
సాయి కార్తీక్, నాగేశ్వరరెడ్డి, హన్సిక, సందీప్ కిషన్, ఛోటా కె. నాయుడు
‘‘తొలిసారి నా పనిని సిన్సియర్‌గా, ఫుల్ ఎంజాయ్ చేస్తూ చేశాను. ఈ క్రెడిట్ మొత్తం దర్శకుడు నాగేశ్వరరెడ్డిగారిదే. ఈ సినిమాకు ఆయన దొరకడం నా అదృష్టం’’ అని సందీప్ కిషన్ అన్నారు. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్, హన్సిక, వరలక్ష్మీ శరత్‌కుమార్ నటించిన చిత్రం ‘తెనాలి రామకృష్ణ బిఎ.బిఎల్’. అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను హన్సిక, సందీప్ కిషన్ రిలీజ్ చేశారు. సందీప్‌కిషన్ మాట్లాడుతూ– ‘‘పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఇది. సినిమా మొత్తం నవ్వులే. నేను చాలా కొత్తగా కనిపిస్తాను. అన్నీ తానై చక్కగా రూపొందించారు నాగేశ్వరరెడ్డిగారు’’అన్నారు.
‘‘నిర్మాతలు బాగా సహకరించారు. వాళ్లకో మంచి సినిమా ఇవ్వడమే నేను వాళ్లకు ఇచ్చే గిఫ్ట్. సినిమా బాగా వచ్చింది. నమ్మకంగా ఉన్నాం’’ అన్నారు నాగేశ్వరరెడ్డి. ‘‘ఈ సినిమాలో భాగమవ్వడం çహ్యాపీగా ఉంది’’ అన్నారు హన్సిక. ‘‘నాగేశ్వరరెడ్డి, మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చి ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాం’’ అన్నారు నాగిరెడ్డి. ‘‘మేము షూటింగ్‌కి వెళ్లకపోయినా నాగేశ్వరరెడ్డి వన్‌మ్యాన్ ఆర్మీగా అన్నీ చూసుకున్నాడు. సినిమా పెద్ద హిట్ అవుతుంది’’ అన్నారు సంజీవ్ రెడ్డి. ‘‘సంగీత దర్శకుడిగా ఇది నా 75వ సినిమా. అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్స్’’ అన్నారు సాయి కార్తీక్.
Comments
Please login to add a commentAdd a comment