
పాన్ ఇండియా నటుడు శరత్‌కుమార్‌ను అభిమానులు సుప్రీం హీరో అంటారు. తమిళ సినిమాలో కథానాయకుడిగా ఎన్నో విలక్షణ పాత్రలు చేసిన ఈయన ఆ తరువాత నటనకు అవకాశం ఉన్న ప్రధాన పాత్రల్లో నటించడానికి కూడా వెనుకాడడం లేదు. అయితే శరత్‌కుమార్ ఇప్పటికీ హీరోనే. తమిళం, తెలుగు, మలయాళం ఇలా పలు భాషల్లో పలు రకాల పాత్రలు పోషిస్తూ బిజీగా ఉన్నారు. మరో పక్క ఓ రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. అలాంటి ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి గురువారం తన 69వ పుట్టినరోజును జరుపుకున్నారు.
చదవండి: ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్‌కు హైకోర్టులో ఊరట
ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఈయనకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఆయన వారసురాలు వరలక్ష్మి శరత్‌కుమార్ కూడా తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకున్నారు. ఆమె హీరోయిన్‌గా మాత్రమే కాదు పాత్ర ప్రాధాన్యత ఉన్న రోల్స్ పోషిస్తూ విలక్షణ నటిగా రాణిస్తున్నారు. ఇక గురువారం తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా వరలక్ష్మి శుభాకాంక్షలు తెలుపుతూ ఓ వీడియో విడుదల చేసింది. అందులో ‘వయసు అనేది ఒక నంబరు మాత్రమే అని మీరు నిరూపించారు.. మాకు మాత్రమే కాకుండా మీ చుట్టూ ఉన్న ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఐ లవ్ యూ డాడీ..నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment