పోలీస్‌ వ్యవసాయం | Varalaxmi Sarathkumar photo share in danny movie | Sakshi
Sakshi News home page

పోలీస్‌ వ్యవసాయం

Published Sun, Jul 28 2019 3:07 AM | Last Updated on Sun, Jul 28 2019 3:07 AM

Varalaxmi Sarathkumar photo share in danny movie - Sakshi

లొకేషన్‌లో వరలక్ష్మి

పోలీస్‌గా క్రిమినల్స్‌ పని పట్టాల్సిన పోలీసాఫీసర్‌ వ్యవసాయం చేస్తున్నారు. మాగాణి భూమిలో ట్రాక్టర్‌ ఎక్కి పొలం దున్నుతున్నారు. మరి.. ఈ పోలీసాఫీసర్‌ కహానీ ఏంటో తెలుసుకోవాలంటే ‘డానీ’ సినిమా చూడాల్సిందే. వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘డానీ’. పీజీ మీడియా వర్క్స్‌ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇందులో పోలీసాఫీసర్‌గా నటిస్తున్నారామె. ఆల్రెడీ ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ విడుదలైన సంగతి గుర్తుండే ఉంటుంది. ఎల్‌సీ సంతానమూర్తి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ చెన్నై పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. చిత్రీకరణలో భాగంగా వరలక్ష్మీ వ్యవసాయం చేశారు. ఆ ఫొటోలను షేర్‌ చేసి ఆనందపడిపోతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement