
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి కానుకగా బరిలోకి దిగుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. చాన్నాళ్ల తర్వాత చిరంజీవి పూర్తిస్థాయి మాస్ లుక్‌లో కనిపించనుండటంతో ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను వదిలారు. ట్రైలర్‌ను నేడు(శనివారం)సాయంత్రం 6.03 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు.
మాస్ మూలవిరాట్ వేట మొదలూ.. అంటూ సముద్ర అలల బ్యాక్ డ్రాప్లో చిరంజీవి బల్లెం పట్టుకొని ఉన్న మాస్ పోస్టర్‌తో ట్రైలర్ అప్‌డేట్ ఇచ్చేశారు. కాగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment