మెగాస్టార్‌ చిరంజీవి చేతుల మీదుగా ‘వసంత కోకిల’ ట్రైలర్‌ | Megastar Chiranjeevi Launches Bobby Simha Vasantha Kokila Trailer | Sakshi
Sakshi News home page

Chiranjeevi-Vasantha Kokila Movie Trailer: ఒక్క రాత్రిలో ఏం జరిగింది! ఆసక్తిగా ‘వసంత కోకిల’ ట్రైలర్‌

Published Mon, Feb 6 2023 6:50 PM | Last Updated on Mon, Feb 6 2023 6:56 PM

Megastar Chiranjeevi Launches Bobby Simha Vasantha Kokila Trailer - Sakshi

జాతీయ అవార్డు గ్రహీత, విలక్షణ నటుడు బాబీ సింహా హీరోగా నటించిన లేటెస్ట్‌ మూవీ ‘వసంత కోకిల’. రమణన్ దర్శకత్వంలో ముద్ర ఫిల్మ్ ఫ్యాక్టరీ, ఎస్ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో కాశ్మీర హీరోయిన్‌గా నటించింది. నలభై ఏళ్ల క్రితం కమల్‌ హాసన్‌, శ్రీదేవి నటించిన సూపర్‌ హిట్‌ టైటిల్‌ ‘వసంతకోకిల’తో ఈ సినిమా రూపొందుతుండటంతో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌, పాటలు బాగా ఆకట్టుకున్నాయి.

చదవండి: కాంతార 2పై కీలక అప్‌డేట్‌ ఇచ్చిన రిషబ్‌ శెట్టి

తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి రీలిజ్ చేశారు. కన్నడ ట్రైలర్‌ను స్టార్ హీరో శివరాజ్‌ కుమార్ లాంచ్‌ చేశారు. ఇటీవలే బాబీ సింహ వాల్తేరు వీరయ్య సినిమాలో విలన్‌గా మెప్పించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆర్య ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఫిబ్రవరి 10న ఈ మూవీ తెలుగుతో పాటు మలయాళం, కన్నడలో విడుదల కానుంది. 

చదవండి: వచ్చే వారం ప్రభాస్‌-కృతి సనన్‌ నిశ్చితార్థం? ట్వీట్‌ వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement