వరలక్ష్మి ప్రేమలో పడిందా? | vimal, varalakshmi sarathkumar Movie is Kanni Rasi | Sakshi
Sakshi News home page

వరలక్ష్మి ప్రేమలో పడిందా?

Published Sun, Feb 18 2018 4:13 AM | Last Updated on Sun, Feb 18 2018 4:14 AM

vimal, varalakshmi sarathkumar Movie is Kanni Rasi - Sakshi

కన్యరాశి చిత్రంలో ఓ దృశ్యం

తమిళసినిమా: నటి వరలక్ష్మీశరత్‌కుమార్‌ది కన్యరాశియేనా? ఈ బ్యూటీ ప్రేమలో పడ్డారా, లేదా? ఏమిటీ అర్థం పర్థం లేని ప్రశ్నలు అని అనుకుంటున్నారా? దానికో కథ ఉందంది. నటి వరలక్ష్మీశరత్‌కుమార్‌ కథానాయకిగా ఇప్పుడు చాలా బిజీ. కోలీవుడ్‌లో వరుస పెట్టి అవకాశాలు వచ్చేస్తున్నాయి. తాజాగా యువ నటుడు విమల్‌తో డ్యూయెట్లు పాడేస్తున్నారు. ఈ చిత్రం పేరు కన్యరాశి. ఇంతకు ముందు ఇదే పేరుతో నటుడు ప్రభు నటించిన చిత్రం మంచి విజయాన్ని సాధించిందన్నది గమనార్హం.

విమల్, వరలక్ష్మీశరత్‌కుమార్‌ల కన్యరాశి చిత్రాన్ని కింగ్‌ మూవీమేకర్స్‌ పతాకంపై పి.షమీం ఇబ్రహీం నిర్మిస్తున్నారు. దీనికి ఎస్‌.ముత్తుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ముఖ్యపాత్రలను పాండిరాజన్, రోబోశంకర్, యోగిబాబు నటిస్తున్నారు. ఛాయాగ్రహణం ఎస్‌.సెల్వకుమార్, సంగీతాన్ని విశాల్‌ చంద్రశేఖరన్‌ అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది వినోదానికి పెద్ద పీట వేసే ఫ్యామిలీ ఎంటర్‌టెయినర్‌ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు.

విమల్‌ కుటుంబానికి చెందిన అందరిదీ కన్యరాశినే నని చెప్పారు. అదే విధంగా  అందరూ ప్రేమ వివాహమే చేసుకుంటారని తెలిపారు. అలాంటిది విమల్‌ మాత్రం తల్లిదండ్రులు కుదిర్చిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని పట్టుపడతాడన్నారు. అలాంటి సమయంలో వాళ్ల ఇంటికి ఎదురింట్లో వరలక్ష్మి కుటుంబం కొత్తగా దిగుతారన్నారు. ఈ రెండు కుటుంబాల మధ్య పరిచయం ఏర్పడుతుందని తెలిపారు. ఆ తరువాత ఎం జరిగిందన్నది వినోదాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం కన్యరాశి అని చెప్పారు. ఇంతకీ వరలక్ష్మీది కన్యరాశియేనా, విమల్‌ ఈమె ప్రేమలో పడ్డాడా? తనే ఆయన లవ్‌లో పడిందా? అన్న ఫుల్‌ కామెడీతో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టెయినర్‌గా కన్యరాశి చిత్రం ఉంటుందని దర్శకుడు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement