ఒక్కో చిత్రంలో ఒక్కో విధమైన పాత్రలో నటిస్తూ నటి వరలక్ష్మి శరత్ కుమార్ సత్తా చాటుతున్నారు. నాయకి, ప్రతినాయకి ఇలా పాత్ర ఏదైనా అందులో ఒదిగిపోయి నటిస్తూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఈమె తాజాగా పోలీస్ అధికారిగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నారు. దీనికి మారుతి నగర్ పోలీస్ స్టేషన్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇంతకు ముందు వరలక్ష్మి శరత్ కుమార్, సంతోష్ ప్రతాప్ జంటగా కొండ్రాల్ పావం వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన దయాళ్ పద్మనాభన్ ఈ సినిమాను స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు.
నటుడు ఆరవ్ కథానాయకుడిగా నటిస్తున్న ఇందులో సంతోష్ ప్రతాప్, మహత్ రాఘవేంద్ర, దర్శకుడు సుబ్రమణి శివ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర వివరాలను దర్శక నిర్మాత దయాళ్ పద్మనాభన్ వెల్లడిస్తూ.. ఇది పోలీసుల సాధికారతను చర్చించే కథాచిత్రంగా ఉంటుందన్నారు. చిత్రాలకు వాస్తవ పేర్లు పెట్టడం తనకు ఇష్టముండదన్నారు.
అదేవిధంగా తాను ఆంజనేయ స్వామి భక్తుడినని, అందువల్ల ఈ చిత్రానికి మారుతీ నగర్ పోలీస్ స్టేషన్ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు తెలిపారు. ఇందులో నటి వరలక్ష్మి శరత్ కుమార్‌లోని మరో కొత్త కోణాన్ని చూస్తారన్నారు. కథ, కథనాలు వైవిధ్యంగా ఉంటాయని చెప్పారు. షూటింగ్ పూర్తి అయ్యిందని, ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. చిత్రం త్వరలోనే ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ స్ట్రీమింగ్‌కు సిద్ధం అవుతోందని దయాళ్ పద్మనాభన్ చెప్పారు.
మరోసారి పోలీస్ అధికారిగా..!
Published Wed, Mar 29 2023 7:16 AM | Last Updated on Wed, Mar 29 2023 7:17 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment