
మహా నటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు కేరళ కుట్టీ కీర్తి సురేష్. అలనాటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలోని తన నటనకు జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు కీర్తి. మహానటి అనంతరం వరుసగా తెలుగులో అవకాశాలు దక్కించుకుంటూ తక్కువ కాలంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాబితాలోకి చేరిపోయారు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో బోలేడు సినిమాలు ఉన్నాయి. నితిన్‌కు జోడిగా 'రంగ్‌దే' తోపాటు మహేష్ ‘సర్కారు వారి పాట’లో కూడా నటిస్తున్నారు. ఇక తమిళ్‌లో సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నాతే మూవీలోనూ హీరోయిన్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ఆమె నటిస్తోన్న లేడి ఓరియెంటెడ్ చిత్రం ‘గుడ్‌లక్ సఖి’. జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.
కీర్తి సురేష్, వరలక్ష్మీ శరత్ కుమార్ మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ భామ వరలక్ష్మీ విషయంలో తప్పులో కాలేశారు. నేడు(మార్చి3) శరత్ కుమార్ కూతురు వరలక్ష్మీ పుట్టినరోజు అనుకొని ఆమెకు శుభాకాంక్షలు తెలిపింది. ‘హ్యపీ బర్త్‌డే వరూ.. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని, వచ్చే ఏడాదంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను. అంటూ ట్విటర్‌లో ట్వీట్ చేశారు. అయితే కీర్తి చేసిన పోస్టు సరిగానే ఉన్నప్పటికీ.. ఇక్కడే అసలైన కిటుకు దాగుంది. ఈ రోజు వరలక్ష్మీ పుట్టిన రోజు కాదు. ఆమె బర్త్‌డే మార్చి5. ఈ విషయం తెలియని కీర్తి విష్ చేయడంతో వరలక్ష్మీ స్పందించారు. ‘థాంక్యూ చెల్లెమ్మ..కానీ నా బర్త్‌డే ఈ రోజు కాదు.. మార్చి 5’ అంటూ ఫన్నీ రిప్లై ఇచ్చారు. కాగా కీర్తి పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో దీన్ని చూసిన నెటిజన్లు నవ్వులు పేల్చుతున్నారు.
చదవండి: కీర్తి సురేష్ ఎవరితోనూ ప్రేమలో లేదు..
Thank u chellamm but my birthday is on 5th https://t.co/xz0fUYX5p0
— 𝑽𝒂𝒓𝒂𝒍𝒂𝒙𝒎𝒊 𝑺𝒂𝒓𝒂𝒕𝒉𝒌𝒖𝒎𝒂𝒓 (@varusarath5) March 3, 2021