‘‘మైఖేల్’ కథని, దర్శకుడు రంజిత్‌ని బలంగా నమ్మాం. ట్రైలర్‌కి వచ్చిన అద్భుతమైన స్పందన మా నమ్మకాన్ని నిజం చేసింది. కథ, కంటెంట్, మేకింగ్ పరంగా ‘మైఖేల్’ యూనివర్సల్‌గా రీచ్ అయ్యే సినిమా’’ అని హీరో సందీప్ కిషన్ అన్నారు. రంజిత్ జయకొడి దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా రూపొందిన చిత్రం ‘మైఖేల్’. విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్, దివ్యాంశా కౌశిక్, వరుణ్ సందేశ్, గౌతమ్ మీనన్ కీలక పాత్రల్లో నటించారు. నారాయణ్ దాస్ కె. నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి, పుసూ్కర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 3న విడుదలకానుంది.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రంజిత్ జయకొడి మాట్లాడుతూ– ‘‘నేను తమిళ్‌లో మూడు సినిమాలు తీశాను. తెలుగులో ‘మైఖేల్’ నా మొదటి చిత్రం. యాక్షన్, రొమాన్స్, ఎమోషన్.. ఇలా అన్ని అంశాలున్న చిత్రమిది’’ అన్నారు. ‘‘సందీప్ కిషన్‌కి సినిమా తప్ప మరో తపన ఉండదు. ఈ మూవీ కోసం ఆయన ఎంత కష్టపడ్డారో ట్రైలర్‌లోనే తెలుస్తోంది. ‘మైఖేల్’తో సక్సెస్ కొడతామనే నమ్మకం ఉంది’’ అన్నారు భరత్ చౌదరి. ‘‘రంజిత్ ‘మైఖేల్’ కథ చెప్పిన వెంటనే మరో ఆలోచన లేకుండా సినిమా చేద్దామని చెప్పా’’ అన్నారు పుస్కూర్ రామ్మోహన్ రావు. ‘‘మైఖేల్’ లాంటి మంచి సినిమాలో భాగం కావడం ఆనందంగా ఉంది’’ అన్నారు దివ్యాంశా కౌశిక్, వరుణ్ సందేశ్.
Comments
Please login to add a commentAdd a comment