మెగాస్టార్‌ చేతుల మీదుగా గల్లీరౌడీ ట్రైలర్‌ | Chiranjeevi Launch Sundeep Kishan Gully Rowdy Movie Trailer | Sakshi
Sakshi News home page

మెగాస్టార్‌ చేతుల మీదుగా గల్లీరౌడీ ట్రైలర్‌

Published Mon, Sep 13 2021 1:36 PM | Last Updated on Mon, Sep 13 2021 1:36 PM

Chiranjeevi Launch Sundeep Kishan Gully Rowdy Movie Trailer - Sakshi

సందీప్‌కిషన్‌, నేహాశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘గల్లీరౌడీ’. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ కోన వెంకట్‌ సమర్పణలో ఎంవీవీ సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ నెల 17న గల్లీరౌడీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఈ మూవీ ట్రైలర్‌ను మెగాస్టార్‌ చిరంజీవి విడుదలచేశారు. వినోదం, యాక్షన్‌ అంశాలతో ఆద్యంతం ట్రైలర్‌ ఆసక్తికరంగా సాగింది.

రౌడీయిజం చేయడం ఇష్టం లేకపోయినా ప్రేమించిన అమ్మాయి కోసం రౌడీగా చెలామణి అవుతూ సందీప్‌కిషన్‌ కనిపిస్తున్నాడు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘వారసత్వంగా రౌడీయిజాన్ని వృత్తిగా ఎంచుకున్న ఓ యువకుడి కథ ఇది. ఓ అమ్మాయి కారణంగా ఆ రౌడీ జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందనేది నవ్విస్తూనే ఉత్కంఠను పంచుతుంది. రాజేంద్రప్రసాద్‌, బాబీసింహ నటన ఆకట్టుకుంటుంది’ అని తెలిపారు. పోసాని కృష్ణమురళి, వెన్నెలకిషోర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement