కడుపుబ్బా నవ్వుకుంటారు | tenali ramakrishna babu trailer launch | Sakshi
Sakshi News home page

కడుపుబ్బా నవ్వుకుంటారు

Published Mon, Nov 11 2019 6:32 AM | Last Updated on Mon, Nov 11 2019 6:32 AM

tenali ramakrishna babu trailer launch - Sakshi

‘‘కర్నూలు జిల్లాకు చెందిన దర్శక– నిర్మాతలు కలిసి ‘తెనాలి రామకృష్ణ: బీఏ బీఎల్‌’ సినిమాను రూపొందించారు. ఈ సినిమా మేకింగ్‌ విషయంలో నన్ను సంప్రదిస్తే నా వంతు సాయం చేశాను. సందీప్‌ చక్కగా నటించాడు. దర్శక–నిర్మాతలతో పాటు చిత్రబృందానికి అభినందనలు’’ అని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ అన్నారు. సందీప్‌కిషన్, హన్సిక జంటగా నటించిన తాజా చిత్రం ‘తెనాలి రామకృష్ణ: బీఏ బీఎల్‌’. ‘కేసులు ఇవ్వండి ప్లీజ్‌’ అనేది ఉపశీర్షిక. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించారు. జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్‌రెడ్డి, రూపా జగదీష్, ఇందుమూరి శ్రీనివాసులు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. కర్నూలులో జరిగిన ప్రీ–రిలీజ్‌ వేడుకలో సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ను టీజీ వెంకటేశ్‌ విడుదల చేశారు.

సందీప్‌కిషన్‌ మాట్లాడుతూ–‘‘మా చిత్రబృందంలో తెనాలి రామకృష్ణుడు నాగేశ్వరరెడ్డిగారే. ఆయనలాంటి దర్శకుడు ప్రస్తుతం నాకు దొరకడం నా అదృష్టం. ఈ సినిమా చూసి ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకుంటారు’’ అన్నారు. ‘‘సందీప్‌ కెరీర్‌లోనే ఈ సినిమా పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నా’’ అన్నారు జి. నాగేశ్వరరెడ్డి. ‘‘ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి. ‘‘కర్నూలులో 18రోజులు చిత్రీకరణ జరిపాం. సినిమా వినోదాత్మకంగా ఉంటుంది’’ అన్నారు నిర్మాతలు. ‘‘కర్నూలులో చిత్రీకరణ జరుపుకున్న సినిమాలన్నీ పెద్ద విజయం సాధించాయి. ఈ సినిమా కూడా హిట్‌ కావాలి’’ అన్నారు కర్నూలు మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ. హన్సిక, సంగీత దర్శకుడు సాయి కార్తీక్, నటుడు సప్తగిరి, ఎడిటర్‌ గౌతంరాజు, అశోక్‌కుమార్, కోట్ల హర్షవర్ధన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
  ∙కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, టి.జి.వెంకటేశ్, సందీప్‌ కిషన్, జి.నాగేశ్వరరెడ్డి, సంజీవ్‌ రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement