్రలు పోషించిన వరలక్ష్మీ.. ఇందులో డిఫరెంట్ రోల్ ప్లే చేసింది. కూతురుని కాపాడటం కోసం పోరాడే సాధారణ మహిళ పాత్రలో ఒదిగిపోయింది. ఇక మైమ్ గోపి విలనిజం బాగా వర్కౌట్ అయింది. రియాగా చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నివేక్ష అద్భుతంగా నటించింది. అరవింద్‌గా గణేష్ వెంకట్రామన్ చక్కగా నటించాడు. లాయర్‌గా శశాంక్, పోలీసు అధికారి శంకర్‌గా మధుసూధన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.సాంకేతికంగా సినిమా పర్వాలేదు. గోపీసుందర్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు కథలో భాగంగా వస్తుంటాయి. కానీ అవి గుర్తించుకునేలా ఉండవు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సినిమా నిడివి తక్కువే అయినా చాలా చోట్ల అనవసరపు సీన్స్ ఉన్నాయి. వాటిని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. OTT లొ చూడదగిన చిత్రంసన్ నెక్స్ట్ ఓటీటీలో శబరి సినిమా ని కుటుంబమంతా కలిసి చూడొచ్చు. ఈ సినిమాలో ఎలాంటి అనుచిత సన్నివేశాలు లేకపోవడం, మరియు ప్రధానంగా తల్లి ప్రేమ, పోరాటం వంటి భావోద్వేగాలు ఉండడం, దీన్ని ఫ్యామిలీతో కలసి చూసేందుకు అనుకూలంగా చేస్తుంది. సస్పెన్స్-థ్రిల్లర్ అయినప్పటికీ, ఈ చిత్రం పరోక్షంగా కుటుంబ విలువలను కూడా ప్రతిబింబిస్తుంది, అందువల్ల కుటుంబం మొత్తం ఓటీటీలో ఈ సినిమాను కలిసి చూడొచ్చు అంతే కాకుండా వరలక్ష్మి నటన అందరిని ఆకట్టుకుంటుంది.దసరా పండుగకు ఇంటిల్లిపాది కలసి చూసే సినిమాల లిస్ట్ లో శబరి ముందు ఉంటుంది. -
చాలా రోజుల తర్వాత ‘శబరి’లో డ్యాన్స్ చేశా: వరలక్ష్మీ శరత్‌కుమార్
‘తెలుగులో నేను చేసిన తొలి లేడీ ఓరియంటెడ్ చిత్రం ‘శబరి’. ఇది థ్రిల్లర్ మూవీ. తన బిడ్డను కాపాడుకోవడం కోసం ఓ తల్లి ఏం చేసింది? అనేది ఈ చిత్రకథ. చాలా రోజుల తర్వాత ఈ మూవీలో డ్యాన్స్ చేశాను’’ అని వరలక్ష్మీ శరత్‌కుమార్ అన్నారు. ఆమె లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘శబరి’. అనిల్ కాట్జ్ దర్శకత్వంలో మహర్షి కూండ్ల సమర్పణలో మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మే 3న ఈ సినిమా విడుదలవుతోంది. ఐదు భాషల ట్రైలర్స్ విడుదల వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. నటుడు వరుణ్ సందేశ్ తెలుగు ట్రైలర్‌ని, నిర్మాత మహేంద్రనాథ్ తమిళ ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. ‘‘నిర్మాత గురించి ఆలోచించే నటి వరలక్ష్మి. ‘శబరి’ నా తొలి సినిమా. ఆదరించాలి’’ అన్నారు మహేంద్రనాథ్ కూండ్ల. ఈ కార్యక్రమంలో నటుడు ఫణి, నటి సునయన , సినిమాటోగ్రాఫర్ నాని చమిడిశెట్టి, ఆర్ట్ డైరెక్టర్ ఆశిష్ తేజ్, కాస్ట్యూమ్ డిజైనర్ మానస నున్న, కొరియోగ్రాఫర్ రాజ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో ‘ అశ్వధామ’.. ఫస్ట్ లుక్ రిలీజ్
హృతిక్ శౌర్య, వరలక్ష్మీ శరతకుమార్ కీలక పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'అశ్వధామ’. 'హతః అక్షర’ అనేది ఉపశీర్షిక. చంద్ర శేఖర్ ఆజాద్ పాటిబండ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఫ్లిక్‌నైన్ స్టూడియో సంస్థ నిర్మిస్తోంది. హీరో పుట్టినరోజు(నవంబర్ 7) సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ చిత్రం బృందం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసింది. హృతిక్ శౌర్య 'ఓటు’ చిత్రంతో హీరోగా కెరీర్ ప్రారంభించారు. అందులో సాఫ్ట్ కుర్రాడిగా కనిపించిన ఆయన ఈ చిత్రంలో ప్రొపర్ కమర్షియల్ హీరోగా కనిపించనున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ "రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే లవ్, క్రైమ్ థ్రిల్లర్ ఇది. పక్కా కమర్షియల్ అంశాలతో తెరకెక్కుతోంది. వరలక్ష్మీ శరతకుమార్ పాత్ర గత చిత్రాలకు భిన్నంగా కొత్తగా ఉంటుంది. నెగటివ్ షేడున్న పాత్రలో ఒక సర్ప్రైజ్ ఆర్టిస్ట్ కనిపిస్తారు. హీరోకి మంచి చిత్రం అవుతుంది. కమర్షియల్ హీరోగా ఎలివేట్ అవుతాడు. ఆయన చేసిన యాక్షన ఎపిసోడ్స్‌కి టీమ్ అంతా ఫిదా అయింది. ఇప్పటి వరకూ జరిగిన రెండు షెడ్యూళ్లలో కీలక సన్నివేశాలతోపాటు యాక్షన్స సీన్స్ చిత్రీకరించాం’’ అని అన్నారు. -
అన్వేషి విజువల్స్ బాగున్నాయి
‘‘అన్వేషి’ ట్రైలర్, విజువల్స్ చాలా బాగున్నాయి. సంగీతం, నేపథ్య సంగీతం కూడా చక్కగా ఉంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలి. చిత్ర యూనిట్‌కి అభినందనలు’’ అని నటి వరలక్ష్మీ శరత్ కుమార్ అన్నారు. విజయ్ ధరణ్ దాట్ల, సిమ్రాన్ గుప్తా, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా వీజే ఖన్నా దర్శకత్వం వహించిన చిత్రం ‘అన్వేషి’. టి.గణపతి రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని నవంబరు రెండో వారంలో విడుదలకి సన్నాహాలు చేస్తున్నారు. గణపతి రెడ్డి పుట్టినరోజు(సోమవారం) సందర్భంగా ‘అన్వేషి’ మూవీ ట్రైలర్‌ను వరలక్ష్మి విడుదల చేశారు. టి.గణపతి రెడ్డి మాట్లాడుతూ– ‘‘నిర్మాతగా ‘అన్వేషి’ నా తొలి చిత్రం. సినిమా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు. ‘‘మంచి కథాంశంతో రూపొందిన మా సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు వీజే ఖన్నా, విజయ్ ధరణ్ దాట్ల, సిమ్రాన్ గుప్తా, అనన్య. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్, సహ నిర్మాతలు హరీష్ రాజు, శివన్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దుర్గేష్ మాట్లాడారు. -
మరోసారి పోలీస్ అధికారిగా..!
ఒక్కో చిత్రంలో ఒక్కో విధమైన పాత్రలో నటిస్తూ నటి వరలక్ష్మి శరత్ కుమార్ సత్తా చాటుతున్నారు. నాయకి, ప్రతినాయకి ఇలా పాత్ర ఏదైనా అందులో ఒదిగిపోయి నటిస్తూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఈమె తాజాగా పోలీస్ అధికారిగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నారు. దీనికి మారుతి నగర్ పోలీస్ స్టేషన్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇంతకు ముందు వరలక్ష్మి శరత్ కుమార్, సంతోష్ ప్రతాప్ జంటగా కొండ్రాల్ పావం వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన దయాళ్ పద్మనాభన్ ఈ సినిమాను స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. నటుడు ఆరవ్ కథానాయకుడిగా నటిస్తున్న ఇందులో సంతోష్ ప్రతాప్, మహత్ రాఘవేంద్ర, దర్శకుడు సుబ్రమణి శివ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర వివరాలను దర్శక నిర్మాత దయాళ్ పద్మనాభన్ వెల్లడిస్తూ.. ఇది పోలీసుల సాధికారతను చర్చించే కథాచిత్రంగా ఉంటుందన్నారు. చిత్రాలకు వాస్తవ పేర్లు పెట్టడం తనకు ఇష్టముండదన్నారు. అదేవిధంగా తాను ఆంజనేయ స్వామి భక్తుడినని, అందువల్ల ఈ చిత్రానికి మారుతీ నగర్ పోలీస్ స్టేషన్ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు తెలిపారు. ఇందులో నటి వరలక్ష్మి శరత్ కుమార్‌లోని మరో కొత్త కోణాన్ని చూస్తారన్నారు. కథ, కథనాలు వైవిధ్యంగా ఉంటాయని చెప్పారు. షూటింగ్ పూర్తి అయ్యిందని, ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. చిత్రం త్వరలోనే ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ స్ట్రీమింగ్కు సిద్ధం అవుతోందని దయాళ్ పద్మనాభన్ చెప్పారు. -
మా నమ్మకం నిజమైంది : సందీప్ కిషన్
‘‘మైఖేల్’ కథని, దర్శకుడు రంజిత్ని బలంగా నమ్మాం. ట్రైలర్‌కి వచ్చిన అద్భుతమైన స్పందన మా నమ్మకాన్ని నిజం చేసింది. కథ, కంటెంట్, మేకింగ్ పరంగా ‘మైఖేల్’ యూనివర్సల్‌గా రీచ్ అయ్యే సినిమా’’ అని హీరో సందీప్ కిషన్ అన్నారు. రంజిత్ జయకొడి దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా రూపొందిన చిత్రం ‘మైఖేల్’. విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్, దివ్యాంశా కౌశిక్, వరుణ్ సందేశ్, గౌతమ్ మీనన్ కీలక పాత్రల్లో నటించారు. నారాయణ్ దాస్ కె. నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి, పుసూ్కర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 3న విడుదలకానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రంజిత్ జయకొడి మాట్లాడుతూ– ‘‘నేను తమిళ్లో మూడు సినిమాలు తీశాను. తెలుగులో ‘మైఖేల్’ నా మొదటి చిత్రం. యాక్షన్, రొమాన్స్, ఎమోషన్.. ఇలా అన్ని అంశాలున్న చిత్రమిది’’ అన్నారు. ‘‘సందీప్ కిషన్‌కి సినిమా తప్ప మరో తపన ఉండదు. ఈ మూవీ కోసం ఆయన ఎంత కష్టపడ్డారో ట్రైలర్లోనే తెలుస్తోంది. ‘మైఖేల్’తో సక్సెస్ కొడతామనే నమ్మకం ఉంది’’ అన్నారు భరత్ చౌదరి. ‘‘రంజిత్ ‘మైఖేల్’ కథ చెప్పిన వెంటనే మరో ఆలోచన లేకుండా సినిమా చేద్దామని చెప్పా’’ అన్నారు పుస్కూర్ రామ్మోహన్ రావు. ‘‘మైఖేల్’ లాంటి మంచి సినిమాలో భాగం కావడం ఆనందంగా ఉంది’’ అన్నారు దివ్యాంశా కౌశిక్, వరుణ్ సందేశ్. -
డెవిల్ కపుల్స్.. భర్తతో కలిసి దుర్మార్గాలు చేసే భ ‘లేడీ విలన్స్’
విలన్.. హీరోయిన్ వెంట పడ్డాడు. లేకపోతే హీరోతో గొడవ పడ్డాడు. ఏదో ఒకటి. హీరోయిన్ విల న్ అసహ్యయించుకుంటుంది. అతన్ని ఛీ కొడుతుంది. హీరో ఏమో చావకొడతాడు. మూకీ నుంచి టాకీ వరకు ఒకటే స్టోరీ లైన్. విలన్ని చూసి భయపడే ఆడవాళ్లు ఉంటారు. చీదరించు కునే ఆడవాళ్లు ఉంటారు…మరి…విలన్‌కి జోడీ మాటేంటి ? ఈడూ జోడూ అంటే హీరో హీరో యిన్స్ మాత్రమేనా ? ఈ డౌట్ సహజంగా అందరికీ వస్తుంది కదా. ఇంతకీ తెలుగు సినిమాల్లో విలన్ జోడీలు లేరా? చిలకాగోరింకల్లా అనోన్యంగా ఉంటూ…కలిసికట్టుగా దుర్మార్గాలు చేసే డెవిల్ కపుల్స్ మీద ఒక లుక్ వేసేద్దామా.. ఏ సినిమా చూసినా హీరోకే జోడి. అది లవర్ కావచ్చు. లేదా భార్య కావచ్చు. కానీ…విలన్ కి మాత్రం జోడి ఉండదు. హీరోయిన్ చేత ఛీ కొట్టించుకునే విలన్లే అందరూ. ఒకవేళ భార్య రూపం లో జోడి ఉన్నా…ఆమె విలన్ని…విలన్ లానే చూస్తుంది. అలా కాకుండా విలన్ చేసే ప్రతి దుర్మార్గాన్ని సపోర్ట్ చేసే జోడి ఉంటే ? ఆమె భార్య కావచ్చు. ప్రేయసి కావచ్చు. తెలుగు సినిమాల్లో చాలా అరుదుగా విలన్‌కి అలాంటి జోడి దొరుకుతూ ఉంటుంది. అతను చేసే వెధవ పనున్నింటికీ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. విలన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. క్రాక్ సినిమా తో మరోసారి ఈ ట్రెండ్ ఫోకస్‌లోకి వచ్చింది. కఠారి కృష్ణకి అన్ని రకాలుగా అండగా ఉండే జయమ్మ క్యారెక్టర్ అందరినీ ఆకర్షించింది. ఈ చిత్రంలో కటారి కృష్ణ పాత్రని సముద్రఖని పోషించగా, జయమ్మగా వరలక్ష్మీ శరత్‌కుమార్ నటించింది. అర్జున్.. ఒక్కడు తర్వాత గుణశేఖర్, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన చిత్రం. అక్కా తమ్ముళ్ల సెంటిమెంట్ బ్యాగ్రౌండ్లో వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. మధుర మీనాక్షి టెంపుల్ సెట్ గురించి అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. ఈ సినిమాలో విలన్ బాల నాయ గర్ అయితే, అంతకు మించి అన్న టైప్‌లో విలనీజాన్ని పండించింది ఆండాల్ పాత్ర. బాల నాయగర్గా ప్రకాష్ రాజ్, ఆయన సతీమణి ఆండాల్గా సరిత నటించారు. భర్త మనసు తెలు సుకుని మరీ దుర్మార్గపు పనులు చేసే భార్యగా సరిత నటన ప్రశంసలు అందుకుంది. మహేశ్ బాబుతో పాటుగా సరితకు కూడా నంది స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది. విలన్‌కి జోడిగా ఉంటూ యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేసే ఆడవాళ్లు తెలుగు సినిమాల్లో తక్కు వే. మహేశ్‌బాబు హీరోగా, తేజ దర్శకత్వంలో వచ్చిన నిజం చిత్రంలో అలాంటి క్యారెక్టర్ని డిజై న్ చేశారు. నిజంలో విలన్‌గా గోపిచంద్ నటించారు. దేవుడు పాత్రలో గోపిచంద్ ప్రదర్శించిన విలనీజం అప్పట్లో పెద్ద సంచలనమైంది. ఈ సినిమాలో గోపిచంద్‌కి జంటగా రాశి నటించింది. హీరోయిన్ పాత్రల నుంచి లేడీ విలన్ క్యారెక్టర్లోకి రాశి జంప్ చేయడంపై కాస్త డిస్కషన్ కూడా సాగింది. మల్లి పాత్రలో గ్లామర్‌కి క్రూరత్వం మిక్స్ చేసి సిల్వర్ స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసింది రాశి. సినిమాకి, సినిమాకి పూర్తి భిన్నమైన జానర్స్‌ని ఎంపిక చేసుకునే హీరోల్లో రానా ఒకడు. నేనే రాజు, నేనే మంత్రి అందుకో ఉదాహరణ. జోగేంద్ర, రాధ చూడముచ్చటైన జంట. చివరి వరకు మూవీలో ఈ కపుల్ ట్రావెల్ చేయక పోయినా…కథ మలుపు తిరగడానికి మాత్రం కారణమౌ తుంది. అదే ఊరి సర్పంచ్ జంట. సర్పంచ్‌గా ప్రదీప్ రావత్ నటిస్తే…అతని భార్యగా బిందు చంద్రమౌళి నటించారు. ప్రదీప్ రావత్, బిందు చంద్రమౌళి ఇద్దరూ నెగిటివ్ రోల్స్‌లో తెగ జీవించేశారు. ఒక సినిమా. పది విభిన్నమైన క్యారెక్టర్లు. దశావతారంతో నట విశ్వరూపం చూపించేశారు కమలహాసన్. ఒక్కో పాత్ర పూర్తి భిన్నమైన నేపథ్యంతో సాగుతోంది. కథానాయకుడు, ప్రతికథా నాయకుడుతో పాటుగా కథని మలుపు తిప్పే కీలక పాత్రలన్నీ తానే పోషించారు. అందులో విలన్ పాత్ర ఫ్లెచర్కి జంటగా మల్లికా షరావత్ నటించింది. గోవింద్‌ని పట్టుకునే క్రమంలో ఫ్లెచర్కి మల్లికా షరావత్ అన్ని రకాలుగా సహకరిస్తుంది. అమ్మోరు. పాతికేళ్ల క్రితమే వి.ఎఫ్.ఎక్స్ తో సిల్వర్ స్క్రీన్ మీద అద్భుతాన్ని ఆవిష్కరించిన చిత్రం. అసలే స్పెషల్ ఎఫెక్ట్స్. ఆ పైన భక్తి చిత్రం. ఒకవైపు భక్తి భావోద్వేగం. మరోవైపు తొలి సారిగా కళ్ల ముందు కనిపిస్తున్న సరికొత్త సాంకేతిక మాయజాలం. అందుకే…అమ్మోరు అం తటి ఘన విజయం సాధించింది. దేశంలోని అన్ని భాషా చిత్ర పరిశ్రమల్లో చర్చ జరిగే చేసింది. అమ్మోరు చిత్రంలో ప్రధాన విలన్‌గా గోరఖ్ పాత్రలో రామిరెడ్డి నటించారు. అదే చిత్రంలో మరో విలన్‌గా బాబూమోహన్ నటించారు. బాబూ మోహన్‌కి జంటగా వడివుక్కరసి నటించారు. హీరో కుటుంబంలో చిచ్చు పెట్టడం దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ భార్యా, భర్తలిద్దరూ కలిసికట్టుగా ప్లాన్ చేస్తూ ఉంటారు. వీరిద్దరి మధ్య కుట్రల కోణంలో కెమిస్ట్రీ చాలా బాగా పండింది. టాలీవుడ్లో దాదాపు పదేళ్ల పాటు ఏలేసిన హీరోయిన్స్‌గా ఒకరు సిమ్రాన్. సహజంగా హీరో యిన్‌గా ఫేడౌట్ అయిన తర్వాత ఏ వదినగానో, అక్కగానో రీఎంట్రీ ఉంటుంది. కానీ…సిమ్రాన్ మాత్రం లేడీ విలన్‌గా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తమిళ మూవీ సీమరాజా తెలుగులోనూ అదే పేరుతో విడుదలైంది. ఈ చిత్రంలో విలన్ లాల్ భార్యగా నెగివిట్ షేడ్స్ ఉన్న రోల్ ప్లే చేసింది సిమ్రాన్. హీరోయిన్ సమంతాతో పాటుగా లాల్, సిమ్రాన్ ల విలనీజం కూడా సినిమాకి హైలెట్ గా నిలిచింది. -
మా నాన్న రియల్ హీరో: వరలక్షి శరత్ కుమార్
పాన్ ఇండియా నటుడు శరత్‌కుమార్‌ను అభిమానులు సుప్రీం హీరో అంటారు. తమిళ సినిమాలో కథానాయకుడిగా ఎన్నో విలక్షణ పాత్రలు చేసిన ఈయన ఆ తరువాత నటనకు అవకాశం ఉన్న ప్రధాన పాత్రల్లో నటించడానికి కూడా వెనుకాడడం లేదు. అయితే శరత్‌కుమార్ ఇప్పటికీ హీరోనే. తమిళం, తెలుగు, మలయాళం ఇలా పలు భాషల్లో పలు రకాల పాత్రలు పోషిస్తూ బిజీగా ఉన్నారు. మరో పక్క ఓ రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. అలాంటి ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి గురువారం తన 69వ పుట్టినరోజును జరుపుకున్నారు. చదవండి: ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్‌కు హైకోర్టులో ఊరట ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఈయనకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఆయన వారసురాలు వరలక్ష్మి శరత్‌కుమార్ కూడా తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకున్నారు. ఆమె హీరోయిన్గా మాత్రమే కాదు పాత్ర ప్రాధాన్యత ఉన్న రోల్స్ పోషిస్తూ విలక్షణ నటిగా రాణిస్తున్నారు. ఇక గురువారం తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా వరలక్ష్మి శుభాకాంక్షలు తెలుపుతూ ఓ వీడియో విడుదల చేసింది. అందులో ‘వయసు అనేది ఒక నంబరు మాత్రమే అని మీరు నిరూపించారు.. మాకు మాత్రమే కాకుండా మీ చుట్టూ ఉన్న ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఐ లవ్ యూ డాడీ..నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతోంది. View this post on Instagram A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar) -
‘థాంక్యూ చెల్లెమ్మ.. కానీ ఈరోజు నా బర్త్‌డే కాదు’
మహా నటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు కేరళ కుట్టీ కీర్తి సురేష్. అలనాటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలోని తన నటనకు జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు కీర్తి. మహానటి అనంతరం వరుసగా తెలుగులో అవకాశాలు దక్కించుకుంటూ తక్కువ కాలంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాబితాలోకి చేరిపోయారు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో బోలేడు సినిమాలు ఉన్నాయి. నితిన్‌కు జోడిగా 'రంగ్‌దే' తోపాటు మహేష్ ‘సర్కారు వారి పాట’లో కూడా నటిస్తున్నారు. ఇక తమిళ్లో సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నాతే మూవీలోనూ హీరోయిన్గా చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ఆమె నటిస్తోన్న లేడి ఓరియెంటెడ్ చిత్రం ‘గుడ్‌లక్ సఖి’. జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. కీర్తి సురేష్, వరలక్ష్మీ శరత్ కుమార్ మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ భామ వరలక్ష్మీ విషయంలో తప్పులో కాలేశారు. నేడు(మార్చి3) శరత్ కుమార్ కూతురు వరలక్ష్మీ పుట్టినరోజు అనుకొని ఆమెకు శుభాకాంక్షలు తెలిపింది. ‘హ్యపీ బర్త్‌డే వరూ.. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని, వచ్చే ఏడాదంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను. అంటూ ట్విటర్లో ట్వీట్ చేశారు. అయితే కీర్తి చేసిన పోస్టు సరిగానే ఉన్నప్పటికీ.. ఇక్కడే అసలైన కిటుకు దాగుంది. ఈ రోజు వరలక్ష్మీ పుట్టిన రోజు కాదు. ఆమె బర్త్‌డే మార్చి5. ఈ విషయం తెలియని కీర్తి విష్ చేయడంతో వరలక్ష్మీ స్పందించారు. ‘థాంక్యూ చెల్లెమ్మ..కానీ నా బర్త్‌డే ఈ రోజు కాదు.. మార్చి 5’ అంటూ ఫన్నీ రిప్లై ఇచ్చారు. కాగా కీర్తి పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో దీన్ని చూసిన నెటిజన్లు నవ్వులు పేల్చుతున్నారు. చదవండి: కీర్తి సురేష్ ఎవరితోనూ ప్రేమలో లేదు.. Thank u chellamm but my birthday is on 5th https://t.co/xz0fUYX5p0 — 𝑽𝒂𝒓𝒂𝒍𝒂𝒙𝒎𝒊 𝑺𝒂𝒓𝒂𝒕𝒉𝒌𝒖𝒎𝒂𝒓 (@varusarath5) March 3, 2021 -
క్రాక్ ఆరంభం
రవితేజ, శ్రుతీహాసన్ జంటగా రూపొందుతున్న చిత్రం ‘క్రాక్’. గతంలో రవితేజతో ‘డాన్ శీను’, ‘బలుపు’ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు మలినేని గోపీచంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సరస్వతి ఫిలిమ్ డివిజన్ బ్యానర్‌పై బి. మధు నిర్మిస్తున్నారు. బుధవారం ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఈ షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఉద్వేగభరితమైన కథా కథనాలతో ‘క్రాక్’ సినిమా రూపొందుతోందని, ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు, టీజర్‌కు మంచి స్పందన వచ్చిందని చిత్రబృందం పేర్కొంది. వరలక్ష్మీ శరత్‌కుమార్, సముద్రఖని, సుధాకర్ కొమాకుల, వంశీ చాగంటి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్. తమన్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, కెమెరా: జి.కె. విష్ణు -
నవ్వులే నవ్వులు
‘‘తొలిసారి నా పనిని సిన్సియర్‌గా, ఫుల్ ఎంజాయ్ చేస్తూ చేశాను. ఈ క్రెడిట్ మొత్తం దర్శకుడు నాగేశ్వరరెడ్డిగారిదే. ఈ సినిమాకు ఆయన దొరకడం నా అదృష్టం’’ అని సందీప్ కిషన్ అన్నారు. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్, హన్సిక, వరలక్ష్మీ శరత్‌కుమార్ నటించిన చిత్రం ‘తెనాలి రామకృష్ణ బిఎ.బిఎల్’. అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను హన్సిక, సందీప్ కిషన్ రిలీజ్ చేశారు. సందీప్‌కిషన్ మాట్లాడుతూ– ‘‘పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. సినిమా మొత్తం నవ్వులే. నేను చాలా కొత్తగా కనిపిస్తాను. అన్నీ తానై చక్కగా రూపొందించారు నాగేశ్వరరెడ్డిగారు’’అన్నారు. ‘‘నిర్మాతలు బాగా సహకరించారు. వాళ్లకో మంచి సినిమా ఇవ్వడమే నేను వాళ్లకు ఇచ్చే గిఫ్ట్. సినిమా బాగా వచ్చింది. నమ్మకంగా ఉన్నాం’’ అన్నారు నాగేశ్వరరెడ్డి. ‘‘ఈ సినిమాలో భాగమవ్వడం çహ్యాపీగా ఉంది’’ అన్నారు హన్సిక. ‘‘నాగేశ్వరరెడ్డి, మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చి ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాం’’ అన్నారు నాగిరెడ్డి. ‘‘మేము షూటింగ్‌కి వెళ్లకపోయినా నాగేశ్వరరెడ్డి వన్‌మ్యాన్ ఆర్మీగా అన్నీ చూసుకున్నాడు. సినిమా పెద్ద హిట్ అవుతుంది’’ అన్నారు సంజీవ్ రెడ్డి. ‘‘సంగీత దర్శకుడిగా ఇది నా 75వ సినిమా. అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్స్’’ అన్నారు సాయి కార్తీక్. -
పోలీస్ వ్యవసాయం
పోలీస్‌గా క్రిమినల్స్ పని పట్టాల్సిన పోలీసాఫీసర్ వ్యవసాయం చేస్తున్నారు. మాగాణి భూమిలో ట్రాక్టర్ ఎక్కి పొలం దున్నుతున్నారు. మరి.. ఈ పోలీసాఫీసర్ కహానీ ఏంటో తెలుసుకోవాలంటే ‘డానీ’ సినిమా చూడాల్సిందే. వరలక్ష్మీ శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘డానీ’. పీజీ మీడియా వర్క్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇందులో పోలీసాఫీసర్‌గా నటిస్తున్నారామె. ఆల్రెడీ ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైన సంగతి గుర్తుండే ఉంటుంది. ఎల్సీ సంతానమూర్తి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ చెన్నై పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. చిత్రీకరణలో భాగంగా వరలక్ష్మీ వ్యవసాయం చేశారు. ఆ ఫొటోలను షేర్ చేసి ఆనందపడిపోతున్నారు. -
40 నిమిషాల గ్రాఫిక్స్‌తో...
కమల్‌హాసన్ హీరోగా నటించిన ‘నియా’ చిత్రం తమిళంలో ఘన విజయం సాధించింది. దానికి సీక్వెల్‌గా ‘నియా–2’ పేరుతో తమిళంలో, ‘నాగకన్య’ పేరుతో తెలుగులో ఓ చిత్రాన్ని రూపొందించారు. ‘జర్నీ, రాజారాణి’ చిత్రాల ఫేమ్ జై హీరోగా, వరలక్ష్మీ శరత్ కుమార్, రాయ్‌లక్ష్మి, కేథరిన్ థెరిస్సా ప్రధాన పాత్రల్లో నటించారు. ఎల్.సురేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఈనెల 24న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. లైట్ హౌస్ సినీ మ్యాజిక్ అధినేత కె.ఎస్.శంకర్ రావు తెలుగులో విడుదల చేస్తున్నారు. కె.ఎస్.శంకర్ రావు మాట్లాడుతూ– ‘‘పాము నేపథ్యంలో వచ్చిన ‘నోము, దేవి, పున్నమినాగు, అమ్మా నాగమ్మ’ వంటి చిత్రాలెన్నో ప్రేక్షకాదరణకు నోచుకున్నాయి. ఇప్పుడు మళ్లీ పాము కథాంశాన్ని ఎంచుకుని నేటి నవీన సాంకేతికతను మిళితం చేశారు. ముఖ్యంగా నలభై నిమిషాల కాలనాగు గ్రాఫిక్స్ ఈ చిత్రానికి హైలైట్. హారర్ కథాంశంతో ఆద్యంతం ఆకట్టుకునే ఈ చిత్రంలో పాము చేసే విన్యాసాలు, మనిషి పాముగా మారే సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో నిజమైన కోబ్రాను వాడాలనుకున్నాం. అందుకోసం బ్యాంకాక్ కూడా వెళ్లాం. కానీ ఒరిజనల్ పామును షూటింగ్లో ఉపయోగించడానికి వీలుకాలేదు. దాంతో గ్రాఫిక్స్‌లో చూపించాం’’ అన్నారు ఎల్.సురేష్. ‘‘వెండితెరపై కాలనాగును చూపించాలన్న ఉద్దేశ్యంతో ఇండోనేషియాలో పాములకు శిక్షణ ఇచ్చే నిపుణులను కలిశాం. వారి దగ్గర 20 నుంచి 28 అడుగుల పొడవున్న కోబ్రాలు ఉన్నాయి. వాటిపై చిత్రీకరణ జరిపి కొన్ని సీన్లను గ్రాఫిక్స్‌లో ఉపయోగించాం’’ అని గ్రాఫిక్స్ నిపుణుడు వెంకటేష్ చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: రాజావెల్ మోహన్, సంగీతం: షబ్బీర్. -
ఐరన్ లేడీ!
ఆ మధ్య జయలలిత మీద వరుసగా బయోపిక్స్ అనౌన్స్ చేసింది తమిళ ఇండస్ట్రీ. ఏయల్ విజయ్, ప్రియదర్శిని, భారతీరాజా దర్శకులు అనే వార్త వచ్చింది. ఇప్పుడు ఈ ముగ్గురిలో దర్శకురాలు ప్రియదర్శిని ఒక అడుగు ముందుకువేసి ‘ఐరన్‌లేడీ’ అంటూ టైటిల్ పోస్టర్ని రిలీజ్ చేశారు. ఈ బయోపిక్‌లో వరలక్ష్మీ శరత్‌కుమార్ టైటిల్ రోల్ చేస్తారని సమాచారం. వచ్చే నెలలో ఓ గ్రాండ్ ఓపెనింగ్ ఫంక్షన్ నిర్వహించి, ఆ కార్యక్రమంలో నటీనటులను అనౌన్స్ చేయాలనుకుంటున్నారట. ‘‘ఎప్పటికీ తమిళుల గుండెల్లో ఉండిపోయేటువంటి జీవితాన్ని గడిపారు జయలలితగారు. ఈ సినిమా కచ్చితంగా ఆవిడకు మంచి నివాళిలా ఉండేలా ప్లాన్ చేస్తున్నాం’’ అని ప్రియదర్శిని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 24న జయలలిత పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను స్టార్ట్ చేయనున్నారు. -
సూపర్ సవాల్
అడుగులు ముందుకు వేయడానికి చెవులకు, బ్రెయిన్‌కి పని చెబుతున్నారు కథానాయిక వరలక్ష్మీ శరత్‌కుమార్. అంత అందమైన కళ్లు ఉంటే ఇలా ఎందుకు చేస్తున్నారు? అంటే నిజ జీవితంలో చేయడం లేదు. సినిమాలో క్యారెక్టర్ కోసం చేస్తున్నారు. ఆల్రెడీ అరడజను సినిమాలతో బిజీగా ఉన్న వరలక్ష్మీ మరో సినిమాకు పచ్చజెండా ఊపారు. జేకే అనే అతను ఈ సినిమా ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో బ్లైండ్ క్యారెక్టర్ చేస్తున్నారు వరలక్ష్మీ. ‘‘కొత్త సినిమా మొదలైంది. ప్రేక్షకుల ఆశీర్వాదం కావాలి. తొలిసారి బ్లైండ్ క్యారెక్టర్లో నటించబోతున్నాను. ఇది నాకు సూపర్ చాలెంజింగ్ రోల్. సూపర్ ఎగై్జటింగ్‌గా ఉంది’’ అని పేర్కొన్నారు వరలక్ష్మీ శరత్ కుమార్. ఈ సినిమాకు శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు. మాథ్యూ ఛాయాగ్రాహకుడు. -
వెల్వెట్ నగరంలో...
హీరోయిన్గా, కుదిరితే క్యారెక్టర్ ఆర్టిస్టుగా, వీలైతే విలన్‌గా.. ఇలా పాత్ర ఏదైనా మనసుకు నచ్చితే చాలు వెంటనే నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు వరలక్ష్మీ శరత్‌కుమార్. ఆల్రెడీ విజయ్, ధనుష్, ‘జయం’ రవి సినిమాల్లో కీలక పాత్రలు చేస్తున్నారు వరలక్ష్మీ. ఇక ఆమె కథానాయికగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘వెల్వెట్ నగరం’. మనోజ్ కుమార్ దర్శకత్వంలో ఈ ఉమెన్ సెంట్రిక్ థ్రిల్లర్ మూవీ రూపొందుతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విజయ్ సేతుపతి రిలీజ్ చేశారు. ఆ నెక్ట్స్ చిత్రబృందం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది. వరలక్ష్మీ రోల్ డిఫరెంట్‌గా ఉంటుందని పోస్టర్ చూస్తే అర్థమవుతోంది కదూ. అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు భగత్ కుమార్ కెమెరా వర్క్ చేస్తున్నారు. మేకర్ స్టూడియో ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణŠ కార్తీక్ నిర్మిస్తున్నారు. -
హ్యాపీ జర్నీ
హీరోయిన్ వరలక్ష్మీ శరత్‌కుమార్ ఆనందానికి అవధుల్లేవ్. కారణం ఏంటో తెలుసా? విజయ్ సినిమా సెట్లో జాయిన్ అవ్వడమే. ‘తుపాకి, కత్తి’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా మరో చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. కీర్తీ సురేష్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో వరలక్ష్మీ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. చెన్నైలో జరుగుతోన్న ఈ సినిమా సెట్లోకి శుక్రవారం ఫస్ట్ టైమ్ ఎంటర్ అయ్యారు వరలక్ష్మీ ‘‘విజయ్ సార్‌తో నేను నటిస్తోన్న సినిమా హ్యాపీ జర్నీ సారై్టంది. చాలా సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు వరలక్ష్మీ శరత్ కుమార్. ఇదిలా ఉంటే.. ఈ సినిమా మేజర్ షూటింగ్‌ను చెన్నైలోనే చేస్తారట. స్మాల్ షెడ్యూల్ కోసం ఫారిన్ వెళ్తారట. అలాగే హీరో విజయ్ బర్త్‌డే సందర్భంగా ఈ నెల 22న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది దీపావళికి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
వరలక్ష్మి ప్రేమలో పడిందా?
తమిళసినిమా: నటి వరలక్ష్మీశరత్కుమార్ది కన్యరాశియేనా? ఈ బ్యూటీ ప్రేమలో పడ్డారా, లేదా? ఏమిటీ అర్థం పర్థం లేని ప్రశ్నలు అని అనుకుంటున్నారా? దానికో కథ ఉందంది. నటి వరలక్ష్మీశరత్‌కుమార్ కథానాయకిగా ఇప్పుడు చాలా బిజీ. కోలీవుడ్‌లో వరుస పెట్టి అవకాశాలు వచ్చేస్తున్నాయి. తాజాగా యువ నటుడు విమల్‌తో డ్యూయెట్లు పాడేస్తున్నారు. ఈ చిత్రం పేరు కన్యరాశి. ఇంతకు ముందు ఇదే పేరుతో నటుడు ప్రభు నటించిన చిత్రం మంచి విజయాన్ని సాధించిందన్నది గమనార్హం. విమల్, వరలక్ష్మీశరత్కుమార్ల కన్యరాశి చిత్రాన్ని కింగ్ మూవీమేకర్స్ పతాకంపై పి.షమీం ఇబ్రహీం నిర్మిస్తున్నారు. దీనికి ఎస్.ముత్తుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ముఖ్యపాత్రలను పాండిరాజన్, రోబోశంకర్, యోగిబాబు నటిస్తున్నారు. ఛాయాగ్రహణం ఎస్.సెల్వకుమార్, సంగీతాన్ని విశాల్ చంద్రశేఖరన్ అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది వినోదానికి పెద్ద పీట వేసే ఫ్యామిలీ ఎంటర్టెయినర్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. విమల్ కుటుంబానికి చెందిన అందరిదీ కన్యరాశినే నని చెప్పారు. అదే విధంగా అందరూ ప్రేమ వివాహమే చేసుకుంటారని తెలిపారు. అలాంటిది విమల్ మాత్రం తల్లిదండ్రులు కుదిర్చిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని పట్టుపడతాడన్నారు. అలాంటి సమయంలో వాళ్ల ఇంటికి ఎదురింట్లో వరలక్ష్మి కుటుంబం కొత్తగా దిగుతారన్నారు. ఈ రెండు కుటుంబాల మధ్య పరిచయం ఏర్పడుతుందని తెలిపారు. ఆ తరువాత ఎం జరిగిందన్నది వినోదాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం కన్యరాశి అని చెప్పారు. ఇంతకీ వరలక్ష్మీది కన్యరాశియేనా, విమల్ ఈమె ప్రేమలో పడ్డాడా? తనే ఆయన లవ్‌లో పడిందా? అన్న ఫుల్ కామెడీతో కూడిన ఫ్యామిలీ ఎంటర్టెయినర్గా కన్యరాశి చిత్రం ఉంటుందని దర్శకుడు తెలిపారు. -
విశాల్‌తో రొమాన్స్‌కు సై అంటున్న..
తమిళసినిమా: నటుడు విశాల్‌కు నటి వరలక్ష్మీశరత్‌కుమార్‌కు మధ్య ప్రేమాయణం గురించి ఆ మధ్య కథలు కథలుగా ప్రచారమైన సంగతి తెలిసిందే.ఈ జంట మదగజరాజా అనే చిత్రంలో కలిసి నటించారు. ఆ సమయంలోనే వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని, అది ప్రేమగా మారి పెళ్లి చేసుకునే స్థాయికి చేరిందనే ప్రచారం హల్చల్ చేసింది. అలాంటిది ఆ తరువాత విశాల్‌కు వరలక్ష్మికి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయనే ప్రచారం జోరందుకుంది. అలా వదంతుల పర్వం కొనసాగుతున్న సమయంలో ఇటీవల ఒక కార్యక్రమంలో విశాల్‌తో పాటు వరలక్ష్మీశరత్‌కుమార్ పాల్గొన్నారు. ఆ సందర్భంలో వరలక్ష్మీ విశాల్‌ను కామరాజర్ రేంజ్‌కి పొగిరేశారు. విశాల్ కూడా కామరాజర్లా ప్రజల కోసం పనిచేస్తానుగానీ ఆయన మాదిరి పెళ్లి చేసుకోకుండా ఉండను అని పేర్కొనడంతో పాటు త్వరలోనే లక్ష్మీలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని అన్నారు.దీంతో విశాల్‌కు వరలక్ష్మీశరత్‌కుమార్ మధ్య మళ్లీ ప్రేమ చిగురించిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. వాటిని బలపరచే విధంగా ఈ సంచలన జంట మళ్లీ కలిసి నటించడానికి సిద్ధమవుతున్నారు. విశాల్ హీరోగా నటిస్తూ నిర్మించనున్న సండైకోళీ–2 చిత్రంలో వరలక్ష్మీశరత్‌కుమార్ నటించనున్నారు. అయితే ఇందులో కథానాయకిగా కీర్తీసురేశ్ నటించనున్నారు. మరి వరలక్ష్మీశరత్‌కుమార్ పాత్ర ఏమిటనేగా మీ ఆసక్తి. ఇందులో తనకు బావ అయిన విశాల్‌నే పెళ్లి చేసుకుంటానని కంకణం కట్టుకునే యువతిగా చిత్రంలో నటించనున్నారట. అయితే విశాల్ మాత్రం నటి కీర్తీసురేశ్‌ను ప్రేమిస్తారట. దీంతో విశాల్‌కు వరలక్ష్మీకి మధ్య వార్ నడుస్తోందట. ఇంతకు ముందు విశాల్ నటించిన తిమిరు చిత్రంలో నటి శ్రేయారెడ్డి పాత్ర తరహాలో సండైకోళి–2 చిత్రంలో వరలక్ష్మీశరత్‌కుమార్ పాత్ర ఉంటుందని çకోలీవుడ్ వర్గాల సమాచారం.