Danny
-
ఇంగ్లిష్ ఓ ప్రజాస్వామిక హక్కు
ఇంగ్లిష్ రాకపోవడాన్ని ఒక భాషా వైకల్యంగా మార్చేసిన యాభై ఏళ్ళ చారిత్రక పరిణామాల్ని సీనియర్ మేధావులు గుర్తించడంలేదు. తాము తెలుగు మీడియంలోనే చదివి గొప్పవాళ్ళయినట్టు ఒక అర్థ సత్యాన్ని ప్రచారం చేస్తున్నారు. మాతృభాషలకు ఉపయోగపు విలువలు మాత్రమే మిగలగా, ఇంగ్లిష్‌కు మారకపు విలువ కూడా అదనంగా చేరిందన్న వాస్తవాన్ని ముందుగా అందరూ గుర్తించాలి. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మాధ్యమాన్ని వ్యతిరేకిస్తున్నది భద్రలోకమే అనేది చాలా స్పష్టం. మరోవైపు, అభద్రలోకం ప్రభుత్వాన్ని చౌక బియ్యం, పక్కా ఇళ్ళు, వృద్ధాప్య పెన్షను, కార్పొరేట్ వైద్యం కావాలని అడిగినట్టు ఇప్పుడు తమ పిల్లలకు ఇంగ్లిష్ మీడియం విద్య కూడా కావాలని అడుగుతోంది. ఇంగ్లిష్ మీడియంలో చదవాలని ఆశిస్తున్న ప్రతి పేద కుటుంబానికీ ఆ అవకాశం కల్పించాలి. అది వారి ప్రజాస్వామిక హక్కు కూడా. వర్గ సమాజపు సమీకరణలకన్నా కులవర్గ సమాజపు సమీకరణలు సంక్లిష్టంగా వుంటాయి. ఇప్పటి వరకు సంపన్న, ఎగువ మధ్య, మధ్య తరగతులకు చెందినవారిని పాలకవర్గం అంటున్నాం; దిగువమధ్య, పేద సమూహాలని పాలితవర్గం అంటున్నాం. ఇది ఆర్థిక విశ్లేషణ మాత్రమే. సాంఘీకార్థిక (socio& economic) విశ్లేషణకు సాంస్కృతిక అవగాహన కూడా కావాలి. పెత్తందారీ కులాలు, అణగారిన కులాలు రెండూ ఇటు పాలకవర్గంలోనూ అటు పాలిత వర్గంలోనూ వుంటాయి. అంత మాత్రాన అవి రెండూ ఒకటికానేకావు. పాలకవర్గంలో అత్యధిక శాతం పెత్తందారీ కులాలు, అత్యల్ప శాతం అణగారిన కులాలు వుంటాయి. ఈ సమీకరణని భద్రలోకం అనాలి. అలాగే, పాలితవర్గంలో అత్యధిక శాతం అణగారిన సమూహాలు, అత్యల్ప శాతం పెత్తందారీ కులాలు వుంటాయి. ఈ సమీకరణని అభద్రలోకం అనాలి. రెండు వందల సంవత్సరాల బ్రిటిష్ పాలనతో పాటూ అది తెచ్చిన వలస భాషాసంస్కృతులు పోయివుంటే దేశీయ భాషలు వికసించడానికి అవకాశాలు వుండేవి. కానీ అలా జరగలేదు. ఆర్థిక రంగంలో విదేశీ పెట్టుబడులు గతంకన్నా పెద్ద వరదలా వస్తున్నాయి. విదేశీ కంపెనీలను తీసుకు రాగలిగినవారే రాజకీయ రంగంలో సమర్థులుగా చలామణి అవుతున్నారు. రాజకీయార్థిక రంగంలోని విలువలే సాధారణంగా విద్యా సాంస్కృతిక రంగాల్లోనూ కొనసాగుతాయి. వలస పాలన కాలంలోనూ లేనన్ని విదేశీ వస్తువులు, సాంప్రదాయాలు మన ఇళ్ళు జీవితాల్లోనికి వచ్చేశాయి. పిల్లలు అభివృధ్ధి చెందిన దేశాల్లో స్థిరపడాలనే జీవితాశయం మనలో బలపడుతోంది. ఐటీ ఉద్యోగాలకు విదేశీ ద్వారాలు తెరుచుకున్నాక మన సమాజంలో ఇంగ్లిష్ గిరాకీ మరీ పెరిగిపోయింది. గతం నుండే ప్రభుత్వ కార్యాలయాలు, న్యాయస్థానాలు మొదలు పోలీసు స్టేషన్ల వరకు కార్యకలాపాలన్నీ ఇంగ్లిష్‌లోనే సాగుతున్నాయి. అధికారం మొత్తం తన చుట్టూ తిరుగుతుండడంతో మొదట్లో అనుసంధాన భాషగావున్న ఇంగ్లిష్ ఇప్పుడు మనకు అప్రకటిత అధికార భాషగా మారిపోయింది. మాతృభాషలకు ఉపయోగపు విలువలు మాత్రమే మిగలగా, ఇంగ్లిష్‌కు మారకపు విలువ కూడా అదనంగా చేరింది. ఈ వాస్తవాన్ని ముందు అందరూ గుర్తించాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లో అర్ధ శతాబ్దం క్రితం ఇంగ్లిష్ మీడియం స్కూళ్ళు అరుదుగా వుండేవి. అందువల్ల భద్రలోకం కూడా అభద్రలోకంతోపాటు తెలుగు మీడియం పాఠశాలల్లోనే ‘కంబైన్డ్ స్టడీస్’ చేసేది. భద్రలోకపు స్థాయి, అవసరాలకు అనుగుణంగా అప్పటి తెలుగు మీడియం పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు ఉన్నతంగా వుండేవి. 1971లో ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏర్పడి, కళాశాల విద్యలోనూ తెలుగు మీడియంను అనుమతించాక విద్యారంగంలో కులవర్గ సమీకరణలు చాలా వేగంగా మారిపోయాయి. తెలుగు మీడియంకన్నా ఇంగ్లిష్ మీడియం మెరుగైనదనీ, అందులోనూ స్టేట్ సిలబస్ కన్నా సెంట్రల్ సిలబస్ నాణ్యమైనదనే ఒక కొత్త విలువ బలంగా ముందుకు వచ్చింది. భద్రలోకం మొత్తం ఇంగ్లిష్ మీడియం ప్రైవేటు స్కూళ్ళకు మారిపోవడంతో తెలుగు మీడియం ప్రభుత్వ పాఠశాలల్లో క్లాస్ రూంలు, బ్లాక్ బోర్డులు, బెంచీలు, గాలి, వెలుతురు, తాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస సౌకర్యాలు సహితం లేకుండాపోయాయి. మరోవైపు, ప్రభుత్వ విద్యారంగంలో అధ్యాపక సంఘాల సంఖ్య పెరిగింది. అధ్యాపకుల జీతాలు పెరిగాయి; విద్యా ప్రమాణాలు మాత్రం ఘోరంగా పడిపోయాయి. అభద్రలోకం మాత్రమే గతిలేక తెలుగు మీడియంలో మిగిలిపోయింది. ప్రాథమిక పాఠశాల నుంచి విశ్వవిద్యాలయాల వరకు ఇదే పరిస్థితి ఉంది. అల్పాదాయవర్గాలకు చెందిన భవన కార్మికులు, ఆటో డ్రైవర్లు సహితం తమ పిల్లలను ఇంగ్లీషు మీడియం స్కూళ్ళకు పంపించడం మొదలెట్టారు. ప్రమాదం ఏ దశకు చేరిందంటే ప్రభుత్వ ఉపాధ్యాయులు సహితం తమ పిల్లల్ని తెలుగు మీడియం పాఠశాలల్లో చేర్చడానికి భయపడిపోతున్నారు. ఫలితంగా అభద్రలోకానికి నియత విద్య మీదనే నైరాశ్యం ఏర్పడే ముప్పు వచ్చింది. ఇంగ్లిష్ రాకపోవడాన్ని ఒక భాషా వైకల్యంగా మార్చేసిన యాభై ఏళ్ళ చారిత్రక పరిణామాల్ని సీనియర్ మేధావులు గుర్తించడంలేదు. తాము తెలుగు మీడియంలోనే చదివి గొప్పవాళ్ళయినట్టు ఒక అర్థ సత్యాన్ని ప్రచారం చేస్తున్నారు. మరోవైపు, అభద్రలోకం ప్రభుత్వాన్ని చౌక బియ్యం, పక్కా ఇళ్ళు, వృధ్ధాప్య పెన్షను, కార్పొరేట్ వైద్యం కావాలని అడిగినట్టు ఇప్పుడు తమ పిల్లలకు ఇంగ్లిష్ మీడియం విద్య కూడా కావాలని అడుగుతోంది. వైఎస్ జగన్ నిర్వహించిన చరిత్రాత్మక పాదయాత్ర సందర్భంగా పేదజనం ఆయనతో చెప్పుకున్న కష్టాల్లో కాన్వెంటు ఫీజుల భారం ఒకటి. ఆ మేరకు ప్రభుత్వ విద్యావ్యవస్థలో ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు మూడు నాలుగు విడతల్లో ఇంగ్లిష్ మీడియంలోనికి మార్చాలని సీఎం జగన్ ఒక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది నుంచి ఇది అమల్లోనికి రానుంది. ప్రతి తరగతిలోనూ విద్యార్ధుల ఛాయిస్‌ను బట్టి తెలుగు లేదా ఉర్దూ ఒక సబ్జెక్ట్‌గా తప్పనిసరిగా వుంటుంది. ఇది అందరూ ఆహ్వానించవలసిన పరిణామం. అభద్రలోకానికి ఇంగ్లిష్ మీడియం విద్య అందిస్తారనగానే భద్రలోకం ఉలిక్కి పడింది. పురాతన కాలంలో విద్య నేర్చే శూద్రుల్ని కఠినంగా శిక్షించేవారట. ఇప్పుడు అభద్రలోకానికి ఇంగ్లిష్ దక్కకుండా చేయడానికి మాతృభాషా మాధ్యమ పరిరక్షణ వేదిక నడుం బిగించింది. ప్రతి మనిషికీ పుట్టడానికి ముందే తల్లిగర్భంలోనే మాతృభాష పరిచయం అవుతుంది. పుట్టాక కూడ ఆ వాతావరణంలోనే పెరుగుతాడు కనుక ఎవరికైనా నేర్చుకోవడానికి మాతృభాష చాలా సౌలభ్యంగా వుంటుంది. మనిషి జీవితంలో మాతృభాష అనేది స్కూళ్లకు ముందూ వుంటుంది, ఆ తర్వాతా వుంటుంది. స్కూళ్ళలో మాత్రమే మాతృభాష పుట్టి పెరుగుతుందని అమాయకులు మాత్రమే భావిస్తారు. మాతృభాష అనగానే తెలుగు, ఉర్దు మాత్రమే గుర్తుకువస్తాయి. తమిళ కన్నడ మలయాళ గుజరాతీ సమూహాలే కాకుండా సవర, జాతాపు తదితర ఆదివాసీ భాషల సమూహాలూ అనేకం వుంటాయి. ఆయా భాషలు మాట్లాడేవాళ్ళకు వాళ్ళ పరిసరాల్లో వాళ్ళ మాతృభాషలో విద్యా బోధనకు అవకాశాలు లేవు. మాతృభాష పేరుతో అధికార భాషలో విద్యాబోధన సాగిస్తారు. ఆ అధికార భాషా సంఘం ప్రచురించే పుస్తకాల్లోని కృతక ఆంధ్రభాష కన్నా ఇంగ్లిష్ చదవడమే చాలా సులువుగా వుంటుంది. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మాధ్యమాన్ని వ్యతిరేకిస్తున్నది భద్రలోకమే అనేది చాలా స్పష్టం. అప్పట్లో ప్రైవేటు విద్యను ప్రమోట్ చేయడానికి ప్రభుత్వ విద్యను బలహీనపరిచిందీ వీళ్ళే. ఇప్పుడు ప్రైవేటు విద్యా సంస్థల ఔన్నత్యాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను వ్యతిరేకిస్తున్నదీ వీళ్ళే. సమాజంలో అందరూ ఉద్యోగాల కోసమే చదువుతారుగానీ అందరికీ ఉద్యోగాలు రావు. అత్యుల్లాసమైన (Volatile) ఉపాధిరంగంలో ఒక్కోసారి ఒక్కో సబ్జెక్ట్‌కు గిరాకీ వుంటుంది. 1970లలో కామర్స్ చదివితే చాలు బ్యాంకు ఉద్యోగం వచ్చేస్తుంది అనేవారు. 1990లలో Y2K సమస్య వచ్చినపుడు బీటెక్ మాత్రమే కాదు ఏదో ఒక్క సాఫ్ట్వేర్ భాష వచ్చినా ఉద్యోగాలు వచ్చాయి. గిరాకీ సరఫరా సూత్రం అన్నింటా వుంటుంది. ఇప్పుడు ఇంగ్లిష్ మీడియంకు అలాంటి క్రేజ్ వుంది. మార్కెట్లో ఉపాధి అవకాశాలే లేనపుడు ఏ మాధ్యమంలో చదివితే ఏమిటనే? వాళ్ళూ వున్నారు. ‘‘కూటికీ పేదోణ్ణేకానీ; కులానికి కాదు’’ అనే మాట మన సాంస్కృతిక రంగంలో వినపడుతూ వుంటుంది. ఉద్యోగం రాకపోయినా ఇంగ్లిష్ వచ్చినవాళ్ళు అలాంటి సాంస్కృతిక గౌరవాన్ని ఆస్వాదించే వాతావరణం మన సమాజంలో వుంది. ఆర్థిక రంగంలో అభద్రలోకానికి భద్రలోకానికి మధ్య సాగే ఘర్షణే ఇప్పుడు విద్యారంగంలో తెలుగు మీడియం, ఇంగ్లిష్ మీడియంల వివాదంగా వ్యక్తం అవుతోంది. నాణ్యమైన ఆంగ్ల మాధ్యమ సంస్థల్లో సామాజిక మైనారిటీ విద్యా మెజారిటీగా మారుతుండగా, సామాజిక మెజారిటీ విద్యా మైనారిటీగా మిగిలిపోతోంది. ఈ అసమానత్వం ఇంకెంత కాలం కొనసాగాలీ? ఇంగ్లిష్ మీడియంలో చదవాలని ఆశిస్తున్న ప్రతి పేద కుటుంబానికీ ఆ అవకాశం కల్పించాలి. ఇప్పుడు అభద్రలోకపు ప్రజాస్వామిక హక్కు ఇంగ్లిష్ మీడియం. డానీ (వ్యాసకర్త రచయిత, సీనియర్ పాత్రికేయులు, సమాజ విశ్లేషకులు ‘ మొబైల్ : 90107 57776) -
పోలీస్ వ్యవసాయం
పోలీస్‌గా క్రిమినల్స్ పని పట్టాల్సిన పోలీసాఫీసర్ వ్యవసాయం చేస్తున్నారు. మాగాణి భూమిలో ట్రాక్టర్ ఎక్కి పొలం దున్నుతున్నారు. మరి.. ఈ పోలీసాఫీసర్ కహానీ ఏంటో తెలుసుకోవాలంటే ‘డానీ’ సినిమా చూడాల్సిందే. వరలక్ష్మీ శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘డానీ’. పీజీ మీడియా వర్క్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇందులో పోలీసాఫీసర్‌గా నటిస్తున్నారామె. ఆల్రెడీ ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైన సంగతి గుర్తుండే ఉంటుంది. ఎల్సీ సంతానమూర్తి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ చెన్నై పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. చిత్రీకరణలో భాగంగా వరలక్ష్మీ వ్యవసాయం చేశారు. ఆ ఫొటోలను షేర్ చేసి ఆనందపడిపోతున్నారు. -
అభివృద్ధి అర్థాలు వేరు బాబూ!
సందర్భం పార్టీ ఆధారిత పార్లమెం టరీ ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదమైన ఎన్నికల ప్రక్రియే అస్తవ్యస్తంగా మారిన ఈ తరుణంలోనూ కొన్ని పరిణామాలు ఎలక్టోరల్ జస్టిఫికేషన్ అనిపిస్తాయి. నరేంద్ర మోదీ, చంద్రబాబులను అభివృద్ధికి ప్రతీకగా మీడియా పేర్కొంటూ ఉంటుంది. నిజా నికి వారు కొందరి పెరుగుదలకు మాత్రమే ప్రతీ కలు. బాబు మార్కు ‘పెరుగుదల’ ఆర్థిక విధానాలను ప్రజలు ప్రతిసారీ తిప్పికొడుతూనే ఉన్నారు. సీబీఐ మాజీ డైరెక్టర్ కె. విజయరామారావు 1999 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ఎన్నికైబాబు ప్రభుత్వంలో కీలకమైన పట్టణాభివృద్ధి శాఖను చేపట్టారు. ఆయన కాలంలోనే హైదరాబాద్‌లో హైటెక్ సిటీ నిర్మాణం పేరిట చంద్రబాబు మార్కు ‘సంపద పెరుగుదల’ పెద్ద ఎత్తున సాగింది. ఇది ప్రజలకు నచ్చలేదు. 2004 ఎన్నికల్లో విజయరామారావును ఓడించడమేగాక, గ్రేటర్ హైదరాబాద్ లోని 16 నియోజకవర్గాల్లో 13 చోట్ల టీడీపీని ఓడించారు. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆధునిక హైదరాబాద్‌ను నిర్మించింది తానే అని చెప్పుకుంటే 150 డివిజన్లలో ఒకే ఒక్క చోట టీడీపీ గట్టెక్కింది.తాను అభివృధ్ధి ప్రవక్త అని చెప్పుకున్నప్పుడల్లా ప్రజలు బాబుకు గట్టి గుణపాఠమే చెపుతూ వచ్చారు. అయినా ఆయన తన విధానాలను మార్చుకోలేదు. అమరావతి, పోలవరం భారీ ప్రాజెక్టుల్ని చూపి సంపద పెంచినట్టు భారీ ప్రచారం చేసుకుంటే సులువుగా గెలవవచ్చని వారు ఆశపడ్డారు. అమరావతి, పోలవరం వల్ల రాష్ట్రంలో ప్రాబల్యంగల రెండు మూడు సామాజికవర్గాల సంపద మాత్రమే పెరుగుతుందని తెలియనంత అమాయకులు కాదు ప్రజలు. అమరావతి మంత్రి నారాయణనే కాక నెల్లూరులో టీడీపీ అభ్యర్థులు అందరినీ ప్రజలు ఓడించారు. దీనినే ఎలక్టోరల్ జస్టిఫికేషన్ అంటారు. అమరావతి, పోలవరం (పట్టిసీమ)ల వల్ల భారీగా సంపద పెరిగిన ప్రాంతం కృష్ణా, గుంటూరు జిల్లాలు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన కొన్ని గ్రామాల్లో అధికార పార్టీకి కొన్ని ఓట్లు పడివుండవచ్చు గానీ ఆ రెండు జిల్లాల్లో కూడా అధికార పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. 33 నియోజకవర్గాల్లో టీడీపీకి దక్కింది నాలుగే స్థానాలు. ప్రజలు పోలవరం మంత్రి దేవినేని ఉమను మైలవరంలో మట్టికరిపించారు. ఇది మరో ఎలక్టోరల్ జస్టిఫికేషన్.తాను సమాచార విప్లవ సారధినని బాబు చాలాసార్లు చెప్పుకునేవారు. అయితే, హైదరాబాద్‌లో వారికి కాలం కలిసివచ్చినట్టు విజయవాడలో కలిసిరాలేదు. చేనేత కేంద్రమైన మంగళగిరిని ఆంధ్రప్రదేశ్ సిలికాన్ వ్యాలీగా మార్చినట్టు టీడీపీ ప్రచారం చేసుకుంది. ఆ నమ్మకంతోనే సీఎం తనయుడు, ఐటీ మంత్రి లోకేశ్‌ను మంగళగిరి బరిలో దించారు. ప్రజలు లోకేశ్‌నూ ఓడించి మరో ఎలక్టోరల్ జస్టిఫికేషన్ చేశారు. అభివృద్ధి అంటే పోలవరం, అమరావతి, ఐటీ ప్రాజెక్టులే కాదని ప్రజలు గట్టిగా చెప్పారు. జగన్‌కు వాళ్ళ నాన్న పెద్ద ప్లస్ పాయింట్ అయితే, బాబుకు వాళ్ళబ్బాయి పెద్ద మైనస్ పాయింట్.దెందులూరులో చింతమనేని ప్రభాకర్, విజయవాడ సెంట్రల్లో బోండా ఉమామహేశ్వరరావు సాగించిన అరాచకాలు ఇన్నీ అన్నీ కావు. రాష్ట్రమంతటా గనుల మాఫియా, ఇసుక మాఫియా చెలరేగిపోయింది. ఇందులో మహిళల వస్త్రాపహరణాలు, అత్యాచారాలు, హత్యాచారాలు అన్నీ ఉన్నాయి. టీడీపీ అధినేత వాళ్ళను అదుపు చేయకపోగా అడ్డంగా వెనకేసుకు వచ్చారు. కొత్త రాష్ట్ర శాసన సభకు తొలి స్పీకర్‌గా ఎన్నికైన కోడెల శివప్రసాద్ 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను సంతలో గొడ్లలా అధికారపార్టీ కొనేసినా కళ్ళు మూసుకున్నారు. ప్రతి పక్షం సభకు రాలేని పరిస్థితిని కల్పించారు. సభా గౌరవాన్ని పాతాళానికి తొక్కేశారు. సత్తెనపల్లి ప్రజలు ఆయనకు రాజకీయాల నుంచి అవమానకరపు వీడ్కోలు పలికారు. విచిత్రం ఏమంటే, 23 మంది విపక్ష ఎమ్మెల్యేలను రేటుకట్టి కొన్న టీడీపీకి మే 23 నాటి ఎన్నికల ఫలితాల్లో దక్కింది 23 ఎమ్మెల్యేలే! దీన్ని ఒక మేజికల్ జస్టిఫికేషన్ అనుకోవచ్చు!. కార్పొరేట్లకు ప్రభుత్వాధినేతలు మొహమాటంతో కొన్ని పనులు చేసిపెట్టాల్సి ఉంటుందనేది నిజమే గానీ, నిత్యం కార్పొరేట్ల సేవలోనే తరించే ప్రభుత్వాధినేతలకు ప్రజలు గట్టిగానే బుధ్ధి చెపుతారన్నది అంతకన్నా నిజం. తమ రాజకీయ ఆబ్లిగేషన్లను పాటిస్తూనే ప్రజల కోసం తపన పడే ప్రభుత్వాధినేతలు సహితం కొందరు ఉన్నారు. ఎన్టీఆర్, వైఎస్సార్ ఆ కోవలోకి వస్తారు. ప్రజలు కూడా వాళ్ళనే తరతరాలు గుర్తు పెట్టుకుంటారు. అసలు విషయం ఏమంటే, ఏపీ ప్రజలు ఈసారి బాబును ఎన్టీఆర్‌కు రాజకీయ వారసునిగా చూడడానికి ఇష్టపడలేదు. జగన్‌ను వైఎస్సార్‌కు రాజకీయ వారసునిగా గుర్తించి పట్టంకట్టారు. ఇది అసలైన ఎలక్టోరల్ జస్టిఫికేషన్! జగన్ ఒకే విధానానికి కట్టుబడి, నిరంతరం జనంలో వుండి వాళ్ళ ఆదరణను పొందారు. చంద్రబాబు ప్రతి అంశం మీదా మాట మార్చి విశ్వసనీయతను కోల్పోయి ప్రజల ఆగ్రహానికి గురయ్యారు. కొత్తతరం, కొత్త చూపు, కొత్త ఆశలు, కొత్త సాకారం ! డానీ రచయిత సీనియర్ పాత్రికేయులు, సమాజ విశ్లేషకులు ‘ 90107 57776 -
తండ్రయిన డివిలియర్స్
ప్రిటోరియా: దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ ఏబీ డివిలి యర్స్ తండ్రయ్యాడు. బుధవారం అతని భార్య డానిలె అబ్బాయికి జన్మనిచ్చింది. 2013లో వీరికి పెళ్లయింది. తన భార్య ప్రసవం కారణంగానే డివిలియర్స్ బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. -
చంద్రబాబు చైనా యాత్ర మరో కోణం
సందర్భం అమరావతి, బీజింగ్ మధ్య రక్తచందన మార్గం నిర్మించాలని చంద్రబాబు ఆశిస్త్తుంటే, జిన్ పింగ్ బీజింగ్ ఇస్లామాబాద్ మీదుగా మధ్యధరా సముద్రానికి చేరడానికి ‘పట్టు రహదారి’ని నిర్మించే పనిలో పడ్డారు! వర్తమాన చరిత్రలో ఇంతకన్నా వైచిత్రి ఏముంటుందీ? చంద్రబాబు చైనా యాత్రలో సాధించిన విజయాల గురించి మీడియాలో రంగు రంగుల కథనాలు వచ్చాయి. వస్తున్నా యి. రాష్ర్టంలో అపారంగా ఉన్న ఎర్రచందనం నిల్వల్ని చైనాకు అమ్మడానికి రంగం సిధ్ధమైందనీ, అలా సమకూరే నిధులతో కొత్త రాజధాని అమ రావతి నిర్మాణం చేపడతారనేది ప్రధానాంశం. కొత్త రాజధాని నిర్మాణానికి దాదాపు ఐదు లక్షల కోట్ల రూపా యలు ఖర్చవుతుందని ఏడాదిన్నర క్రితమే చంద్రబాబు అంచనా వేశారు. ఆ నిధుల్ని తాను మిత్రపక్షంగా ఉం టున్న నరేంద్రమోదీ ప్రభుత్వం అందిస్తుందని వారు ఇన్నాళ్లూ రాష్ర్ట ప్రజల్ని నమ్మిస్తూ వచ్చారు. నిజానికి కొత్త రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభు త్వ సహాయం, రైతుల రుణమాఫీ అనే రెండు అంశాలు చంద్రబాబు పక్షాన లేకుంటే మొన్నటి ఎన్నికల్లో ఏపీ ప్రజల తీర్పు భిన్నంగా ఉండేది. ఇప్పుడు కొత్త రాజ ధానికి కేంద్ర నిధుల వ్యవహారం కూడా అటకెక్కినట్టే కనిపిస్తోంది. అనుమానం ఉన్న వాళ్లు కేంద్ర ప్రణాళికా శాఖ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ సాక్షాత్తు పార్లమెంటులో ఇచ్చిన డిజిటల్ డిస్ప్లేను చూడవచ్చు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశమూ లేదు. మాకు ఆ ఉద్దేశమూ లేదని వారు కుండబద్దలు కొట్టారు. ఇప్పుడు ఐదు లక్షల కోట్ల రూపాయలు సమకూ ర్చుకోవడానికి బాబు దగ్గరున్న ఏకైక వనరు ఎర్రచం దనం నిల్వలే. గత ఏడాది రాష్ర్ట ప్రభుత్వం గ్లోబల్ టెం డర్ల ద్వారా 4,160 టన్నుల ఎర్రచందనం దుంగలను అమ్మకానికి పెట్టినపుడు సగటున టన్నుకు 18 లక్షల రూపాయల చొప్పున మొత్తం 750 కోట్ల రూపాయల నిధులు సమకూరాయి. ఈ లెక్కన 5 లక్షల కోట్ల రూపా యల నిధుల సమీకరణకు రాష్ర్ట ప్రభుత్వం దాదాపు 30 లక్షల టన్నుల ఎర్రచందనం దుంగల్ని అంతర్జాతీయ మార్కెట్లో అమ్మాల్సి ఉంటుంది. ఇంటర్నేషనల్ యూని యన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ సంస్థ అంతరించిపో తున్న వృక్ష సంతతిగా పేర్కొన్న ఎర్రచందనాన్ని ప్రభు త్వం ఆ స్థాయిలో అమ్మకానికి పెట్టవచ్చునా? అనేది ఇంకో సందేహం. 2012 అక్టోబర్‌లో అంతర్జాతీయ బయోడైవర్సిటీ సదస్సు హైదరాబాద్‌లో జరిగినప్పుడే ఈ అంశం ప్రముఖంగా చర్చకు వచ్చింది. పెళుసుగా ఉండే ఎర్ర చందనం కలప ఫర్నిచర్‌కు పనికిరాదనీ, దాన్ని అణు విద్యుత్ కేంద్రాల్లో వినియోగిస్తున్నారని చైనా గుట్టు విప్పారు. ఎర్రచందనాన్ని చైనా అణు విద్యుత్ కేంద్రా ల్లోనే వినియోగిస్తోందా? లేక అణ్వాయుధాల తయారీ లోనూ వినియోగిస్తోందా? అన్నది కూడా ఎవరికైనా రావలసిన సందేహమే. దీనికి సమాధానం రెండోది కూడా అయితే చైనా అణ్వాయుధ పాటవాన్ని పెంచుకో వడంలో మనం సహితం ఎర్రచందనం పేడు ఒకటి ధారబోస్తున్నామన్న మాట. చైనాలో చంద్రబాబు 11 ఒప్పందాలు చేసుకున్నా రనే వార్త వచ్చిన రోజునే చైనా ప్రభుత్వం పదేళ్లుగా భారత రహస్యాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటోం దని ఒక ప్రైవేటు సెక్యూరిటీ సంస్థ వెల్లడించింది. కీలక మైన భారత వైమానిక, రక్షణ రంగాలతోపాటు పలు ప్రభుత్వరంగ సంస్థలపై చైనా ప్రభుత్వం నిఘా ఉంచిం దని ఆ సంస్థ ఓ నివేదికలో పేర్కొంది. చైనా హ్యాకర్లు ప్రభుత్వరంగ సంస్థల కంప్యూటర్లలోకి చొరబడి కీలక మైన సమాచారాన్ని సేకరిస్త్తున్నారన్నది దీని సారాంశం. భారత్‌తోపాటు దక్షిణ కొరియా, ఫిలిప్పీన్స్, వియ త్నాం, మలేసియా, నేపాల్, సింగపూర్, ఇండోనేసియా లాంటి ఆసియా దేశాలను లక్ష్యంగా చేసుకుని చైనా గూ ఢచర్యం సాగిస్తోందని ఆ సెక్యూరిటీ సంస్థ చెబుతోంది. బాబు ఇండియా విమానం ఎక్కిన మరునాడే చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ పాకిస్తాన్ విమానం ఎక్కారు. నవాజ్ షరీఫ్‌ని ఆలింగనం చేసుకుని ‘మన స్నేహబం ధం కొండలకన్నా ఎత్తయినది, సముద్రాలకన్నా లోతై నది, తేనెకన్నా తీయనైనద’ని అన్నారు. ప్రపంచపటం మీద చైనా ఒంటరిగా ఉన్నప్పుడు బీజింగ్‌కు స్నేహ హ స్తాన్ని సాచింది ఇస్లామాబాద్ ఒక్కటేనని గుర్తు చేసుకు న్నారు. ఈ ఏడాది తన విదేశీ పర్యటనని పాకిస్తాన్‌తోనే మొదలు పెట్టానని గొప్పగా చెప్పుకున్నారు. అటు నవా జ్ షరీఫ్ కూడా జిన్ పింగ్‌కు దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారమైన ‘నిషాన్-ఈ -పాకిస్తాన్’తో సత్కరిం చారు. ఇది మన భారతరత్నతో సమానం. ఒకవైపు, సాంస్కృతిక సారూప్యత రీత్యా ఏపీ కొత్త రాజధాని అమరావతిని చైనీయులు రెండో స్వగృహంగా భావించాలని బాబు కోరి వస్తే, మరోవైపు చైనా తన దేశం నుంచి మధ్యధరా సముద్రానికి చేరే చారిత్రక సిల్క్ రూట్ పునరుద్ధరణకు పాకిస్తాన్‌తో ఒప్పందం చేసుకుంది. రూ.3 లక్షల కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ 3 వేల కిలోమీటర్ల కారిడార్ ప్రాజెక్టు వల్ల పాకిస్తాన్-చైనా మధ్య రోడ్డు లింకులు రైలు మార్గా లు, పైపులైన్లు నిర్మించనున్నారు. అమరావతి బీజింగ్ మధ్య బాబు రక్తచందన మార్గం నిర్మించాలని ఆశిస్త్తుంటే, జిన్ పింగ్ బీజింగ్ ఇస్లామాబాద్ మీదుగా మధ్యధరా సముద్రానికి చేర డానికి ‘పట్టు రహదారి’ని నిర్మించే పనిలో పడ్డారు! వర్తమాన చరిత్రలో ఇంతకన్నా వైచిత్రి ఏముంటుందీ? (రచయిత సీనియర్ పాత్రికేయులు, సమాజ విశ్లేషకులు) మొబైల్ : 76749 99063 - డానీ -
రోనీ, డానీ @ 63
ఈ అవిభక్త కవలల పేర్లు రోనీ, డానీ. వయసు 62 సంవత్సరాల ఎనిమిది నెలల ఏడు రోజులు. ప్రస్తుతం ప్రపంచంలో జీవించి ఉన్న అవిభక్త కవలల్లో వీరే పెద్ద. థాయ్ ట్విన్స్.. చాంగ్, ఎంగ్ బంకర్లు 62 ఏళ్ల ఎనిమిది నెలల ఆరు రోజులు జీవించారు. దీంతో వారిద్దరి వయసును రోనీ, డానీలు అధిగమించారు. మరో నాలుగు నెలల్లో ఇంకో అరుదైన రికార్డును కూడా వీరు సొంతం చేసుకోనున్నారు. ప్రపంచంలోనే అత్యధిక కాలం జీవించిన అవిభక్త కవలలుగా గిన్నిస్ పుస్తకంలోకి ఎక్కనున్నారు. ఇప్పటివరకు ఈ రికార్డు.. 1877లో ఇటలీలో జన్మించిన గియాకోమో, గియోవాన్ని బట్టిస్టా టోక్కిల పేరిట ఉండేది. వారు 63 ఏళ్ల వయసులో 1940లో కన్నుమూశారు. అమెరికాలోని ఒహియోకు చెందిన రోనీ, డానీలు 1951 అక్టోబర్ 28న జన్మించారు. ఒకరికి ఎదురుగా మరొకరు ఉన్నట్టుగా అతుక్కుని పుట్టిన వీరిద్దరికీ నాలుగు చేతులు, నాలుగు కాళ్లతోపాటు వేర్వేరు గుండెలు, ఉదరాలు ఉన్నాయి. అయితే జీర్ణకోశం, పురీషనాళం, పురుషాంగం మాత్రం ఒక్కోటే ఉంది. వీటిపై డానీకే నియంత్రణ ఉంటుంది. జన్మించినప్పుడు వీరిద్దరూ పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారు. అయితే, శస్త్రచికిత్స ద్వారా వేరు చేయడం కోసం డాక్టర్లు ఇద్దరినీ రెండేళ్లపాటు ఆస్పత్రిలోనే ఉంచారు. ఆపరేషన్ చేస్తే ఇద్దరూ బతుకుతారని గ్యారంటీ ఇవ్వలేమని చెప్పడంతో రోనీ, డానీల తల్లిదండ్రులు అందుకు అంగీకరించలేదు. దీంతో అప్పటినుంచి ఇలా కలిసే పెరిగారు. నాలుగేళ్ల ప్రాయం నుంచే సంపాదనలో కుటుంబానికి చేదోడువాదోడుగా నిలిచారు. తమకంటే 11 ఏళ్లు చిన్నవాడైన సోదరుడు జిమ్‌తో కలిసి సర్కస్‌లో మేజిక్ ట్రిక్స్ ప్రదర్శిస్తుంటారు. 39 ఏళ్ల వయసులో 1991లో తమ ఉద్యోగాల నుంచి రిటైరయ్యారు. ప్రస్తుతం జిమ్, ఆయన భార్య హాల్వేస్ వీరి ఆలనాపాలనా చూస్తున్నారు.